‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎప్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని నేరుగా కలిసినప్పుడు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఆయనతో అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడాను అంతేకానీ నేరుగా కలవలేదు. కానీ ఆ మధ్య కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చాలా సింపుల్. అంత సింపుల్‌గా ఉంటారా? అని నేరుగా కలిసినప్పుడు అనిపించింది. ఎదుటి వ్యక్తులకు మంచి గౌరవం ఇస్తారు. ఆయనతో చాలా విషయాలను చర్చించాం. సినిమాల గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. బయట ఏం జరుగుతుంది? పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు అడిగారు. ఇలాంటి మీటింగ్స్ మరికొన్ని జరిగితే బాగుంటుందని నేను అన్నాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం నాకు బాగా నచ్చింది. ఆయనతో గడిపిన సమయం గుర్తుండిపోతుంది’ అని సూపర్‌స్టార్ మహేశ్ బాబు అన్నారు.
మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటించింది. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మంగళవారం (మే 10) హీరో మహేశ్ బాబు మీడయాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.
► సర్కారు వారి పాట షూటింగ్ జర్నీ చాలా కష్టమైనది. లాక్‌డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోవడం.. మళ్లీ మొదలు పెట్టడం..ఇలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మా టీమ్ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. సర్కారు వారి పాట ఫుల్ క్రెడిట్ పరశురామ్ గారికే దక్కుతుంది. ఎందుకంటే.. దీంట్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా చేశారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. కొన్ని సీన్స్‌లో అయితే పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ డైలాగ్ డెలివరీ కానీ, బాండీ లాంగ్వేజీలోకానీ.. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ట్రైలర్ అమెజింగ్. సినిమా కూడా అలానే ఉండబోతుంది.
► నా ప్రతి సినిమా పోకిరితో పోల్చలేదు. కానీ ఈ సినిమాలో నా ఫెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో మాదిరి ఉంటుంది. పోకిరిలో ఉన్న మాస్ క్యారెక్టర్ ఇందులో ఉంది. పోకిరి స్టేజ్‌లో ఉన్న క్యారెక్టరైజేషన్ దొరికిందని హ్యాపీగా ఉంది. ఆ కారణంగానే పోకిరితో ఈ సినిమాను పోల్చాను.
► పరశురాం గొప్ప రచయిత కూడా. ఒక రచయిత దర్శకుడు అయితే మంచి ఔట్‌పుట్ వస్తుందని నేను నమ్ముతాను. దాదాపు నా దర్శకులందరూ రచయితలే. అందుకే మంచి సినిమాలొచ్చాయి.
► సర్కారు వారి పాట కథ ఫస్టాఫ్‌లో యూఎస్‌లో మొదలై సెకండాఫ్‌లో వైజాగ్‌కి వస్తుంది.
► మ..మ..మహేశా పాట స్థానంలో మొదటగా వేరే సాంగ్ అనుకున్నాం. షూటింగ్ కూడా పూర్తి చేశాం. కానీ డైరెక్టర్ గారితో పాటు మిగతా వాళ్లు సినిమా ఫ్లో చూసి.. ఒక మాస్ సాంగ్ ఉంటే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. అప్పుడు తమన్ మ..మ..మహేశా ట్యూన్ తీసుకొచ్చాడు. ఇలాంటి మాస్ సాంగ్ నా కెరీర్‌లోనే ఇంతవరకు చేయలేదు.
► మురారి పాట ఈ సినిమాలో ఉండదు. దాని స్థానంలో మాస్ సాంగ్ ఉంటుంది. మురారి పాటను యూట్యూబ్‌లో విడుదల చేస్తాం.
► లాక్‌డౌన్ కారణంగా కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట్లో అనుకున్న స్క్రిప్ట్‌నే ఫాలో అయ్యాం.
► మెడపై రూపాయి టాటూ క్రెడిట్ కూడా పరశురాం గారిదే. టైటిల్ అనౌన్స్‌మెంట్, పోస్టర్ రిలీజ్ టైమ్‌కి నా హెయిర్ పోస్టర్‌లో ఉన్నంత పెరగలేదు. పరశురామ్ గారే టాటూ వేయించి ఉన్న పోస్టర్ డిజైన్ చూపించి మీ పాత్ర ఇలా ఉంటుందన్నారు.
► నా గత మూడు నాలుగు సినిమాల్లో సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాం. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. ఫస్ట్‌టైం మహేశ్‌ని ఇంత ఫ్రీగా చూపించారా అని సర్కారు వారి పాట సినిమా చూశాక అంతా అనుకుంటారు. అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు.
► సర్కారు వారి పాట సినిమాను తెలుగు మూవీగానే తీద్దాం అనుకున్నాం. పాన్ ఇండియా మూవీగా చేద్దామని అనుకోలేదు.
► ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. నాకు బాగా దగ్గరైనవాళ్లు దూరమయ్యారు. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కాస్త ఎమోషనల్ అయ్యాను.
► కథలో నుంచి వచ్చిన టైటిల్ సర్కారువారి పాట. టైటిల్ ముందే లీక్ అయిపోయింది. అందరికి తెలిశాక నాకు వచ్చి చెప్పారు. వినగానే బాగా నచ్చేసింది.వెంటనే ఓకే చెప్పేశాను.
► బాలీవుడ్ సినిమాలు చేయనని నేను అనలేదు. నేను ఎప్పుడు తెలుగు సినిమాలే చేస్తానని చెప్పాను. మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌కి రీచ్ అవ్వాలనేదే నా కోరిక. నేను పదేళ్ల నుంచి అనుకున్నది ఇప్పుడు నెరవేరుతుంది. మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మన ఇండస్ట్రీని వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్లాలి అనేదే నా ఫీలింగ్.
► రాజమౌళితో చేయబోయే సినిమా పాన్ ఇండియా స్థాయిలో చేస్తాను.
► ఈ సినిమాలో కీర్తి సురేశ్ క్యారెక్టర్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. లవ్‌ట్రాక్ మాత్రం ఈ సినిమాకే హైలెట్. కీర్తి సురేశ్ చాలా బాగా నటించింది.
► తమన్ ఈ సినిమాకు ప్రాణం పెట్టేశాడు. మ్యూజిక్ సెన్సేషన్ అతనిప్పుడు. అతను ఏ మ్యూజిక్ ఇచ్చిన యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. కళావతి పాట ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. తమన్ ఫస్ట్ ఈ ట్యూన్ ఇచ్చినప్పుడు మా అందరికి నచ్చలేదు. స్లోగా ఉంది, మెలోడీ అని నా ఫీలింగ్.. మహేశ్ లాంటి మీరో కమ కమాన్ కళావతి అని పాడోచ్చా అని దర్శకుడి ఫీలింగ్. కానీ తమన్ మాత్రం నా మాట విననండి. ఇది మహేశ్‌బాబు కెరీర్‌లో ఒక బెస్ట్ సాంగ్ అవుతుంది అని చెప్పాడు. పాట విడుదల తమన్ చెప్పిందే నిజమైంది. ఇప్పుడు ఇదే నా ఫెవరేట్ సాంగ్.
► రాజమౌళితో సినిమా చేయడం లాంగ్ ప్రాసెస్. కానీ అతనితో ఒక్క సినిమా చేస్తే..పాతిక సినిమాలు చేసినట్లే.
► నాకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెబుతున్న ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ వస్తారు.
► రామ్ లక్ష్మణ్‌లు నా ఫెవరేట్ ఫైట్ మాస్టర్స్ . వాళ్లు ఎప్పుడు కథనే ఫాలో అవుతారు. ప్రతి సినిమాలో కొత్త స్టైల్ ఉంటుంద. తమ చుట్టూ ఉన్నవాళ్లని జాగ్రత్తగా చూసుకుంటారు. అందుకే వాళ్లంటే నాకు ఇష్టం.
► ఈ సినిమాలో సముద్రఖని చాలా బాగా నటించారు. మొదట ఈ పాత్రలో దర్శకుడు చాలా పెద్ద పెద్ద నటుల పేర్లను చెప్పాడు. రెండు మూడు షెడ్యూల తర్వాత సముద్ర ఖనిని ఫైనల్ చేశాం. చాలా కొత్తగా ఉంటది ఆయన పాత్ర. సముద్ర ఖని అదగొట్టేశారు. సినిమా షూటింగ్ అయ్యాక.. గుర్తుగా నా కళ్ల జోడు ఇవ్వమని అడిగారు. ఆయన ఫెర్మార్మెన్స్ చూశాక.. ఒక కళ్ల జోడు ఏంటి.. ఒక కళ్ల జోడు కొట్టునే ఇవ్వాలనిపించింది.
► ‘నేను విన్నాను..నేను ఉన్నాను’ అనే డైలాగ్‌ని సినిమా చూశాక చాలా ఎంజాయ్ చేస్తారు.
► నాన్నగారి బయోపిక్ చేయాలనే ఆలోచననే లేదు. ఇంతవరకు నాన్నగారి బయోపిక్ కోసం ఎవరు నన్ను అప్రోచ్ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment