సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటుడు కుందర జానీ కన్నుమూశారు. కేరళలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన మరణించినట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా.. కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మలయాళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ఆయనకు నివాళులర్పించారు.
(ఇది చదవండి: విక్రమ్ కొత్త సినిమా.. చిన్నా మూవీ డైరెక్టర్‌తో..)
కెఎన్ బాలగోపాల్ సోషల్ మీడియాలో రాస్తూ.. "కుందర జానీ నా చిరకాల మిత్రుడు. అతను మలయాళ చిత్రసీమలో 45 ఏళ్లకు పైగా చురుకుగా ఉన్నారు. దాదాపు 500 చిత్రాలకు పైగా నటించాడు. కొల్లంలోని సాంస్కృతిక, సామాజిక వేదికల్లో నిరంతరం చురుకుగా ఉండే కుందర జానీ మృతికి నా సంతాపం తెలియజేస్తున్నా.' అని పోస్ట్ చేశారు.
కాగా.. 1979లో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన కుందర జానీ మలయాళ చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు పోషించినందుకు గుర్తింపు తెచ్చుకున్నాడు. 2022లో విడుదలైన మెప్పడియాన్ ఆయన చివరి చిత్రం. అవన్ చండీయుడే మకన్, భార్గవచరితం మూన్నం ఖండం, బలరామ్ వర్సెస్ తారదాస్, తచ్చిలేదత్ చుండన్, సమంతారం, వర్ణప్పకిట్ట్, సాగరం సాక్షి, ఆనవల్ మోతిరమ్ లాంటి చిత్రాల్లో కనిపించారు. మలయాళంతో పాటు కొన్ని తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో కూడా నటించారు. కధయిలే రాజకుమారి, నిలవుం నక్షత్రాలుమ్, సీబీఐ డైరీ అనే మలయాళ సీరియల్స్‌లో కూడా కనిపించారు.
(ఇది చదవండి: అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక : మృణాల్ ఠాకూర్)
Comments
Please login to add a commentAdd a comment