ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Parking Movie Released In OTT, Check Streaming Platform Details Inside - Sakshi
Sakshi News home page

Parking Movie In OTT: అలాంటి స్టోరీతో తీసిన మూవీ.. అంతే త్వరగా ఓటీటీలోకి

Published Sat, Dec 30 2023 7:17 AM | Last Updated on Sat, Dec 30 2023 10:46 AM

Parking Movie Ott Streaming Telugu Disney Plus Hotstar - Sakshi

ఓటీటీలోకి మరో క్రేజీ మూవీ వచ్చేసింది. మనలో చాలామందికి తెలిసిన సమస్యని సినిమాగా తీశారు. తక్కువ బడ్జెట్‌తో చాలా సింపుల్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హిట్ అయిపోయింది. ఇప్పుడీ సినిమానే నెలరోజుల్లో ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. తాజాగా ఇది డిజిటల్ ఆడియెన్స్‌కి కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో రిలీజైంది?

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

ఓటీటీలో ఆ సినిమా
జనాభా పెరిగిపోయింది. అందరి దగ్గర టూ-ఫోర్ వీలర్స్ ఉంటున్నాయి. వాడకం బాగానే ఉంది గానీ ప్రతి ఒక్కరికీ పార్కింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు ఇదే అంశాన్ని తీసుకుని తమిళంలో 'పార్కింగ్' పేరుతో ఓ మూవీ తీశారు. 'జెర్సీ'లో నాని కొడుకుగా చేసిన హరీశ్ కల్యాణ్.. ఇందులో హీరోగా చేశాడు. డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిపోతుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ దీన్ని చూస్తూ టైమ్ పాస్ చేసేయొచ్చు.

కథేంటి?
సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే హీరో. ఓ ఇం‍ట్లో అద్దెకు ఉంటాడు. పెళ్లయిన తర్వాత కొత్త కారు కొంటాడు. అయితే ఉంటున్న ఇం‍ట్లో పార్కింగ్ సమస్య వస్తుంది. హౌస్ ఓనర్-హీరో ఒకరినొకరు రక్తాలొచ్చేలా కొట్టుకునేంతవరకు.. ఇంకా చెప్పాలంటే పోలీస్ కేసుల వరకు వెళ్తారు. మరి ఈ పార్కింగ్ సమస్యని వీరిద్దరూ ఎలా పరిష్కరించారు? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి 'హాయ్ నాన్న'.. స్ట్రీమింగ్ డేట్?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement