narmada
-
భార్యకు జెర్సీ నటుడు స్పెషల్ విషెస్.. వీడియో రిలీజ్!
సింధు సమవేలి అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యువ హీరో హరీశ్ కల్యాణ్. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించారు. కాదలి, జైశ్రీరామ్, నాని జెర్సీ లాంటి టాలీవుడ్ చిత్రాల్లో కనిపించారు. ఇటీవలే విడుదలైన ధోని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కించిన ఎల్జీఎం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. అయితే గతేడాదే హరీష్ కల్యాణ్ వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. నర్మద అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. చెన్నైలో జరిగిన వీరి పెళ్లికి కోలీవుడ్ సినీతారలు, ప్రముఖులు సైతం హాజరయ్యారు. తాజాగా హరీశ్ కల్యాణ్ దంపతులు తమ మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య నర్మద పట్ల ప్రేమను చాటుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తన భార్యతో కలిసి ఉన్న ఆనందకరమైన క్షణాలను పంచుకుంటూ స్పెషల్ విషెస్ తెలిపారు. ఒకవైపు సినిమాలతో పాటు బిజీగా ఉంటూ.. మరోవైపు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం హరీశ్ కల్యాణ్ నటిస్తోన్న నూరు కోడి వానవిల్, డీజిల్ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. అనంతరం మరో ప్రయోగాత్మక చిత్రంలో కూడా నటించనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Harish Kalyan (@iamharishkalyan) View this post on Instagram A post shared by Dhoni Entertainment Pvt Ltd (@dhoni.entertainment) -
ఓ ఇంటివాడైన నటుడు హరీష్ కల్యాణ్.. ఫోటోలు వైరల్
యువ నటుడు హరీష్ కల్యాణ్ శుక్రవారం ఓ ఇంటివాడయ్యాడు. ప్యార్కాదల్ ఇష్క్, ఇస్పేట్, రాజావుమ్ ఇదియే రాణీవుమ్, ధారాళ ప్రభు తదితర చిత్రాల ద్వారా కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు హరీష్ కల్యాణ్. ఈయన తెలుగులోనూ జెర్సీ చిత్రంలో అతిథి పాత్రలో నటించి, అక్కడ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం నూరు కోటి వానవిల్లో హీరోగా నటించి, పూర్తి చేశారు. తాజాగా డీజిల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు ఈయన చేతిలో ఉన్నాయి. ఇలా నటుడిగా బిజీగా ఉన్న హరీష్ కల్యాణ్ శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చెన్నైకి చెందిన నర్మదా ఉదయ్‌కుమార్‌తో హరీష్ కల్యాణ్‌కు శుక్రవారం ఉదయం స్థానిక తిరువేర్కాడులోని కల్యాణ్ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాల సాక్షిగా వివాహం జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తమది పెద్దలు కుదుర్చిన వివాహం అని నటుడు కల్యాణ్ మీడియాకు తెలిపారు. -
నెట్టింట వైరల్ అవుతున్న నటుడు హరీశ్ కల్యాణ్,నర్మద పెళ్లి ఫొటోలు
-
పెళ్లి పీటలు ఎక్కిన జెర్సీ నటుడు హరీశ్, చెన్నై ప్యాలెస్‌లో గ్రాండ్ వెడ్డింగ్
నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మూవీ ఫేం, కోలీవుడ్ నటుడు హరీశ్ కల్యాణ్ నేడు పెళ్లి పీటలు ఎక్కాడు. అక్టోబర్ 6న నర్మద ఉదయ్‌కుమార్‌తో హరీశ్ శంకర్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేస్తూ కాబోయే భార్యను పరిచయం చేశాడు హరీశ్. ఈ నేపథ్యంలో నేడు(అక్టోబర్ 28) నర్మదాతో ఏడడుగులు వేశాడు. ఆయన తండ్రి, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కల్యాణ్ ఈ రోజే పెళ్లి వేడుక జరగనుందని తమిళ మీడియాతో పేర్కొన్నారు. చదవండి: ఫ్యాన్స్‌తో తమన్నా మాస్ డాన్స్, వీడియో వైరల్ ఈ సందర్భంగా వివాహ తేదీ, ముహుర్త సమయం, వేదిక వివరాలను వెల్లడించారు. ఇవాళ ఉదయం చెన్నైలోని తిరువెర్కడు జీపీఎన్ ప్యాలెస్‌లో 9 నుంచి 10:30 గంటల మధ్య హరీష్ కల్యాణ్-నర్మద పెళ్లి జరుగనుందని, ఈ వివాహ వేడుకకు ప్రతీ ఒక్కరూ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని ఆయన కోరారు. కాగా 2010లో ‘సింధు సమవ్లీ’ సినిమాతో అరంగేట్రం చేసిన హరీశ్ కల్యాణ్ తమిళ బిగ్‌బాస్ సీజన్-1లో 4వ రన్నరప్‌గా నిలిచాడు. ప్యార్ ప్రేమ కాదల్, ఇస్పడే రాజుం ఇదయ రాణియుం వంటి పలు సినిమాల్లో నటించాడు. చదవండి: విజయ్‌తో స్వయంవరం? జాన్వీ కపూర్ షాకింగ్ రియాక్షన్ With all my heart, for all my life ❤️ Im extremely happy to introduce 𝐍𝐚𝐫𝐦𝐚𝐝𝐚 𝐔𝐝𝐚𝐲𝐚𝐤𝐮𝐦𝐚𝐫, my wife-to-be. Love you to bits 🤗❤️ With God’s blessings, as we begin our forever, we seek double the love from you all, now & always pic.twitter.com/yNeHusULfY — Harish Kalyan (@iamharishkalyan) October 5, 2022 -
కాబోయే భార్యను పరిచయం చేసిన కోలీవుడ్ హీరో
కోలీవుడ్ నటుడు హరీశ్ కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు పేర్కొన్నాడు. దసరా పండుగ సందర్భంగా కాబోయే భార్యను అభిమానులకు పరిచయం చేశాడు. 'నటుడిగా నా కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎంతో సపోర్ట్ చేశారు. మీ ప్రేమాభిమానాలతో నన్ను ఈ స్థాయికి చేర్చారు. ఇప్పుడు నా జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. ఈ విషయం మీకు తెలియజేయడం ఆనందంగా ఉంది. నర్మదా ఉదయ్‌కుమార్‌తో త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెడుతున్నాను. మాకు మీ ఆశీస్సులు కావాలి' అంటూ కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఈ ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా 2010లో ‘సింధు సమవ్లీ’ సినిమాతో అరంగేట్రం చేసిన హరీశ్ కల్యాణ్ తమిళ బిగ్‌బాస్ సీజన్-1లో 4వ రన్నరప్‌గా నిలిచాడు. ప్యార్ ప్రేమ కాదల్, ఇస్పడే రాజుం ఇదయ రాణియుం వంటి పలు సినిమాల్లో నటించాడు. With all my heart, for all my life ❤️ Im extremely happy to introduce 𝐍𝐚𝐫𝐦𝐚𝐝𝐚 𝐔𝐝𝐚𝐲𝐚𝐤𝐮𝐦𝐚𝐫, my wife-to-be. Love you to bits 🤗❤️ With God’s blessings, as we begin our forever, we seek double the love from you all, now & always pic.twitter.com/yNeHusULfY — Harish Kalyan (@iamharishkalyan) October 5, 2022 -
నిర్విరామ విహారిణి
మనకున్న మహిళా యాత్రికులే తక్కువ. వారిలో నిరంతర యాత్రికురాలు నర్మదారెడ్డి. నర్మదకు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రదేశానికి వెళ్లడం, ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడం, భిన్న సంస్కృతుల ప్రజల జీవనశైలిని ఆకళింపు చేసుకోవడం ఇష్టమైన అభిరుచులు. అనుభవం ఉన్న పర్యాటకులే Ðð ళ్లేందుకు సాహసించని ధ్రువ ప్రాంతాలైన అంటార్కిటికా, ఐస్లాండ్, నార్వేలలో కూడా ఆమె విహరించి వచ్చారు. అజర్బైజాన్, జార్జియా, సైబీరియా, మంగోలియాలతో పాటు చైనా, దక్షిణ కొరియా, మలేషియా, బ్రూనై, బల్గేరియా, రుమేనియా, గ్రీస్, ఇటలీ, క్రొయేషియాలను సందర్శించి అక్కడి విశేషాలను, వసతులను, ఆహారపు అలవాట్ల మూలాలను అధ్యయనం చేశారు. ఆ యాత్ర విశేషాలను తెలుపుతూ ‘ఆగదు మా ప్రయాణం’, ‘కొలంబస్ అడుగు జాడల్లో మా ప్రయాణం’ అనే పుస్తకాలు రాశారు. నర్మద గృహిణిగా ఉంటూనే న్యాయవాద విద్యను అభ్యసించారు. నూటయాభై దేశాలను చుట్టి వచ్చారు. ఇటీవల కొలంబస్ ‘అడుగు జాడల్లో’ పుస్తక ఆవిష్కరణ సందర్భంలో సాక్షితో ముచ్చటించారు. ఆ విశేషాలు. మార్క్ ట్వైన్.. కొలంబస్ నర్మద వివాహం అయినప్పటి నుంచి భర్త నోముల ఇంద్రారెడ్డితో కలిసి ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. ‘రిసార్ట్ కండోమినియమ్స్ ఇంటర్నేషనల్’ సంస్థ సభ్యులుగా చేరటంతో ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ఆమె కల సులువుగా సాకారమైంది. ఇంచుమించు కొలంబస్ నడయాడిన ప్రాంతాలన్నీ ఆమె తిరిగొచ్చారు. చైనాను ‘భూతల స్వర్గం’ అంటారు నర్మద. అక్కడి ప్రజల క్రమశిక్షణ, కట్టుబాట్లు, ట్రైన్లు, శుభ్రమైన రోడ్లు ఏ టూరిస్టును అయినా ఇట్టే ఆకర్షిస్తాయట. గొప్ప అనుభూతిని ఇచ్చింది మాత్రం నైబీరియన్ ట్రైన్ జర్నీ అట. సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి చైనా, రష్యా, మంగోలియా మధ్య ఆరు రోజులు చేసిన ప్రయాణాన్ని జీవితంలో మర్చిపోలేనని నర్మద అంటారు. ‘అన్వేషించు, కల గను, సాధించు’ అనే మార్క్ ట్వైన్ సందేశం నుంచి ఆమె స్ఫూర్తి పొందారు. జీవితాన్ని కేరింతలు, తుళ్లింతలతో నవ్వుతూ ఆనందిస్తూ, నలుగురికి చేయూతనిస్తూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఆమె కోరిక. పర్యటనలు, విహారాలతో పాటు జీవిత చరమాంకం వరకు విద్యార్థినిగానే ఉండిపోవాలని ఆమె ఆశ. అందుకే ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చేశారు. ఇప్పుడు పీహెచ్‌డీపై దృష్టి పెట్టారు. నర్మద ట్రావెలర్ మాత్రమే కాదు. మంచి గాయని కూడా. హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభలో జరిగే కార్యక్రమాల్లో తరచూ పాల్గొని పాటలు పాడుతుంటారు. షటిల్ బ్యాట్మింటన్ ప్లేయర్ కూడా. స్టేట్ లెవెల్ పోటీలలో హైదరాబాద్ జట్టు నుంచి విజయం సాధించారు. అంతేకాదు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నర్మదను వరించిన పురస్కారాలు: ∙2015లో ‘ఉమన్ అచీవర్’ అవార్డు ∙ఉమెన్ ఆన్ గో (ప్రపంచాన్ని తిరిగే నిరంతర యాత్రికురాలు) అవార్డు ∙షటిల్ బాడ్మింటన్‌లో స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ –2018 ∙సోషల్ సర్వీస్‌కు గాను ‘స్టార్ మహిళ’ అవార్డు ∙ఎల్ఎల్ఎంలో డిస్టింక్షన్. ఎల్ఎల్బీలో సిల్వర్ మెడల్. నర్మద తిరిగొచ్చిన ప్రదేశాలలో కొన్ని ప్రపంచంలో ఏడు వింతలైన మాచుపీచు, చైనా వాల్, బ్రెజిల్‌లోని రియోలో ఉన్న క్రీస్తు విగ్రహం, తాజ్‌మహల్, చిచెన్ ఇడ్డా (మెక్సికో), కొల్లీజియం (ఇటలీ), జోర్డాన్. అనుకోకుండా చూసినవి మాత్రం ఆమ్స్టర్ డామ్‌లో తూలిప్ మొక్కలు, చైనాలోని టెర్రకోట మ్యూజియం, మంగోలియా ఇసుక సునామీలు, ఇటలీలోని ఒకే రకమైన ఇటుకలతో నిర్మించిన ఆల్బరాబెల్లోలోని పురాతన గ్రామం. ఇక దేశంలో అయితే.. అన్ని ముఖ్యపట్టణాలతో పాటు 18 శక్తి పీఠాలు, వాలీ ఆఫ్ ఫ్లవర్స్, 12 జ్యోతిర్లింగాలు. – కోన సుధాకర్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
కుటుంబసభ్యులకు భారం కాకూడదని..
నెల్లూరు, నాయుడుపేటటౌన్: అనారోగ్యంతో బాధపడుతున్న యువతి కుటుంబసభ్యులకు భారం కాకూడదనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబసభ్యులు చెప్పినట్లు సూళ్లూరుపేట రైల్వే ఎస్సై కిష్టయ్య బుధవారం వెల్లడించారు. నాయుడుపేట రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం సంఘమిత్ర రైలుకు ఎదురువెళ్లి ఆత్మహత్య చేసుకున్న యువతి ఆచూకి లభ్యమైంది. మండల పరిధిలోని మర్లపల్లి గ్రామానికి చెందిన ఏలూరు నర్మద (20)గా రైల్వే పోలీసులు గుర్తించారు. వారు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన నర్మద శ్రీసిటీలోని సెల్‌ఫోన్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె తల్లి సంపూర్మ కూడా మేనకూరు సెజ్‌లోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గతంలో సంపూర్ణ భర్త రైలు ప్రమాదంలో మృతిచెందాడు. నర్మద ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందింది. అయితే తన అనారోగ్యంతో కుటుంబసభ్యులు అవస్థలు పడకూడదని ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యకు పూనుకున్నట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. యువతి మృతదేహానికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించి వారికి అప్పగించారు. గ్రామస్తులు అనేకమంది వైద్యశాల వద్దకు చేరుకుని కంటతడి పెట్టారు. మృతురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
‘ఆయన’ తిరిగొచ్చారు
భోపాల్ : ఆయన తిరిగొచ్చారు. ఆరు నెలల క్రితం ‘నర్మద పాదయాత్ర’ పేరిట ఆయన చేపట్టిన రాజకీయేతర యాత్ర సోమవారం నాడు ముగిసింది. ఆయన తన యాత్రను రాజకీయేతర యాత్రగా అభివర్ణించుకున్నప్పటికీ అందులో రాజకీయం లేకపోలేదు. ప్రజలతో పోయిన సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు, పార్టీలో పోయిన పరువును తిరిగి తెచ్చుకునేందుకు ఆయన ఈ యాత్రను చేపట్టారు. ప్రతిపక్షాలనే కాకుండా స్వపక్షాన్ని కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి ఇబ్బందిపెట్టే తత్వం ఆయనది. అలా అని బోలా మనిషి కాదు. కనిపించని కపట నాయకుడు. దివంగత కాంగ్రెస్ నేత అర్జున్ సింగ్ శిశ్యరికంలో రాజకీయంగా ఎదిగిన వారు. ఆయనే దిగ్విజయ్ సింగ్. స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఆరు నెలల తన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగొచ్చారు. ‘నేను ఇదివరకటిలా రాజకీయ కార్యకర్తను కాను. ఇప్పుడు పరిపాలనాదక్షుడిన’ ని మీడియా ముందు చెబుతూ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సీఎం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. తాను పార్టీలో ఏ బాధ్యతలు నిర్వహించాలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే నిర్ణయిస్తారని లౌక్యం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పదవి పట్ల మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా, అది ఇరువైపుల పదునున్న కత్తిలాంటిదని చెప్పారు. ప్రతిపక్షంలో భయం పుట్టించగలదని, స్వపక్షంలో చీలికలకు కారణం కాగలదనే ఉద్దేశంతోనే ఆయన ఇరువైపుల పదునున్న కత్తితో పోల్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో దిగ్విజయ్ సింగ్‌తోపాటు కమల్ నాథ్ బృందం, జ్యోతిరాధిత్య సింధియా బృందం అంటూ మూడు వర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో 70 ఏళ్లు దాటిన వారిని పోటీకి నిలబెట్టరాదని రాహుల్ గాంధీ బలంగా భావిస్తున్నందున 71 ఏళ్ల దిగ్విజయ్ సింగ్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం లేకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఆయన కమల్‌నాథ్‌ను సమర్థించేందుకు సిద్ధంగా ఉన్నారు. జ్యోతిరాధిత్యను ఆయన మొదటి నుంచి దూరం పెడుతున్నారు. 2003లో దిగ్విజయ్ సింగ్ స్వరాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కేంద్ర పార్టీ కార్యకలాపాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. మొన్నటి వరకు గోవా, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. గోవా ఎన్నికల్లో అధిక సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకరావడంలో దిగ్విజయ్ సింగ్ విఫలం కావడంతో ఆయన బాధ్యతలను కుదించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు మాత్రమే పరిమితమయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు. ఇప్పుడు దిగ్విజయ్ తిరిగి రావడంతో ఆయన గురించి పార్టీ వర్గాల్లో ‘ఆయన తిరిగొచ్చారు’ అని నర్మగర్భంగా కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలు విసిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతం ప్రజలు దుర్భర దారిద్య్ర పరిస్థితులతో మగ్గుతున్నారు. ఇసుక మాఫియా వ్యవహారాలు పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం పరువు తీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిగ్విజయ్, కమల్‌నాథ్, సింధియాలు ఒక్కటయితే కాంగ్రెస్‌కు విజయం పెద్ద కష్టం కాదు. -
3300 కి.మీ. పాదయాత్ర చేసిన డిగ్గీ రాజా
భోపాల్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేపట్టిన ‘నర్మదా యాత్ర’ సోమవారంతో ముగిసింది. దేశంలో పురాతన నదిగా పేరొందిన నర్మదా నది తీరంలో ఇసుక మాఫియా చేస్తున్న దురాగతాల వల్ల నది కలుషితమవుతుందంటూ డిగ్గీ రాజా ఆరు నెలల క్రితం నర్మదా యాత్ర చేపట్టారు. గతేడాది సెప్టెంబర్ 30న ప్రారంభమైన ఈ పాదయాత్ర 3300 కిలోమీటర్ల మేర సాగింది. బర్మన్ ఘాట్‌కి చేరుకున్న దిగ్విజయ్, ఆయన భార్య అమృత కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఆయన భార్య అమృత, మాజీ ఎంపీలు రామేశ్వర్ నీఖ్రా, నారాయణ్ సింగ్, ఆయన అనుచరగణం కూడా పాల్గొన్నారు. కాగా ఆద్యంతం మతపరమైన, సాంస్కృతిక యాత్రగా సాగిన ఈ పాదయాత్ర మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవినీతి చిట్టాను బయటపెట్టేందుకు సాక్ష్యాలు సేకరించడానికి దోహదపడిందని, ఆ వివరాలు త్వరలోనే బహిర్గతం అవుతాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. -
ఆ పాదయాత్ర వెనక పరమార్థం ఏమిటో?
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తన రెండో భార్య అమృత రాయ్‌తో కలిసి రాష్ట్రంలో చేపట్టిన 3,300 నర్మదా పరిక్రమ యాత్ర ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. రోజుకు పది, పన్నెండు కిలోమీటర్ల చొప్పున గ్రామీణ ప్రాంతాల గుండా ఆయన సాగిస్తున్న ఆయన యాత్ర ఇప్పటికీ దాదాపు రెండు నెలలు పూర్తి చేసుకొంది. మరో నాలుగు నెలలపాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన ప్రజలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యక్షంగా కలుసుకొని వారితో ముచ్చటిస్తున్నారు. 110 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి కొనసాగనున్న ఆయన యాత్ర పట్ల పార్టీ సహచర నాయకులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వయస్సులో ఆయన ఇంత రిస్కు తీసుకొని ఎందుకు పాదయాత్ర జరుపుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయన యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఆయనకు పార్టీలో పోటీదారులైన కమల్‌నాథ్, జోతిరాధిత్య సింధియాలు కూడా ఆయన యాత్రలో పాల్గొనాల్సి వచ్చింది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దిగ్విజయ్ యాత్రకు ప్రాధాన్యత చేకూరింది. 2003 నుంచి అధికారంలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో 228 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి కేవలం 38 సీట్లు రావడంతో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్రంలో అన్ని పదవులకు దూరంగా ఉంటానని దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. పదేళ్లు ఎప్పుడో పూర్తయినప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి పదవులు స్వీకరించేందుకు ఆయన అవకాశం రాలేదు. పైగా పార్టీ కేంద్ర స్థాయిలో ఉన్న పదవులు ఊడిపోయాయి. ముందుగా గోవా పార్టీ ఇన్చార్జి పదవిని పోగొట్టుకున్న ఆయన ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణలలో కూడా పదవులను కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో పదవులకు దూరంగా ఉన్నప్పటికీ పార్టీలో తన పట్టును కోల్పోకుండా పావులు కదుపుతూ వస్తున్నారు. తన విధేయులకు పదవులు లభించేలా చూసుకుంటున్నారు. తన మాటను పార్టీ సీనియర్ నేతలు ఖాతర చేయకపోతే తన మాటను పట్టించుకోకపోతే ముందుముందు పశ్చాత్తాప పడాల్సి వస్తుందంటూ ఆయన తనదైన శైలిలో చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు యువజన నేతగా, భవిష్యత్ కాంగ్రెస్ సీఎంగా పార్టీలో జ్యోతిరాధిత్య నీరాజనాలు అందుకుంటున్న నేపథ్యంలోనే దిగ్విజయ్ ఈ సుదీర్ఘ యాత్రను చేపట్టారు. రాష్ట్రంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్నా ముందుగా తనను పార్టీ అధిష్టానం సంప్రదించే పరిస్థితి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అన్నింటికి సమాధానం తిరిగి ప్రజల మన్ననలను కూడగట్టుకోవడమేనని ఆయన భావించారు. ఎన్నికల్లో ఘోర పరాజయంతో రాష్ట్ర ప్రజలకు దూరమైన ఆయన తనకంటే ఎంతో చిన్నదైన జర్నలిస్ట్‌ను రెండో భార్యగా చేసుకొని మరింత దూరమయ్యారు. తన కుమారుడైన ఎమ్మెల్యే జయవర్ధన్ సింగ్‌తోపాటు మాజీ ఎంపీ, తన సోదరుడు లక్ష్మణ్ సింగ్‌లు కూడా ఇదే అంశంపై దూరమయ్యారు. కొన్నేళ్ల తర్వాత వారు ఇప్పుడు దిగ్విజయ్‌ను పాదయాత్రలో వారు కలుసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత పెళ్లేమిటని ఈసడించుకున్న ప్రజలే ఇప్పుడు ఆయన వెంట నడుస్తున్న అమృతరాయ్‌ను కూడా ఆదరిస్తున్నారు. -
నేను బలమైన అభ్యర్థిని కాను !
సాక్షి, జబల్పూర్ : నేను ముఖ్యమంత్రి పదవికి రేసులో లేను... నేనిప్పుడు బలమైన బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మధ్య ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు దిగ్విజయ్ సింగ్.. దసరా పండగ రోజున 3,300 కిలోమీటర్ల మేర నర్మదా పరిక్రమ్ పాదయాత్రను ఆరంభించనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా,. జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ మరో సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రకటన చేశారు. కమల్‌నాథ్ ప్రకటన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ తాను రేసులో లేనంటూ ప్రకటన చేయడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
మిర్యాలగూడలో వివాహిత దారుణ హత్య
మిర్యాలగూడ మండలంలోని బైపాస్ రోడ్డు వద్ద కొంక నర్మద(29) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. వివరాలు.. మిర్యాలగూడ మండలం కలల్వాడ కాలనీకి చెందిన కొంక రాము, నందిపాడు గ్రామానికి చెందిన నర్మదను 8 సంవత్సరాల క్రితం లవ్‌మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఒక బాబు, ఒక పాప. నర్మద టీచర్‌గా పనిచేస్తోంది. కొంతకాలం సజావుగానే వీరి కాపురం సాగింది. మూడు సంవత్సరాల నుంచి గొడవలు మొదలయ్యాయి. ఒక సంవత్సరం నుంచి విడిగా ఉంటున్నారు. గతంలో కూడా ఓ సారి నర్మదపై హత్యాయత్నం చేశాడు. సోమవారం సాయంత్రం స్కూలు నుంచి తిరిగి వస్తోన్న నర్మదను భర్త కొంక రాము సుత్తితో తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మా ఇంట్లో టాయిలెట్ ఉంది సార్!
గుజరాత్‌లోని ఓ జిల్లాలోని స్కూళ్లలో పిల్లవాడికి ఆ రోజు అటెండెన్స్ వేయాలంటే అతను మాష్టారు పిలిచినప్పుడు చెప్పాల్సింది 'ప్రెజెంట్ సార్' అని కాదు.. మా ఇంట్లో టాయిలెట్ ఉంది సార్! అని. ఇదేంటి అనుకుంటున్నారా? ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్‌కు అనుగుణంగా పనిచేస్తున్న స్వచ్ఛభారత్ అభియాన్ కింద గుజరాత్ లోని నర్మదా జిల్లాలో గల ప్రాథమిక పాఠశాలల్లో ఇలా పలికితేనే అటెండెన్స్ వేస్తారు. ప్రతి విద్యార్ధికి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలనే అవగాహన కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి విద్యాశాఖ అధికారులు తెలిపారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో దాదాపు 690 ప్రాథమిక పాఠశాలు ఉన్నాయి. వీటిలో చదువుకునే పిల్లలంతా హాజరు చెప్పేటప్పుడు ‘మా ఇంట్లో టాయిలెట్ ఉంది సార్!’ అని చెప్పాల్సిందేనని రూల్ పాస్ చేసినట్లు వివరించారు. దీంతో మిగతా విద్యార్థుల ముందు టాయిలెట్ లేదని చెప్పిన విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత మరుగుదొడ్డి ఏర్పాటుపై తల్లిదండ్రులతో చర్చించి టాయిలెట్లను నిర్మించుకుంటున్నట్లు తెలిపారు. ఇది మొదటి దశలో జరిగిందని, రెండో దశలో ఇంకా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టని తమ తరగతి మిత్రుల ఇంటికి పిల్లలందరూ కలిసి వెళ్లి టాయిలెట్ నిర్మాణంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ విషయంపై ఓ విద్యార్ధిని పలకరించగా.. తన పేరు నిరవ్ బరియా అని కెవాడియాలోని కెవాడియా కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నట్లు చెప్పాడు. పాఠశాలలో హాజరు చెప్పే పద్ధతిలో మార్పు చేసినప్పుడు తన ఇంట్లో టాయిలెట్ లేదని చెప్పాడు. దీంతో మిగిలిన స్నేహితుల ముందు టాయిలెట్ లేదని చెప్పాల్సి వచ్చిందని తెలిపాడు. సాయంత్రం ఇంటికి వెళ్లాక ఈ విషయంపై ఇంట్లో మాట్లాడానని, వెంటనే వాళ్లు మరుగుదొడ్డి నిర్మాణానికి ఏర్పాట్లు చేసినట్లు వివరించాడు. -
స్వైన్‌ఫ్లూకు మరొకరి బలి
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నల్లగొండ జిల్లావాసి మృతి ఆదిలాబాద్‌లో ఒకే కుటుంబంలో ఆరుగురికి వైరస్ లక్షణాలు వరంగల్‌లో బయటపడ్డ రెండో కేసు! సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా చేరి రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌బారినపడి 21 మంది మృత్యువాతపడగా తాజాగా మరొకరు స్వైన్‌ఫ్లూ కారణంగా మరణించారు. కొన్ని రోజులుగా స్వైన్‌ఫ్లూ లక్షణాలతో నల్లగొండ జిల్లా మోతేమండలం ఎదురాపురం గ్రామానికి చెందిన ఎం. శ్రీనివాస్ (40) శనివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సూర్యాపేటకు చెందిన నర్మద అనే మహిళకు పుట్టిన 20 రోజుల పసిపాపకు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఉస్మానియాలో ఇప్పటికే నాలుగు పాజిటివ్ కేసులు ఉండగా, మరో 19 మందిని స్వైన్‌ఫ్లూ అనుమానంపై చేర్చుకున్నారు. నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ప్రస్తుతం ముగ్గురు పాజిటివ్ బాధితులకు చికిత్స అందిస్తుండగా, మరో 61 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించారు. తెలంగాణవ్యాప్తంగా ఇప్పటి వరకు 893 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా 299 మందికి హెచ్1ఎన్1 వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 21 మంది మృతిచెందారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని విద్యానగర్‌కు చెందిన ఒకే కుటుంబంలో ఆరుగురికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. ఇక వరంగల్‌లో రెండో స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసు శనివారం నమోదైంది. ఎంజీఎం ఆస్పత్రిలో జ్వరం, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులకు చికిత్స పొందుతున్న తానోజా అనే రోగి నమూనాలను సేకరించి స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ కోసం హైదరాబాద్ పంపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో ఓ బాలిక (3) స్వైన్‌ఫ్లూ వ్యాధి బారిన పడినట్టు సమాచారం. పరీక్షించిన వైద్యులు.. బాలికకు స్వైన్ఫ్ల్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనుమానించడంతో భయపడిన బాలిక తల్లిదండ్రులు ఈ నెల 21 సొంతూరుకు వెళ్లిపోయారు. దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు నల్లగొండ జిల్లా వైద్యాధికారి ఆమోస్‌కు ఫోన్ ద్వారా విషయం తెలిపారు. ఆయన సూచన మేరకు ఆమెను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. స్వైన్‌ఫ్లూపై సురేష్‌చందా సమీక్ష హైదరాబాద్: స్వైన్‌ఫ్లూపై శనివారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన గాంధీ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా, స్వైన్‌ప్లూపై సమాచారం తెలుసుకోవడం, ఇవ్వడం కోసం 104 నంబర్‌ను అమల్లోకి తెచ్చి రెండు రోజులైనా ఆ కేంద్రం సరిగ్గా స్పందించడం లేదు. ‘సాక్షి’ ప్రతినిధి ఆ నంబర్‌కు ఫోన్ చేసి స్వైన్‌ప్లూపై సమాచారం కోరగా... ఎవరూ స్పందించలేదు. పది నిమిషాలు లైన్లో ఉంచి, తర్వాత ఫోన్ కట్ చేశారు. 299 మందికి స్వైన్ ఫ్లూ! నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్ వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా 893 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా... 299 మందిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లుగా నిర్ధారణ అయిందని నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్ శనివారం తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు స్వైన్‌ఫ్లూ బారిన పడి మరణించిన వారి సంఖ్య 12 మంది అని చెప్పారు. శుక్ర, శనివారాల్లో మరో 100మందికి సంబంధించిన శాంపిల్స్‌ను పరీక్షల కోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పంపామని చెప్పారు. స్వైన్‌ఫ్లూ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. వైరస్ సోకిన వారికి అత్యవసర సేవలు అందించేందుకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల్లో 150 పడకలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. 20 వేల స్వైన్‌ఫ్లూ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్లను అన్ని జిల్లాల్లోని ఆసుపత్రులకు పంపిణీ చేశామని నరేంద్రనాథ్ తెలిపారు. సాధారణ వ్యాక్సిన్లు స్వైన్‌ఫ్లూ వైరస్‌కు పనిచేయవని... ఖర్చు భరించి స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు. స్వైన్‌ఫ్లూను హోమియోతో అరికట్టవచ్చు సచివాలయ వైద్యాధికారి విష్ణుమూర్తి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకకుండా ముందస్తుగా హోమియో (ఆర్సెనిక్ ఆల్బ్ 30) మాత్రలు తీసుకోవడం మంచిదని సచివాలయ హోమియో డిస్పెన్సరీ వైద్యాధికారి విష్ణుమూర్తి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వైన్‌ఫ్లూను అరికట్టగలిగే శక్తి హోమియో మాత్రలకు ఉందని పలు జాతీయ పరిశోధన సంస్థలు స్పష్టం చేశాయని చెప్పారు. -
పుట్టిన రోజే తిరిగిరాని లోకాలకు..
కాలుజారి పడి విద్యార్థిని మృతి కార్వేటినగరం: పుట్టిన రోజే ఓ విద్యార్థినికి నూరేళ్లు నిండాయి. మంచినీటి కోసం నడిచి వెళుతూ కాలుజారి పడి ఓ విద్యార్థిని గదిలోనే మంగళవారం మరణించింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మండలంలోని ఎంఎం. విలాసం పంచాయతీ ఒంటిల్లుకు చెందిన ఎం. నర్మద మెడిసిన్‌లో కోచింగ్ తీసుకునేందుకు విజయవాడకు వెళ్లింది. మంగళవారం ఉదయం తాగునీటి కోసం వెళ్లి కాలుజారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. సహచర విద్యార్థినులు ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగానే మరణించినట్లు గ్రామంలోని ఆమె తల్లిదండ్రులు ఎం.సోములు,స్వర్ణలతకు సమాచారం అందించారు. దీంతో ఆ గ్రామం సోకసంద్రమైంది. కష్టాలు తీరతాయనుకున్నామే... కుమార్తె మరణ వార్త విన్న తల్లి స్వర్ణలత కుప్పకూలింది. ‘‘ఇద్దరు కూతుళ్లను కొడుకులుగా భావించి అల్లారుముద్దుగా పెంచాం. ఉద్యోగులుగా చూడాలనే ఆశలను అడియాశలయ్యాయి’’ అంటూ ఆమె రోదనలతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. పుట్టిన రోజు నా చిట్టి తల్లికి నూరేళ్లు నిండాయని తండ్రి సోములు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. నర్మద తోటి విద్యార్థినులు పుత్తూరు కళాశాల నుంచి వచ్చి తమ కళాశాలలో చదివిన నర్మద డాక్టర్ అవుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న తమకు విషాదం మిగిలిందన్నారు. చుట్టు పక్కల గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చి నర్మద మృతదేహాన్ని చూసి, కన్నీటిపర్యంతమయ్యారు. ఎమ్మెల్యే నారాయణస్వామి పరామర్శ మెడిసిన్ చదవడానికి వెళ్లి మృతి చెందిన నర్మద(18) కుటుంబాన్ని గంగాధరనె ల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి బుధవారం పరామర్శించారు. నర్మద మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె తండ్రి సోములును ఓదార్చారు. ఆయన వెంట వైఎస్ఆర్ సీపీ సింగిల్‌విండో అధ్యక్షుడు వి. గీత లోకనాథరెడ్డి, డెరైక్టర్ ఏకాంబరం, సర్పంచ్‌లు పష్పమునికృష్ణ, అమీద్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ప్రభాకరరెడ్డి నర్మదకు నివాళులు అర్పించారు. -
నర్మద, క్షిప్ర రివర్ లింక్ ప్రారంభం
-
రైతుల కోసం దేనికైనా సిద్ధం
నందికొట్కూరుటౌన్/రూరల్, న్యూస్‌లైన్: కేసీ ఆయకట్టు రైతుల సంక్షేమం కోసం దేనికైనా సిద్ధమని నంద్యాల ఎమ్పీ ఎస్పీవై రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఎమ్పీతో పాటు రైతులు మల్యాల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. కేసీకి సకాలంలో నీరు విడుదల కాని పక్షంలో హంద్రీనీవా కాల్వ నుంచి మళ్లించే విషయమై చర్చించారు. రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో హంద్రీనీవాకు నీటి పంపింగ్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు కాల్వకు గండి కొట్టి పైపుల ద్వారా నీరు ఇవ్వాలని పట్టుబడటంతో ఎమ్పీ వారిని వారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుంకేసుల నుంచి శనివారం 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని, ఇప్పటికే కర్నూలు దాటి ఉంటాయన్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు 10 రోజులకు ఒక్కసారి నీటిని విడుదల చేస్తే రైతుల పంటలు దాదాపు చేతికి అందుతాయన్నారు. ఆతర్వాత మార్చిలో 1 టీఎంసీ నీరు అవసరం ఉంటుందని, ప్రభుత్వంతో పోరాడి విడుదల చేయిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఒక వేళ నీరు రాకపోతే హంద్రీకాల్వ గురించి ఆలోచన చేద్దామన్నారు. కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు సకాలంలో పూర్తయింటే రైతులు సాగునీటి కష్టాలు తప్పేవన్నారు. తమ పొలాలకు నీరివ్వకుండా అనంతపురానికి తరలిస్తే సహించేది లేదని రైతులు నినాదాలు చేశారు. ఎమ్పీ వెంట పాటు కేడీసీపీ మాజీ చైర్మన్ కాతా అంకిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కన్వీనర్ ఐజయ్య, నాయకులు మాండ్ర శివానందరెడ్డి, బండి జయరాజు, పిడతల దేవరాజు, కట్టమంచి జనార్దనరెడ్డి ఉన్నారు. పోలీసుల బందోబస్తు: హంద్రీనీవా కాల్వకు గండి కొట్టి కేసీకీ నీటిని మళ్లిస్తామని ముందు నుంచి రైతులు చెబుతుడటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్పీతో పాటు భారీగా రైతులు మల్యాల ఎత్తిపోతల పథకానికి చేరుకున్నట్లు సమాచారం అందుకున్న ట్రైనింగ్ డీఎస్పీ నర్మద, ఎస్ఐ గంగానాథ్బాబు, 15 పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారులతో మాట్లాడి సమస్యను సామరష్యంగా పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు.