కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ జి మారి ముత్తు(57) మరణించాడు. గుండెపోటుతో ఆయన శుక్రవారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెళ్లడించారు. దర్శకుడిగా, నటుడిగా కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు మారి ముత్తు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు. ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇందులో విలన్ నమ్మకస్తుడి పాత్రలో నటించాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మారి ముత్తు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి నుంచి పారిపోయి..
మారిముత్తుకు చిన్నతనం నుంచే సినిమాలపై ప్రేమ కలిగింది. ఇంట్లో చెబితే ఒప్పుకోకపోవడంతో 1990లో సొంతూరు పసుమలైతేరి నుంచి చెన్నైకి పారిపోయాడు. దర్శకుడు కావాలనే కోరికతో గీత రచయిత వైరముత్తు దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్‌గా పనిచేశాడు. తరువాత నటుడు-దర్శకుడు రాజ్ కిరణ్‌లో సహాయ దర్శకునిగా చేరాడు. మణిరత్నం, వసంత్, ఎస్ జే సూర్య లాంటి దర్శకుల దగ్గర పని చేశాడు. 'మన్మధన్'సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ‘కన్నుమ్ కన్నుమ్’సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత ‘పులివాల్’చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2014లో విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.
(చదవండి: ఈ హీరోల మల్టీ టాలెంట్ గురించి తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment