Marimuthu
-
మహేశ్ బాబు వల్లే నా సినిమాకు గుర్తింపు.. ఆయన ఒప్పుకుంటే: కోలీవుడ్ డైరెక్టర్
ఓ మై కడవులే, లక్కీ మ్యాన్, ఓరి దేవుడా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు. ప్రస్తుతం డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన అశ్వత్ మరిముత్తు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తెలుగులో సినిమా తీస్తే ఫస్ట్ మూవీని ఎవరితో చేస్తారని ప్రశ్నించగా.. దానిపై స్పందించారు. తెలుగులో సూపర్ స్టార్‌తోనే నా మొదటి సినిమా చేస్తానని మనసులో మాటను బయటపెట్టారు.అశ్వత్ మరిముత్తు మాట్లాడుతూ..'ఆయన వల్లే నాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. ఓసారి నా చిత్రం ఓహ్ మై కడవులే చిత్రానికి ట్విటర్లో ఊహించని విధంగా వ్యూస్ వచ్చాయి. దానికి కారణం ఏంటో మొదట తెలియలేదు. కానీ ఆ తర్వాత మహేశ్ బాబు మా సినిమాపై మెచ్చుకుంటూ పోస్ట్ చేశాడని తెలిసింది. ఆయన వల్లే మా చిత్రానికి గుర్తింపు వచ్చింది. కేవలం రూ.3 కోట్లతోనే ఆ సినిమాను నిర్మించాం. ఇది చాలా చిన్న సినిమా. తెలుగులో మహేశ్ బాబు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆయనతోనే మొదటి సినిమా చేస్తా. ఆయనతో మూవీ చేయాలనేది నా చిరకాల కోరిక' అని వెల్లడించారు.ఓ మై కడవులే చిత్ర నిర్మాతల నుంచి ఎటువంటి ముందస్తు అభ్యర్థన లేకుండానే మహేష్ బాబు ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారని మరిముత్తు వెల్లడింతారు. ఆయన వల్లే పలువురు తెలుగు దర్శకులు, నటీనటులు ఈ చిత్రాన్ని వీక్షించి అభినందనలు తెలిపారు. ఆ క్షణం నుంచి మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని మరిముత్తు తెలిపారు. మరి దర్శకుడి కోరికను మన మహేష్ బాబు అంగీకరిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ డ్రాగన్ చిత్రానికి దర్శకత్వ వహించారు మరిముత్తు. ఈ చిత్రం ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. #MaheshBabu వల్ల తెలుగు ఇండస్ట్రీ లో పేరు వచ్చింది - Director #AshwathMarimuthu#Dragon #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/fKHaTJiHr8— Telugu FilmNagar (@telugufilmnagar) February 17, 2025 -
ఆ నటుడి మరణం బాధాకరం.. దర్శకుడి భావోద్వేగం
యోగిబాబు, ఇనయా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం తూక్కుదురై. బాలశరవణన్, సెండ్రాయన్, కుంకి అశ్విన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఓపెన్ గేట్ పిక్చర్స్ పతాకంపై అన్బు, వినోద్, అరవింద్ కలిసి నిర్మించారు. డేనిస్ మంజునాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రవివర్మ చాయాగ్రహణం, మనోజ్, కేఎస్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న తూక్కుదురై చిత్రం ఈనెల 25న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు డేనిస్ మంజునాథ్ ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు డేనిస్ మంజునాథ్ మాట్లాడుతూ.. నిర్మాత అన్భు, నటుడు మారిముత్తు ఈ చిత్రం కోసం ఆరంభం నుంచి ఎంతగానో శ్రమించారని చెప్పారు. అలాంటిది ఈ రోజు నటుడు మారిముత్తు లేకపోవడం బాధాకరం అన్నారు. ఇది ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేని కుటుంబసమేతంగా జాలీగా చూసి ఆనందించే కథా చిత్రం అని చెప్పారు. ఫిబ్రవరి 9న విడుదల చేయాలని భావించామని అయితే అప్పుడు భారీ చిత్రాలు విడుదల కానుండడంతో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఉత్రా ప్రొడక్షన్స్ అధినేత హరి ఉత్రా పొందారు. తాను ఇప్పటి వరకు విడుదల చేసిన చిత్రాల్లో భారీ బడ్జెట్ కథా చిత్రం ఇదేనని ఆయన పేర్కొన్నారు. చదవండి: ‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా? -
విషాదం.. ‘జైలర్’ నటుడు మృతి
కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ జి మారి ముత్తు(57) మరణించాడు. గుండెపోటుతో ఆయన శుక్రవారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెళ్లడించారు. దర్శకుడిగా, నటుడిగా కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు మారి ముత్తు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు. ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇందులో విలన్ నమ్మకస్తుడి పాత్రలో నటించాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మారి ముత్తు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి పారిపోయి.. మారిముత్తుకు చిన్నతనం నుంచే సినిమాలపై ప్రేమ కలిగింది. ఇంట్లో చెబితే ఒప్పుకోకపోవడంతో 1990లో సొంతూరు పసుమలైతేరి నుంచి చెన్నైకి పారిపోయాడు. దర్శకుడు కావాలనే కోరికతో గీత రచయిత వైరముత్తు దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్‌గా పనిచేశాడు. తరువాత నటుడు-దర్శకుడు రాజ్ కిరణ్‌లో సహాయ దర్శకునిగా చేరాడు. మణిరత్నం, వసంత్, ఎస్ జే సూర్య లాంటి దర్శకుల దగ్గర పని చేశాడు. 'మన్మధన్'సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ‘కన్నుమ్ కన్నుమ్’సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత ‘పులివాల్’చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2014లో విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. (చదవండి: ఈ హీరోల మల్టీ టాలెంట్ గురించి తెలుసా?)