సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. తెరపై మహేశ్ చాలా స్టైలీష్‌గా కనిపించడం.. కామెడీ, యాక్షన్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో సినీ ప్రియులు కూడా ‘సర్కారు వారి పాట’కి ఫిదా అయ్యారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది.
అయితే ఈ చిత్రంలో చిన్న చిన్న మార్పులు చేసుంటే మరింత పెద్ద విజయం సాధించేదని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ‘పరుచూరి పాఠాలు’ పేరుతో కొత్త సినిమాలపై రివ్యూ ఇస్తున్న అయన.. తాజాగా ‘సర్కారు వారి పాట’పై తన అభిప్రాయన్ని వెల్లడించారు.
(చదవండి: జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాను..అదే నా భయం : తమన్నా)
ఈ సినిమా ఫస్టాఫ్‌లో మహేశ్ బాబు, కీర్తి సురేశ్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయని ఆయన అన్నారు. సరదాగా సాగిపోతున్న సమయంలో మహేశ్ ఇండియాకి తిరిగి రావడం అనేది ప్రమాదకరమైన మలుపు అని ఆయన అభిప్రాయపడ్డాడు.
అలా కాకుండా కీర్తి సురేశ్, మహేశ్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ నిడివి పెంచి ఉంటే సినిమా మరింత పెద్ద హిట్ అయ్యేదన్నారు. హీరోతో పాటు హీరోయిన్‌ని కూడా ఒకే విమానంలో తిరిగి ఇండియాకు తీసుకువచ్చేలా కథ రాసుకొని ఉంటే..తెలియకుండానే కొన్ని కామెడీ సన్నివేశాలు, రొమాన్స్ సీన్స్ యాడ్ అయ్యేవని..అలా అయితే ఈ సినిమా మరో వంద కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసేదని పరుచూరి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment