దిగ్విజయ్ సింగ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని మాజీ కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఓ వార్త సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. బీజేపీ అనుసరిస్తున్న హిందుత్వ భావానికీ హిందూ మతానికి సంబంధం లేదని అన్నారు. మతం అనేది పూర్తిగా వ్యక్తిగత అంశమని, దానిని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం సరికాదన్నారు. ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిందని, తాను మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో సిమి, భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేదించానని గుర్తుచేశారు. భవిష్యత్తు ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య సిద్ధాంతపరమైన పోటీ నెలకొంటుందని పేర్కొన్నారు.
హిందూత్వాన్ని వీర్‌సావార్కర్ భారతదేశానికి పరిచయం చేశారని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి రాజకీయ గురువు మీరే అన్న ప్రశ్నకు స్పందిస్తూ... రాహుల్ గాంధీ చాలా కాలం నుంచి రాజకీయల్లో ఉన్నారని, ఆయనకు రాజకీయ గురువులు అవసరం లేదన్నారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేయలేదన్న దిగ్గి.. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి మాత్రం పోటీ చేయట్లేదని తేల్చిచెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా లౌకిక శక్తులతో కలిసి పనిచేయడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment