![Sarkaru Vaari Paata Movie Crosses RS 200 Crore Mark - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/25/sarkaru-vari-paata.jpg.webp?itok=cP948w_4)
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం.. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ని సాధించి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది. కేవలం 12 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాదిలో 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన తొలి సినిమాగా ‘సర్కారు వారి పాట’ రికార్డు సృష్టించింది.
12రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ.156.9కోట్ల గ్రాస్, రూ.100.01కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఇప్పటి వరకు 122.09 కోట్ల షేర్, రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మహేశ్ బాబు సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వరకు కొత్త సినిమాలేవి రిలీజ్‌కు లేకపోవడంతో కలెక్షన్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Super 🌟 @urstrulyMahesh's SWAG SEASON continues 🔥🔥#BlockbusterSVP 💥💥#SVPMania #SarkaruVaariPaata @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents pic.twitter.com/mWZ9u6xo8s
— Mythri Movie Makers (@MythriOfficial) May 24, 2022
మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సముద్రఖని విలన్‌గా నటించారు. తమన్ సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment