
హరీష్ కల్యాణ్, రైజ విల్సన్
హరీష్ కల్యాణ్, రైజ విల్సన్ జంటగా ఎలన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన సినిమా ‘ప్యార్ ప్రేమ కాదల్’. ఈ సినిమాను తమిళంలో సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా నిర్మించారు. కాలేజీ లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో యువన్ శంకర్‌రాజా, విజయ్ మోర్వనేని తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘‘ఈ సినిమా ప్రేమ కథలో ఉన్న భావోద్వేగాలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. యువన్ శంకర్ రాజా మంచి సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు చిత్రబృందం.
Comments
Please login to add a commentAdd a comment