
సాక్షి, జబల్‌పూర్ : నేను ముఖ్యమంత్రి పదవికి రేసులో లేను... నేనిప్పుడు బలమైన బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మధ్య ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు దిగ్విజయ్ సింగ్.. దసరా పండగ రోజున 3,300 కిలోమీటర్ల మేర నర్మదా పరిక్రమ్ పాదయాత్రను ఆరంభించనున్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా,. జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ మరో సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రకటన చేశారు. కమల్‌నాథ్ ప్రకటన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ తాను రేసులో లేనంటూ ప్రకటన చేయడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు.