రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఫైల్ ఫొటో
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యల అంశంతో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నించి.. వాళ్లే ఇరుకున పడ్డారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి బుధవారం ఓ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
రైతుల ఆత్మహత్యల విషయాన్నీ ప్రస్తావించి భంగపడ్డారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల వల్ల 2019 నుంచి ఇప్పటిదాకా రైతుల ఆత్మహత్యలు 25% తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ నివేదికలో ప్రకటించిందని లెక్కలతో సహా అసలు విషయాన్ని విజయసాయి రెడ్డి ట్వీట్ ద్వారా వెల్లడించారు.
లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు ఆ సమాధానం ద్వారా స్పష్టం అయ్యింది కూడా.
Self goal by TDP MPs in Parliament. They tried to raise the issue of increasing farmer suicides in AP and just got informed by the Agriculture Minister that the farmer suicide rates have actually come down by nearly 25% since 2019 due to various schemes of @ysjagan garu. pic.twitter.com/fO9zILeMHh
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 8, 2023
Comments
Please login to add a commentAdd a comment