‘విక్కీ డోనర్‌’ రీమేక్‌లో తాన్యా! | Tanya Hope Romances Harish Kalyan in Vicky Donor Remake | Sakshi
Sakshi News home page

‘విక్కీ డోనర్‌’ రీమేక్‌లో తాన్యా!

Published Sun, Aug 11 2019 10:20 AM | Last Updated on Sun, Aug 11 2019 10:20 AM

Tanya Hope Romances Harish Kalyan in Vicky Donor Remake - Sakshi

నటుడు హరీష్‌ కల్యాణ్‌తో నటి తాన్యా హోప్‌ జత కట్టనుంది. బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొన్న తరువాత నటుడు హరీష్‌ కల్యాణ్‌ సినిమాల్లో హీరోగా బిజీ అయిపోయారు. ఈయన నటించిన ప్యార్‌ ప్రేమ కాదల్, ఇస్పేట్‌ రాజావుమ్‌ ఇదయ రాణీయుం వంటి చిత్రాలు మంచి ప్రజాదరణను అందుకున్నాయి. ప్రస్తుతం ధనుష్‌ రాశీ నేయర్‌గళే చిత్రంలో నటిస్తున్నాడు. సంజయ్‌ భారతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది.

తాజాగా హరీష్‌ కల్యాణ్‌ మరో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈయన హీరోగా నటించనున్న ఈ చిత్రానికి దారాళ్‌ ప్రభు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది హిందీలో మంచి హిట్‌ అయిన విక్కీ డోనర్‌ చిత్రానికి రీమేక్‌. కాగా ఇందులో అతనికి జంటగా తాన్యాహోప్‌ హీరోయిన్‌గా ఎంపికైందన్నది తాజా సమాచారం. ఈ కన్నడ బ్యూటీ గతంలో అరుణ్‌విజయ్‌కు జంటగా తడం చిత్రంలో నటించింది.

తొలి చిత్రంతోనే కోలీవుడ్‌లో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీకి ఇది రెండో అవకాశం.  కాగా మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తాన్యా చెబుతోంది. ఇకపోతే హిందీలో నటుడు అనుకపూర్‌ పోషించిన ప్రధాన పాత్రను తమిళంలో వివేక్‌ నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణ మారిముత్తు దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఈ చిత్రాన్ని స్క్రీన్‌ సీన్‌ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రం తరువాత నటుడు హరీష్‌కల్యాణ్‌ దర్శకుడు శశి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement