ఆ నటుడి మరణం బాధాకరం.. దర్శకుడి భావోద్వేగం | Yogi Babu, Ineya Thookudurai Movie Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

Thookudurai: ఈ సినిమా కోసం అతడు ఎంతో కష్టపడ్డాడు.. రిలీజయ్యేలోపే..

Jan 21 2024 10:09 AM | Updated on Jan 21 2024 12:42 PM

Yogi Babu, Ineya Thookudurai Movie Pre Release Event Highlights - Sakshi

తూక్కుదురై చిత్ర పోస్టర్‌, దివంగత నటుడు మారిముత్తు

నిర్మాత అన్భు, నటుడు మారిముత్తు ఈ చిత్రం కోసం ఆరంభం నుంచి ఎంతగానో శ్రమించారని చెప్పారు. అలాంటిది ఈ రోజు నటుడు మారిముత్తు లేకపోవడం బాధాకరం అన్నారు.

యోగిబాబు, ఇనయా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం తూక్కుదురై. బాలశరవణన్‌, సెండ్రాయన్‌, కుంకి అశ్విన్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఓపెన్‌ గేట్‌ పిక్చర్స్‌ పతాకంపై అన్బు, వినోద్‌, అరవింద్‌ కలిసి నిర్మించారు. డేనిస్‌ మంజునాథ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రవివర్మ చాయాగ్రహణం, మనోజ్‌, కేఎస్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న తూక్కుదురై చిత్రం ఈనెల 25న విడుదలకు సిద్ధమవుతోంది.


దర్శకుడు డేనిస్‌ మంజునాథ్‌

ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు డేనిస్‌ మంజునాథ్‌ మాట్లాడుతూ.. నిర్మాత అన్భు, నటుడు మారిముత్తు ఈ చిత్రం కోసం ఆరంభం నుంచి ఎంతగానో శ్రమించారని చెప్పారు. అలాంటిది ఈ రోజు నటుడు మారిముత్తు లేకపోవడం బాధాకరం అన్నారు.

ఇది ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేని కుటుంబసమేతంగా జాలీగా చూసి ఆనందించే కథా చిత్రం అని చెప్పారు. ఫిబ్రవరి 9న విడుదల చేయాలని భావించామని అయితే అప్పుడు భారీ చిత్రాలు విడుదల కానుండడంతో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఉత్రా ప్రొడక్షన్స్‌ అధినేత హరి ఉత్రా పొందారు. తాను ఇప్పటి వరకు విడుదల చేసిన చిత్రాల్లో భారీ బడ్జెట్‌ కథా చిత్రం ఇదేనని ఆయన పేర్కొన్నారు.

చదవండి: ‘తొలిప్రేమ’లో పవన్‌ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement