నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మూవీ ఫేం, కోలీవుడ్ నటుడు హరీశ్ కల్యాణ్ నేడు పెళ్లి పీటలు ఎక్కాడు. అక్టోబర్ 6న నర్మద ఉదయ్‌కుమార్‌తో హరీశ్ శంకర్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేస్తూ కాబోయే భార్యను పరిచయం చేశాడు హరీశ్. ఈ నేపథ్యంలో నేడు(అక్టోబర్ 28) నర్మదాతో ఏడడుగులు వేశాడు. ఆయన తండ్రి, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కల్యాణ్ ఈ రోజే పెళ్లి వేడుక జరగనుందని తమిళ మీడియాతో పేర్కొన్నారు.
చదవండి: ఫ్యాన్స్‌తో తమన్నా మాస్ డాన్స్, వీడియో వైరల్
ఈ సందర్భంగా వివాహ తేదీ, ముహుర్త సమయం, వేదిక వివరాలను వెల్లడించారు. ఇవాళ ఉదయం చెన్నైలోని తిరువెర్కడు జీపీఎన్ ప్యాలెస్‌లో 9 నుంచి 10:30 గంటల మధ్య హరీష్ కల్యాణ్-నర్మద పెళ్లి జరుగనుందని, ఈ వివాహ వేడుకకు ప్రతీ ఒక్కరూ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని ఆయన కోరారు. కాగా 2010లో ‘సింధు సమవ్లీ’ సినిమాతో అరంగేట్రం చేసిన హరీశ్ కల్యాణ్ తమిళ బిగ్‌బాస్ సీజన్-1లో 4వ రన్నరప్‌గా నిలిచాడు. ప్యార్ ప్రేమ కాదల్, ఇస్పడే రాజుం ఇదయ రాణియుం వంటి పలు సినిమాల్లో నటించాడు.
చదవండి: విజయ్‌తో స్వయంవరం? జాన్వీ కపూర్ షాకింగ్ రియాక్షన్
With all my heart, for all my life ❤️
— Harish Kalyan (@iamharishkalyan) October 5, 2022
Im extremely happy to introduce 𝐍𝐚𝐫𝐦𝐚𝐝𝐚 𝐔𝐝𝐚𝐲𝐚𝐤𝐮𝐦𝐚𝐫, my wife-to-be. Love you to bits 🤗❤️
With God’s blessings, as we begin our forever, we seek double the love from you all, now & always pic.twitter.com/yNeHusULfY
Comments
Please login to add a commentAdd a comment