Hero Harish Kalyan Extends Support To Bindu Madhavi In BB Telugu OTT, Tweet Viral - Sakshi
Sakshi News home page

BB Non Stop-Bindu Madhavi: మరోసారి హాట్‌టాపిక్‌గా మారిన బిందు మాధవి లవ్‌ ఎఫైర్‌

Published Tue, Apr 12 2022 9:32 AM | Last Updated on Tue, Apr 12 2022 11:14 AM

Hero Harish Kalyan Extends Support To Bindu Madhavi In Biggboss Non Stop - Sakshi

తెలుగమ్మాయి బిందు మాధవి టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువ పాపులర్‌ అయ్యింది. ఆవకాయ బిర్యానీతో తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సాధించినా అనుకున్నంతగా సక్సెస్‌ కాలేదు. దీంతో కొన్నాళ్లు తెలుగుతెరపై ఎక్కడా కనిపించలేదు. కానీ బిగ్‌బాస్‌ పుణ్యమా అని మళ్లీ ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనదైన ఆటతీరుతో ఆశ్చర్యపరుస్తున్న బిందుకు సోషల్‌ మీడియాలోనూ సూపర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

వోటింగ్‌ విషయంలోనూ ముందంజలో ఉంటూ టైటిల్‌ హాట్‌ ఫేవరేట్‌గా దూసుకుపోతుంది. అయితే తాజాగా బిందు లవ్‌ ఎఫైర్‌ గురించి ఓ వార్త సోషల్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. తమిళ యంగ్‌ హీరో హరీష్ కళ్యాణ్ బిందు మాధవికి సపోర్ట్‌ చేస్తూ చేసిన ట్వీట్‌ ఇందుకు కారణం. గతంలో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది.

తాజాగా ఈ కోలీవుడ్‌ హీరో బిందుకు సపోర్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేయడంతో మరోసారి ఈ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. కాగా తమిళ సీజన్‌1లో బిందు మాధవి పాల్గొన్న సంగతి తెలిసిందే. హీరో హరీష్ కళ్యాణ్ కూడా అదే సీజన్‌లో మరో కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్‌ వచ్చింది. తాజాగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement