మిర్యాలగూడలో వివాహిత దారుణ హత్య | The brutal murder of a married woman | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో వివాహిత దారుణ హత్య

Published Mon, Jun 27 2016 6:29 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

The brutal murder of a married woman

 మిర్యాలగూడ మండలంలోని బైపాస్ రోడ్డు వద్ద కొంక నర్మద(29) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. వివరాలు.. మిర్యాలగూడ మండలం కలల్‌వాడ కాలనీకి చెందిన కొంక రాము, నందిపాడు గ్రామానికి చెందిన నర్మదను 8 సంవత్సరాల క్రితం లవ్‌మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఒక బాబు, ఒక పాప. నర్మద టీచర్‌గా పనిచేస్తోంది. కొంతకాలం సజావుగానే వీరి కాపురం సాగింది. మూడు సంవత్సరాల నుంచి గొడవలు మొదలయ్యాయి. ఒక సంవత్సరం నుంచి విడిగా ఉంటున్నారు. గతంలో కూడా ఓ సారి నర్మదపై హత్యాయత్నం చేశాడు. సోమవారం సాయంత్రం స్కూలు నుంచి తిరిగి వస్తోన్న నర్మదను భర్త కొంక రాము సుత్తితో తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement