'జెర‍్సీ' ఫేమ్ హరీష్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా 'పార్కింగ్'. ఇందూజ హీరోయిన్. రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు.
(ఇదీ చదవండి: Bigg Boss 7: అశ్విని ఎలిమినేట్.. ఏడు వారాలకు రెమ్యునరేషన్ ఎంత తెలుసా?)
ఈ కార్యక్రమంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్, అరుణ్ రాజ్ కామరాజా, రవికుమార్, రతన్ కుమార్, రంజిత్ జయకొడి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక హీరో హరీష్ కల్యాణ్ మాట్లాడుతూ.. చిత్ర జయాపజయాలు ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటాయని, 'పార్కింగ్' లాంటి మంచి కథని వదులుకుంటే కచ్చితంగా తాను బాధపడేవాడినని చెప్పుకొచ్చాడు. లోకేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తాను ఇంతకుముందే చూశానని, పార్కింగ్ అనే పేరుతో ఒక పెద్ద సమస్యను ఈ చిత్రంలో చూపించారని దర్శకుడిని అభినందించారు. చిత్రంలో అందరూ చాలా బాగా నటించారని పేర్కొన్నారు.
కథేంటి?
ట్రైలర్ బట్టి చూస్తే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే హీరో. ఓ ఇంట్లో అద్దెకు ఉంటాడు. పెళ్లయిన తర్వాత కొత్త కారు కొంటాడు. అయితే ఉంటున్న ఇంట్లో పార్కింగ్ సమస్య వస్తుంది. ఓనర్-హీరో ఒకరినొకరు రక్తాలొచ్చేలా కొట్టుకునేంతవరకు వెళ్తుంది. పోలీస్ కేసుల వరకు వెళ్తారు. మరి ఈ పార్కింగ్ సమస్యని ఎలా పరిష్కరించారు? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ.
(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!)\
Comments
Please login to add a commentAdd a comment