Farmers Suicides
-
ఇందిరమ్మ రాజ్యం కాదు.. తోడేళ్లలా ప్రాణం తీసే సర్కార్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది.. తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది! అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రైతుల ఆత్మహత్యలపై స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్..‘ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిది! రైతు రాజ్యం కాదిది..రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిది!. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది.. తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది!.కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్. ఆత్మహత్యలు కాదివి ముమ్మాటికి మీరు చేసిన హత్యలు. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు. రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయి. వారి కన్నీళ్లే కపట సర్కార్ ను కూల్చి వేస్తాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిది! రైతు రాజ్యం కాదిది..రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిది!ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది..తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది!కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్ఆత్మహత్యలు కాదివి… pic.twitter.com/u70SmU5tlb— KTR (@KTRBRS) January 21, 2025మరోవైపు రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ సైతం స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా..‘రైతాంగం గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. మరో నలుగురు అన్నదాతల బలవన్మరుణం.. ఇప్పటికి రాలిన మట్టిపూలు 406 మంది. రుణమాఫీ కాక, పంట దిగుబడి రాక, పెట్టుబడులు భారమై అప్పుల బాధలో నలుగురు అన్నదాతల ఆత్మహత్య. రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు చోట్ల ఘటనలు జరిగియా.రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతూనే ఉన్నది. అన్నదాతల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం నుంచి కోలుకోకముందే సోమవారం మరో నాలుగు జిల్లాల్లో అప్పుల బాధతో నలుగురు యువ రైతులు ప్రాణాలు వదిలారు.🔴 రైతాంగం గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. మరో నలుగురు అన్నదాతల బలవన్మరుణం.. ఇప్పటికి రాలిన మట్టిపూలు 406🔴 రుణమాఫీ కాక, పంట దిగుబడి రాక, పెట్టుబడులు భారమై అప్పుల బాధలో నలుగురు అన్నదాతల ఆత్మహత్య🔴 రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు చోట్ల ఘటనలురాష్ట్రంలో రైతుల… pic.twitter.com/UmPqslh3Ph— BRS Party (@BRSparty) January 21, 2025వేసిన పంటలు చేతికిరాక.. వచ్చిన పంటకు సరైన మద్దతు ధర లేక.. బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు తనువు చాలించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, వరంగల్ జిల్లా సగెం మండలం పోచమ్మతండా, వికారాబాద్ జిల్లా దోమ మండలం అయినాపూర్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ ఘటనలు తెలంగాణలో రైతుల ప్రస్తుత దయనీయ పరిస్థితికి అద్దంపడుతున్నాయి’ అంటూ ఆరోపణలు చేసింది. -
సాయం అందక.. బీమా పొందలేక...
రైతులను తాము నిండా ముంచుతున్నామని చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. తమ ప్రభుత్వ నిర్వాకం వల్లే 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఒప్పుకుంది. వారిలో ఏ ఒక్కరికీ పైసా పరిహారం చెల్లించలేదని అంగీకరించింది. రబీ సీజన్లో నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణం 60.55 లక్షల ఎకరాలు కాగా, కేవలం 8.80 లక్షల ఎకరాల్లో పంటలకు మాత్రమే బీమా కవరేజ్ కల్పించినట్టుగా కూడా వెల్లడించింది. అంటే తమ ప్రభుత్వ నిర్వాకం వల్లే దాదాపు 52 లక్షల ఎకరాల్లో సాగవుతున్న నోటిఫైడ్ పంటలకు బీమా దూరమైందని కూడా అంగీకరించింది. గత రబీ సీజన్లో 43.82లక్షల మంది రైతులకు నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం అందించగా... నేడు కేవలం 6.50లక్షల మందికే స్వచ్ఛంద నమోదు పంటల బీమా కింద నమోదు చేసినట్టు తెలిపింది. మొత్తం 37.32 లక్షల మంది రైతులకు పంటల బీమా రక్షణ లేకుండాపోయినట్లు అంగీకరించింది. తద్వారా ఐదేళ్లపాటు రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి, కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛంద నమోదు పద్ధతి వల్ల రైతులకు పంటల బీమా రక్షణ లేకుండాపోయిందని ఒప్పుకుంది.ఈ మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను గాలికి వదిలేసిన తీరుపై పూర్తి ఆధారాలతో ‘సాక్షి’లో వరుసగా రెండు రోజులపాటు ప్రచురితమైన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు సోమవారం విడుదల చేసిన ప్రకటనల ద్వారా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు సమ్మతించడం గమనార్హం. 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ⇒ సాక్షిలో ‘సర్కారు హత్యలు 97’ కథనంపై వ్యవసాయ శాఖ వివరణ సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12 నుంచి నేటి వరకు 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి ఆరు నెలల్లో 49 మంది చనిపోగా, జూన్ నుంచి డిసెంబర్ వరకు 97 మంది చనిపోయారని తేల్చి చెప్పింది. ‘సర్కారు హత్యలు 97’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సాక్షి’లో పేర్కొన్న 97 మంది రైతుల ఆత్మహత్యలు నిజమేనని ఆ ప్రకటనలో అంగీకరించింది. వారిలో ఏ ఒక్కరికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. రైతుల ఆత్మహత్యల వివరాలను పొందుపర్చేందుకు ప్రభుత్వాదేశాల మేరకు ప్రత్యేకంగా ఇటీవలే చంద్రన్న పోర్టల్ ప్రారంభించినట్టు పేర్కొంది.ఈ 97 మందిలో త్రిసభ్య కమిటీ నిర్ధారించిన రైతుల వివరాలను చంద్రన్న పోర్టల్‌లో అప్లోడ్ చేసి, ఆయా రైతు కుటుంబాలకు రూ.7లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సున్నా వడ్డీ రాయితీ చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించింది. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి అర్హుల వివరాల జాబితాలను అప్లోడ్ చేయడంలో జరిగిన జాప్యం వల్లే రాయితీ విడుదల చేయలేదని పేర్కొంది. ఆ సీజన్లో అర్హత పొందిన 6.31లక్షల మందికి చెల్లించాల్సిన రూ.132 కోట్లను కూడా సాధ్యమైనంత త్వరగానే చెల్లిస్తామని తెలిపింది.పంటల బీమా పరిధిలోకి వచ్చింది 8.80 లక్షల ఎకరాలే ⇒ నేటితో ప్రీమియం చెల్లింపునకు గడువు ముగిసినట్టే.. ⇒ అవగాహన కల్పించినా.. ఆరున్నర లక్షల మందే దరఖాస్తు ⇒ ‘సాక్షి’ కథనంపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు సాక్షి, అమరావతి: రబీ సీజన్ నుంచి అమలు చేస్తున్న స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమాలో చేరేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. ఇప్పటి వరకు 6.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 8.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని పంటలు బీమా పరిధిలోకి తీసుకొచి్చనట్టు పేర్కొన్నారు. ‘ప్రీమియం భారం.. బీమాకు దూరం’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు మేరకే ఐదేళ్ల పాటు అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం స్థానంలో స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలు చేస్తున్నామని తెలిపారు.పంట రుణాలు పొందని రైతులు ఈ పథకంలో చేరేందుకు మంగళవారంతో గడువు ముగిసిందని తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు పొందే రైతులు మాత్రం పోర్టల్ ద్వారా పూర్తి వివరాలు అప్లోడ్ చేసేందుకు మరో 15 రోజులు వెసులుబాటు కల్పించామని వివరించారు. జీడిమామిడి పంటకు ఏడు రోజులు, వరిపంటకు మరో 15 రోజులు పొడిగించాలని బీమా కంపెనీలను సంప్రదించామని, వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వెబ్‌ల్యాండ్ డేటాతోపాటు కౌలుదారుల సమాచారం సీసీఆర్సీ డేటా బేస్, ఆర్వోఎఫ్ఆర్ భూముల వివరాలను రెవెన్యూ శాఖ సహకారంతో జాతీయ పంటల బీమా పోర్టల్‌తో అనుసంధానం చేశామని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలను నిరోధించాల్సిన బాధ్యత బ్యాంకులదే ⇒ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను నిరోధించాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉందని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ అన్నారు. బ్యాంకులు మానవీయ కోణంలో స్పందించి రైతులను ఉదారంగా ఆదుకోవాలని ఆయన కోరారు. రైతు ఆత్మహత్యల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం జిల్లా అధికారులు, బ్యాంకర్లతో సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్ సీఎస్ మాట్లాడుతూ తుపాన్లు, అధిక వర్షాల వంటి వైపరీత్యాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర ఆటుపోట్లకు గురవుతోందన్నారు.ప్రతికూల పరిస్థితుల నడుమ బ్యాంకర్లు, వ్యవసాయ సిబ్బందికి అవసరమైన చేయూతనివ్వాలన్నారు. పెట్టుబడుల నిమిత్తం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి తలెత్తకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ లేని రుణాలు, ఇతర ప్రోత్సాహకాలు అందించాలన్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు మాట్లాడుతూ ఎటువంటి హామీ, పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాలను రూ.1.60లక్షల నుంచి రూ.2లక్షలకు ఆర్బీఐ పెంచిన విషయాన్ని రైతులకు తెలియజేయాలని సూచించారు. -
ఆ రైతు కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో కుటుంబంతో సహా కొమ్మర నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ రైతు సంఘం(సీపీఎం) అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఇదే రోజున నంద్యాల జిల్లా ఎం.లింగాపురానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ రైతు సంఘం(సీపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య మరో ప్రకటనలో విమర్శించారు. -
మాకెప్పుడు మాఫీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ జరగని లక్షలాది మంది రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఫిర్యాదులు తీసుకుంటున్నా, గ్రామాల్లో సర్వే చేస్తున్నా తమకు న్యాయం దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదనీ ప్రభుత్వం చెబుతూ సర్వే చేస్తున్నç³్పటికీ.. వారికి ఎప్పుడు రుణమాఫీ జరుగుతుందో స్పష్టత ఇవ్వక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకెందుకు రుణమాఫీ జరగడం లేదని వ్యవసాయశాఖ అధికారులను నిలదీస్తున్నారు. సురేందర్‌రెడ్డి అనే 52 ఏళ్ల రైతు తనకు రుణమాఫీ కాలేదనే ఆవేదనతో శుక్రవారం మేడ్చల్ వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. మాఫీకి దూరంగా లక్షలాది మంది గత ఆర్థిక సంవత్సరం (2023–24) మార్చి 31 నాటికి బ్యాంకులు రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలు రూ.64,940 కోట్లు. ఇందులో డిసెంబర్ నాటికి ఇచ్చిన రుణాలు రూ.49,500 కోట్లు. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్ల వరకు అవసరమని మొదట్లో కాంగ్రెస్ సర్కారు ప్రాథమిక అంచనా వేసింది. అనంతరం రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవుతాయంటూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తీరా బడ్జెట్ కేటాయింపుల్లో దాన్ని రూ.26 వేల కోట్లకు కుదించారు.చివరికు మూడు విడతల్లో రుణమాఫీకి ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమే కావడంతో లక్షలాది మంది రుణమాఫీకి దూరమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రూ.లక్ష మాఫీకి 36.68 లక్షల రైతులు అర్హులు కాగా.. ప్రస్తుత ప్రభుత్వంలో రూ.2 లక్షల మాఫీకి 22.37 లక్షల మందే ఉండటం విస్మయం కలిగించే అంశం. కాగా రూ.లక్ష రుణమాఫీతో పోల్చితే రూ.2 లక్షల మాఫీలో రైతుల సంఖ్య ఏకంగా 14.31 లక్షలు తగ్గిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ జరగలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. లక్షలాది మంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. రైతుల వివరాల సేకరణ పూర్తయ్యేదెప్పుడు?రేషన్‌కార్డు లేకపోవడం, ఆధార్..బ్యాంక్ అకౌంట్లలో తప్పిదాలు, ఇతర సాంకేతిక కారణాలతో రూ.2 లక్షల వరకు మాఫీకాని రైతుల కుటుంబస భ్యుల నిర్ధారణ కోసం వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో సర్వే చేపట్టారు. బ్యాంకు డేటా ఆధారంగా 4.5 లక్షల మంది రైతుల వివరాలను సేకరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు లక్షన్నర మంది రైతుల వివరాలను గుర్తించినట్లు చెబుతున్నారు. సర్వేలో భాగంగా కుటుంబసభ్యుల ఆధార్ నంబర్లు, వారి వయస్సులు, ఇతర వివరాలు సేకరించడంతో పాటు కుటుంబ పెద్దతో ఫొటో తీయాల్సి ఉంది.వారి సెల్ఫీ ఫొటోలను, రైతులు ఇచ్చిన అఫిడవిట్లను అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే వరదలు, వర్షాల కారణంగా ఈ ప్రక్రియ చాలాచోట్ల నిలిచిపోయింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వివరాల సేకరణ ఎప్పుడు పూర్తి అవుతుందో, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో అంతుబట్టడం లేదనే నిరాశా నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత ఐదేళ్ల కాలంలో కుటుంబ పెద్ద చనిపోయిన రైతు కుటుంబాలు చాలా ఉన్నాయి. వారికి రుణమాఫీ కాలేదని అనేకచోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫార్మాట్లో ఎలాంటి కాలమ్ లేదని బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. అదనపు మొత్తంపై మార్గదర్శకాలెప్పుడు?ప్రస్తుతం రూ.2 లక్షల్లోపు రుణం ఉన్న రైతులకే రుణమాఫీ వర్తింపజేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆపై ఒక్క రూపాయి అదనంగా రుణం తీసుకుని ఉన్నా మాఫీ వర్తింపజేయలేదు. రూ.2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న రుణం సొమ్మును రైతులు చెల్లించాకే ప్రభుత్వం నుంచి సొమ్ము జమ అవుతుందని అంటున్నారు. అయితే ఇందుకు వ్యవసాయాధికారులు ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల రైతులు ఇప్పటికే అదనపు మొత్తం చెల్లించి అధికారులను సంప్రదించారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రాలేదని చెబుతున్న అధికారులు, కనీసం అవి ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండటంతో రైతుల పరిస్థితి దిక్కుతోచకుండా ఉంది. రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు కూడా దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.రుణమాఫీ కాలేదని..మేడ్చల్‌లో దుబ్బాక రైతు ఆత్మహత్యబ్యాంకులో తల్లి, కుమారుడికి వేర్వేరుగా పంట రుణాలుఒకే రేషన్‌కార్డులో ఇద్దరి పేర్లూ ఉండటం, ఇద్దరి రుణాలూ కలిపి రూ.3 లక్షలకు పైగా ఉండటంతో జరగని రుణమాఫీమనస్తాపంతో వ్యవసాయ కార్యాలయం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణంమేడ్చల్/దుబ్బాక రూరల్: రుణమాఫీ కాలేదని మనో వేదనకు గురైన ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా అక్బర్పేటభూంపల్లి మండలం చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట సురేందర్‌రెడ్డి (52) మేడ్చల్ హౌసింగ్ బోర్డు కాలనీలో భార్య మంజుల, కుమారుడు నితిన్రెడ్డితో కలిసి నివాసముంటున్నాడు. కండ్లకోయలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సురేందర్‌రెడ్డికి చిట్టాపూర్‌లో ఆయన పేరుపై 4.5 ఎకరాల భూమి, తల్లి సుశీల పేరిట రెండు ఎకరాల భూమి ఉంది. ఇద్దరూ చిట్టాపూర్‌లోని ఆంధ్రప్రదేశ్æ గ్రామీణ వికాస బ్యాంకులో 2012లో పంట రుణం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూ రాగా ప్రస్తుతం సుశీల పేరిట రూ.1,15,662, సురేందర్‌రెడ్డి పేరిట రూ.1,92,440 పంట రుణం ఉంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. కాగా సురేందర్‌రెడ్డి, సుశీల ఇద్దరి రుణాలూ కలిపి రూ.3,08,102 ఉండటంతో వారి రుణాలు మాఫీ కాలేదు. దీంతో సురేందర్‌రెడ్డి పలుమార్లు బ్యాంకు అధికారులను, వ్యవసాయాధికారులను సంప్రదించాడు. తనకు మాఫీ ఎందుకు కాలేదని వారిని అడగగా.. తల్లి, కుమారుడి పేర్లు ఒకే రేషన్‌కార్డులో ఉన్నాయని, రుణం రూ.3 లక్షల పైచిలుకు ఉండటం వల్ల మాఫీ కాలేదని అధికారులు చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం రేషన్ కార్డుకు రూ.2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేసిందని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇద్దరికీ వేర్వేరు రేషన్‌కార్డులు ఉండి ఉంటే మాఫీ అయ్యేదని వారు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సురేందర్‌రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ విషయమై పలుమార్లు తన సోదరుడు రవీందర్‌రెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. రేషన్‌కార్డు నుంచి తల్లి పేరు తొలగించేందుకు దరఖాస్తు కూడా చేశాడు. సురేందర్‌రెడ్డికి గతంలోనూ రుణమాఫీ కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కోసమని ఇంట్లో నుండి వెళ్లిన సురేందర్‌రెడ్డి మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయ కాంప్లెక్స్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేçహాన్ని నగరంలోని గాంధీ మార్చురీకి తరలించారు.రెండురకాల సూసైడ్ నోట్లుమృతుడి జేబులో నుంచి పోలీసులు రెండు రకాల సూసైడ్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం (ఎస్బీఐ)లోంచి వచ్చే స్లిప్పులపై ఇవి రాసి ఉన్నాయి. ఒక దానిపై ‘నా చావుకు కారణం నా అమ్మ’ అని రెండు సార్లు, మరో పత్రంపై ‘చిట్టాపూర్ బ్యాంకులో లోన్ మాఫీ కాలేదని, అందుకే నా ఆత్మహత్య’ అని రాసి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు సురేందర్ రెడ్డి బ్యాంకు రుణం రూ.192440, తల్లి సుశీల బ్యాంకు రుణం రూ.115662 ఇద్దరిది కలిపి మొత్తం రూ.308102రైతు రుణమాఫీ కాని కుటుంబాల వివరాలు నమోదురామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శుక్రవారం రుణమాఫీ కాని రైతు కుటుంబాల ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న రామన్నపేటతో పాటు పరిసర గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు వందల సంఖ్యలో ఉదయం 10 గంటలకే రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వర్ పనిచేయకపోవడంతో రైతులు రెండుగంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం మూడు ఫోన్ల ద్వారా వివరాలను అప్లోడ్ చేయడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా..? హరీష్‌రావు ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదని ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల వరుస మరణాలపై హరీష్ రావు ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమంటూ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూప లేదనే ఆవేదనతో... సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలు మరువక ముందే నేడు ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం.ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్నసీఎం గారి సొంత జిల్లాలోనే ఓ రైతు… pic.twitter.com/xwPPUVtJ4E— Harish Rao Thanneeru (@BRSHarish) July 4, 2024 రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరమన్న హరీష్.. ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదని ధ్వవజమెత్తారు. పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. -
ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య
మిరుదొడ్డి (దుబ్బాక)/ రామగిరి (మంథని): ఏడు బోర్లు వేసినా నీరందక పంట ఎండిపోవడంతో మనోవేదనతో ఓ రైతు, ఆరుగాలం కష్టపడ్డా నీటి కొరతతో పత్తి పంటకు దిగుబడి రాలేదన్న బాధతో మరో రైతు పురుగుల మందు తాగి తనువు చాలించారు. సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు.. తొగుట మండల కేంద్రానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్‌కు (48) వ్యవసాయమే జీవనాధారం. భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషించుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నాడు. మిరుదొడ్డి మండల పరిధిలోని కాసులా బాద్ శివారులో నాలుగు ఎకరాల భూమిని కొనుగో లు చేసి వరి పంట వేశారు. భూగర్భ జలాలు వట్టిపోవడం.. మండుతున్న ఎండలతో రెండు ఎకరాలు పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో సుమారు రూ.6 లక్షల వరకు అప్పు చేసి 7 బోరు బావులు తవ్వంచాడు. అందులో ఒకటి రెండు బోరు బావుల నుంచి సన్నటి నీటి ధార మాత్రం వస్తోంది. పొట్ట దశకు వచ్చిన రెండు ఎకరాలకు సాగు నీరు అందక ఎండు ముఖం పట్టింది. దీంతో మనోవేదనకు గురైన శ్రీనివాస్ శనివారం సాయంత్రం పొలం వద్దే పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మరోఘటనలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ యాదవ్ (34) రెండేళ్లక్రితం ఇల్లు నిర్మించుకున్నాడు. ఇందుకోసం కొంత అప్పు తీసుకొచ్చాడు. తనకున్న 8 ఎకరాల్లో పత్తి వేశాడు. ఇందుకోసం బ్యాంకులో మరికొంత లోన్ తీసుకున్నాడు. అప్పు రూ.35 లక్షల వరకు చేరింది. పత్తి పంట అధిక దిగుబడి వస్తే మొత్తం అప్పు తీర్చవచ్చని భావించాడు. కానీ, తెగుళ్లు, నీటి కొరతతో ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ ఈనెల 3న గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన
రాజన్న సిరిసిల్ల, సాక్షి: తెలంగాణలో ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. గతేడాది ఇదే సమయానికి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అంతటా నీళ్లిచ్చింది. కేసీఆర్‌పై కోపంతోనే మేడిగడ్డకు రిపేర్ చేయించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఢిల్లీకి హైదరాబాద్‌కు తిరగడం తప్ప.. రైతుల్ని పరామర్శించే తీరిక సీఎం రేవంత్‌రెడ్డికి లేకుండా పోయింది. ఇప్పటికే 200 మంది రైతులు చనిపోయారు. ఇప్పటికైనా రైతుల్ని ఆదుకోండి’’ అని కాంగ్రెస్ సర్కార్‌ను కోరారాయన. ‘ఎండిపోయి పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం ఇవ్వాలి. ఎకరానికి పదివేలా, 25 వేలా.. ఎంతిస్తారో పరిహారం అంత ఇవ్వండి. అధికారం నుంచి దిగేపోయేనాటికి రైతుల కోసం కేసీఆర్ రైతుబంధు పేరిట రూ.7,000 కోట్ల రూపాయలు పెట్టారు. కానీ, అవికూడా రైతులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఆ డబ్బు చేరవేస్తోంది. ఎన్నికల టైంలో.. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతుబంధు ఇవ్వాలి. రైతులకు అండగా మేమున్నాం. కేసీఆర్ ఉన్నారు. దయచేసి ఆత్మహత్యల్లాంటి చర్యలకు రైతులు పాల్పడొద్దు’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
వేలేరు/తలమడుగు: రాష్ట్రంలో ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. నీరు తడి లేక పంట ఎడిపోయి ఒకరు.. పంట దిగుబడి సరిగా రాక అప్పుల్లో కూరుకుపోయి తీర్చే దారిలేక మరొక రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండ్రోజుల వ్యవధిలో జరిగిన ఈ రైతుల ఆత్మహత్య లకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన పిట్టల సుధాకర్(43)కు మూడెకరాల వ్యవ సాయ భూమి ఉంది. కొంతభాగం మొక్కజొన్న సాగుచేశాడు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో అప్పులు చేసి బావిలో సైడ్ బోర్లు వేయించాడు. అయినా నీరు పడకపోవడంతో పంట చేతికందే సమయంలో ఎండిపోయింది. బోర్లు వేసేందుకు, పంట పెట్టుబడికి, రెండేళ్ల క్రితం కూతురు పెళ్లికి తెచ్చిన అప్పు మిత్తి కలిపి రూ.12లక్షల వరకు ఉంది. ఇటు పంట ఎండిపోవడం, అటు అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందాడు. సోమవారం మధ్యాహ్నం చేలోకి వెళ్లిన సుధాకర్ ఎండిన పంటలను చూసి తీవ్ర మనోవేదనతో పురుగుల మందుతాగాడు. చుట్టు పక్కల రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వెంటనే వారు అక్కడకు వెళ్లి చూడగా.. అప్పటికే సుధాకర్ మృతి చెందాడు. మంగళవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. పొలానికి వెళ్లొస్తానని చెప్పి... ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కాకర్ల ఆశన్న (43)కు రెండెకరాల 19 గుంటలతో పాటు తన భార్య సుచరిత పేరిట మూడెకరాల 30 గుంటల పొలం ఉంది. మొత్తం ఆరెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సీజన్లో అందులో పత్తి, కంది పంటలు సాగు చేశాడు. పత్తి పెట్టుబడి కోసం ఆదిలాబాద్‌లోని ఎస్బీఐలో భార్యాభర్తల ఇద్దరు పేరుమీద రూ.4లక్షలు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి మరో రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు సంతానం. కుమార్తె డిగ్రీ, కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఇటీవలే కుమార్తెకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగా రాక, తెచ్చిన అప్పు తీర్చే దారిలేక మనస్తాపం చెందిన ఆశన్న మంగళవారం ఉదయం పొలానికి వెళ్లొస్తానని చెప్పి ఇంటినుంచి బయల్దేరాడు. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా...వారు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఆశన్న మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అప్పట్లో రైతుల ఆత్మహత్యలపై వైఎస్సార్ ఎమోషనల్
-
పార్లమెంట్లో టీడీపీ ఎంపీల సెల్ఫ్ గోల్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యల అంశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నించి.. వాళ్లే ఇరుకున పడ్డారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి బుధవారం ఓ ట్వీట్ ద్వారా తెలియజేశారు. రైతుల ఆత్మహత్యల విషయాన్నీ ప్రస్తావించి భంగపడ్డారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల వల్ల 2019 నుంచి ఇప్పటిదాకా రైతుల ఆత్మహత్యలు 25% తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ నివేదికలో ప్రకటించిందని లెక్కలతో సహా అసలు విషయాన్ని విజయసాయి రెడ్డి ట్వీట్ ద్వారా వెల్లడించారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు ఆ సమాధానం ద్వారా స్పష్టం అయ్యింది కూడా. Self goal by TDP MPs in Parliament. They tried to raise the issue of increasing farmer suicides in AP and just got informed by the Agriculture Minister that the farmer suicide rates have actually come down by nearly 25% since 2019 due to various schemes of @ysjagan garu. pic.twitter.com/fO9zILeMHh — Vijayasai Reddy V (@VSReddy_MP) February 8, 2023 -
రైతు ఆత్మహత్యతో ఉద్రిక్తత
కామారెడ్డి టౌన్: తన మూడు ఎకరాల భూమి మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్‌లో ఇండస్ట్రియల్ జోన్లోకి వెళ్లడంతో, ఆ భూమిని అమ్ముకోవడానికి వీలుపడక మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన పయ్యావుల రాములు (42)కు కామారెడ్డి పట్టణ శివారులోని ఇల్చిపూర్ వద్ద 3 ఎకరాలు పంట భూమి ఉంది. కాగా, ఇటీవల మున్సిపల్ నూతన మాస్టర్‌ప్లాన్‌లో అక్కడి భూములన్నీ ఇండస్ట్రియల్ జోన్లోకి చేర్చా రు. అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు ఆ భూమిని గతంలోనే అమ్మకానికి పెట్టాడు. ఇప్పుడు ఆ భూమి ఇండస్ట్రియల్ జోన్లోకి వెళ్లడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకురాక మనస్తాపంతో రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన తల్లి.. చుట్టుపక్కల వారికి తెలపడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాములు మృతితో రైతులు గ్రామంలో కాసేపు ఆందోళన చేశా రు. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకుని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేయడానికి తరలివచ్చారు. అయితే కామా రెడ్డి కొత్త బస్టాండ్ ముందు పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు అక్కడే రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. తర్వాత రాము లు మృతదేహాన్ని అక్కడే వదిలేసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ధర్నాకు దిగారు. ఈ సమయంలో 2 గంటల పాటు రోడ్డుపైనే ట్రాక్టర్ లో మృతదేహం అలానే ఉంది. తర్వాత పోలీసులు గట్టి బందోబస్తు మధ్య మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే తన భర్త మృతదేహాన్ని తన అను మతి లేకుండా ఆస్పత్రికి తరలించినందుకు రాములు భార్య.. తన కుటుంబ సభ్యులు, ఇతర రైతులతో కలసి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వారికి సంఘీభావం ప్రకటించారు. రెండు పంటలు పండే రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్లోకి మార్చడం దారుణమన్నారు. నా కుటుంబాన్ని ఆదుకోండి తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాములు భార్య శారద కోరారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల తన భర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బుధవారం రాత్రి ఆమె ఆందోళన విరమించి కుటుంబ సభ్యులతో కలసి ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. రాములు మృత దేహానికి పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 300 శాతం తగ్గాయి: ఎమ్మెల్సీ పల్లా
సాక్షి, హైదరాబాద్: రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చే యూత, సాగునీటి ప్రాజెక్టులు, వనరుల కారణంగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గతంతో పోలిస్తే 300 శాతం తగ్గాయని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగం ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, వి.గంగాధర్ గౌడ్, తాత మధులతో కలిసి ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. 2014లో 1,300 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అది ఇప్పుడు 352గా ఉందని, నీతి ఆయోగ్ వంటి సంస్థ తెలంగాణలో వ్యవసాయ స్థితిగతులు బాగున్నాయని కితాబిచి్చందని గుర్తు చేశారు. కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పది శాతంలోపు తగ్గితే తెలంగాణలో 300 శాతం తగ్గాయని, వివిధ కారణాలతో భూ మి లేనివారు ఆత్మహత్యలు చేసుకుంటే కూ డా రైతుల ఖాతాలో వేస్తున్నారని అన్నారు. ఎవరు ఆత్మహత్య చేసుకున్నా అది బాధాకరమే అని, తప్పుడు లెక్కలతో ఓ పత్రిక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అసత్యా లు ప్రచారం చేస్తుందని విమర్శించారు. చదవండి: సర్పంచ్‌లూ అర్థం చేసుకోండి!.. కేంద్రం రూ.1,100 కోట్ల నిధులు ఆపేసింది -
కేసీఆర్‌కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఇందులో భాగంగా తెలంగాణలో రైతుల సమస్యలు పత్తి ధర, రుణమాఫీ గురించి ప్రధానంగా చెప్పుకొచ్చారు. వివరాల ప్రకారం.. సీఎం కేసీఆర్‌కు శనివారం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. లేఖలో పత్తికి మద్దతు ధర, రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరారు. రైతులను దళారులు దగా చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ లేఖలో డిమాండ్ చేశారు. ఇక, కొద్దిరోజుల క్రితం పత్తికి 9వేలకు పైగా ధర ఉండగా.. ప్రస్తుతం పత్తి ధర 7వేలకు పడిపోయింది. దాదాపు 2వేల రూపాయలు తగ్గడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు సిండికేట్‌గా మారి పత్తి ధరను తగ్గించి రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి ముగ్గురు రైతుల్లో.. ఒకరు కౌలుదారే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతీ ముగ్గురు వ్యవసాయదారుల్లో ఒకరు కౌలురైతు ఉన్నారని రైతు స్వరాజ్య వేదిక సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో కౌలురైతుల స్థితిగతులపై ఆ వేదిక ఆధ్వర్యంలో అధ్యయనం జరిపారు. 20 జిల్లాల్లో 34 గ్రామాల్లో మొత్తం 7,744 మంది రైతులను సర్వే చేయగా, వారిలో 2,753 మంది (35.6 శాతం) కౌలురైతులు ఉన్నట్లు తేలింది. సర్వే చేసిన మొత్తం 2,753 కౌలురైతుల్లో 523 మంది ఏమాత్రం భూమి లేనివారే. వీరు 19 శాతం మంది ఉన్నారు. 81 శాతం మంది ఎంతోకొంత సొంత భూమి ఉండి, అది జీవనోపాధికి సరిపోక అదనంగా మరి కొంతభూమిని కౌలుకు తీసుకున్నారు. కౌలురైతుల సగటు సొంతభూమి 2.3 ఎకరాలు కాగా, సగటున కౌలుకు తీసుకున్న భూమి విస్తీర్ణం 5.1 ఎకరాలు. 31 శాతం మంది కౌలు రైతులు 5 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కౌలుకు తీసుకున్నారు. కౌలు రైతుల్లో 60.9 శాతం మంది బీసీలున్నారు. ఎస్సీలు 22.9 శాతం, ఎస్టీలు 9.7 శాతం మంది ఉన్నారు. ఓసీలు 4.2 శాతం, ముస్లిం మైనారిటీలు 2.4 శాతం మంది ఉన్నారు. భూమిని కౌలుకు ఇస్తున్న యజమానుల్లో 49 శాతం మంది బీసీలు కాగా, 33 శాతం మంది ఓసీలు, 10 శాతం మంది ఎస్సీలు, మిగిలిన 7 శాతం మంది ఎస్టీలు, మైనారిటీలు. సర్వేలో ముఖ్యాంశాలు... ► భూయజమానుల్లో 26 శాతం మంది మాత్రమే స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. 55 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారం, కాంట్రాక్టులు, ఇతర వృత్తుల్లో ఉన్నవారే. మిగిలినవారు ఇతర వృత్తి లేనివారు లేదా వృద్ధులు. ► 25 శాతం భూ యజమానులు నగరాల్లో ఉండగా, ఒక శాతం విదేశాల్లో ఉంటున్నారు. నగరాలు, విదేశాలలో ఉన్నవారిలో సగం మంది ఆ గ్రామాలతో కానీ, వ్యవసాయంతోకానీ ఎటువంటి సంబంధం లేనివారే. కేవలం పెట్టుబడి కోసం వీరు భూములను కొని కౌలుకు ఇస్తున్నారు. ► కౌలు రైతుల్లో 9.5 శాతం మహిళలున్నారు. మహిళా కౌలురైతులలో 22.7 శాతం భూమి లేని వారే. ► 73 శాతం కౌలు రైతులు ఒకే భూమిలో కనీసం మూడేళ్లు లేదా అంతకుపైగా సాగు చేస్తున్నారు. 39 శాతం మంది 5 ఏళ్లకుపైగా, 18 శాతం మంది 10 ఏళ్లకుపైగా ఒకే భూమిలో కౌలు సాగుచేస్తున్నారు. ► 91.1 శాతం కౌలు రైతులు కౌలు మొత్తాన్ని నగదురూపంలో, 7.5 శాతం మాత్రమే పంట రూపంలో చెల్లిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే పంట భాగస్వామ్యం పద్ధతిలో కౌలు ఇస్తున్నారు. నగదురూపంలో కౌలు చెల్లించేవారిలో 38.3 శాతం మంది సీజన్ ముందే పూర్తిగా చెల్లిస్తున్నారు. 20.5 శాతం మంది కౌలు ధరలో సగం ముందుగా చెల్లించి సగం చివరిలో చెల్లిస్తున్నారు. 41 శాతం మంది పంటకోతల తర్వాత చెల్లిస్తున్నారు. ► కౌలురైతుల్లో 69 శాతం వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. హమాలీ/భవన నిర్మాణ కార్మికులుగా 13 శాతం మంది, పశుపోషణపై 9.6 శాతం మంది, మేకలు, గొర్రెల పెంపకంపై 3 శాతం మంది ఆధారపడ్డారు. ఇతరులు బీడీ కారి్మకులుగా, ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటోడ్రైవర్లుగా, చిన్నవ్యాపారులుగా అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. ► రాష్ట్రవ్యాప్తంగా ప్రతికౌలు రైతు కుటుంబానికి సగటు రుణం రూ.2.7 లక్షల వరకు ఉంది. దానిలో రూ. 2 లక్షలు ప్రైవేట్ రుణాలే. కౌలుభూమి మీద పంటసాగు కోసం బ్యాంకు రుణాలు అందడంలేదు. వాళ్లకు ఉన్న ► మొత్తం రుణాల్లో 25 శాతం మాత్రమే బ్యాంక్ రుణాలు ఉన్నాయి. ప్రైవేట్ అప్పులపై వడ్డీ 24 శాతం నుంచి 60 శాతం వరకు ఉంది. ఇదీ చదవండి: చక్కని సాగుకు.. చిన్న డ్రోన్లు -
చంద్రబాబు హయాంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువ: కేంద్రం లిఖిత పూర్వక సమాధానం
సాక్షి, ఢిల్లీ: రైతు ఆత్మహత్యలపై రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగాయని నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. చంద్రబాబు హయాంలో 2018-19లో 628 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, 2019 తర్వాత క్రమంగా ఏపీలో రైతు ఆత్మహత్యలు తగ్గుతూ వస్తున్నాయి. 2019-20లో 564 మంది, 2020-21లో 481 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్రమంత్రి వివరించారు. చదవండి: గుజరాత్ ఎన్నికలు.. గెలిచిన, ఓడిన ప్రముఖులు వీరే! -
భూమి పోతోందని.. సెల్ టవర్‌పై ఉరేసుకున్న రైతు
లింగంపేట (ఎల్లారెడ్డి): చెరువు కింద కాస్త భూమి ఉంది.. తూము నుంచి నీళ్లు వదిలితే ఆ భూమిలో నీళ్లు నిలుస్తాయి.. ఏ పంటా వేయలేని పరిస్థితి.. పైగా ఆ భూమి నుంచే కాల్వ తవ్వేందుకు గ్రామస్తులు నిర్ణయించడంతో ఓ రైతు ఆవేదన చెందాడు. తనకు అన్యాయం జరుగుతోందని, అధికారులు పట్టించుకోవడం లేదని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అందరూ చూస్తుండగానే టవర్‌పై రుమాలుతో ఉరివేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారంలో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. చెరువు నీళ్లు నిలుస్తుండటంతో.. మెంగారం గ్రామానికి చెందిన రైతు పుట్ట ఆంజనేయులు (32)కు గ్రామ శివార్లలోని చెరువు ముందు 9 గుంటల వ్యవసాయ భూమి ఉంది. చెరువు దిగువన అర గుంట భూమి ఉంది. దిగువన ఉన్న పంట భూములకు చెరువు నుంచి తూము ద్వారా నీళ్లు వదులుతుంటారు. అలా నీళ్లు వదిలినప్పుడు పక్కనే ఉన్న ఆంజనేయులు భూమిలో నీళ్లు నిలుస్తాయి. దీనివల్ల కొన్నేళ్లుగా ఆ భూమిలో పంట వేయలేక పోతున్నాడు. ఒకట్రెండు సార్లు పంట వేసినా నీళ్లకు కొట్టుకుపోయి దెబ్బతింది. దీనితో తనకు నష్టపరిహారం చెల్లించాలని, తన పొలం నుంచి నీళ్లు పోకుండా చేయాలని గతంలోనే ఆంజనేయులు అధికారులు, గ్రామస్తులను కోరాడు. దానితో గత ఏడాది రూ.2వేలు నష్టపరిహారంగా ఇచ్చారు. ఇక గత ఏడాది తన పొలం మీదుగా కాల్వ తవ్వడానికి అధికారులు, గ్రామస్తులు ప్రయత్నించగా జేసీబీకి అడ్డునిలిచి ఆపేశాడు. కాల్వ తవ్వుతారని.. ప్రస్తుతం యాసంగి పంటకు నీళ్లు ఇచ్చేందుకు గ్రామ పంచాయతీ ఆదివారం నిర్ణయం తీసుకుంది. చెరువు తూము దిగువ నుంచి పంట కాల్వ తీయాలని నిర్ణయించిన గ్రామస్తులు.. ఆయకట్టు రైతుల నుంచి ఎకరానికి రూ.500 చొప్పున వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇది తెలిసిన ఆంజనేయులు తన పొలం నుంచి కాల్వ తవ్వుతారని, భూమి తనదికాకుండా పోతుందని ఆందోళన చెందాడు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ‘నాన్నా దిగి రా’ అంటూ పిల్లలు రోదించినా.. రైతు ఆంజనేయులు సెల్ టవర్ ఎక్కిన విషయం తెలుసుకున్న తహసీల్దార్ మారుతి, ఎస్సై శంకర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని, దిగి రావాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆంజనేయులు భార్య సుజాత కూడా సెల్ టవర్ దిగాలని వేడుకుంది. ఆయన ముగ్గురు పిల్లలు ‘నాన్నా దిగి రా’ అంటూ రోదించినా వినిపించుకోలేదు. సుమారు గంటసేపు సెల్ టవర్‌పైనే ఉన్న ఆంజనేయులు.. అందరూ చూస్తుండగానే టవర్‌పై ఇనుప రాడ్‌కు తన రుమాలును కట్టి ఉరివేసుకున్నాడు. కాసేపటికే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి పరిశీలించారు. రైతు ఆత్మహత్యకు కారణాలు, ఇతర అంశాలను ఆరా తీశారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ భరోసా ఇచ్చారు. -
పోగొట్టుకున్న చోటనే వెతకాలి..!
సాక్షి, మహబూబాబాద్: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎర్రబంగారం పండిస్తే సిరులు కురుస్తాయని ఆశపడి మిర్చి సాగు చేసిన రైతులకు తామర పురుగు, నల్లిపురుగు, పేను బంక పురుగు చుక్కలు చూపించాయి. దుక్కి దున్నడం నుంచి ఏపుగా పెరిగి.. కాత, పూత సమయంలో ఈ మాయదారి పురుగు రావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 70 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు నష్టాల పాలయ్యారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది మిరప పూతకు ఆశించిన తామర పురుగు(ఫైల్) తగ్గేదేలే అంటూ మిర్చి సాగు.. గత ఏడాది మిర్చి పంట సాగుచేసి నష్టపోయినా.. రైతులు మాత్రం తగ్గేదే లేదు అన్నట్లు మళ్లీ ఈ ఏడాది కూడా అదే పంట సాగుచేసేందుకు పోటీ పడుతున్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,88,182 ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,03,537 ఎకరాల్లో సాగుచేయగా.. మహబూబాబాద్ జిల్లాలో 82,434 ఎకరాలు, జోగుళాంబ గద్వాలలో 35,309, భద్రాద్రి కొత్తగూడెంలో 32,375, జయశంకర్ భూపాలపల్లిలో 30,499 ఎకరాలు సాగుచేశారు. గత ఏడాది నష్టాలను చూసిన అధికారులు.. ఈ ఏడాది మిర్చి సాగుచేసే వారు పెద్దగా ఉండరని భావించారు. కానీ వారి అంచనాలు తారుమారు చేసి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా, మహబూబాబాద్‌లో 70 వేల ఎకరాలకు పైగా, భద్రాద్రి కొత్తగూడెంలో 28 వేల ఎకరాలపైగా సాగుచేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల ఎకరాలకు పైగా సాగుచేశారని, ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 2 లక్షలు నష్టం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) గ్రామానికి చెందిన రైతు సోమిరెడ్డి లక్ష్మయ్య గత ఏడాది ఎకరం భూమిలో మిర్చి సాగు చేశాడు. రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంటకు వైరస్ సోకింది. అనేక మందులను పిచికారీ చేశాడు. అయినా ఫలితం దక్కలేదు. పెట్టుబడితోపాటు భార్యాభర్తల కష్టం సైతం నేలపాలైంది. ఇతర పంటలు వేస్తే కలిసి రాదనే భావనతో లక్ష్మయ్య ఈ ఏడాది కూడా మిర్చి పంట వేశాడు. ఇప్పటివరకు రూ.70వేలు ఖర్చు చేశాడు. తోటలో అక్కడక్కడా బొబ్బరోగం కనిపిస్తోంది. తామర పురుగు కూడా ఆశిస్తే పెట్టుబడి అప్పులు కుప్పలుగా పేరుకుపోయే ప్రమాదం ఉంది. సాఫీగా పంట పండితే అప్పులు తీరుతాయని లక్ష్మయ్య చెప్పాడు. వేరే పంట వేయలేక.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన రైతు మడికంటి శ్రీను గత ఏడాది మూడు ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. రూ.మూడు లక్షల పెట్టుబడి పెట్టాడు. కానీ మూడు క్వింటాళ్ల మిర్చికూడా పండలేదు. దీంతో చేసిన కష్టంపోగా పెట్టుబడి అప్పుగానే మిగిలింది. ‘వేరే పంట వేయలేక.. నష్టపోయిన మిర్చి పంటవేసి పోగొట్టుకున్న చోటనే వెతకాలి.. తాడోపేడో.. తేల్చుకునేందుకు ఈ ఏడాది కూడా మూడెకరాల్లో మిర్చి పంట వేశా’నని శ్రీను చెప్పాడు. జాగ్రత్తలు పాటిస్తే పంటను రక్షించుకోవచ్చు మిరప పంటను ఆశించే నల్లతామర పురుగుకు మందులేదు. కానీ జాగ్రత్తలు పాటించి, సస్యరక్షణ చర్యలు చేపడితే పంటను రక్షించుకోవచ్చు. పంట చుట్టూ జొన్న, సజ్జ పంటలు రెండు మూడు వరుసల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువులు మోతాదుకు మించి వాడొద్దు. నీలిరంగు జిగురు అట్టలు ఎకరాకు 40 చొప్పున పెట్టుకోవాలి. వేపనూనె, కానుగ నూనె, పలుసార్లు పిచికారీ చేయాలి. జీవ నియంత్రణ కారకాలు, భవేరియా బాసియానా లేదా లెకానిసీలియం లెకానీని తగిన మోతాదుల్లో స్ప్రే చేయాలి. తామర పురుగు నివారణకు వాడే పురుగు మందులు ఒకే మందును పలుమార్లు కొట్టొద్దు. ఎప్పటికప్పుడు మందు మార్చాలి. నాటిన 15వ రోజు, 45వ రోజున ఫిప్రోనిల్ గుళికలను వేయాలి. – కె.భాస్కర్, ఉద్యాన శాస్త్రవేత్త, (జేవీఆర్ ఉద్యాన పరిశోధనా కేంద్రం, మల్యాల) ఇదీ చదవండి: తెలంగాణలో ‘స్పినోడాన్’ శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు -
Chakradhar Goud: వంద రైతు కుటుంబాలకు రూ.కోటి సాయం
సాక్షి, సిద్దిపేట జోన్: రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వంద రైతు కుటుంబాలకు.. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.కోటి విలువైన చెక్కులను ఆదివారం సిద్దిపేట కొండ భూదేవి గార్డెన్స్‌లో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవడం, వారికి అండగా నిలిచే లక్ష్యంగా తమ సంస్థ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందన్నారు. చదవండి: (నీ కాళ్లు మొక్కుత సారూ.. పైసలిప్పియ్యరూ: రైతు ఆవేదన) -
గంటకో రైతు మృతి
న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో దేశంలో గంటకో రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ధ్వజమెత్తింది. ‘‘2021లో 10,881 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అంటే సగటున రోజుకు 30 మంది. గంటకొకరన్నమాట. 2014–21 మధ్య 54 వేల రైతు ఆత్మహత్యలు జరిగినట్టు నేసనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో గణాంకాలే చెబుతున్నాయి. 2022కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు వారికి రోజుకు కేవలం 27 రూపాయలు గిడుతోంది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే అన్నారు. -
అప్పులబాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్/చెన్నారావుపేట: ఆ రైతు కుటుంబాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. అప్పు తెచ్చి వైద్యం చేయించుకున్నారు. ఎలాగోలా బతికి బయటపడిన ఆ రైతు పంటల సాగుకు మరికొంత అప్పు చేశాడు. అయితే ఆశించిన రీతిలో పంట పండక అప్పుల భారం నెత్తినపడింది. తీర్చేదారి లేక ఆ ఇంటి పెద్ద పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా లక్ష్మతండా గ్రామ పంచాయతీ పరిధిలోని బూరుకుంట తండాలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ధరంసోత్ రాములు నాయక్ (58)కు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కుటుంబం మొత్తానికి కరోనా రావడంతో వైద్యం కోసం అప్పు చేశాడు. మిర్చి, పత్తి పంటల సాగుకు మరికొంత అప్పు తెచ్చాడు. మొత్తంగా రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. కానీ పంటల దిగుబడి రాలేదు. అప్పుల భారంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఉదయం ఇంటి సమీపంలోని వ్యవసాయ భూమిలో పురుగు మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాములు నాయక్ రాత్రి 9 గంటల సమయంలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో మరో రైతు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఎడ్ల బొంద్యాలు (65)కు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐదో కుమార్తెకు గత ఏడాది వివాహం చేశాడు. ఇందుకోసం రూ.4 లక్షలు, వ్యవసాయానికి మరో రూ.లక్ష అప్పు చేశాడు. అయితే పంటలు సరిగా పండక, అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో.. తీర్చలేనని మనస్తాపానికి గురై ఈ నెల 15న ఇంట్లోనే పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముందు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. కేసీఆర్ సర్కార్‌పై నిర్మల ఫైర్
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గాంధారిలో రైతులతో ఆమె సమావేశమయ్యారు. తెలంగాణ సర్కార్‌పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. శుక్రవారం తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతోందని నిర్మల ఆరోపించారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. 2017 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో రెండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డ్స్ చెబుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో రుణమాఫీపై హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కేవలం వందలో ఐదుగురు రైతులకు మాత్రమే చేసినట్లు చెప్పారు. మల్లన్నసాగర్ ,మిడ్ మానేరు ,సీతారామ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటిదాకా పూర్తి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న వేయొద్దని, వరి వేస్తే ఉరేనంటూ రైతులను తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తోందని నిర్మల ఫైర్ అయ్యారు. అందరివాడైన రైతు సమస్యలను కేసీఆర్ సర్కార్ రాజకీయాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. సున్నితమైన అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లోని రైతు సమస్యలకు అనుగుణంగా రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తోందని నిర్మల అన్నారు. ఏ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధాని మోదీకి తెలుసని వ్యాఖ్యానించారు. చదవండి: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీపై కేసు -
కాళేశ్వరం లిఫ్టుల్లో పారేది డబ్బే
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారమి వ్వని తెలంగాణ ప్రభుత్వం, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మూడింతలు పెంచుకుందని, లిఫ్టుల్లో నీళ్లకు బదులు డబ్బు పారిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కాళేశ్వరం సహా మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, సీతారామసాగర్, పాలమూరు–రంగారెడ్డి, కిష్టంపల్లి, నక్కలగూడెం వంటి ప్రాజెక్టులకు సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు ఎందుకు పరిహారం చెల్లి ంచలేదని ప్రశ్నించారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రవాసీ యోజన్‌లో భాగంగా.. జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించేందుకు నిర్మలా సీతారామన్ గురువారం కామారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. వ్యయం ఎందుకు పెరిగిందో చెప్పాలి ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం, దాన్ని రూ.లక్షా 20 వేల కోట్లకు ఎందుకు పెంచిందో సమాధానం ఇవ్వాలి. సాధారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతుంది. అయితే కాళేశ్వరం త్వరగా పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతోంది. మరి త్వరగా పూర్తయినపుడు నిర్మాణ వ్యయం మూడింతలు ఎందుకు పెరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలి..’అని మంత్రి డిమాండ్ చేశారు. 91.7 శాతం మంది రైతులు అప్పుల్లో.. ‘రైతు ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని ఇటీవలి నివేదికల్లో వెల్లడైంది. రైతులకు రుణ మాఫీ చేయరు. ప్రాజెక్టులకు కింద మునిగిపోయిన భూములకు పరిహారం ఇవ్వరు. పంటలు దెబ్బతిన్నపుడు రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రధానమంత్రి ఫసల్ బీమాను తీసుకువస్తే అమలు చేయరు. కానీ రైతులకు అన్నీ చేస్తున్నామని అంటున్నారు. అన్నీ చేస్తుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు అప్పుల్లో మునిగిపోయారు? 91.7 శాతం మంది రైతులు అప్పుల్లో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి..’అని నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. పుట్టబోయే బిడ్డపై లక్షా 25 వేల అప్పు ‘మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ప్రభుత్వం అప్పుల పాలు చేస్తోంది. ఏ ప్రభుత్వమైనా బడ్జెట్లో పొందుపర్చిన విధంగా ఆదాయ, వ్యయాల లెక్కలుంటా యి. ఆదాయం ఎంత ? వాగ్దానాలు అమలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ? ఎంత అప్పు చేస్తున్నామన్న విషయాలను ప్రభుత్వం బడ్జెట్లో పొందుపర్చి అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎఫ్ఆర్బీఎం ప్రకారమే అప్పులు తీసుకో వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌కు సంబంధం లేకుండా, ఎఫ్ఆర్బీఎంకు మించి అప్పులు చేస్తోంది. ప్రజలపై భారం మోపుతూ ఇబ్బంది పెడుతోంది. మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డపై రూ.లక్షా 25 వేల అప్పు ఉందని గతంలోనే చెప్పారు..’అని విమర్శించారు. కేంద్ర పథకాలకు సొంత పేర్లు ‘కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొన్న విధంగా పథకాలను తీసుకువచ్చి దేశమంతా అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆ పథకాల పేర్లను మార్చి, నిధులను వాడుకుంటూ తమ పథకాలుగా చెప్పుకుంటోంది. పీఎం ఆవాస్ యోజన పథకాన్ని కేంద్రం తీసుకువస్తే, దాన్ని డబుల్ బెడ్రూం పథకం అంటూ పేరు మార్చుకుంది. పీఎం మత్స్యసంపద యోజన కింద నిధులిస్తే దాన్ని కూడా మార్చింది. గొర్రెల పెంపకానికి నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ నుంచి కేంద్రం డబ్బులిస్తే, ప్రభుత్వం దాన్ని గొర్రెల పంపిణీ పథకంగా మార్చుకుంది. మరోవైపు కేంద్రం సహకరించడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది..’అని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని పట్టించుకోకుండా దేశం తిరుగుతున్నారు ‘కేంద్రం ఇస్తున్న ప్రతి పైసా అర్హులకు అందాలన్నదే ప్రధాని మోదీ సంకల్పం. అందులో భాగంగానే కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తున్నారు..’అని నిర్మలా సీతారామన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం అంతా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బిహార్‌కు వెళ్లి ఏదేదో మాట్లాడుతుంటే అక్కడి సీఎం లేచి నిలబడి ఇక చాలంటూ వారించారని విమర్శించారు. -
వాస్తవ దూరమైన కథనం.. అది ‘ఈనాడు’ ఆత్మఘోష
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్న సంకల్పంతో పగ్గాలు చేపట్టింది మొదలు సీఎం వైఎస్ జగన్ ప్రతీ అడుగు రైతు సంక్షేమం దిశగానే వేస్తున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా సీజన్‌కు ముందుగానే సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను పంపిణీ చేస్తున్నారు. ఇచ్చిన మాట కంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించడమే కాకుండా సకాలంలో పంట రుణాలు అందిస్తున్నారు. వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారం చెల్లిస్తున్నారు. పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడేళ్లలో వివిధ పథకాల ద్వారా రైతులకు నేరుగా రూ.1.28 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.19,709.20 కోట్లకు పైగా బకాయిలను చెల్లించింది. ఇంతలా అన్నదాతలకు అండగా నిలుస్తుంటే కడుపు మంట తట్టుకోలేక ఈనాడు నిత్యం రోత రాతలు రాస్తూ ప్రభుత్వంపై అదే పనిగా బురద చల్లుతోంది. మూడేళ్లలో రూ.23,875.29 కోట్ల పెట్టుబడి సాయం వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. మూడేళ్లలో ఇప్పటి వరకు రూ.23,875.29 కోట్లు అందించారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద మూడేళ్లలో 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్లు బీమా పరిహారం ఇచ్చారు. రూ.లక్ష లోపు పంట రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు సీజన్న్ ముగియకుండానే వడ్డీ రాయితీని అందిస్తున్నారు. ఇలా గత బకాయిలతో కలిపి మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ.1,282.11కోట్లు చెల్లించారు. మూడేళ్లలో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 19.94 లక్షల ఎకరాలకు సంబంధించి 17.61 లక్షల మందికి రూ.1,612.80 కోట్ల పంట నష్టపరిహారాన్ని సీజన్ ముగియకుండానే అందించారు. ఆర్బీకేల ద్వారా 1.12 కోట్ల మందికి సేవలు విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్నకు అండగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన 10,778 ఆర్బీకేల ద్వారా గత 27 నెలల్లో 1.12 కోట్ల మందికి సేవలందించారు. ఆర్బీకేల ద్వారా 34.65 లక్షల మంది రైతులకు రూ.564.50 కోట్ల విలువైన 19.22 లక్షల టన్నుల విత్తనాలు, 13.62 లక్షల మంది రైతులకు రూ.529.24 కోట్ల విలువైన 5.16 లక్షల టన్నుల ఎరువులు, 1.51 లక్షల మందికి రూ.14కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులను పంపిణీ చేశారు. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.16 వేల కోట్లతో గోదాములతో పాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సర్టిఫై చేసిన ఇన్పుట్స్ సరఫరా కోసం జిల్లా, రాష్ట్ర, నియోజక వర్గ స్థాయిలో రూ.213 కోట్ల అంచనాతో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు తీసుకొచ్చారు. ఆర్బీకే స్థాయిలో రూ.587.64 కోట్లతో 6781, రూ.161.50 కోట్లతో 391 క్లస్టర్‌స్థాయిలో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జలకళ కింద రూ.5,715 కోట్లు వెచ్చిస్తూ రైతులపై పైసా భారం పడకుండా ఉచితంగా 2 లక్షల బోరు బావులు తవ్వుతున్నారు. ఉచిత విద్యుత్ కోసం మూడేళ్లలో రూ.25,561 కోట్లు ఖర్చు చేశారు. పంటవేసే సమయంలోనే కనీస మద్దతు ధర ప్రకటించడమే కాకుండా మూడేళ్లలో రూ.44,844.31 కోట్ల విలువైన ధాన్యంతో పాటు రూ.6,903 కోట్ల విలువైన ఇతర పంటలను కొనుగోలు చేశారు. ఇవేమీ ఈనాడుకు కనిపించలేదు. సింగిల్‌కాలం వార్త కూడా రాసిన పాపాన పోలేదు. అందులో వాస్తవాలు లేవు.. అన్నదాతలు ఆత్మఘోష కధనం వాస్తవ విరుద్ధంగా ఉంది. 2020తో పోలిస్తే 2021లో 19.79 శాతం మేర రైతుల ఆత్మహత్యలు పెరిగినట్లు పేర్కొనటంలో వాస్తవం లేదు. 2020తో పోలిస్తే 2021లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. 2022లో ఇప్పటి వరకు 74 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ కార్మికులు పలు కారణాలతో చనిపోతుంటారు. అది రైతుల ఆత్మహత్యల కిందకు రావు. ఏ కారణంతో చనిపోయినా వారికి వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారం అందచేస్తున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ తప్పుల తడకలే.. అడుగడుగునా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంటే జీర్ణించుకోలేని చంద్రబాబు భజన పత్రిక ఈనాడు ‘అన్నదాతల ఆత్మఘోష’ అంటూ సోమవారం వాస్తవ దూరమైన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ఏపీలో 2020లో 889 మంది, 2021లో 1,065 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, 2020తో పోలిస్తే 2021లో 19.79 శాతం మేర ఆత్మహత్యలు పెరిగిపోయినట్లు అచ్చు వేసింది. వాస్తవానికి 2020లో 287 మంది, 2021లో 223 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు త్రిసభ్య కమిటీలు నిర్ధారించాయి. బాధిత కుటుంబాలకు రూ.7లక్షలు చొప్పున పరిహారం కూడా అందించారు. టీడీపీ హయాంలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్ప డితే అసలు వారు రైతులే కాదని, అవి ఆత్మహత్యలే కాదన్నట్లుగా రికార్డుల్లో కూడా నమోదు చేసేవారు కాదు. ఈ కారణంగా టీడీపీ హయాం లో ఐదేళ్లలో 1,004 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించగా, వారిలో పరిహారం ఇచ్చింది 531 మందికే. చంద్రబాబు ఎగ్గొట్టిన మిగతా 473 మంది బాధిత రైతు కుటుంబాలకు 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున రూ.23.65కోట్ల పరిహారాన్ని అందించింది. రైతన్నలు ఏ కారణాలతో చనిపోయినా వారి కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా త్రీమెన్ కమిటీ నిర్ధారణే కొలమానంగా ఆత్మహత్యకు పాల్పడే రైతు కుటుంబాలను ఆదుకుంటున్నారు. మూడేళ్లలో 900 మంది మృత్యువాతపడగా, రూ.7 లక్షలు చొప్పున రూ.63 కోట్ల పరిహారాన్ని అందించారు. వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు సాగు సంబంధిత కారణాల వల్ల జరిగిన ఆత్మహత్యలు కావు కాబట్టి రైతుల ఆత్మహత్యల పరిధిలోకి రావన్న విషయాన్ని ఈనాడు విస్మరించడం విడ్డూరంగా ఉంది. -
ప్రాణం తీసిన పంట నష్టం
సోన్/ఆదిలాబాద్ రూరల్: వర్షాలు, వరదలు మిగిల్చిన పంట నష్టం ఇద్దరు రైతుల ఉసురు తీసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనల వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ గ్రామానికి చెందిన మాముళ్ల గంగాసాగర్(37) తన రెండెకరాల భూమితో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇందుకోసం మూడేళ్ల క్రితం రూ.3 లక్షలు అప్పుచేశాడు. గతేడాది, ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు స్వర్ణ నది ఉప్పొంగడంతో పంటలు పూర్తిగా కొట్టుకుపోయాయి. గతేడాది పంటలు నష్టపోయినా అప్పులుచేసి కౌలు డబ్బులు చెల్లించిన గంగాసాగర్, ఈ ఏడాది కూడా పంటలను వరదలు తుడిచిపెట్టుకుపోవడంతో మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి గ్రామ సమీపంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీరియస్‌గా ఉండటంతో అక్కడినుంచి నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య వర్షిణి, శ్రేహన్, శ్రీనిధ, శ్రీహర్ష అనే ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. పురుగుల మందు తాగి మహిళా రైతు.. ఆదిలాబాద్ రూరల్ మండలం ఎస్సీగూడకు చెందిన కాంబ్లే జైమాల (45)కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు కుమార్తెల వివాహమెంది. తమకున్న మూడెకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని భర్త కాంబ్లే గౌతమ్‌తో పాటు అమె వ్యవసాయం చేస్తోంది. భూమికి పట్టా లేకపోవడంతో రైతుబంధు డబ్బులు రావట్లేదు. రూ.1.50 లక్షల వరకు అప్పుతెచ్చి పత్తి సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోతకు గురై పంట పూర్తిగా దెబ్బతింది. సాగుకు చేసిన అప్పుతో పాటు కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన మరో రూ.3 లక్షల అప్పు ఉంది. అది ఎలా తీర్చాలోనని మనస్తాపం చెందిన ఆమె ఆదివారం ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందిందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై జహీరొద్దీన్ తెలిపారు. కాగా, జైమాలకు ఇటీవల దళితబంధు కింద రూ.10 లక్షల విలువ చేసే యూనిట్ మంజూరైంది. నిధులు సైతం ఖాతాలో జమ అయ్యాయి. ఇంతలో ఈ ఘోరం జరిగిందని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. -
ఆదుకున్న సర్కార్‌పై నిందలా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కౌలు రైతుల బలవన్మరణాలను అడ్డుపెట్టుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వినూత్న పథకాలు, విప్లవాత్మక కార్యక్రమాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతాంగానికి అన్ని విధాలా వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలను పెద్ద మనసుతో ఆదుకుంటోంది. ఈ వాస్తవాలను పక్కనబెట్టి.. మృతి చెందిన కౌలు రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదంటూ రాజకీయ లబ్ధి కోసం పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో 53 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష వంతున పంపిణీ చేశారు. ఈ రైతుల వాస్తవ పరిస్థితి పరిశీలించగా.. వీరిలో అర్హతలున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిహారం అందజేసింది. వీరిలో ఒక్కరు కూడా పట్టా రైతు కారు. అయినప్పటికీ పంట సాగు హక్కు పత్రం (క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డ్ – ప్రత్యేక చట్టం ద్వారా జగన్ ప్రభుత్వం ఇచ్చింది) ఉన్న ఏ ఒక్కరినీ విడిచి పెట్టకుండా రూ.7 లక్షల చొప్పున సాయం అందించింది. ఆ కార్డులు లేని వారికి కూడా వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.లక్ష ఇచ్చి ఆదుకుంది. అటు కౌలు రైతు కార్డు లేక, వయసు మీరడంతో ఇటు బీమా వర్తించక ఒకరికి మాత్రమే పరిహారం అందలేదు. ఇలాంటి వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం సాయమే చేయలేదని పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఇదివరకే ప్రభుత్వ పరిహారం అందుకున్న వారిలో కొందరి వివరాలు ఇలా ఉన్నాయి. రూపాయి లంచం లేకుండా రూ.7 లక్షలు ఇతని పేరు గుత్తుల వెంకట్రావు (54). వరి పంట సాగుచేసే కౌలు రైతు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు స్వగ్రామం. అప్పుల బాధతో 2021 నవంబర్ 24న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య భవాని, కుమారుడు సురేష్, కుమార్తె దేవి ఉన్నారు. ఇతనికి కౌలు రైతు కార్డు ఉండటంతో కుటుంబ సభ్యులు నేరుగా అధికారులను ఆశ్రయించారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి రూ.7 లక్షలు మంజూరైంది. ఈ సాయం భవాని బ్యాంక్ ఖాతాలో జమ అయింది. దరఖాస్తు చేయగానే పరిహారం ఇతని పేరు శీలం త్రిమూర్తులు. కౌలు రైతు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం గ్రామ పంచాయతీ ప్రత్తిగొంది గ్రామం. ఆరు ఎకరాల్లో వరి సాగు చేసేవాడు. సాగులో నష్టాలు రావడంతో 2021 ఏప్రిల్ 12 ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు. ప్రభుత్వం ఇచ్చిన కౌలు రైతు కార్డు ఉండటంతో భార్య శీలం సుజాత ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకుంది. రూ.7 లక్షల పరిహారం ఆమె బ్యాంకు ఖాతాలో జమ అయింది. ప్రభుత్వం ఆదుకోక పోయుంటే తమ పరిస్థితి ఏమయ్యేదోనని ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతోంది. ఎవరి సిఫారసు లేకుండా సాయం ఈమె పేరు సుంకర నాగమణి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి. భర్త సుంకర చంద్రయ్య కౌలు రైతు. నాలుగున్నర ఎకరాల పొలం కౌలుకు చేసేవాడు. పంట నష్టపోవడంతో 2020 నవంబర్ 24న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కౌలు రైతు కార్డు ఉండటంతో వలంటీర్ ద్వారా విషయాన్ని ఎవరి సిఫారసు లేకుండానే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రూ.7 లక్షలు పరిహారం మంజూరైంది. తమ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకుందని వారు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబానికి ఆధారం చూపారు.. ఈమె సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన ఉమ్మిడిశెట్టి వెంకటలక్ష్మి. భర్త ఉమ్మిడిశెట్టి వెంకట దుర్గారావు (45) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వర్జీనియా పొగాకు సాగు చేసేవాడు. అప్పులపాలై 2022 ఫిబ్రవరి 20న ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు దొరబాబు, కుమార్తె దేవి, పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్న తండ్రి సుబ్బారావు, తల్లి మంగమ్మ పోషణ ఇబ్బందిగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన కౌలు రైతు కార్డు ఉండటంతో ప్రభుత్వం రూ.7 లక్షలు మంజూరు చేసింది. ఆ డబ్బులు ఆమె బ్యాంక్ ఖాతాకు జమ చేశారు. కౌలు కార్డు లేకపోయినా సాయం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామానికి చెందిన పట్టపగలు సురేష్ (28) 2021 నవంబర్ 30న, ఆలమూరు మండలం పెనికేరుకు చెందిన కర్రి శ్రీనివాస్ (28) 2021 జూలై 11న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. కౌలు కార్డు కోసం భూ యజమాని సంతకం చేయకపోవడంతో వీరికి కౌలు కార్డు మంజూరు కాలేదు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వైఎస్సార్ బీమా పథకం ద్వారా సురేష్ భార్య మహాలక్షి, శ్రీనివాస్ భార్య కర్రి వీరవేణి బ్యాంకు ఖాతాలకు రూ.లక్ష చొప్పున జమ చేసింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకర పాలెం శివారు చింతాకుల వారి పాలెంకు చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ (65) పంట నష్టంతో పాటు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి కూడా కౌలు రైతు కార్డు లేదు. 65 ఏళ్లు దాటడంతో బీమా వర్తించలేదు. -
దీన్ని శవాలపై పేలాలు ఏరుకోవటం కాక ఇంకేమనాలి రామోజీ?
అన్నదాతల ఆత్మహత్యలతో రాజకీయాలా? దీన్ని శవాలపై పేలాలు ఏరుకోవటం కాక ఇంకేమనాలి రామోజీరావు గారూ? మీ చంద్రబాబును గద్దెనెక్కించడానికి మరీ ఇంతటి దారుణమైన మార్గాన్ని ఎంచుకోవాలా? అసలిప్పుడు నిజంగానే ‘అన్నదాత అప్పుల సాగు’ చేస్తున్నాడా? విత్తనాల నుంచి విక్రయం వరకూ ప్రభుత్వమే రైతును చేయిపట్టి నడిపిస్తుండటం నిజం కాదా? ఆర్బీకేల నుంచి ఈ–క్రాపింగ్ వరకూ మునుపెన్నడూ లేని స్థాయిలో వ్యవసాయానికి బాసటనివ్వటం నిజం కాదా? మరెందుకు ఈ రాతలు? ఎందుకంటే... ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ముందుకెళుతోంది. చంద్రబాబునెవరూ నమ్మటం లేదు. దీంతో ‘ఈనాడు’ ఒక మాయా యుద్ధానికి దిగింది. లేని అంశాలను తెరపైకి తెచ్చి... ఒకటిరెండు ఉదాహరణలతో రాష్ట్ర ప్రజానీకం మొత్తాన్ని భయపెట్టడమే ఈ యుద్ధ వ్యూహం. దీనికి సహ సారథి చంద్రబాబు ఎటూ ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఆయన దత్తపుత్రుడు కూడా ఈ బృందంలో చేరాడు. కౌలు రైతులకు పరిహారం ఇవ్వటం లేదంటూ జిల్లాల వారీగా ఆయన చేస్తున్న యాత్రకు... ఇతోధికంగా సహకరించడానికి ‘ఈనాడు’ ఇలాంటి తప్పుడు వార్తలను వండి వార్చటం మొదలెట్టింది. ఇందులో నిజానిజాలేంటో చూద్దాం.... రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాక్షాత్తూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. కౌలు రైతులకు నష్టపరిహారం అందటం లేదని గగ్గోలు పెడుతున్న వారంతా... నిజంగా పరిహారం అందని కౌలు రైతును ఒక్కరినైనా చూపించమని!!. నిజానికి మునుపెన్నడూ ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో కౌలు రైతుల్ని గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. దానికింద నమోదు చేసుకున్న వారందరికీ సీసీఆర్సీ కార్డులు మంజూరు చేసింది. మామూలు రైతులకు పట్టాలు ఎలాగూ ఉంటాయి. సీసీఆర్సీ కార్డు ఉండి... ఆత్మహత్య చేసుకున్న ఒక్కరికైనా పరిహారం రాలేదని నిరూపించమనేది ముఖ్యమంత్రి మాట. సీసీఆర్సీ కార్డులు సహా ఏమీ లేకుంటే... అలాంటి వారికి ఆత్మహత్య చేసుకున్నా సరే వైఎస్సార్ బీమా వర్తింపజేయాలన్న ముఖ్యమంత్రి సూచనలతో గతంలోనే ఈ మేరకు విధాన నిర్ణయం తీసుకున్నారు. దాంతో అందరికీ వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష చొప్పున సహాయం అందుతోంది. ‘ఈనాడు’తో సహా విమర్శలు చేస్తున్నవారంతా... పరిహారం గానీ, బీమా గానీ అందని ఏ ఒక్కరినీ చూపించలేకపోతున్నారు. అందుకే మాయా యుద్ధానికి దిగుతున్నారు. చంద్రబాబు ఏం చేసినా కరెక్టే..!!! ఏ ప్రభుత్వమూ తన హయాంలో రైతులు గానీ, మరో వర్గం గానీ ఆత్మహత్యలు చేసుకోవాలనుకోదు. కాకపోతే తమ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు తక్కువ జరిగాయని చెప్పడానికి చంద్రబాబు నాయుడు ఓ దుర్మార్గమైన పద్ధతిని అనుసరించాడు. కౌలు రైతుల సంగతి సరేసరి!. పట్టాలున్న రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా... పరిహారం చెల్లించలేదు. ఐదేళ్ల కాలంలో కేవలం 450 మందికి తలా రూ.3.5 లక్షల పరిహారం చెల్లించి.. మరో రూ.1.50 లక్షల చొప్పున అప్పుల్లో సర్దుబాటు చేశారు. ఇలా.. ఐదేళ్లలో ఆయనిచ్చింది రూ.20.12 కోట్లు. మరో 471 మందికి రైతులకు పరిహారం ఇవ్వకుండా బకాయిపెట్టేశాడు. కౌలు రైతుల ఊసే లేదు. సరికదా పలువురు రైతుల ఆత్మహత్యల్ని నమోదు కూడా చేసుకోలేదు. విచిత్రమేంటంటే బాబు ఇన్ని దుర్మార్గాలు చేసినా అప్పట్లో రైతులు అప్పుల పాలైనట్లు గానీ, ఆత్మహత్యలు చేసుకున్నట్లు గానీ రామోజీరావుకు కనిపించలేదు. ‘ఈనాడు’లో అక్షరం ముక్క కూడా రాయలేదు. కౌలు రైతుల సంగతేంటని పవన్‌కల్యాణ్ ప్రశ్నించలేదు కూడా!!. రైతుల కష్టాలు తెలిసిన మనిషిగా... తన ప్రభుత్వం వస్తూనే చంద్రబాబు ఎగ్గొట్టిన 471 మంది రైతులకూ రూ.5 లక్షల చొప్పున చెల్లించేలా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ రూ.23.55 కోట్లు చెల్లించారు. పైపెచ్చు కౌలు రైతులకు కూడా పరిహారం అందేట్టుగా ప్రత్యేక చట్టం తెచ్చారు. దానిప్రకారం వారిని నమోదు చేసుకుని సీసీఆర్సీ కార్డులు అందజేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకిచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 850 మందికి రూ.7లక్షల చొప్పున రూ.59.50 కోట్లు చెల్లించింది. టీడీపీ హయాంలో మరణించిన వారిక్కూడా కలిపి మూడేళ్లలో మొత్తం 83.05 కోట్లు చెల్లించిదీ ప్రభుత్వం. మరి ఈ నిజాలను ఏమాత్రం ప్రస్తావించకుండా ‘ఈనాడు’ రాసే తప్పుడు వార్తలను ఏమనాలి? ఇది ఏమార్కు జర్నలిజం రామోజీరావు గారూ? ‘ఈనాడు’ వార్తలో కనపడని నిజాలివీ... 1. కన్నమ్మకు అండగా ప్రభుత్వం... ఈ ఫోటోలో కన్పిస్తున్న కన్నమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. వీరికి 60 సెంట్ల భూమి ఉంది. కూతురు పెళ్లి కోసం పదిహేనేళ్ల కిందట ఆమె భర్త రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఆయన కూడా పదేళ్ల కిందట మరణించారు. 2016–18 మధ్యలో తన పెద్ద కుమారుడు ఏర్నినాయుడు వ్యవసాయం కోసం రూ.2 లక్షలు, మూడేళ్ల క్రితం కుటుంబ అవసరాల కోసం 50 సెంట్లు భూమి తనఖా పెట్టి మరో రూ.2లక్షలు అప్పు చేశారు. ఇలా తండ్రి చేసిన అప్పు, తన అప్పు కలిసి వడ్డీతో రూ.10 లక్షలవడంతో తీర్చలేనేమోననే బెంగతో 2021లో ఏర్నినాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన 7 నెలల్లో జమైన రూ.7 లక్షల పరిహారంతో పెద్దల సమక్షంలో అప్పులన్నీ సర్దుబాటు చేసుకున్నారు. కన్నమ్మతో పాటు ఎర్నినాయుడు భార్య రమణమ్మకు, మాటలు రాని రెండో కుమారుడుకు పెన్షన్ వస్తోంది. తనకున్న 10 సెంట్లకు రూ.13,500 చొప్పున రైతు భరోసాతో పాటు వైఎస్సార్ చేయూత కింద రూ.18,750 చొప్పున మూడేళ్లుగా సాయం అందుతోంది. ఏర్నినాయుడు భార్యకు అమ్మవడి, ఆసరా వంటి సంక్షేమ ఫలాలూ అందాయి. వీటి ద్వారా కొద్దికొద్దిగా మిగిలిన అప్పులు తీరుస్తున్నారు. ‘ప్రభుత్వం ఇచ్చిన పరిహారం, సంక్షేమ పథకాల పుణ్యమాని అప్పులనుంచి బయటపడ్డాం. పిల్లలను చదివించుకో గలుగుతున్నాం’ అంటూ కన్నమ్మతో పాటు వీర్నినాయుడు భార్య రమణమ్మ చెబుతున్నారు. ‘ఈనాడు’ మాత్రం వీరి అప్పును మరికొంత పెంచి... అప్పులింకా మిగిలి ఉన్నాయంటూ నెపమంతా ప్రభుత్వం మీదికి నెట్టేలా వండి వార్చేసింది. 2. పరిహారం వస్తే రాలేదని రాతలా? కర్నూలు జిల్లా బెళగళ్ మండలం పలుదొడ్డికి చెందిన బోయ పద్మ భర్త లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమే. 4.94 ఎకరాలున్న లక్ష్మణ్... 2014–18 మధ్యలో ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.7.50 లక్షలు, 2018–19 సీజన్లో బ్యాంకులో రూ.1.90లక్షల అప్పు చేశారు. 2021లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే ఏడాది త్రి సభ్య కమిటీ నివేదిక ఇవ్వటంతో పరిహారం రూ.7 లక్షలు ఇటీవలే పద్మ ఖాతాకు జమయింది. ఆమెకు పెన్షన్‌తో పాటు రైతు భరోసా, ఆసరా, వడ్డీ రాయితీ వంటి సంక్షేమ ఫలాలూ అందుతున్నాయి. ఇటీవలే 1.50 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసిన మిగిలిన 3.44 ఎకరాల్లో పత్తితో పాటు ఇతర పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతోంది. 2019కి పూర్వం వ్యవసాయం కలిసి రాకపోవడంతో అప్పులు చేసి అవి తీర్చలేకపోయామని, దాంతోనే తన భర్త చనిపోయాడని పద్మ చెబుతోంది. పరిహారం రావటంతో బ్యాంకు రుణాన్ని, ఇతర వడ్డీలను సర్దుబాటు చేసుకున్నామని, పథకాలతో నిలదొక్కుకున్నామని చెబుతోంది. ‘ఈనాడు’ మాత్రం ఈమెకు వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష మాత్రమే వచ్చిందని పేర్కొది. బాబు హయాంలో ప్రయివేటు వ్యక్తుల దగ్గర చేసిన రూ.7.5 లక్షల రుణాన్ని, దాని వడ్డీలను ప్రస్తావించలేదు కూడా. ఇది పాత్రికేయమా... రాజకీయమా? మరీ ఇన్ని అబద్ధాలు వండి వార్చటమంటే పాఠకులను మోసం చేసినట్లు కాదా? ఇంతటి దౌర్భాగ్యపు రాతలెందుకు? 3. పరిహారంపై ఇక్కడా అబద్ధాలే... విశాఖ జిల్లా రాయవరం మండలం గెడ్డనపాలేనికి చెందిన పినపాత్రుని వరలక్ష్మికి కూడా ఇటీవలే పరిహారం మంజూరయింది. ఈమె భర్త పినపాత్రుని లోవరాజు కూడా టీడీపీ హయాంలో వరిసాగు కలిసిరాక భారీగా అప్పులు చేసి... ఆ భారాన్ని తట్టుకోలేక 2021లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల పరిహారం రాగా... వరలక్ష్మికి పెన్షన్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాలూ అందుతున్నాయి. తమకున్న 1.85 ఎకరాల భూమిని కుటుంబ సభ్యుల సహకారంతో ప్రస్తుత ఖరీఫ్‌కు సిద్ధం చేస్తోంది. పరిహారంతో అప్పులు సర్దుబాటు చేశానని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని చెబుతోంది. ‘ఈనాడు’ మాత్రం పరిహారం అందలేదని పేర్కొనటంతో పాటు... ఆమె భర్త టీడీపీ హయాంలో చేసిన అప్పులను ప్రస్తావించదు. పైపెచ్చు ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదన్న తరహాలో పచ్చి అబద్ధాలు!. ఇదీ ‘ఈనాడు’ మార్కు జర్నలిజం. మూడేళ్లలో 1.28 లక్షల కోట్ల లబ్ది... ► ఎన్నికల్లో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని ఇచ్చిన హామికి మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లకు రూ.67,500 పెట్టుబడి సాయం అందిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే మూడు విడతల్లో 52.38 లక్షల కుటుంబాల ఖాతాలకు నేరుగా రూ.23,875.29 కోట్లను ‘రైతు భరోసా’గా జమచేసింది. ► రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమాను అమలు చేయటమే కాక... 6.19 లక్షల మందికి చెల్లించాల్సిన రూ.714.84 కోట్ల పాత బకాయిలతో కలిసి మూడేళ్లలో 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల బీమా పరిహారమూ అందించారు. ► లక్ష లోపు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు సీజన్ ముగియకుండానే వడ్డీ రాయితీ అందిస్తున్నారు. గత ప్రభుత్వం 46.81 లక్షల మందికి చెల్లించాల్సిన రూ.784.73 కోట్ల పావలా వడ్డీ బకాయిలతో కలిపి మూడేళ్లలో 65.65 లక్షల మందికి రూ.1282.11 కోట్ల వడ్డీ రాయితినీ చెల్లించారు. ► విపత్తుల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే లక్ష్యంతో రూ.2 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధిని ఏర్పాటు చేయడమే కాక సీజన్ ముగియకుండానే నష్టపోయిన ప్రతి ఎకరాకూ పెట్టుబడి రాయితీని అందిస్తున్నారు. ఇలా మూడేళ్లలో 19.94 లక్షల ఎకరాలకు సంబంధించి 17.61 లక్షల మంది రైతులకు రూ.1612.80 కోట్ల పెట్టుబడి రాయితీని అందించారు. ► మూడేళ్లలో రూ.24,561 కోట్లు ఖర్చు చేసి 9 గంటల పాటు పగటి పూట నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది. ► 2019 మే నుంచి రూ.44,844.31 కోట్ల విలువైన ధాన్యంతో పాటు రూ.6903 కోట్ల విలువైన ఇతర పంటలను ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది ఈ ప్రభుత్వం. ► 10,778 ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అందించడమే కాక... ఆర్బీకేలకు అనుబంధంగా అద్దె ప్రాతిపదికన సాగు యంత్రాలు అందించేందుకు రూ.587.64 కోట్లతో 6781 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, 161.50 కోట్లతో క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. ఇటీవలే రూ.175 కోట్లతో 3800 ట్రాక్టర్లను సమకూర్చారు. ► రూ.5715 కోట్లతో 2 లక్షల బోరు బావులు తవ్విస్తోంది. ► కౌలురైతులకు రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయడమే కాదు మూడేళ్లలో 15 లక్షల మంది కౌలురైతులకు సీసీఆర్సీ కార్డులు అందించారు. 8.29 లక్షల కౌలు రైతు కుటుంబాలకు రూ.5421 కోట్ల పంట రుణాలు అందించారు. గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టిన రూ.19,709.20 కోట్ల బకాయిలను ఇప్పటి వరకు చెల్లించింది. ► ఇలా మూడేళ్లలో నేరుగా రైతులకు రూ.1.28 లక్షల కోట్ల లబ్ది నేరుగా అందిస్తే... ఏనాడూ ప్రశంసకు సింగిల్ కాలమ్ కూడా కేటాయించకుండా... అబద్ధాల సాగుకు మాత్రం ముందుకు రావటం రామోజీకే చెల్లుతుంది!!. -
పంట నష్టపోతే పరిహారమేదీ?: షర్మిల
అశ్వాపురం: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయి రైతులు అప్పుల పాలైతే వారికి కనీసం పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 65వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెంలో ఆదివారం రైతు గోస ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పంటలు నష్టపోయినప్పుడు పరిహారం ఇవ్వకుండా రైతుబంధు పథకంలో రూ.5 వేలు ఇస్తే ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటల బీమా పథకం ఎందుకు అమలు కావడం లేదని నిలదీశారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు అని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఇలా సరఫరా చేస్తే పంట ఎండిపోతుందనే ఆందోళనతో సిద్దిపేట జిల్లాలో ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుందని, ఆమె మరణానికి సీఎం కేసీఆరే కారణమన్నారు. ధర్నాలో వైఎస్సార్టీపీ నాయకులు పిట్టా రాంరెడ్డి, గడిపల్లి కవిత, టీఆర్ఎస్కు చెందిన గొల్లగూడెం సర్పంచ్ తాటి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు ఆత్మహత్యలకు సర్కార్‌దే బాధ్యత’
బూర్గంపాడు: అప్పుల బాధ, కల్తీవిత్తనాల బెడద, రుణమాఫీలో జాప్యం వంటి కారణాలతో జరుగుతున్న రైతుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ముసలిమడుగు గ్రామం నుంచి ప్రారంభమై రామాపురం, కృష్ణసాగర్ క్రాస్‌రోడ్స్, మల్లెలమడుగు, మొండికుంట, కొత్తూరు మీదుగా తుమ్మలచెరువు వరకు కొనసాగింది. ముసలిమడుగులో నిర్వహించిన రైతుగోస దీక్షలో ఆమె మాట్లాడుతూ ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో 8 వేల మంది, గత 6 నెలల్లో వెయ్యి మందికిపైగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వ్యవసాయాన్ని పండుగలా, రైతులను రాజులుగా చేస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఆ రైతుల భూములనే లాక్కుంటూ వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. -
తెగుళ్ల నష్టం.. అప్పుల కష్టం
మహబూబాబాద్ రూరల్/దౌల్తాబాద్ (దుబ్బాక): అప్పులు తీర్చేమార్గం కానరాక మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలం ఆమనగల్‌కు చెందిన దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి(40) మూడెకరాల్లో వరి, ఎకరం పత్తి, రెండు ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. పత్తి అంతంత మాత్రంగానే పండగా, మిర్చికి తెగుళ్లు ఆశించడంతో తీరని నష్టం వాటిల్లింది. పంటలసాగుకు చేసిన అప్పు, బ్యాంకు రుణాలు మొత్తం రూ.10 లక్షలకు చేరాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక తన వ్యవసాయ బావి వద్ద సోమవారం సాయంత్రం పురుగులమందు తాగాడు. సమీప రైతులు గమనించి 108లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఉప్పరపల్లికి చెందిన జంగపల్లి బాల్‌రాజు(28) హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మాస్టర్. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి స్వగ్రామానికి వచ్చి తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ముగ్గురు అక్కలపెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం ఉదయం గ్రామం సమీపంలోని సింగచెరువు వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. -
రైతన్న ఉసురు తీస్తున్న సర్కార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యలు పెరిగిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని, రైతు వ్యతిరేక చర్యలతో వారి ఉసురు తీస్తోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. మూడేళ్ళలో 70 వేలమంది రైతులు చనిపోతే ఇందులో 9 వేలమందివి ఆత్మహత్యలేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతీ రైతుకు రైతుబీమా కింద రూ.5 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు షర్మిల రాసిన లేఖను మీడియా ముందుంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 59 ఏళ్ళు దాటిన రైతుకు బీమా సదుపాయం కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. బీమా రైతుకా? వయసుకా? అని ఆమె ప్రశ్నించారు. తన లేఖపై స్పందించని పక్షంలో రైతు పక్షాన ఆందోళనలు చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. పార్టీ గుర్తింపుపై ఎందుకు కొర్రీలు పెడుతున్నారో ఎన్నికల సంఘమే తెలపాలని ఆమె ఓ ప్రశ్నకు బదులిచ్చారు. -
అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య
నర్మెట/నర్సింహులపేట/మహదేవపూర్: అప్పుల బాధతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వేసిన పంట నష్టపోగా, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో వీరు బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ కౌలు రైతు ఉన్నాడు. వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేటలో నూనె రాజశేఖర్ (28) రెండెకరాల్లో పత్తి సాగు చేయగా, పంట దిగుబడి ఆశించినమేర రాలేదు. గతంలో పంటసాగుకోసం చేసిన అప్పుతోపాటు తాజా అప్పు రూ.3 లక్షలకు చేరుకుంది. దీనికితోడు ఇటీవల రాజశేఖర్‌కు ఆపరేషన్ జరిగింది. ఇందుకోసం మరో రూ.2 లక్షలు ఖర్చయ్యాయి. దీంతో అప్పులు తీర్చేదారి లేక మంగళవారం సెంట్రింగ్ కూలిపనికి వెళ్తున్నానని భార్యతో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. బుధవారం గ్రామానికి సమీపంలో పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడి నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సదానందం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఎర్రచక్రుతండాకు చెందిన జాటోతు బొద్యా (55) తనకున్న ఎకరం భూమిలో మిరప సాగు చేశాడు. సుమారు రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంట అమ్మడంతో రూ.15వేలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు కూతురు వివాహానికి రూ.4.5 లక్షలు అప్పు చేశాడు. దీంతో అప్పు తీర్చేదారిలేక మనస్తాపంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రూ.10 లక్షల అప్పు తీర్చలేక.. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లికి చెందిన పుట్ట రవి (38) తనకున్న ఎకరంతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. కౌలుకోసం రూ.30 వేలతోపాటు పంట సాగుకు ఇప్పటి వరకు సుమారు రూ. 10 లక్షల వరకు అప్పు చేశాడు. కాగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తోడు తెగుళ్లు సోకి పంట పూర్తిగా నాశనమైంది. దీంతో మనోవేదనకు గురైన రవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజ్‌కుమార్ తెలిపారు. -
నా బతుకంతా తెలంగాణకే
సాక్షి, హైదరాబాద్: ‘నా బతుకంతా ఇక్కడే.. నేను, నా పిల్లలూ ఇక్కడే పుట్టాం. నేనిక్కడే చదువుకున్నా. ఇక్కడే ఉంటున్నా. తెలంగాణ ప్రజలకు సేవ చేస్తా. వారి పక్షాన పోరాడతా’అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఆమె శుక్రవారం పరామర్శించారు. వారికి అండగా నిలబడతా నని భరోసా ఇచ్చా రు. షర్మిల మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు తాను వారి ప్రాంతాలకే వెళ్ళాలనుకున్నా కోవిడ్ నిబంధనలను అడ్డుపెట్టి యా త్రను ప్రభుత్వం అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడున్నరేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు. పాల్వంచ ఘటనలో నిందితుడిని శిక్షించాలన్నారు. -
అప్పులు పండె.. నూరేళ్లు నిండె!
మహబూబాబాద్ రూరల్: మిరప పంట చేతికి వచ్చాక అమ్మేసి అప్పులు తీర్చాలనుకున్న ఓ రైతు.. తెగుళ్ల కారణంగా నష్టపోవడంతో మనోవేదనకుగురై ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలం లక్ష్మాతండాలో గురువారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. లక్ష్మాతండాకు చెందిన అజ్మీర శ్రీను (39)కు భార్య పద్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సొంతంగా మూడు ఎకరాల పొలం ఉండగా, ఓ రైతు వద్ద మరో ఎకరంనర కౌలుకు తీసుకున్నాడు. మూడు ఎకరాల్లో మిర్చి, ఎకరంనరలో వరిసాగు చేశాడు. మిర్చిసాగుకు రూ.5 లక్షల వరకు అప్పు కాగా, గతంలో కుమార్తెల పెళ్లికి రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. మిర్చికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మంచి ధర వస్తుందని సాగు చేయగా తామరపురుగు, నల్లి తెగుళ్లతో చేనుకు పూర్తిగా నష్టం వాటిల్లింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలని కొన్నిరోజులుగా మదనపడుతున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే గురువారం కూడా మిరప మొక్కలకు పురుగు మందు చల్లి భార్యను ఇంటికి వెళ్లమన్నాడు. ఆమె వెళ్లిన తరువాత అదే చేనులో పురుగు మందుతాగాడు. రాత్రి ఇంటికి వచ్చి పురుగు మందు తాగానని కుటుంబ సభ్యులతో చెప్పడం తో వారు వెంటనే చికిత్సనిమిత్తం ఏరియా ఆస్పత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పద్మ మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
పురుగు సోకి.. రైతు రాలి!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ సాక్షి ప్రతినిధి, వరంగల్: మిర్చి సాగు ఈ ఏడాది రైతులను అతలాకుతలం చేసింది. తెగుళ్లు సోకడంతో లాభాలు పక్కనపెడితే చాలాచోట్ల పెట్టుబడులు కూడా దక్కలేదు. అప్పటికే ఉన్న అప్పులకు కొత్త అప్పులు తోడయ్యాయి. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతులు బతుకు చాలిస్తున్నారు. తెగుళ్లను నివారించలేని ఆ పురుగుల మందులనే తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌లో ఏడుగురు, ఖమ్మం జిల్లాలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. 50 శాతానికి పైగా దెబ్బతిన్న పంటలు తెలంగాణలో 3,58,558 ఎకరాల్లో రైతులు మిర్చి పంటలు వేశారు. అత్యధికంగా వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 2,82,598 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. అయితే అంతుబట్టని తెగులుతో 50 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.1.72 లక్షల మేర పెట్టుబడి ఖర్చు చేస్తుండగా.. తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా పడిపోయింది. పంటను కాపాడుకునేందుకు విపరీతంగా పురుగుల మందులు వాడినా ఫలితం లేకపోవడంతో ఎకరాకు 35 క్వింటాళ్ల మేర దిగుబడి రావాల్సి ఉండగా ఐదు క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. లొంగని తెగుళ్లతో తీవ్ర నష్టాలు రాష్ట్రవ్యాప్తంగా సాగైన పంటలో 2 లక్షల ఎకరాలకు పైగా తెగుళ్లు ఆశించాయి. ఇందులో 1.70 లక్షల ఎకరాల్లో పూర్తిగా పంట నష్టం జరిగింది. జెమిని (గుబ్బ తెగులు), తామర, వేరు కుళ్లు వంటి తెగుళ్ల దాడితో పంట రైతుల చేతికి అందడం లేదు. ఈ తెగుళ్లు వదిలించేందుకు రైతులు రూ.వేలు వెచ్చించి పురుగుల మందు పిచికారీ చేస్తున్నా ఫలితం కానరాలేదు. మిర్చి సాగుకు ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాలో 30 నుంచి 40 బస్తాలు దిగుబడి వస్తుందని భావిస్తే తెగుళ్ల కారణంగా 8 నుంచి 10 బస్తాలకు పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్, జనవరి మాసాల్లో వచ్చిన తీవ్ర చలిగాలులు కూడా కొంత దెబ్బతీశాయి కేరింతల ఇల్లు రోదిస్తోంది! మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన నారమళ్ల సంపత్ (25)కు మూడేళ్ల కూతురు ఉండగా ఇటీవలే మరో పాప పుట్టింది. చిన్నారి కేరింతలు కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తాయి. అంతలోనే ఆ యువరైతు సాగు చేసిన మిర్చికి తెగులు సోకింది. పంట దెబ్బ తినడంతో అప్పటికే ఉన్న అప్పుల భారం ఆత్మహత్యకు ప్రేరేపించింది. మిరప చేనులోనే కలుపు మందు తాగి బలవన్మరణం చెందాడు. సంపత్‌కు మూడున్నర ఎకరాల భూమి ఉంది. ఇందులో అర ఎకరంలో వరి సాగు చేశాడు. మిగతా మూడెకరాలతో పాటు, మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. గతంలోనే ఇతనికి పంట కోసం చేసిన రూ.3 లక్షల అప్పు ఉంది. తాజాగా మిర్చి సాగు చేసి అప్పు తీర్చేద్దామనుకున్నాడు. మరో రూ.5 లక్షలు అప్పు చేశాడు. కానీ తామర తెగులు సోకి పంటంతా దెబ్బతినడం, అప్పులు మీద పడడంతో తీవ్ర ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. ఈసారైనా లాభం వస్తుందని.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని నెమలిపురి గ్రామానికి చెందిన భూక్య వాగ్యా తనకున్న మూడెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. గత ఏడాది ఇదే పంట సాగు రూ.3.50 లక్షల నష్టం మిగిల్చింది. ఈసారైనా లాభం వస్తుందని ఆశించాడు. తొలుత రూ.40 వేల విలువైన విత్తనాలు విత్తినా నారు చేతికి రాలేదు. దీంతో రూ.లక్ష పెట్టి నారు కొనుగోలు చేశాడు. పంట చేతికి వచ్చే సమయానికి తెగుళ్లు, తామర పురుగు, వైరస్ సోకడంతో దెబ్బతింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా పంట చేతికి రాలేదు. మొత్తం మీద ఈ ఏడాది రూ.4 లక్షలు, గత ఏడాది ఉన్న అప్పు మొత్తం రూ.8 లక్షల వరకు అప్పులయ్యాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వాగ్యా తన తోటలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. అల్లుడు గత నాలుగేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో కూతురూ పుట్టింట్లోనే ఉంటోంది. వాగ్యా మృతితో ఈ కుటుంబం ఇప్పుడు దిక్కులేనిదైంది. రూపాయి వచ్చే పరిస్థితి లేక.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు దగ్గు సంపత్‌రావు (48). ఈయనది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం శ్యాంనగర్ గ్రామం. భార్య సుమతి, కుమార్తెలు దివ్య, నవ్య ఉన్నారు. తనకున్న ఏడెకరాల భూమిలో నాలుగెకరాలు మొదటి కుమార్తె దివ్యకు ఇచ్చి 2011లో వివాహం చేశాడు. మిగిలిన మూడెకరాలతో పాటు కుమార్తె భూమిని సైతం తానే సాగు చేస్తున్నాడు. గతేడాది ఈ ఏడెకరాలతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని, ఎనిమిదెకరాల్లో మిర్చి, రెండెకరాల్లో వరి సాగు చేశాడు. అకాల వర్షాలతో మిర్చి దిగుబడి తగ్గడంతో సుమారు రూ. 4 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది తనకున్న ఏడెకరాల్లో మిర్చి పంట వేశాడు. పూతదశలో పంటను తామర పురుగు ఆశించింది. ఎన్ని రకాల క్రిమి సంహారక మందులు కొట్టినా ఫలితం లేకపోయింది. అన్నీ కలిపి పెట్టుబడికి సుమారు రూ.7 లక్షల ఖర్చు అయింది. పంటతో రూపాయి వచ్చే అవకాశం కూడా కన్పించలేదు. అప్పు చెల్లిం చడం ఎలా అన్న ఆవేదనతో ఈ నెల 20న మిర్చి తోటలోనే పురుగుమందు తాగాడు. ఈ రెండు పట్టికలూ చాలు.. తెగుళ్ల కారణంగా మిర్చి దిగుబడి ఎంత దారుణంగా తగ్గిపోతోందో, రైతులు భారీ నష్టాలు ఎలా మూట గట్టుకుంటన్నారో తెలుసుకునేందుకు. -
అప్పుల బాధ తాళలేక..
బాన్సువాడ రూరల్: అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసు కున్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మం డలం హన్మాజీపేట్ గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సింగం శంకర్ (52) ఇటీవలే వరి పంట కోసి తన పొలం పక్కనే ఆరబె ట్టాడు. ఆదివారం రాత్రి ధాన్యం కాపలా కో సం ఇంటి నుంచి వెళ్లిన అతడు.. సోమవారం తెల్లవారు జామున పురుగు ల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ధాన్యం కుప్పపై విగతజీవిగా పడిఉన్న శంకర్‌ను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పంటలు పండక నష్టాలు వచ్చి అప్పులు పెరిగి పోయాయని మృతుడి భార్య లక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. -
రైతుల ఆత్మహత్యలు తగ్గాయి
సిరిసిల్ల: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని.. ఈ విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు శివారులోని అపెరల్ పార్క్‌లో శుక్రవారం మంత్రి, గోకుల్దాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అపెరల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. జౌళి రంగం అభివృద్ధికి తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ అపెరల్ పాలసీ(టీ–టాప్) తెచ్చామని తెలిపారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో 12 వేల మందికి ఉపాధి కల్పించేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. అలాగే సిరిసిల్లలో 60 ఎకరాల్లో నెలకొల్పిన అపెరల్ పార్క్ ద్వారా పదివేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. బీడీలు చేస్తూ రె క్కలు ముక్కలు చేసుకునే మహిళలకు సులభంగా నెలకు రూ.10 వేలనుంచి రూ.12 వేలు సంపాదించుకునేందుకు గార్మెంట్ పరిశ్రమలు దోహదపడతాయని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్రాలు ప్రపంచ విపణిలో పోటీ పడతాయని, నాణ్యమైన, నవ్యమైన వస్త్రాలకు సిరిసిల్ల కేంద్ర బిందువు అవుతుందని పేర్కొన్నారు. మన పత్తి ఎంతో నాణ్యమైంది దేశంలోనే తెలంగాణ పత్తి ఎంతో నాణ్యమైందని, ఈ విషయాన్ని దక్షిణ భారత స్పిన్నింగ్ మిల్లుల సంఘమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేతన్నల సంక్షేమం కోసం నేతన్నల బీమా పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. రైతుల తరహాలో నేతకార్మికులు ఏ కారణాలతో చనిపోయినా.. వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేలా బీమా పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలోనూ నేతన్నకు చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 26 వేల మంది కార్మికులకు రూ.110 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. కాగా, సిరిసిల్లలో రూ.400 కోట్లతో చేపట్టిన వర్కర్ టు ఓనర్ పథకం కొద్ది రోజుల్లో కార్యరూపం దాలుస్తుందన్నారు. మహిళల ఉపాధికి ప్రాధాన్యం: శైలజారామయ్యర్ అపెరల్ పార్క్‌లో మహిళల ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో రూ.20 కోట్లతో రోడ్లు, షెడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఇన్నర్‌వేర్ గార్మెంట్ పరిశ్రమకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని ఈ ఫ్యాక్టరీలో వెయ్యి మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గోకుల్దాస్ కంపెనీ ఎండీ సుమీర్ హిందుజా మాట్లాడుతూ మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, టీఎస్ఐఐసీ ఎండీ ఇ.వెంకట నర్సింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వ్యవసాయ చట్టాలు: సుప్రీం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం సుదీర్ఘ ఉద్యమం చేస్తున్న రైతులు, రైతు సంఘాలకు భారీ ఊరట లభించింది. మూడు వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటీషన్‌పై విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతకాలం చట్టాల అమలును నిలిపి వేయాలని లేదంటే తామే స్టే విధిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెగేసి చెప్పింది. ఈ చట్టాల పరిశీలనకు గాను ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే రైతులు తమ నిరసనను కొనసాగించుకోవచ్చని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాల పై స్టే ఇచ్చిన తర్వాత ఆందోళన నిలిపి వేస్తారా ? అని సుప్రీం రైతు సంఘాల ఉద్యమ నేతలను ప్రశ్నించింది. తదుపరి వాదనలను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మక సమస్యగా ఎందుకు చూస్తోందని ప్రశ్నించిన సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా కేంద్ర వైఖరిపై అసంతృప్తితో ఉన్నామన్నారు. రైతుల ఆందోళన, సమస్యను పరిష్కరించడంలో సరిగా వ్యవహరించలేదన్నారు. పలు దఫాలు చర్చలు విఫలంపై స్పందిస్తూ కేంద్రం పరిస్థితిని సరిగ్గా నిర్వహిస్తోందని, చర్చలు ప్రభావవంతంగా ఉన్నాయని తాము విశ్వసించడలేదంటూ ఘాటుగా స్పందించారు. అందుకే చట్టాల అమలును నిలిపివేయడం ద్వారా వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతు సంఘాలతో ప్రభుత్వ చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య సీజేఐ వ్యాఖ్యలు ప్రాధన్యతను సంతరించుకున్నాయి. కొంతమంది రైతులు ఆత్మహత్యలను ప్రస్తావించిన సుప్రీం, వీటిపై ఆందోళన వ్యక్తం చేసింది. వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతోందని కూడా ప్రశ్నించింది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలి. మ ఇకపై ఎవరి రక్తంతోనూ మన చేతులు తడవకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాల పరిశీనలకుగాను ఐసీఎఆర్‌తో సహా నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై వ్యతిరేక, అనుకూల వాదనలను ఈ కమిటీకి అందించుకోవచ్చని, కమిటీ నివేదిక మేరకు వ్యవహరిస్తామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు కేవలం రెండు, మూడు రాష్ట్రాలు మాత్రమే నిరసన తెలుపుతున్నాయని అటార్నీ జనరల్ మెహతా సుప్రీంకు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల రైతులు, ఇతర ప్రాంతాల రైతులు నిరసనల్లో పాల్గొనడం లేదన్నారు. అయితే కమిటీ వేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే చట్టాలను నిలుపుదల చేయవద్దని ఆయన కోరారు. -
గణతంత్ర వేడుకల్లో ట్రాక్టర్ మార్చ్
ఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నెల రోజులకు పైగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమ డిమాండ్లను ఇప్పటికైనా ప్రభుత్వం అంగీకరించకపోతే జనవరి26 గణతంత్ర వేడుకల్లో దేశ రాజధాని నగరంలో ట్రాక్టర్లతో మార్చ్ నిర్వహిస్తాని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌కు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో కిసాన్ పరేడ్ పేరుతో రైతులు తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు. ఇప్పటికే నూతన వ్యవసాయ చట్టాల రద్దు సహా నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో కొంత పురోగతి చోటు చేసుకుంది. (టాయిలెట్ గదిలో రైతు ఆత్మహత్య ) రైతుల ప్రధానమైన 4 డిమాండ్లలో.. సాగు చట్టాల రద్దుకు విధివిధానాలు రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడమనే రెండు డిమాండ్ల అమలుపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. రైతులపై విద్యుత్ బిల్లుల భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌కు, అలాగే, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించే ప్రతిపాదనను విరమించుకోవాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇరు వర్గాల మధ్య ఆరో విడత చర్చలు 50% అంశాలపై రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొనగా, రైతు సంఘాల నేతలు వీటిని ఖండించారు. ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి లిఖితపూర్వక సయోధ్య కుదరలేదని రైతు సంఘాల అధినేత స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపాడు. జనవరి4న మరోసారి చర్చలు నిర్వహిస్తామని, ప్రతిష్టంభన నెలకొన్న మిగతా రెండు డిమాండ్లపై కేంద్రం నుంచి సానుకూలత రాకపోతే గణతంత్ర వేడుకల్లో మార్చ్‌తో నిరసన తెలియజేస్తామని వెల్లడించాడు. చలి తీవ్రత ఉన్నా ఏమాత్రం లెక్కచేయకుండా దేశ వ్యాప్తంగా వేలాది మంది రైతులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 50 మంది రైతులు అమరులయిన సంగతి తెలిసిందే. (రైతు సంఘాలతో చర్చల్లో పురోగతి) -
ఏ చట్టమైనా ఇంటి స్త్రీని రక్షించాలి..
చనిపోయినవారు బతికున్నవారితో కలిసి ఒకేచోట చేరడం ఢిల్లీలో జరిగింది. పంజాబ్‌లోని దాదాపు 2000 మంది వితంతువులు ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పసుపుపచ్చటి దుపట్టాలు తలపై కప్పుకుని పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఫొటోలే. భర్తలవి. తండ్రులవి. కుమారులవి. అన్నీ బాగుంటేనే ఇంత మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.. ఈ కొత్త చట్టాల వల్ల ఇంకా ఎంతమంది వితంతువులను తయారు చేస్తారు మీరు? అని వారు ప్రశ్నించారు. వితంతువులందరూ ఒక్కటై తమ నిరసనను వ్యక్తం చేయడం ఈ ఉద్యమంలో ఒక బలమైన సందర్భం. వీరు చెబుతున్న కథలు వ్యధాభరితం. శోకం చాలా గాఢంగా ఉంటుంది. అది చాలా సహనాన్ని కూడా ఇస్తుంది. కాని ఒక దశ తర్వాత అది తిరగబడుతుంది. శోకానికి కూడా చివరి బిందువు ఉంటుంది. అది దాటితే కన్నీరు కార్చే కళ్లు రుధిర జ్వాలలను వెదజల్లుతాయి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో ఇదే కనిపిస్తోంది. చదవండి: నాకు పేరొస్తుందనే.. విపక్షాలపై మోదీ ధ్వజం ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనలో బుధవారం ప్రత్యేకంగా ‘వితంతువుల నిరసన’ నిర్వహించేందుకు సోమ, మంగళవారాల్లోనే పంజాబ్ నుంచి వితంతువులు ప్రత్యేక బస్సుల్లో, ట్రాలీలలో బట్టలు, ఆహారం పెట్టుకుని బయలుదేరారు. బయలుదేరేముందు స్థానిక కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, ధర, నిల్వకు సంబంధించిన కొత్త సవరణలతో వచ్చిన చట్టాలు వీరికి ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. చదవండి: రైతుల వాదనకే మద్దతు ఢిల్లీ– హర్యానా సరిహద్దులోని టిక్రీ వద్ద వేలాదిగా రైతులు బైఠాయించి నెల రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, సవరింపులను ఒప్పుకోము అని వారు తేల్చి చెబుతున్నారు. మగవారు వ్యవసాయాన్ని వదిలి ఇక్కడకు చేరగా పంజాబ్‌లో చాలా మటుకు స్త్రీలు, పిల్లలు పొలం పనులు చూస్తున్నారు. అయితే బుధవారం రోజున ప్రత్యేకంగా వ్యవసాయ రుణాల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలు, తల్లులు, తోబుట్టువులు ఈ నిరసనలో పాల్గొన్నారు. భారతదేశంలో 2019లో 10,281 మంది వ్యవసాయరంగంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో 5,957 మంది రైతులు కాగా, 4,324 మంది రైతు కూలీలు. దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయరంగ ఆత్మహత్యలు 7.5 శాతం ఉన్నాయి. పురుషుడు పరువు కోసం ప్రాణాలు తీసుకుంటూ ఉంటే స్త్రీ కుటుంబం కోసం ప్రాణాలు నిలబెట్టుకుంటూ రావడం దేశమంతా ఉంది. ‘ఏ రోజైతే మా ఇంటి మగాళ్లు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ రోజే మా జీవితం ఆగిపోయింది’ అని ఇక్కడ నిరసనలో పాల్గొన్న వితంతువులు తెలియచేశారు. ‘పంజాబ్‌లో సంపన్న రైతులు ఉన్నారు. అలాగే పేద రైతులు తక్కువేం లేరు’ అని ఈ మహిళలు అన్నారు. వీరు ఇలా వచ్చి నిరసన తెలపడానికి కారణం ఏమంటే ఆ అప్పులు పెరుగుతూ ఉండటం. దేశంలో ఏ చట్టమైనా ఇంటిని, ఇంటి స్త్రీని రక్షించేదిగా ఉండాలని ప్రజలు అనుకోవడం సహజం. ఇప్పడు ఆ స్త్రీ తీవ్ర ఆందోళనలో ఉంది. ఆ ఆందోళన తొలగక పోతే అశాంతి కొనసాగుతూనే ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
కేసీఆర్ కుటుంబం పతనం ఖాయం
సాక్షి, సంగారెడ్డి: రైతుల శాపం తగిలి ఏదోక రోజు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కుటుంబం పతనం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కూడా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే పాలకులు సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. ‘రోజూ ఏదో ఒక మూల రైతు మరణిస్తున్నాడు. రైతు ఆత్మహత్య లేని వార్త దినపత్రికల్లో కనిపించడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు ఆత్మహత్యలను ప్రభుత్వ రికార్డులలో చూపడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు రైతు ఆత్మహత్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు. గత శుక్ర, శనివారం రెండు రోజుల్లో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాల’ని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇదేనా తెలంగాణ అంటే? ‘రైతు చనిపోతే ఈ ప్రభుత్వం స్కీం పెట్టింది.. కానీ బతకడానికి ఎందుకు పెట్టలేదు, అంటే రైతు చనిపోవాలని పథకం పెట్టారా? తెలంగాణ వస్తే.. రైతు ఆత్మహత్యలు ఉండవని కేసీఆర్ వేల సార్లు సభలలో చెప్పారు. అందుకే కావచ్చు.. రైతు ఆత్మహత్యలను రికార్డ్ లోకి ఎక్కించడం లేదు. ఇదేనా రైతు ఆత్మ హత్యలు లేని తెలంగాణ అంటే? ఎందుకు, ఈ ప్రభుత్వం వర్ష కాలంలో సంభవించిన పంట నష్టంపై స్పందించడం లేదు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం దగ్గరకు వెళ్తారు. తెలంగాణలో మాత్రం ప్రభుత్వానికి ఇబ్బంది ఉందని ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నార’ని ఎద్దేవా చేశారు. రుణమాఫీ ఊసేలేదు ఎన్నికల సమయంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నా.. ప్రజలు మమ్మల్ని నమ్మలేదు. టీఆర్ఎస్ లక్ష రూపాయల రుణమాఫీ అంది. రెండో సారి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్న రుణమాఫీ ఊసేలేదు. టీఆర్ఎస్ పార్టీ రైతులను మభ్యపెడుతూ.. కాలం గడిపేస్తుంది. తెలంగాణ వచ్చాక కూడా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే.. మీరు సిగ్గు పడాలి.. రైతుల శాపం తగిలి ఏదో ఓక రోజు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కుటుంబం పతనం అవుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 500 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం.. రైతులకు ఎందుకు నష్ట పరిహారం ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఇలాగే చేస్తే.. రైతులు వ్యవసాయం వదిలి పెట్టే పరిస్థితి వస్తది. ఎకరాకు 20 వేల చొప్పున అన్ని పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి. లేదంటే రెండు, మూడు రోజులలో ప్రగతి భవన్ ముందు సంగారెడ్డి రైతులతో ధర్నా చేస్తా. రైతులకు ఉచిత ఎరువులు అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు. సీఎం ప్రకటనలు కేవలం బ్రేకింగ్ లకే పరిమితం అవుతుంది. నాగలి దున్నడు, నీళ్ళు పారించడు కానీ పెద్ద రైతు లెక్క కేసీఆర్ మాట్లాడుతడు.. ప్రభుత్వ సూచనల మేరకే రైతులు పంటలు వేసారు. ఇప్పుడు నష్టం పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా’ అని జగ్గారెడ్డి విమర్శించారు. చదవండి: మా లక్ష్యం బావ, బావమరిది కాదు: రఘునందన్‌రావు -
ఆ పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు అండ్ కో తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 33 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2019 వరకు అధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయని తెలిపారు. రైతుల ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. దేశంలో రైతులకు ఏ రాష్ట్రంలో ఇవ్వని పథకాలను ఏపీలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పెట్టుబడి సహాయం చేస్తున్నట్లు కన్నబాబు వెల్లడించారు. (చదవండి : రైతులకు బేడీలు వేసిన ఘనత చంద్రబాబుదే) -
ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు సమస్యలు, కూలీల ఇబ్బందులను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. న్యాయం చేయమని కోరిన రైతులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి లాక్డౌన్ విధించడంతో కూలీలు దొరకక, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక, ఐకేపీ సెంటర్లలో సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సంజయ్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజులుగా తరఫున రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కరోనా విపత్తుపై అఖిలపక్షం ఏర్పాటు చేయమంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు జంకుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ తెలియజేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. వడగండ్ల వానతో రైతాంగానికి తీరని నష్టం ఏర్పడింది. కొనుగోళ్లలో రైతులు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిపక్షం చేసిన సూచనలు సలహాలు పట్టించుకోవడం లేదు. టోకెన్లు, డ్రా సిస్టంతో ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చాలా కేంద్రాలలో ప్రారంభం కాలేదు. తేమ, తాలు పేరుతో ధాన్యం ను దోపిడీ చేస్తున్నారు. 30 వేల కోట్లు పెడితే మద్దతు ధర ఎందుకు చెల్లించట్లేదు. ఐకేపీ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గలోనే ధాన్యం కాల్చివశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతుల ఇబ్బందులను ఎత్తి చూపితే.. బీజేపీ రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. రైతులను ఆదుకోవాల్సింది పోయి.. విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల సూచనలు తీసుకుని ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించేది కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మీకు అండగా బీజేపీ పోరాడుతుంది’ అని భరోసా ఇచ్చారు. -
రైతులకు అండగా వైఎస్ జగన్ సర్కార్
-
రైతులకు న్యాయం జరిగేలా చర్యలు..
-
అప్పుల బాధ భరించలేక
చిత్తూరు ,వరదయ్యపాళెం: అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరదయ్యపాళెం మండలం సంతవేలూరు పంచాయతీ సాతంబేడులో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల మేరకు.. సాతంబేడు గ్రామానికి చెందిన డి.రమణయ్య కుమారుడు డి.మనోహర్ (37) ఐటీఐ చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట చేతికందలేదు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు అంతకంతకు పెరిగిపోయాయి. గత ఏడాది రూ.లక్షన్నరతో వేసిన 4 బోర్లలో నీళ్లు పడలేదు.రెండేళ్ల పాటు రూ.లక్ష పెట్టుబడితో పెట్టిన పంట చేతికందలేదు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న బంగారాన్ని రూ.70వేలకు బ్యాంకులో తాకట్టు పెట్టగా, మరో రూ.60వేలకు పట్టాదారు పాసుపుస్తకాలపై బ్యాంకులో క్రాప్‌లోన్ పొందాడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం శ్రీకాళహస్తి పట్టణంలో, రెండో కుమార్తె నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 8వ తరగతి ప్రైవేటుగా చదువుతున్నారు. వీరికి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి. వ్యవసాయ పెట్టుబడులకు, బోర్లు వేసేందుకు స్థానిక రైతుల వద్ద చేసిన రూ.2లక్షలు అప్పు అంతకంతకు పెరిగిపోవడంతో వారి నుంచి ఒత్తిడి పెరిగింది. మనస్తాపం చెందిన మనోహర్ తన అప్పుల ఇబ్బందులను రాతపూర్వకంగా సూసైడ్ నోట్లో పొందుపరిచి సోమవారం తెల్లవారుజామున ఎవరూ లేని సమయంలో ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. సూసైడ్ నోట్లో చివరిగా ముఖ్యమంత్రిని వేడుకుంటూ తన ఆత్మహత్యకు వచ్చే నగదును తన పిల్లల ఖాతాలకు వేయాలని కోరడం గమనార్హం. సమాచారం అందుకున్న స్థానిక పోలీ సులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. సత్యవేడు ఏరియా ఆసుపత్రిలో మనోహర్ మృతదేహానికి శవపంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్లు ఎస్హెచ్ఓ ప్రసాద్ తెలిపారు. -
ప్రతి గంటకూ ఓ నిరుద్యోగి బలవన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ : హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ఆర్సీబీ నివేదిక ప్రకారం 2018లో 12,936 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఖ్య అదే ఏడాది రైతుల ఆత్మహత్యల కంటే అధికం కావడం గమనార్హం. ఇక 2017లోనూ అదే ఏడాది రైతుల ఆత్మహత్యలతో పోలిస్తే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకున్నాయని నివేదిక తెలిపింది. 2018లో ప్రతి గంటకూ ఒక నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడినట్టు ఎన్ఆర్సీబీ గణాంకాంలు వెల్లడించాయి. ఆ ఏడాది జరిగిన 1,34,516 ఆత్మహత్యల్లో 9.6 శాతం నిరుద్యోగులవేనని తేలింది. అదే ఏడాది మొత్తం బలవన్మరణాల్లో 10,349 మంది రైతు ఆత్మహత్యలు కాగా ఇవి మొత్తం మరణాల్లో 7.7 శాతంగా నమోదయ్యాయి. ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగుల్లో 10,687 మంది పురుషులు కాగా, 2249 మంది స్త్రీలుగా గుర్తించారు. అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళ ఆత్మహత్యల్లోనూ 12.3 శాతంతో ముందువరుసలో నిలిచింది. ఇక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీలు తర్వాతి స్ధానాల్లో నిలిచాయి. -
మరాఠ్వాడాలో మరణ మృదంగం
సాక్షి ముంబై: మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలోనే 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల పలితాల అనంతరం అధికారం కోసం ఒకవైపు కుమ్ములాటలు కొనసాగుతున్న సమయంలోనే ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 300 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం ప్రకటించింది. 2019 అక్టోబరు 14 నుంచి 2019 నవంబరు 11వ తేదీ వరకు ఒక్క మరాఠ్వాడా ప్రాంతంలోనే 68 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే, 2019 నవంబరు నెలలో 300 రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే దిగ్భ్రాంతికర విషయాన్ని రెవెన్యూ శాఖ శుక్రవారం వెల్లడించింది. అక్టోబర్‌లో అకాల వర్షాల కారణంగా మరాఠ్వాడాలో 70 శాతం ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అక్టోబర్, నవంబర్ నెలలో ఆత్మహత్యలు 61 శాతం వరకు పెరిగినట్లు పేర్కొంది. ఇలా ఒకే నెలలో 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడటం 2015లోనూ చోటుచేసుకుందని తెలిపింది. -
ఆగని ‘మహా’ వ్యథ
సాక్షి ముంబై: అతివృష్టి లేదంటే అనావృష్టి.. ఆదుకునే నాథుడు లేడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రపతి పాలన పెట్టడంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక మహారాష్ట్రలో అన్నదాతలు కుంగిపోతున్నారు. గత కొన్నేళ్లుగా కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడిన రైతాంగం ఈ ఏడాది కురిసిన వర్షాలకు ఆనందం చెందారు. తమ పంట పండిందని సంబరాలు చేసుకున్నారు. అయితే అక్టోబర్‌లో రుతుపవనాల తిరుగు ప్రయాణ సమయంలో భారీగా వర్షాలు కురవడంతో చేతికందిన పంట నీళ్లపాలైంది. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. కేవలం మరాఠ్వాడా ప్రాంతంలో 41 లక్షల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, కందితో పాటు ఇతర పండ్ల తోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లడంతో రైతన్నలు తట్టుకోలేకపోయారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో 68 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ ఏడాది జనవరి నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో 746 మంది బలవన్మరణం పొందారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై తమను ఆదుకుంటుందేమోనని రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలోనే రాష్ట్రపతి పాలన పెట్టడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. అయితే రాష్ట్ర గవర్నర్ పంట నష్టపోయిన వారికి ప్రతీ హెక్టార్‌కు రూ.8 వేలు, పండ్ల తోటలకు ప్రతీ హెక్టార్‌కు రూ.18 వేలు ప్రకటించడం కాస్త ఊరటనిచ్చినా కష్టాల ఊబి నుంచి రైతుల్ని బయటపడవేయలేకపోయాయి. ప్రభుత్వ లెక్కలన్నీ తప్పులే ‘సాక్షి’తో పి. సాయినాథ్ రైతు కష్టాల్లో మహారాష్ట్ర అత్యంత దయనీయ స్థితిలో ఉందని సీనియర్ జర్నలిస్టు, ది హిందూ పత్రిక గ్రామీణ వ్యవహారాల మాజీ ఎడిటర్ పి. సాయినాథ్ అన్నారు. రైతుల ఆత్మహత్య వివరాల్లో ప్రభుత్వ గణాంకాలన్నీ తప్పుడువేనని చెప్పారు. ఈ విషయమై ఆయన సాక్షితో మాట్లాడుతూ 1995 నుంచి 2015 వరకు 20 ఏళ్లలో మహారాష్ట్రలో 65 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెబుతున్నారు కానీ, ఇది సరైనది కాదని అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలను సేకరించే పద్ధతిలో లోపాలున్నాయని అన్నారు. వారు సరిగ్గా లెక్కలు వేసి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న డేటా కూడా మూడేళ్ల నాటిదని సాయినాథ్ వ్యాఖ్యానించారు. రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలోనే కనీసం ప్రభుత్వం కూడా లేకపోవడం పులి మీద పుట్రవంటిదేనని వ్యాఖ్యానించారు. -
ఏపీలో 13 జిల్లాలకు రూ.13 కోట్లు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న విషయాన్ని మరోసారి నిజం చేసి చూపించారు. ఇప్పటికే కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించడానికి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పంటకు కనీస మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబానికి తక్షణమే సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి వ్యవసాయశాఖ కొత్త ఆలోచనా విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం 13 జిల్లాలకు రూ. కోటి చొప్పున రూ.13 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు రూ. కోటి రూపాయలు చొప్పున వారి గ్రీన్ చానెల్ అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఇక మీదట దురదృష్టవశాత్తు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే తక్షణమే వారి కుటుంబాలకు జిల్లా కలెక్టరే స్వయంగా వెళ్లి ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు. -
ఆయువు తీసిన అప్పులు
సాక్షి, ప్రకాశం: దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన రైతు గంగిరెడ్డి దుర్గారెడ్డి (42) సుశీల దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గంగిరెడ్డి తనకు ఉన్న 2.50 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. మిరప, వరి పంటల సాగులో నీటి ఎద్దడి వలన బోర్లు వేసి ఎక్కువ ఖర్చుచేసినా నష్టాలే మిగలడంతో మూడేళ్ల క్రితం కుటుంబంతో కలిసి బతుకు దెరువు కోసం విజయవాడ కూలి పనులకు కుటుంబంతో కలసివెళ్లాడు. అక్కడ ఇంటి అద్దెలు, జీవన కర్చులు ఎక్కువ ఉండటం వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో అక్కడ బతకలేక అప్పులు చేయాల్సి వచ్చింది. దాదాపు రూ.6లక్షల వరకు అప్పు తేలింది. దీంతో అతడు మద్యానికి బానిసయ్యాడు. గ్రామంలో వ్యవసాయ పనులు కూడా చూసుకుంటూ విజయవాడ వెళ్లొస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్నాడు. నెల రోజుల క్రితం దర్శి ఆంధ్రాబ్యాంక్‌లో రూ.లక్ష లోను తీసుకుని జూదం వంటి వ్యసనాలకు ఖర్చు చేశాడు. తరచు అప్పులు వడ్డీలు గుర్తుకొస్తున్నాయంటూ ఒక సారి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం గుడికి వెళ్తున్నానని చెప్పి విజయవాడ నుంచి బొట్లపాలెం గ్రామ సమీపానికి వచ్చాడు. అక్కడ ఓ చెట్టు కింద తన వెంట తెచ్చుకున్న పురుగుమందును మద్యంలో కలుపుకొని తాగి మృతి చెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ అశోక్ వర్ధన్, ఏడీ అర్జున్ నాయక్, ఏఓ మధుబాబులు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. దుర్గారెడ్డి మృతదేహం వద్ద లభించిన నోట్ పుస్తకంలో తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని, అప్పులు భారంగా మారడం, ఆ కారణంగా చెడు అలవాట్లకు బానిసగా మారి దిక్కుతోచక ఆత్మహత్య చేసుకుంటునట్టు రాసి ఉందని గుర్తించారు. కాలం కలిసి రాక బలవన్మరణం.. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన షేక్ ఖజావలి (59)కు భార్య ఖరీమాబీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళిల్లు చేసి పంపించారు. తనకు వారసత్వంగా వచ్చిన ఎకరన్నర పొలంలో ఖాజావలి పొగాకు సాగు చేసేవాడు. దీంతో పాటు రెండు పొగాకు బ్యారన్లను అద్దెకు తీసుకొని వాటి కింద 16 ఎకరాల పొగాకు పంటకు, మరో 15 ఎకరాలు శనగ పంట కోసం కౌలు భూమి తీసుకొని వ్యవసాయం చేసేవాడు. గడచిన నాలుగేళ్ళలో వర్షాలు లేక పంటలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. అయినప్పటికి ఏ ఏడుకాయేడు ఈ ఏడాదైనా బాగుండకపోతుందా అన్న ఆశతో అందిన కాడికి అప్పులు చేయడంతో పాటు ఉన్న బంగారాన్ని అంతా గ్రామంలోని సిండికేట్ బ్యాంక్‌లో కుదువ పెట్టి 5 లక్షల వరకు వ్యవసాయ రుణంతో పాటు బయట మరో 15 లక్షల రూపాయలు మొత్తం 20 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. గత ప్రభుత్వంలో 80 వేల రూపాయలు మాత్రమే రుణమాఫీకి అర్హత సాధించాడు. అది కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో 3 విడతల్లో 45 వేల రూపాయల వరకే రుణం మాఫీ అయింది. అది కూడా ఉన్న అప్పుకు వడ్డీ రూపంలో పోవడంతో రుణమాఫీ వలన మృతుడికి ఏ మాత్రం ఉపశమనం కలుగలేదు. సరైన వర్షాలు లేక శనగ పంట దిగుబడి లేకపోవడం, పొగాకుకు ధరలు లేకపోవడంతో అప్పులు లెక్కకు మించాడు. ఈ అప్పుల నుంచి కొంత మేరకైనా బయట పడదామని గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలోని సపోటా తోటను పంట కౌలుకు తీసుకున్నాడు. అక్కడ కూడా రైతుకు చుక్కెదురైంది. భూమిలో తేమ లేక సపోటా పంట కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో అప్పుల వారు తమ బాకీ తీర్చాలని ఒత్తిడి పెరిగింది. చేసేదేమి లేక అప్పుల వారి వివరాలను కాగితంలో రాసుకున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఖాజావలి రాత్రికి తిరిగిరాకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం ఖాజావలి తాను కౌలుకు తీసుకున్న సపోటా తోటలో ఉరి వేసుకున్నట్టు గుర్తించిన తోటి రైతులు కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. ఘటనా స్థలాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేమాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. సపోటా తోటలో ఉరి వేసుకొని మృతి చెందిన షేక్ ఖాజావలి -
ముందు కుటుంబాన్ని గుర్తుకు తెచ్చుకోండి
గంగవరం: అప్పులు తీర్చలేమన్న బాధతో రైతులు ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త పిలుపునిచ్చారు. అప్పుల బాధతో మండలంలోని పాత కీలపట్లలో రైతు విజయ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనపై కలెక్టర్, మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారిలో ఆత్మస్థైర్యం నింపారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. పుస్తకంలో మృతుడు రాసిన అప్పులను కలెక్టర్ పరిశీలించారు. అందులో రూ.4.97లక్షలు అప్పుల రూపంలో రాసినట్టు గమనించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ ఆ కుటుంబానికి పరిహారంగా ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.7లక్షలు ప్రభుత్వం నుంచి రెండు రోజుల్లో అందిస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు. అలాగే మృతుడి కుమారుల చదువులకు అయ్యే ఖర్చులు ప్రభుత్వం నుంచి అందేలా చర్యలు తీసుకుని కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. ప్రభుత్వమే ఆదుకుంటుంది మృతుడి కుటుంబ సభ్యులను కలిసి భరోసా ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు ఆత్మహత్య చేసుకునే ముందు వారి కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. రైతుల కున్న అప్పుల గురించి వ్యవసాయ శాఖ అధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతారని, తగిన సూచనలు, సలహాలు తెలియజేస్తారని చెప్పారు. 2014 వరకూ రైతుల ఆత్మహత్యలకు పాల్పడిన వారు జిల్లాలో 25 మంది ఉన్నారని వారిలో 13మందికి మాత్రమే పరిహారం అందిందన్నారు. మిగిలిన 12మందికి త్రీమెన్ కమిటీ రిపోర్టు ప్రకారం అందిస్తామని ఆయన తెలిపారు. వారి వెంట వ్యవసాయ శాఖ జేడీ విజయ్‌కుమార్, పోలీసు శాఖ అధికారులు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మోహన్‌రెడ్డి, ప్రహ్లాద, గిరిరాజారెడ్డి, ఇతర నాయకులు, పలు శాఖల అధికారులు ఉన్నారు. -
అప్పులే ఉరితాళ్లై..
పంట కోసం ఆరుగాలం శ్రమించిన జిల్లా రైతన్నను కరువుతో పాటు అప్పులు వెంటాడుతున్నాయి. ఉరితాళ్లుగా మారుతున్నాయి. వేలకు వేలు తీసుకువచ్చి సాగుచేసినా పంట చేతికి రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ప్రకృతి సైతం కరుణించక పోవడంతో రైతన్నలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. తీసుకున్న అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్నారు. గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెరుగుతున్న అప్పులకు తోడు అధికారులు సహకరించడంలేదంటూ సైదాపురం మండలంలో పురుగు మందు తాగి ఒకరు, అప్పులు తీర్చే మార్గం కానరాక సోమశిల జలాశయం సమీపంలోని పెన్నాలో దూకి మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిలా ఉండగా సోమ, మంగళవారాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. తక్షణ సాయంగా కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అధికారులు అందజేశారు. సాక్షి, సైదాపురం: మండలంలోని కట్టుబడిపల్లి గ్రామానికి చెందిన వేముల కేశవరావు (64) గురువారం అప్పుల బాధలు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి జేబులో లభించిన సూసైడ్ నోట్ అభించింది. తనకు జరిగిన అన్యాయంపై సూసైడ్ నోట్లో ముఖ్యమంత్రికి రాసినట్లు మృతుడి బంధువులు పేర్కొన్నారు. గ్రామంలో తనకు ఉన్న ఎకరా 25 సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం కోసం నాలుగేళ్లగా కాళ్లరిగేలా సైదాపురం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని, దీనికి తోడు పాసు పుస్తకం కోసం రెవెన్యూ అధికారులు డబ్బులు కూడా డిమాండ్ చేశారని సూసైడ్ నోట్లో ఉన్నట్టు వారు తెలిపారు. తాను ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాటు కుమార్తెల పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చలేక అల్లాడిపోతుండేవాడినని, దానికి తోడు ఉన్న భూమిని అమ్మి అప్పులు తీర్చే క్రమంలో రెవెన్యూ అధికారులకు అడిగిన లంచం ఇవ్వలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు మృతుడు తన సూసైడ్ నోట్లో స్పష్టం చేసినట్టు వివరించారు. సైదాపురం మండలంలోని కట్టుబడిపల్లి గ్రామానికి చెందిన వేముల కేశవరావు(64)కు గ్రామంలో ఒకట్నిర ఎకరా భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం కోసం నాలుగేళ్లుగా సైదాపురం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కొన్నేళ్లుగా ఆయన స్వగ్రామమైన కట్టుబడిపల్లిలో కాకుండా నెల్లూరు పట్టణంలోని దర్గామిట్ట వద్ద కాపురం ఉంటుండేవారు. భార్య, వసంతమ్మ, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిపించారు. ఉన్న ఎకరా 25 సెంట్ల పొలంలో సవక తోటను సాగు చేసుకుండేవారు. అప్పడప్పుడు తోటలోకి వస్తూపోతూ ఉండేవారు. ఉన్న పొలానికి పాసుపుస్తకం కావాలంటూ నాలుగేళ్లుగా అర్జీ పెట్టుకున్నారు. ఇటీవలన వీఆర్వో ఆ పొలానికి సంబంధించి సర్వే చేయిస్తానని చెప్పినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా తనకు పాసుస్తకం ఇవ్వాలంటూ అధికారులను ప్రాధేయ పడగా వాటికి డబ్బులు ఖర్చు అవుతాయి పెట్టుకుంటావా? అంటూ రెవెన్యూ అధికారులు చెప్పారని రైతు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనకు ఉన్న కొద్దిపాటి భూమికి సంబంధించి పాసు పుస్తకం కొరకు తిరిగినా ప్రయోజనం కానరాకపోవడంతో ఉన్న అప్పులు తీరకపోవడంతో ఆయన మనస్తాపం చెందారు. బుధవారం ఉదయం నెల్లూరులోని తన ఇంటి వద్ద నుంచి స్వగ్రామైన కట్టుబడిపల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ బంధువుల ఇంటికి వెళ్లి తర్వాత తోట్లోకి వెళ్లాడు. కేశవరావు భోజనానికి రాకపోవడంతో వారు సవక తోట వద్దకు వచ్చే సరికి పురుగుల మందు తాగి విగతజీవిగా కేశవులు పడిఉన్న దృశ్యాన్ని చూసి ఆందోళన చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న అతనిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి జేబులో సూసైడ్ నోట్ ఉండటంతో కలకలం రేగింది. జేసీ విచారణ ఈ విషయం తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ వెట్రి సెల్వి సైదాపురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని సమగ్ర విచారణ చేపట్టారు. గూడూరు సబ్ కలెక్టర్ ఆనంద్‌ను క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ విచారణతో పాటు, మృతుని భార్య ఫిర్యాదు మేరకు జాయింట్ కలెక్టర్ సమగ్ర నివేదికను వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతు ఆరోపణలు నిరాధారమన్నారు. 2016–17,2018–19లో మీసేవలో పట్టాదారు పాసుపుస్తకం కోసం కేశవరావు ఎలాంటి దరఖాస్తు చేపుకోలేదని అలాగే భూమికి సంబంధించి ఎఫ్‌లైన్ కూడా సర్వే కొరకు కట్టలేదనే విషయాలు తమ విచారణలో తేలిందన్నారు ఆమె వెల్లడించారు. కేవలం ఆ రైతు ఇటీవలన జరిగిన స్పందన కార్యక్రమంలో నెల్లూరులోని తమ ఇంటి ముందు ఉన్న చెత్తను తొలగించాలనే అర్జీ తప్ప ఎలాంటి రెవెన్యూ సమస్యపై ఫిర్యాదు చేసిన దాఖలాల్లేవని ఆమె పేర్కొన్నారు. ఆర్థికంగా అప్పుల పాలుకావడంతో ఆరైతు ఆత్మహత్యకు ఒడిగట్టారనే విషయాన్ని మృతుడు భార్య వసంతమ్మ కూడా స్పష్టం చేశారని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. రైతు మృతిపై సమగ్ర విచారణ చేయాలని గూడూరు రూరల్ సీఐ రామకృష్ణారెడ్డిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. పెన్నానదిలో దూకి మరొకరు సోమశిల: తీవ్రమైన అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ఉన్న సోమశిల జలాశయం సమీపం పెన్నానదిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పొదలకూరు మండలం కనుపర్తికి చెందిన ఉస్కలమూర్తి మస్తాన్‌రెడ్డి (55), భార్య మాధవిలకు ఒక కుమారుడు ఉన్నాడు. రెండెకరాల పొలంలో సాగు చేస్తూ పాడి పశువులతో జీవనం సాగిస్తున్నారు. జలాశయంలో బయటపడిన మృతదేహం మస్తాన్‌రెడ్డి వరి సాగుచేశాడు. సాగునీరందక దిగుబడి తగ్గింది. పెట్టుబడులు కూడా తిరిగిరాలేదు. గతేడాది కూడా ఇదే పరిస్థితి ఉంది. మస్తాన్‌రెడ్డి అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. గురువారం సాయంత్రం సోమశిల జలాశయం దిగువ ప్రాంతంలో పెన్నానది వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ నదిలో నడుచుకుంటూ వెళ్లారు. ప్రాణం మీద భయంతో భయపడి మాధవి వెనకుడుగు వేసింది. ఆ ప్రాంతంలో ఎక్కువగా సుడిగుండాలు ఉండడంతో మస్తాన్‌రెడ్డి ఇరుక్కుపోయిన మునిగిపోయాడు. వెంటనే మాధవి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై నాగశిరీష జాలర్ల సాయంతో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలిసులు తెలిపారు. -
అన్నదాతకు ఆసరా ఎలా?
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా, ప్రత్యేకించి రైతుల ఆత్మహత్యలపైనా పార్లమెంటులో అరుదుగా చర్చ జరుగుతుంటుంది. కనుక లోక్‌సభలో గురువారం జీరో అవర్‌లో రైతుల ఆత్మ హత్యలు ప్రస్తావనకు రావడాన్ని స్వాగతించాలి. దేశంలో రైతుల స్థితిగతులు దారుణంగా ఉన్నా యని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించినప్పుడు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత అయిదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. దశాబ్దాలపాటు ఏలిన గత పాలకులే రైతుల ప్రస్తుత దుస్థితికి కారణమని కూడా ఆయన చెప్పారు. ఈ ఆరోపణలు, ప్రత్యా రోపణల సంగతలా ఉంచితే రైతులు చాలా దుర్భర స్థితిలో ఉన్నారని అందరూ గుర్తించాలి. ఈ చర్చ జరగడానికి ముందు రోజు ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఒక రైతు ఆత్మహత్య గురించిన కథనం మీడియాలో వచ్చింది. రైతు తన కుమార్తెను మెడిసిన్ చదివించాలన్న కోరికతో ఆమెను ఒక కోచింగ్ సెంటర్లో చేర్చాలనుకున్నాడు. అందుకోసం తనకున్న కొద్దిపాటి భూమిని తనఖా పెట్టాలనుకున్నాడు. కానీ అప్పటికే అప్పులున్న ఆ భూమిపై అదనంగా రుణం ఇవ్వడానికి వడ్డీవ్యాపారులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పంటలు దెబ్బతినడం, కుటుంబాల్లో అనారోగ్యం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇలా అనేక కారణాలు రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. తాజా ఉదంతంలో పోలీసులు ఆ రైతు మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. బహుశా ప్రభుత్వం కూడా ఆయన మరణం వెనక సాగు సంబంధ కారణాలు లేవని చెప్పే అవకాశం ఉంది. కానీ బుందేల్‌ఖండ్ ప్రాంతంలో గత రెండేళ్లలో 20మంది రైతులు కన్నుమూశారు. పంటలు బాగా పండి, ఆ పంటలకు గిట్టుబాటు ధర లభిస్తే... వీరు కుటుంబ సంబంధమైన బాధ్యతల్ని నెరవేర్చుకోలిగేవారు. అందరిలా జీవనం సాగించేవారు. బలవన్మర ణాలకు పాల్పడే స్థితి ఉండేది కాదు. అందువల్ల రైతుల ఆత్మహత్యలను నమోదు చేయడంలోనూ, ఆ కుటుంబాలను ఆదుకోవడంలోనూ ప్రభుత్వాలు పెద్ద మనసుతో వ్యవహరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ వలసపాలన కాలంలో 1830లో పాలకుడిగా ఉన్న లార్డ్ మెట్కాఫ్ బ్రిటన్‌కు ఒక నివేదిక పంపుతూ భారత్‌లో గ్రామాలన్నీ వేటికవి రిపబ్లిక్ల వంటివనీ, అవన్నీ స్వయంపోషకాలనీ అభివర్ణించాడు. ఈ కారణం వల్లనే అన్ని ఒడిదుడుకులనూ ఎదుర్కొని భారత్ మనుగడ సాగించగలుగుతున్నదని చెప్పాడు. అప్పట్లో గ్రామాలకున్న ఈ శక్తిసామర్థ్యాలకు వ్యవసాయం, చేతివృత్తులే ప్రధాన కారణమని వేరే చెప్పనవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తూ గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండూ క్రమేపీ దెబ్బతిన్నాయి. ఒకనాడు దేశ మనుగడకూ, దాని ఆత్మవిశ్వాసానికీ వెన్నెముకగా నిలిచిన రైతు ఇప్పుడు తానే ఒత్తిళ్లకు లోనవుతున్నాడు. రేపన్నరోజు గడిచేదెలాగో అర్ధంకాక తనువు చాలిస్తున్నాడు. విత్తనాలు మొదలుకొని అన్నీ సకాలంలో సరైన ధరలకు లభ్యమయ్యేందుకు...దిగుబడులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు... దళారుల బెడద తప్పించేం దుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోగలిగితే ఈ రైతు ఆత్మహత్యల్ని నివారించడం సాధ్యమవుతుంది. బహుళజాతి సంస్థ మోన్శాంటో దేశమంతా 450 గ్రాముల బీటీ పత్తి విత్తన ప్యాకెట్‌ను రూ. 1858కి అమ్ముతున్న రోజుల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ విషయంలో పట్టుదలగా పోరాడి, చివరకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఆ ప్యాకెట్ ధరను రూ. 750కి తగ్గించేలా చేశారు. ఈ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ పెద్దల ద్వారా ఆయనకు నచ్చజెప్పించినా వైఎస్ లొంగ లేదు. ఆ ఒరవడిని తర్వాత కాలంలో ఎందరు ముఖ్యమంత్రులు అనుసరించగలిగారు? చాలా సంస్థలు రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొన్న విత్తనాలను మళ్లీ వారికే అత్యధిక ధరకు అమ్ముతున్నాయి. నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న సంస్థలున్నాయి. ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆరుగాలం శ్రమించి అధిక దిగుబడి సాధించినా కనీస మద్దతు ధరకు దిక్కులేదు. వీటన్నిటి సంగతలా ఉంచి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి పంటనష్టం జరిగినప్పుడు సాయం అందించడానికి సవాలక్ష నిబంధనలు అడ్డొస్తాయి. వీటిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం అలాంటి రైతుల కుటుంబాలను ఆదు కోవాలన్న స్పృహ కూడా పాలకులకు ఉండటం లేదు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య 1,513 మంది రైతులు ప్రాణాలు తీసుకుంటే అంతో ఇంతో ఆర్థిక సాయం దక్కింది కేవలం 391 కుటుంబాలకు మాత్రమే. మిగిలిన కుటుంబాలన్నిటి వివరాలూ సేకరించి అర్హతగల ప్రతి కుటుంబానికీ రూ. 7 లక్షల చొప్పున పరిహారం అందించాలని తాజాగా జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ భరోసా పథకాన్ని చెప్పినకంటే ముందే ప్రారంభించి వార్షిక సాయం రూ. 12,500 అందించాలని నిర్ణయించారు. ఉచిత పంటలబీమా, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటివి ఏర్పాటుచేశారు. అసెంబ్లీలో గురు వారం చర్చ సందర్భంగా రైతు సంక్షేమానికి తీసుకోబోయే చర్యల్ని వివరించారు. ఇలా సమస్యల్ని సహృదయంతో అర్థం చేసుకుని, మానవీయ కోణంలో ఆలోచించే పాలకులుండటం ఇప్పటి అవసరం. మొన్నటివరకూ కేంద్ర వ్యవసాయమంత్రిగా పనిచేసిన రాధామోహన్ సింగ్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల మంగళవారం బదులిస్తూ 2015 తర్వాతనుంచి రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను రాష్ట్రాలేవీ పంపలేదని, అందువల్ల జాతీయ క్రైం రికార్డుల బ్యూరో దగ్గర గణాంకాలు లేవని చెప్పారు. బలవన్మరణాలకు పాల్పడిన రైతులెందరో చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వాలున్నప్పుడు వాటినుంచి ఇక ఆశించే దేముంటుంది? ఈ పరిస్థితి మారాలి. పాలకులు చిత్తశుద్ధితో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. -
సీఎం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం
సాక్షి, అమరావతి : అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 7 లక్షలు పరిహారం అందివ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతు ఆత్మహత్యలపై స్పందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ‘డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2014-19 మధ్య కాలంలో 1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ గత ప్రభుత్వం కేవలం 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. రైతు ఆత్మహ్యతలకు సబంధించి కలెక్టర్లు తమ జిల్లాల్లోని డేటాను పరిశీలించాలి. అర్హులైన రైతు కుటుంబాలకు వెంటనే పరిహారం అందజేయాలి. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాల దగ్గరికి వెళ్లాలి. వారి కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపాలి. ఎక్కడైన సరే రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే కలెక్టర్లు స్పందించాలి. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. 7లక్షలు పరిహారం ఇవ్వడమే కాకుండా.. ఆ మొత్తాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా చట్టాన్ని కూడా తీసుకొస్తాం. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కలెక్టర్ కచ్చితంగా ఆ కటుంబం దగ్గరకు వెళ్లాలి. ఈ విషయంపై మళ్లీ ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదు. మనిషే చనిపోయాడు.. మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాద’ని ముఖ్యమంత్రి తెలిపారు. తమది ప్రజా ప్రభుత్వమని, మానవత్వం ఉన్న ప్రభుత్వం అని.. ఆ దిశగానే పాలన సాగుతుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై సానుభూతితో, మానవీయతతో ఉండాలని అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండాలి : సీఎం వైఎస్ జగన్ ‘స్పందన’ కార్యక్రమానికి వస్తున్న వినతులు పరిష్కారంలో నాణ్యత ఉండాలని సీఎం జగన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు స్పందన కార్యక్రమాన్ని గైర్హాజరు కావద్దని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల నుంచి వస్తున్న వినతులకు తప్పకుండా రశీదులు ఇవ్వాలని తెలిపారు. అర్జీదారులకు ఇచ్చే రశీదు మీద కూడా తేదీని రాసివాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లు బాగా పని చేస్తున్నారని చెప్పిన ముఖ్యమంత్రి వారిని అభినందించారు. అలాగే వినతుల పరిష్కారంలో లోపాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘విజయవాడ సెంట్రల్ నుంచి ఒక వినతి వచ్చింది. బినామీ డీలర్ రేషాన్ షాపు నిర్వహిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అధికారులు సరైన పత్రాలు చూపించలేదని ఆ ఫిర్యాదును తిరస్కరించారు. కానీ ఫిర్యాదుదారు ఎలా పత్రాలు చూపిస్తారనేది అధికారులు ఆలోచించాలి. విచారణ చేపట్టాల్సిన బాధ్యత మనది. విచారణ చేయకుండా ఫిర్యాదును తిరస్కరిస్తే.. ఈ కార్యక్రమం వల్ల ఏం ప్రయోజనం?. అధికారులు మనసుపెట్టి సమస్యలను పరిష్కరించాలి. ఎవరైన బాధపడి మన దగ్గరికి వచ్చారంటే మనం దానిని ఫీల్ అయి ఆ వినతిని పరిష్కరించేందుకు కృషి చేయాలి. అర్జీదారులకు ఇచ్చే రశీదులో ఎప్పటిలోగా దానిని పరిష్కరిస్తామనేది రాసి కూడా ఇవ్వాలి. మొదటి స్పందన కార్యక్రమానికి 4,400కు పైగా వినతులు వచ్చాయి. వినతుల పరిష్కారం కోసం పటిష్ట యంత్రాంగం ఏర్పాటు చేయాలి. క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు చేపట్టాల’ని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హౌసింగ్, రేషన్‌కార్డులపై ఎక్కువ వినతులు.. హౌసింగ్, రేషన్‌కార్డులపై అధిక సంఖ్యలో వినతులు వస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దానిపై స్పందించిన ముఖ్యమంత్రి.. వాటిని పరిష్కరించడానికి గ్రామ సచివాలయాలను సమర్ధవంతంగా వాడతామని తెలిపారు. రేషన్‌కార్డు, పెన్షన్ ఏది అడిగినా 72 గంటల్లో పరిష్కరించమని చెబుతున్నట్టు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లోనే రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచుతామన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకూడని పరిస్థితి ఉండకూడదని చెప్పారు. గ్రామ వాలంటీర్లను సమర్దవంతంగా వాడుకోవాలన్నారు. హాస్టళ్లలో వసతుల మెరుగుదల కోసం ప్రతి జిల్లాకు 15 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్లు తనిఖీలకు వెళ్లేలోపు వాటికి సంబంధించిన నివేదికలు తెప్పించుకోని.. ఆ మేరకు నిధులను ఖర్చు చేయాలని సూచించారు. స్పందన కార్యక్రమానికి వచ్చే ప్రజలకు సరైన వసతులు కల్పించాలని.. ప్రతి మండలంలో కూడా స్పందన కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అవినీతిని మండల స్థాయి నుంచి అరికట్టాలి అవినీతిని మండల స్థాయి నుంచి అరికట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతుల్లో కొన్నింటిని ప్రస్తావించిన ముఖ్యమంత్రి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ‘ఇ-సేవలో సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఎమ్మార్వో ఆఫీసులో లంచం ఇస్తే కాని పని జరగడం లేదని చెప్తున్నారు. అలాంటి అధికారులను పిలిపించుకుని కలెక్టర్లు కౌన్సిలింగ్ ఇవ్వాలి. నా స్థాయి నుంచి నేను క్లీన్ చేయడం మొదలుపెట్టాను. మీ స్థాయిలో మండల స్థాయి అధికారులను మీరు క్లీన్ చేయాలి. ఈ అంశంపై వచ్చే రెండు, మూడు నెలల్లో పాజిటివ్ రిపోర్ట్ కావాలి. మండల కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు జరుగుతన్నాయని నిఘా అధికారులు నివేదిక ఇచ్చే పరిస్థితి ఏర్పడాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా డబ్బు లేనిదే పని జరగడం లేదు. దీనిని ఎలా అరికట్టాలో సలహాలు ఇవ్వండి. నేను బలమైన సంకేతం ఇస్తున్నా.. అయితే దీనివల్ల యాభై శాతం మాత్రమే జరుగుతుంది. మిగిలిన యాభై శాతం పూర్తిచేయాల్సింది కలెక్టర్లు, ఎస్పీలు. మీరు మనసుపెడితే ఇది సాధమేన’ని ముఖ్యమంత్రి తెలిపారు. -
గత ప్రభుత్వం చేసిందేమీలేదు
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్ : గత ప్రభుత్వ హయాంలో తాము పంటలు వేసి సక్రమంగా పండక అనేక ఇబ్బందులు పడ్డాం. బోర్ల మీద బోర్లు వేసి అప్పులపాలయ్యాం. వీటిని చెల్లించలేక.. వడ్డీలు కట్టలేక చివరకు తమ కుటుంబ పెద్దలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆదుకోవాల్సిన నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెలలోపే తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని జమ్మలమడుగులో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో జరిగిన సమావేశంలో రైతులు గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కో కన్నీటిగాధను సీఎంతో పంచుకున్నారు. మృతదేహాన్ని తెచ్చుకోవటానికి అప్పుచేశాం మా నాన్న పదెకరాలు కౌలుకు తీసుకుని శనగ పంట సాగుచేశాడు. వర్షాలు లేకపోవడంతో పంట పండలేదు. తెచ్చిన అప్పులు కట్టలేక కర్నూలు జిల్లా అహోబిలంలో పురుగుల మందు తాగి 2003లో చనిపోయాడు. మృతదేహాన్ని తెచ్చుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. రెండు రూపాయల వడ్డీతో రూ.5 వేలు అప్పుచేసి మృతదేహాన్ని తీసుకొచ్చాం. ఆ తర్వాత 2004లో వైఎస్సార్ సీఎం అయిన తర్వాత రూ. 1.5 లక్షల చెక్కు ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు రైతు బాంధవుడిగా పేరు సంపాదించుకుంటున్నారు. – లక్ష్మీ చిన్నకొమెర్ల, మైలవరం మండలం, వైఎస్సార్ జిల్లా ఎగుమతులకు సర్కారు సహకరించాలి ప్రకృతి వైపరీత్యంవల్ల నాకు రూ.40 లక్షల మేర పంట నష్టం జరిగింది.మా ప్రాంతంలో ఎక్కువగా అరటి సాగు చేస్తుంటాం. ఇక్కడ నుంచి విదేశాలకు దానిని ఎగుమతి చేస్తున్నాం. ఎగుమతులు చేసుకోవటానికి ప్రభుత్వం సహకరించాలి. రైతులకు పగలే 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. ఆయన నల్లపురెడ్డి గ్రామంలోని చెరువుకు నీరు వచ్చేలా చేస్తే తమ ప్రాంతం రైతులు జీవితాంతం రుణపడి ఉంటాం.– లింగసాని విజయభాస్కర్‌రెడ్డి, నల్లపురెడ్డి గ్రామం, పులివెందుల గతంలో పెన్షన్ కోసం ఎదురుచూసే వాళ్లం గతంలో చేనేత కార్మికులకు పెన్షన్ ఎప్పుడు వస్తుందో అంటూ ఆశగా చూసేవాళ్లం. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలు చూసి ఎన్నికలకు 2 నెలల ముందు టీడీపీ సర్కారు పెన్షన్‌ను రూ. 2 వేలు చేసింది. అయితే, తిరిగి దానిని మూడువేల వరకు పెంచుకుంటూపోతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతేకాదు.. పెన్షన్ అర్హత వయస్సును 50 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు వైఎస్ జగన్ తగ్గించడం వల్ల చేనేత కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతోంది. – డి. ప్రసాద్, రాజీవ్‌నగర్ కాలనీ, జమ్మలమడుగు కలలో కూడా పెన్షన్ వస్తుందనుకోలేదు రెక్కాడితేగానీ డొక్కాడని చేనేత కుటుంబం మాది. చేనేత మగ్గాల ద్వారా జీవనం సాగిస్తున్న నాకు గత కొంతకాలం కిందట కిడ్నీలు చెడిపోయాయి. లక్షల రూపాయలు ఖర్చుపెట్టాలి. డయాలసిస్ చేయించుకోవలసిన పరిస్థితి ఉంది. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పుడు నాకు రూ.పదివేల పెన్షన్ వస్తోంది. కలలో కూడా అది వస్తుందనుకోలేదు. – కె. వెంకటేశ్వర్లు, మోరగుడి గ్రామం, జమ్మలమడుగు రాజన్న బీమా పథకం ప్రారంభం తొండూరు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి వర్తింపజేసే రాజన్న బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రైతు దినోత్సవం వేదికపై ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం బూచుపల్లె గ్రామానికి చెందిన కోడూరు విశ్వనాథ(32) అనే రైతు 2017లో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి టీడీపీ ప్రభుత్వం విశ్వనాథ కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. విశ్వనాథకు భార్య రామసుబ్బమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతు విశ్వనాథ కుటుంబానికి రాజన్న బీమా పథకం కింద రూ.7 లక్షలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మంజూరు చేశారు. జమ్మలమడుగు రైతు దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా విశ్వనాథ భార్య రామసుబ్బమ్మకు చెక్కును అందించారు. విశ్వనాథ కుమారుడు శ్రీకాంత్‌ను సీఎం వైఎస్ జగన్ తన వద్ద కూర్చొబెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే తమలాంటి పేదల బాధలు తెలుసుకుని, స్పందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవుడంటూ రైతు విశ్వనాథ భార్య రామసుబ్బమ్మ ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకున్న 3 ఎకరాల పొలంలో పత్తి, చీనీ పంటలు సాగు చేసి, నీరులేక ఎండిపోతున్న సమయంలో బోర్లు వేయడానికి తన భర్త విశ్వనాథ రూ.6.50 లక్షల అప్పులు చేశాడని చెప్పారు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. శనగరైతులకు ఎంతో ఊరట గత ఐదేళ్లుగా మా ప్రాంతంలోని రైతులు శనగపంట వేస్తున్నా సరైన దిగుబడులు రావడంలేదు. గిట్టుబాటు ధర కూడా లేదు. జిల్లాలో అత్యధికంగా శనగ పంట సాగుచేసేది పెద్దముడియం మండలంలోనే. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ శనగ రైతులకు క్వింటాకు రూ.1,500లు అదనంగా మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మార్కెట్లో ఉన్న రేటునే మద్దతూ ధరగా ప్రకటించింది. అలా కాకుండా మార్కెట్ రేటుకు అదనంగా రూ.1,500లు క్వింటాకు చెల్లించడం వల్ల శనగ రైతులకు ఎంతో ఊరట కలుగుతుంది. – రామాంజనేయుల రెడ్డి, శనగ రైతు, పెద్దముడియం -
రైతు కుటుంబానికి త్రీమెన్ కమిటీ పరామర్శ
సాక్షి, బల్లికురవ(ప్రకాశం) : పొలంలో జెండాలు పాతి వేలం నోటీసులివ్వడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని ఉన్నతాధికారులు నియమించిన త్రీమెన్ కమిటీ సోమవారం పరామర్శించింది. మండలంలోని కె.రాజుపాలేనికి చెందిన శాఖమూరి హనుమంతురావు (42) కొంతకాలంగా మార్టూరు మండలం శాంతినగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని భార్య, పిల్లలతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో స్వగ్రామం కె.రాజుపాలెంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శాఖమూరి హనుమంతురావు శనివారం ఉదయం పొలం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి స్వగ్రామానికి వచ్చి వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య కుపాల్పడ్డాడు. ఈ ఘనటపై ఒంగోలు ఆర్డీవో పెంచల కిశోర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ టి.ప్రశాంతి, వ్యవసాయాధికారి ఎస్వీపీ కుమారి, ఎస్ఐ పాడి అంకమ్మరావులు శాంతినగర్‌లోని బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. రైతు భార్య రాధిక నుంచి వివరాలు సేకరించారు. మార్టూరు పీడీసీసీ బ్యాంకులో నాలుగేళ్ల క్రితం తీసుకున్న అప్పు రూ. 1.80 లక్షలు వడ్డీతో కలిపి రూ.2.20 లక్షలు, స్టేట్ బ్యాంకులో రూ.లక్ష, ప్రైవేటు వ్యాపారుల వద్ద మరో రూ.3 లక్షల అప్పు ఉందని మృతుడి భార్య చెప్పింది. పీడీసీసీ బ్యాంకు మేనేజర్ ఒత్తిడి చేయడంతో తన భర్త మానసికంగా ఇబ్బంది పడ్డాడని ఆరోపించింది. పొలంలో జెండాలు పాతి 3వ తేదీన పొలం వేలం వేస్తున్నట్లు మేనేజర్ బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత రైతు భార్య త్రీమెన్ కమిటీ ఎదుట వాపోయింది. తన బిడ్డలు హర్షవర్ధన్ ఇంటర్, నందిని 9వ తరగతి చదువుతున్నారని పేర్కొంది. చదువులకు విఘాతం కలగకుండా అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరింది. నోటీస్‌లు ఇవ్వడంతో పాటు పొలంలో జెండాలు పాతిన పీడీసీసీ బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాధిక త్రీమెన్ కమిటీని వేడుకుంది. -
నాణ్యమైన విత్తనోత్పత్తే ‘ఇస్టా’ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విత్తనోత్పత్తిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రియాస్ వాయస్ అన్నారు. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఆండ్రియాస్ ఇస్టా సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా నోవాటెల్ లో తనను కలిసిన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంలో విత్తన నాణ్యతే ప్రధానమని ఆయన అన్నారు. అధిక దిగుబడులు సాధించడానికి మెరుగైన విత్తనాలు అందిం చేలా నాణ్యత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందించడమే తమ బాధ్యత అని చెప్పారు. ఇది ఒకరకంగా సీడ్ పాస్‌పోర్టు లాంటిదన్నారు. అంతర్జాతీయ విత్తన వ్యాపారంలో ఇస్టా సర్టిఫికేషన్ కీలకమని చెప్పారు. అమెరికా, యూరప్ తదితర 80 దేశాల్లో విత్తన రవాణా, అంతర్జాతీయ విత్తన వ్యాపారానికి ఇస్టా సర్టిఫికెట్ అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లలో విత్తనాల నాణ్యతను గుర్తించి అవి సరైన ప్రమాణాలతో ఉన్నాయని తేలితేనే వాటికి సర్టిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఏటా 2 లక్షల సర్టిఫికెట్లను జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ఇస్టా అధ్యక్ష ఎన్నికలు ప్రతి మూడేళ్లకోసారి వార్షిక సమావేశాల్లో మాత్రమే జరుగుతాయన్నారు. అలాగే కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. అంతర్జాతీయం గా సభ్యత్వం ఉన్న దేశాల సభ్యులు ఇస్టా ఎన్నికల్లో పాల్గొంటారన్నారు. ఈ ఎన్నికల్లో భారతదేశానికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇప్పటికే ఇస్టాలో కీలకస్థానంలో ఉన్న తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులుకు సముచిత స్థానం ఇస్తారా అని ప్రశ్నించగా, వచ్చే నెల మూడున జరిగే ఎన్నికల వరకు ఆగాలని ఆయన బదులిచ్చారు. సరైన విత్తనాలులేకే ఆత్మహత్యలు నాణ్యత, విత్తన జెర్మినేషన్ ఉండే హైక్వాలిటీ విత్తనా లకే అనుమతిస్తామని, ప్రభుత్వ ల్యాబ్‌లు, ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఏ దేశానికైనా వాతావరణం అనుకూలించడంతో పాటు విత్తన పరీక్షలు నిర్వహించే ల్యాబొరేటరీలు అవసరమన్నారు. 150 ఏళ్ల క్రితమే జర్మనీలో విత్తనాల పరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటు చేశారన్నారు. మంచి నాణ్యమైన విత్తనాలు వినియోగిస్తేనే పంట దిగుబడి వస్తుంది. సరైన విత్తనాలు వినియోగించక పోవడం వల్ల ఇండియాలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలంటే నాణ్యమైన విత్తనాలు అందించాలి. విత్తనాలు మొలకెత్తే సామర్థ్యాన్ని పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది. ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు అందించడం ద్వారా రైతులను రక్షించుకోవాలి. కొత్త వంగడాలు అందించాలి. వాతావరణ, పర్యావరణ మార్పులు ఇక్కడి రైతుల జీవన విధానంపై ప్రభా వం చూపుతాయన్నారు. రైతులు ఎక్కువ పెట్టుబడులు పెట్టి పండించినా సరైన దిగుబడులు రాక నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందన్నారు. ప్రత్యేక వ్యవసాయ విధానం అవసరం... ‘విత్తనాల ఉత్పత్తిలో ప్రత్యేక విధానాలను అవలంబించాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను పండించాలి. నీటి వినియోగం, వనరులు, భూసార పరీక్షలు అందుబాటులో ఉండాలి. వర్సిటీలు, పరిశోధన సంస్థలు ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలను రూపొందించాలి. నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాలతో అధిక దిగుబడి సాధించవచ్చు. రెట్టింపు దిగుబడి సాధించే విత్తనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడి రైతులు పంట పండించడానికి కష్టపడుతున్నారు. హైక్వాలిటీ విత్తనాల ద్వారానే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దిశలో ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు అందించి రైతులకు తోడ్పడా లి. విత్తన రంగంలో ఏ విత్తనాల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుతుందో ప్రభుత్వాలకు, రైతులకు వివరించి ఆహార భద్రతపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యం’ అని ఆండ్రియాస్ అన్నారు. -
మూడేళ్లలో 12వేల మంది రైతుల ఆత్మహత్య
ముంబై : గడిచిన మూడేళ్లలో మహారాష్ట్రలో 12 వేలకు పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2015 నుంచి 2018 మధ్యకాలంలో ఈ ఆత్మహత్యలు నమోదైనట్టు రాష్ట్ర మంత్రి సుభాష్ దేశ్‌ముఖ్ శాసనసభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. ఈ మూడేళ్లలో మొత్తం 12,021 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, వారిలో 6,888 మంది ప్రభుత్వం నుంచి పరిహారం పొందేందుకు అర్హులుగా ఆయా జిల్లాల అధికారులు గుర్తించారని తెలిపారు. ఇప్పటివరకు 6,845 రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్టు పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో 610 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా.. వారిలో 192 మందిని సాయం పొందడానికి అర్హులుగా గుర్తించి.. 182 రైతు కుటుంబాలకు ఇప్పటికే పరిహారం అందజేశామని తెలిపారు. అంతేకాకుండా మిగిలిన రైతుల ఆత్మహత్యలపై కూడా పరిశీలన జరుగుతుందని తెలిపారు. వారి కుటుంబాలు పరిహారం అందుకోవడానికి అర్హులా, కాదా అనే అంశం తెలాల్సి ఉందన్నారు. -
బాధిత కుటుంబానికి ప్రభుత్వం భరోసా
సాక్షి, అమరావతి బ్యూరో: వ్యవసాయంలో తీవ్ర నష్టాలకు గురై అప్పుల బాధను తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. గుంటూరు జిల్లా దుర్గి మండలంలో రైతు బలుసు అప్పారావు (45), ఆయన భార్య వాణి మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయమే దంపతుల ఆత్మహత్యపై ఆరా తీసి, సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి వెంటనే రూ.7 లక్షల చెక్కును అందించి ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎంవో అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి.. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్‌కు విషయం తెలిపి బాధిత కుటుంబం వద్దకే వెళ్లి చెక్కు అందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయభారతితోపాటు అధికార యంత్రాంగం బుధవారం దుర్గికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న అప్పారావు తల్లి వెంకటరావమ్మ, పిల్లలు హేమంత్ (12), హర్షిత (10)లను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సీఎం ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చెక్కును అందజేశారు. గతంలో పరిహారం రూ.5 లక్షలు మాత్రమే.. గతంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షలను సీఎం సహాయనిధి నుంచి అందించేవారు. మృతుల కుటుంబీకులు పరిహారం కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వచ్చేది. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి పరిహారం వచ్చేందుకు దాదాపు ఏడాది నుంచి రెండేళ్లు పట్టేది. మండల కమిటీ, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కమిటీ, జిల్లా కలెక్టర్.. వ్యవసాయ శాఖ కమిషనర్‌కు నివేదిక పంపడం, మళ్లీ దీన్ని వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపి, అక్కడ నుంచి నగదు వచ్చాక బాధిత కుటుంబానికి చెక్కు ఇచ్చేవారు. అయితే.. సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో రైతుల కష్టాలు స్వయంగా చూశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరల్లేక, నీటి కొరతతో పంటలు పండక, సాగు కోసం చేసిన అప్పులు తడిసిమోపెడై గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాల కన్నీటి గాథలను విన్నారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పరిహారం పెంచి వైఎస్సార్ బీమా అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. ఈ హామీ మేరకే మరణించిన రైతు దంపతుల కుటుంబానికి సంఘటన జరిగిన 24 గంటల్లోనే రూ.7 లక్షలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు రూ.7 లక్షలకు పెంచాం.. సీఎం ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చెక్కు అందించాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. గతంలో రూ.5 లక్షలుగా ఉన్న పరిహారాన్ని సీఎం ఆదేశాల మేరకు రూ.7 లక్షలకు పెంచాం. – శామ్యూల్ ఆనందకుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ -
సాగు సంక్షోభానికి సరైన జవాబు
వ్యవసాయరంగాన్ని సమూలంగా మార్చివేసే దిశగా మన రాజకీయ నాయకత్వం అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలోకి ఏటా రూ. 6 వేలను బదలాయిస్తూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. దేశీయ వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభం దిశగా పయనిస్తోందని గుర్తించినందువల్లనే కేంద్రం పీఎమ్–కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశచరిత్రలో తొలిసారిగా వ్యవసాయరంగంలో ‘ధరల విధానం’ నుంచి ‘ఆదాయ విధానం’ వైపు పయనించడానికి కేంద్రం మొదటి అడుగు వేసిందని ఈ పరిణామం తేల్చి చెబుతోంది. ఇది మన ఆర్థిక చింతనలో సమూలమార్పునకు సంకేతం. దీనికి పోటీగా రాహుల్ గాంధీ సంవత్సరానికి రూ. 72,000లను రైతుల ఖాతాలకు బదలాయిస్తానని హామీ ఇవ్వడం.. రాజకీయ నాయకత్వం ఆలోచనల్లో పెను మార్పునకు సంకేతాలే. సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులోకి రావడానికి కొద్ది రోజుల ముందుగా దేశవ్యాప్తంగా సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సంవత్సరానికి రూ. 6 వేలను ప్రత్యక్షంగా బదలాయిస్తూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎమ్–కిసాన్) పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఇది కనీస మొత్తమే అయినప్పటికీ దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్రస్థాయిలో ఉంటోందో పాలకవర్గాలే గుర్తించి అంగీకరించిన వాస్తవానికి ఇది ప్రతీక అయింది. అయిదేళ్లు పూర్తి అధికారం చలాయించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వాగ్దానం చేసింది కానీ వాస్తవానికి రైతుల ఆదాయం ఇప్పుడు గత 15 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత అధమస్థాయికి దిగజారిపోయింది. ఈ నేపథ్యంలోనే రైతులకు జీవితంపై కాసింత ఆశలు కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నాటకీయ విధానాన్ని ముందుకు తీసుకురావలసి వచ్చింది. 2016 తర్వాత వ్యవసాయరంగ ఆదాయం పెరుగుదల దాదాపుగా జీరో స్థాయిలోనే ఉండిపోయిందని నీతి ఆయోగ్ స్వయంగా అంగీకరించింది. 2011 నుంచి 2016 వరకు ఐదేళ్ల కాలంలో రైతుల నిజమైన ఆదాయం సంవత్సరానికి అర్ధశాతం కంటే తక్కువగానే పెరుగుతూవచ్చిందని (0.44 శాతం) నీతి ఆయోగ్ ప్రకటించింది. వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభం దిశగా పయనిస్తోందని, రైతులకు ప్రత్యక్ష నగదు రూపేణా మద్దతు అవసరమని గుర్తించినందువల్లనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఆకస్మికంగా పీఎమ్–కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధంగా దేశచరిత్రలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ధరల విధానం నుంచి ఆదాయ విధానం వైపు పయనించడానికి మొదటి అడుగు వేసిం దని ఈ పరిణామం తేల్చి చెబుతోంది. నా అభిప్రాయం ప్రకారం, ఇది మన ఆర్థిక చింతనలో సమూల మార్పుకు స్పష్టమైన సంకేతం. పీఎమ్–కిసాన్ పథకంలో భాగంగా ప్రభుత్వం గుర్తించిన మేరకు దేశంలోని సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు తొలివిడతగా 2 వేల రూపాయలను బదలాయించారు. దీనికి తక్షణ ప్రతిస్పందనగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ‘న్యాయ్’ ఆదాయ పథకం అమలు చేస్తామని ప్రతి నెలా దేశంలోని రైతులకు ఒక్కొక్కరికి రూ. 6,000లను నగదురూపేణా బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ దఫా ఎన్నికల్లో తమను గెలిపిస్తే దేశంలోని 20 శాతంమంది అత్యంత నిరుపేదల ఖాతాల్లోకి నెలకు 6 వేల రూపాయలను నేరుగా బదిలీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాగ్దానం చేశారు. అంటే తీవ్ర దారి ద్య్రంలో కొట్టుమిట్టాడుతున్న కోట్లాదిమంది సన్నకారు రైతులను తమ దుస్థితినుంచి బయటపడేయాలంటే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అత్యవసరంగా చేపట్టాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించినట్లయింది. ఈ సందర్భంగా దేశంలోని 17 రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 20,000లకు మించలేదని, నెలవారీగా చూస్తే ఇది రూ. 1,700 కంటే తక్కువేనని 2016 ఆర్థిక సర్వే పేర్కొన్న విషయాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాలి. వ్యవసాయ రంగం ఇప్పటికీ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అత్యంత దిగువస్థాయిలో పడి ఉంటోంది. నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయరంగ ఆదాయాలు ద్రవ్యోల్బణాన్ని సవరించిన తర్వాత చూస్తే దాదాపు స్తబ్దతకు గురై ఉంటున్నాయి. రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా పొందడంలేదు. ప్రభుత్వం ప్రకటించే ధరలకంటే మార్కెట్ ధరలు మరీ తక్కువగా ఉండటం గమనార్హం. 2000–2017 సంవత్సరాల మధ్య ఓఈసీడీ–ఐసీఆర్ఐఈఆర్ సంస్థలు జరిపిన సంయుక్త అధ్యయనం ప్రకారం ధరల పతనం కారణంగా దేశ రైతులు రూ. 45 లక్షల కోట్లను నష్టపోయారని తెలుస్తోంది. దేశంలోని ఏ ఇతర రంగమైనా ఇంత భారీ నష్టానికి గురై ఉంటే కుప్పగూలిపోయేది. గ్రామీణ రంగ దుస్థితి ఎంత పరాకాష్టకు చేరిందంటే రైతుల ఆత్మహత్యలు నిరంతరం కొనసాగుతూ వార్తలకెక్కుతున్నాయి. ఈ వాస్తవాన్ని దేశప్రజలకు తెలుపడానికి కూడా భీతిల్లుతున్న కేంద్రప్రభుత్వం గత రెండేళ్లుగా రైతుల ఆత్మహత్యలకు చెందిన డేటాను కూడా విడుదల చేయకుండా నిలిపి ఉంచడం గర్హనీయం. పుల్వామాలో మన సైనికుల కాన్వాయ్‌పై దాడి తర్వాత మన భుజబలాన్ని ప్రదర్శించే తరహా జాతీయవాదం గురించి రాజకీయ నేతల ఊకదంపుడు ఉపన్యాసాల వెల్లువలో దేశీయ వ్యవసాయరంగ దుస్థితి సమస్య పక్కకు పోయి ఉండవచ్చు కానీ త్వరలో కేంద్రంలో అధికారంలోకి రాబోయే ప్రభుత్వం ఎదుర్కోనున్న అతిపెద్ద సవాలు ఏదంటే కొనసాగుతున్న గ్రామీణ దుస్థితికి చెందిన సంక్లిష్ట సమస్యను పరిష్కరించడమే. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా రైతుల నిరసన ప్రదర్శనలు పెరుగుతుండటం చూస్తున్నప్పుడు, నూతన ప్రధానమంత్రికి వ్యవసాయ సమస్యను ఇక వాయిదా వేయడం ఆసాధ్యమే అనిపిస్తోంది. ప్రత్యక్ష నగదు బదలాయింపుతోపాటు వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయటానికి అనేక స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను నూతన ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. నా అభిప్రాయం ప్రకారం కొత్త ప్రధాని దృష్టి పెట్టవలసిన, చేపట్టాల్సిన దశలు ఇవి. 1. రైతుల ఆదాయం, సంక్షేమంపై కమిషన్: ఈ కమిషన్ వ్యవసాయ ధరలపై కృషి చేయాలి. వ్యవసాయరంగానికి ఆదాయం కల్పించే ప్యాకేజీకి హామీ ఇవ్వాలి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ను తనలో కలిపేసుకుని, రైతు కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000 ఆదా యం వచ్చే ప్యాకేజీని అమలుపర్చాలి. జిల్లాలో రైతుకుటుంబం నెలకు సంపాదించే సగటు ఆదాయానికి ఈ ఆదాయ ప్యాకేజీ అదనపు సహాయంగా జతకూర్చాలి. దీనికి సంబంధించిన డేటా సిద్ధంగా ఉంది కాబట్టి జిల్లాలో సగటు వ్యవసాయదారుడి ఆదాయాన్ని నిర్ణయించడం పెద్ద కష్టమేమీ కాదు. 2. రైతు రుణాల మాఫీ: రైతురుణాలను ఒకే దఫాలో మాఫీ చేయడాన్ని తక్షణ ప్రాతిపదికగా అమలు చేయాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు 2017 నుంచి 1.9 లక్షల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసేశాయి. వ్యవసాయరంగంలో రైతులు చెల్లించలేకపోతున్న మొండి రుణాలు దాదాపు రూ. 3.5 లక్షల కోట్లమేరకు ఉంటాయని అంచనా. ఈ మొత్తాన్ని రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. తమపై పేరుకుపోయిన గత రుణాల భారంనుంచి విముక్తి కానిదే రైతులు కొత్తగా ఉత్పాతక సామర్థ్యంతో ఉంటారని భావించకూడదు. ఈ కష్టకాలంలో రైతుల పక్షాన జాతి మొత్తం నిలబడాల్సిన అవసరం తప్పనిసరి. రైతు రుణ మాఫీ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక భారంగా పరిగణించరాదు. పైగా, కార్పొరేట్ రంగంపై ఉన్న రుణాలను మాఫీ చేస్తున్న విధానాన్ని బ్యాంకింగ్ రంగం రైతు రుణాల పట్ల కూడా అమలు చేయాల్సి ఉంది. కేంద్రప్రభుత్వం తనవంతుగా కార్పొరేట్ రంగ మొండిబకాయిల విషయంలో చేస్తున్నట్లుగానే రైతు రుణమాపీకి కూడా వీలిచ్చేలా బ్యాంకింగ్ రంగాన్ని ఆదేశించాలి. 3. ప్రభుత్వ రంగ పెట్టుబడులు: భారతీయ రిజర్వ్ బ్యాంకు డేటా ప్రకారం 2011–12, 2016–17 మధ్య వ్యవసాయరంగంపై ప్రభుత్వరంగం పెట్టిన మదుపు మొత్తం స్థూల దేశీయోత్పత్తి –జీడీపీ–లో 0.3 నుంచి 0.4 శాతం మాత్రమే ఉంటున్నట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా వ్యవసాయరంగంపై ప్రైవేట్ రంగం మదుపు కూడా తక్కువగానే ఉంది. జనాభాలో దాదాపు 50 శాతం ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయరంగంలో మునిగి తేలుతున్నందున, ప్రభుత్వ రంగ మదుపుల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంపై తక్షణం దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దేశీయ వ్యవసాయ రంగం తగిన మదుపులను అందుకోకపోతే, వ్యవసాయం లాభదాయకమైన పరిశ్రమ అవుతుందని భావించడం అత్యాశే అవుతుంది. 4. సులభతర వ్యవసాయ పద్ధతులు: ప్రతి దశలోనూ రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకుల కారణంగానే భారతీయ వ్యవసాయరంగం కునారిల్లిపోతోంది. పాలనా లేమి కారణంగా వ్యవసాయం బాధితురాలుగా మిగిలిపోతోంది. పరిశ్రమల రంగంలో సులభతర వాణిజ్యం కోసం దాదాపు 7,000 రకాల చర్యలను చేపడుతుండటం సాధ్యపడుతున్నప్పుడు, వ్యవసాయ రంగ కార్యకలాపాలకు ఇదేవిధమైన ప్రాధాన్యతను ఇవ్వకపోవడానికి తగిన కారణమేదీ నాకు కనిపించడం లేదు. జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో ప్రతిదశలోనూ వ్యవసాయరంగ పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని సుసాధ్యం చేయవచ్చు. ఇది వ్యవసాయాన్ని రైతు అనుకూలమైనదిగా మార్చడంలో ప్రారంభ చర్యలకు తావిస్తుంది. 5. ధరలు, మార్కెటింగ్ సంస్కరణలు: మార్కెట్ సంస్కరణలను తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏపీఎమ్‌సీ మండీల క్రమబద్ధీకరణ మార్కెట్ల నెట్వర్క్ని విస్తరించడం ద్వారా దీన్ని మొదలెట్టవచ్చు. ప్రతి అయిదు కిలోమీటర్ల పరిధిలో ఒకటి చొప్పున దేశంలో కనీసం 42,000 మండీలను ఏర్పర్చవలసి ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,600 వ్యవసాయ రంగ మండీలు మాత్రమే ఉంటున్నాయి. వ్యవసాయ మార్కెట్లలో రాజ్యమేలుతున్న సిండికేట్లను కుప్పగూల్చడం ద్వారా వ్యవసాయ మండీల ఏర్పాటులో సంస్కరణలను తప్పక చేపట్టాలి. అదే సమయంలో రైతులు పండించే ప్రతి పంటకూ కనీస మద్దతు ధరకు వీలు కల్పించే దిశలోనే ఎపీఎమ్సీ మండీల్లో సంస్కరణలు సాగాలి. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com దేవిందర్ శర్మ -
కరువు ఉరిమింది.. బతుకు బరువైంది
వరుస కరువులతో రైతన్న వలవల ఏడ్చేను.. తోటలు ఎండుతుంటే రైతు గుండె చెరువాయే.. ఏడ్చనీకి కన్నీళ్లు రాక.. గుండె తడారిపాయే..! భూమి తవ్వినా బూడిదే మిగిలే.. భూమినే నమ్ముకున్న బతుకు బుగ్గిపాలాయే.. కన్నీళ్లింకే.. కాళ్లల్లో సత్తువ తగ్గే.. కూడు పెట్టే మనిషి కాటికి పయనమాయే..!! సాక్షి, పెద్దారవీడు (ప్రకాశం): తీవ్ర వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్షాలు లేక వివిధ పంటలు సాగు చేసిన రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. దీంతో చేసిన అప్పులు తీరేమార్గం కనిపించక రైతులు ఇతర ప్రాంతాలకు వలస బాటపడుతున్నారు. పశుగ్రాసం కొరతతో పాడి రైతులు పశుసంపదను కబేళాలకు తరలిస్తున్నారు. వరుస కరువులతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పత్తి, మిరప కంది, జోన్న, కూరగాయల తోటలు నిట్ట నిలువునా కళ్ల ఎదుటే ఎండిపోతున్నాయి. దీంతో కంటికి రెప్పలా కన్న బిడ్డల కంటే ఎంతో మక్కువతో పెంచుకున్న తోటలు ఎండిపోతుంటే రైతుల గుండె చెరువై పోతోంది. ఈ ఏడాది రబీ, ఖరీఫ్‌లో పత్తి, మిరప, కంది, తదితర పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయి. దీంతో కోట్ల రూపాయల మేర రైతులకు నష్టం వాటిల్లింది. వందల అడుగుల లోతు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతుల వ్యథలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. నీరు లేక విలవిల నియోజకవర్గంలో చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేక ఎడారులను తలపిస్తున్నాయి. ఏటా వర్షపాతం నమోదులో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా సాగు, తాగు నీటికి ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మండలంలో ఇరిగేషన్‌కు సంబంధించిన చెరువులు 10 ఉన్నాయి. ఒక్క చెరువులోనూ చుక్క నీరు లేదు. వర్షాభావం కారణంగా చెరువులు, కుంటలు నీళ్లు లేక బావురుమంటున్నాయి. చెరువుల్లో నీళ్లు ఉంటే సమీపంలోని బోరు బావుల్లో కూడా నీళ్లు పుష్కలంగా ఉంటాయని రైతులు అంటున్నారు. వేసవిలో పంటల సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలు బీటలు వారుతున్నాయి. ట్రాక్టర్ గడ్డి రూ. 15 వేలు కరువు కారణంగా పచ్చిగడ్డి కరువైంది. దీనికితోడు పంటలు లేకపోవడంతో పాడి రైతులకు పశుపోషణ భారంగా మారింది. దీంతో మండలంలోని పాడి రైతులు ట్రాక్టర్ గడ్డికి రూ. 12 నుంచి రూ. 15 వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక గ్రామీణ పాడి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. గ్రాసం లేక పోషణ భారమై నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు పాడి రైతులకు శాపంగా మారింది. పచ్చిగడ్డి కూడా కరువైంది. గ్రాసం కొరతతో పాడి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పశు పోషణ భారమై దిక్కు తోచడంలేదు. కరువు నేపథ్యంలో జీవాల పోషణ భారమై మేకలు, గొర్రెల పెంపకందారులు తమ జీవాలను గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లె లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. కష్టాల నుంచి గట్టెక్కవచ్చు వర్షాలు కురుస్తాయో లేదోనని ఆలోచించి పంటలు పంటలు సాగు చేయాలి. రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయిస్తే కరువు కాలం కష్టాల నుంచి గట్టెక్కవచ్చును. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్సాలు లేకపోవడంతో బోరు 600 అడుగులు వేస్తేగానీ నీరు పడటంలేదు. దీంతో రైతులు సాహసం చేయలేక వెనుకడుగు వేస్తున్నారు. జగన్ ఇచ్చిన ప్రకారం ఉచితంగా వ్యవసాయ బోర్లు వేస్తే ధైర్యంగా వ్యవసాయం చేయవచ్చు. జగన్ హామీలు అమలైతే మళ్లీ రైతు రాజ్యం వస్తుంది. – ఏర్వ వెంకటనారాయణరెడ్డి, చట్లమిట్ల ప్రభుత్వం రైతులను ఆదుకుంటేనే భవిష్యత్తు ఏ ప్రభుత్వమైనా రైతులను అన్ని విధాల అదుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులంతా ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ఇక రైతులను ఎవరు బాగుపర్చుతారు. రైతుకు ఏం అవసరమో తెలుసుకుని వారి జీవితాలకు భరోసా ఇచ్చిన వైఎస్సార్‌కు సాటిలేరు. చంద్రబాబు పాలనలో అవినీతి ఏరులై పారుతోంది తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. – బూస పెరయ్య, చాట్లమడ అగ్రహారం పెట్టబడికి ఇబ్బంది ఉండదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతు రాజ్యం నడిచింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తి జగన్మోణ్రెడ్డి మాత్రమే. జగన్మోహన్రెడ్డి రైతు భరోసా కింద రైతులకు ఉచిత బొర్లతో పాటు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ 12,500 ఇస్తామంటున్నారు. పెట్టుబడి కోసం రైతులు బ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. –బొచ్చు ఆంజనేయరెడ్డి, సానికవరం -
ఫడ్నవిస్‌కు కఠిన పరీక్షే!
బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ ప్రకటించింది కానీ, ఇవేవీ రైతుల బలవన్మరణాలను అరికట్టలేకపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 2015లో 6,268 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా.. 2018 నాటికి ఈ సంఖ్య 11,995కు చేరుకుంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 350 మందికిపైగా రైతులు ప్రాణాలు తీసుకున్నారంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమవుతుంది. వ్యవసాయ సంక్షోభం.. రైతు ఆత్మహత్యలు.. పెరిగిపోతున్న నిరుద్యోగం! ఏప్రిల్ 11న తొలి దశ పోలింగ్ జరగనున్న మహారాష్ట్రలో ఓటర్లను ప్రభావితం చేయగల అంశాలు! ఉత్తరప్రదేశ్ తరువాత అత్యధిక లోక్‌సభ స్థానాలు (48) ఉన్న మహారాష్ట్రలో సగభాగం కరవుతో అల్లాడుతుండగా.. విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. ఫలితంగా ఈ ప్రాంతంలో పలువురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకవైపు కరవు వెంటాడుతుండగా.. ఇంకోవైపు తగినన్ని తాగునీళ్లు కూడా అందకపోవడం.. వ్యవసాయ రుణాలకూ బ్యాంకులు నిరాసక్తత చూపడం రైతులకు గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా మారింది. బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ ప్రకటించింది కానీ, ఇవేవీ రైతుల బలవన్మరణాలను అరికట్టలేకపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 2015లో 6,268 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా.. 2018 నాటికి ఈ సంఖ్య 11,995కు చేరుకుంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 350 మందికిపైగా రైతులు ప్రాణాలు తీసుకున్నారంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమవుతుంది. గతంలో యావత్మల్ ప్రాంతం రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉంటే.. ఇప్పుడు అది పొరుగున ఉన్న అకోలాకు మారిపోయిందని, ఈ ఏడాది ఇప్పటివరకు అక్కడ 102 మంది మరణించారని వసంత్‌రావ్ నాయక్ షేటీ స్వావలంబన్ మిషన్ చైర్మన్ కిషోర్ తివారీ అంటున్నారు. విదర్భలో ఏడింటిపై ప్రభావం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఉండే ఏడు లోక్‌సభ స్థానాల్లో వ్యవసాయ సంక్షోభం అనేది అధికార బీజేపీ– సేన కూటమిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. మరాఠ్వాడ ప్రాంతంలోని మొత్తం ఎనిమిది స్థానాల్లోనూ కూటమికి నష్టం జరగనుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెద్దనోట్ల రద్దు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికార పక్షంపై అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లో కేవలం 4,400 దిగువస్థాయి ఉద్యోగాల భర్తీకి ఏకంగా ఎనిమిది లక్షల దరఖాస్తులు అందడం గ్రామీణ నిరుద్యోగం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అలాగే, గత డిసెంబరులో 1,218 ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకు 4.3 లక్షల దరఖాస్తులు అందాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక ప్రీ పోల్ సర్వేలోనూ ఉద్యోగాలు తమ తొలి ప్రాధాన్యమని ప్రజలు స్పష్టం చేశారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 42 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఓటు వేసేందుకు తమను ప్రభావితం చేసే రెండో అంశం తాగునీటి లభ్యత అనీ, వ్యవసాయ రుణాలు అందుబాటులో ఉండటం మూడో ప్రాధాన్యమని వీరు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రుణ లభ్యత 51 శాతం మందిని ఇబ్బంది పెడుతుండగా సాగునీరు 49 శాతం మందికి సమస్యగా ఉంది. వ్యవసాయోత్పత్తులకు ఎక్కువ ధరలు.. 46 శాతం మంది ఓటు ఎవరికి వేయాలో నిర్ణయిస్తోంది. ఈ గణాంకాలన్నీ గ్రామీణ మహారాష్ట్రవైతే.. నగర ప్రాంతాల పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ఉద్యోగాలు 48 శాతం మందికి, తాగునీరు 43 శాతం మందికి ప్రధాన సమస్యలు కాగా.. ట్రాఫిక్ ఇబ్బందులు 35 శాతం మంది ఓటర్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ అంశాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి కూడా ఎక్కువే ఉంది. ఏతావాతా... మహారాష్ట్రలో అధికార బీజేపీ – శివసేన కూటమి ఈ ఎన్నికల్లో కఠిన పరిస్థితులను ఎదుర్కోనుంది. ఈ కారణంగానే ప్రధాని మోదీ తరచూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌పై విమర్శలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వార్ధా, గోండియాల్లో జరిగిన మోదీ సభల్లో ప్రభుత్వ విజయాలను కాకుండా రాహుల్, పవార్‌పై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఇక్కడ గమనార్హం. ఏప్రిల్ ఒకటిన వార్ధా సమీపంలో జరిగిన సభలో ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాన్ని సృష్టించినందుకు గాను ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారన్న మోదీ వ్యాఖ్య ఈ అంశాన్ని ధ్రువీకరిస్తోంది. గోండియా సభలో పవార్‌పై విరుచుకుపడుతూ ఎన్సీపీ అగ్రనేతలకు కునుకు పట్టడం లేదని, తీహార్ జైల్లో ఉన్న వ్యక్తి తమ రహస్యాలను బయట పెట్టేస్తారన్న భయం వారిని వెన్నాడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను మోసంగా అభివర్ణించిన మోదీ.. దేశద్రోహం చట్టాలను తొలగిస్తామని ప్రకటించడం పాకిస్తానీ కుట్రలో భాగమని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ప్రచారంలో భాగంగా నాగ్‌పూర్‌లో న్యాయ్ పథకం గురించి.. ఉద్యోగ కల్పన గురించి మాట్లాడటం గమనార్హం. రుణమాఫీతీరుపై ఆగ్రహం.. మహారాష్ట్రలో బీజేపీని వ్యతిరేకించేందుకు ఉన్న మరో బలీయమైన కారణం రైతు రుణమాఫీ అరకొర అమలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కృషి సమ్మాన్ యోజన పేరుతో మొత్తం రూ.34,022 కోట్ల మేర రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం 2017, జూన్ 4న ప్రకటించింది. పథకం మొత్తం 89 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుందని అంచనా వేశారు. ఇందులో కనీసం 40 లక్షల మంది రుణం పూర్తిగా మాఫీ అయిపోతుందని లెక్కకట్టారు. ఇదే జరిగి ఉంటే.. వారందరూ తాజాగా వ్యవసాయ రుణాలు తీసుకునే వీలేర్పడేది. కాకపోతే ఈ పథకం అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. ఎవరెవరికి రుణాలు మాఫీ అయ్యాయన్న అంశంపై అధికారిక సమాచారమేదీ లేదు. కాకపోతే అరకొరగా కొంతమందికి రుణాలు మాఫీ అయ్యాయని.. దాదాపు 18 శాతం మంది రైతులు మాత్రమే మళ్లీ రుణాలు పొందగలిగారని కిషోర్ తివారీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపితో పొత్తు పెట్టుకునేందుకు కొన్ని వారాల ముందు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే కూడా రుణమాఫీ అంశంపై ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ అమలు చేశామని దేవేంద్ర ఫడ్నవిస్ చెబుతున్నారని, కానీ వాస్తవానికి ఒరిగిందేమీ లేదని...లబ్ధి పొందిన ఒక్క రైతును కూడా చూపించలేదని ఆయన విమర్శించారు. రైతులకు కనీస పరిహారం కూడా దక్కకపోగా, బీమా పేరుతో కొన్ని వందల రూపాయలు మాత్రం విదిల్చారన్న విమర్శలు ఉన్నాయి. డేట్లైన్ ముంబై టి.ఎన్.రఘునాథ (రచయిత, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు. మహారాష్ట్ర రాజకీయాలను మూడు దశాబ్దాలుగా పరిశీలిస్తున్నారు. ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘ద పయనీర్’, ‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’, ‘ద బ్లిట్జ్’, ‘న్యూస్‌టైమ్’ దినపత్రికల్లో పనిచేశారు) -
ఐదేళ్లలో 2,635మంది రైతుల ఆత్మహత్య..
తుపాకీ పట్టి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే నిరశన కాదు. ఆత్మహత్య కూడా ఓ విధమైన నిరశనే. దేశానికింత తిండి పెట్టే ‘సాగు యుద్ధం’లో అన్నదాతలు కన్నుమూస్తున్నారు.సాగు సంక్షోభంతో అల్లాడుతూ రైతులు పిట్లల్లా రాలిపోతున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధికవృద్ధిరేటును చూపిస్తూ తిమ్మిని బమ్మి చేసి చూపించాలనుకుంటున్నాడు. రాష్ట్రంలో ఇప్పటికీ 67 శాతం మందికి వ్యవసాయమే ఆధారమైనా.. భూమి నుంచి రైతును దూరం చేస్తున్నాడు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు, ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టారు. పంట భూముల్ని విదేశీ సంస్థలకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో పూటకో రైతుఆత్మహత్య చేసుకుంటుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏమీ ఎరగనట్టు, చావులే లేనట్టు నటిస్తోంది. అన్నా హజారే వారసుడిగా, బాబా రాందేవ్ భక్తుడిగా, స్వామినాథన్ అనుచరుడిగా చెప్పుకునే చంద్రబాబు.. వాళ్లు అడిగీ అడక్క మునుపే వాళ్ల దీక్షలకు మద్దతు తెలిపిన ‘బిగ్ బాస్’ రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2,635 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే, కేవలం 169 మందికి మాత్రమే సాయం అందించడం దేనికి సంకేతం? సమస్యను, సంక్షోభాన్ని గుర్తించడానికిబదులు దాటవేయాలని చూడడం గమనార్హం.– ఆకుల అమరయ్య సాక్షి, అమరావతి ఆత్మహత్యలకుకారణాలు.. సాగు భూమి తరిగింది. పంటలు విఫలమయ్యాయి. నీటిపారుదల సౌకర్యం కొరవడింది. నకిలీ,కల్తీ విత్తనాలు, అరకొర పరపతిసౌకర్యం, కరవు కాటకాలు, రుణభారం, పెరిగిన ఎరువుల ధరలు, మార్కెట్ సౌకర్య లేమి, గిట్టుబాటు ధరలులేకపోవడం, కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లాభాల మాట అటుంచి ఉత్పత్తి ధర కూడా లేకుండా పోయింది. పంటల బీమా రైతులకు కాకుండా బీమా కంపెనీలకు, రుణాలుఇచ్చే బ్యాంకులకు ఇన్సూరెన్స్‌గా మారింది. కనీసం 5 శాతం మంది రైతులు కూడా దీన్నిఉపయోగించుకోవడం లేదు. పంట చేతికి రాకముందు ఉండే గిట్టుబాటు ధర ఆ తర్వాత ఉండదు. కనీస మద్దతు ధరతో నిమిత్తం లేకుండా దళారులే ఒక ధరను నిర్ణయించి రైతు నెత్తిన రుద్దుతారు. ఉదాహరణకు వరి ధాన్యం కొనుగోలే ఇందుకు సాక్ష్యం. క్వింటాల్ ధర రూ.1,750 ఉంటే దళారులు మాత్రం రూ.1,200 నుంచి రూ.1,300 వరకే ఖరారు చేసి కళ్లాల వద్దే కొనుగోలు చేస్తామంటారు. వంద కిలోలకు బదులు 110 కిలోలు తీసుకుంటారు. మరోపక్క స్వామినాథన్ కమిషన్ సిఫార్సులుఅటకెక్కాయి. భూ సంస్కరణలు మూలనపడ్డాయి. ఏటికేడూ పెరుగుతున్న ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా ప్రతినిత్యం 35 మంది, రాష్ట్రంలో సగటున ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం వ్యవసాయ సంక్షోభానికి సంబంధించి చంద్రబాబు హయాంలో 123 ఆందోళనలు జరిగాయి. గత ఐదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతగా చితికిపోయిందో అందరికీ తెలిసిందే. నిజానికి ప్రతి దినం సగటున రెండు వేల మంది కాడీ మేడీ వదిలిపెట్టి ప్రత్యామ్నాయ అవకాశాలను వెతుక్కుంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. గిట్టుబాటు ధర ఎండమావై, అప్పుల ఊబిలోంచి బయటకు రాలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నేలతల్లి ముద్దుబిడ్డల బలవన్మరణాల ఘోర విషాదం అంతులేని కథలా కొనసాగుతుంటే రాష్ట్రంలో ఆత్మహత్యలే జరగలేదన్నట్టు ముఖ్యమంత్రి చెప్పడం అసమంజసం.. అసత్యం. గత నాలుగేళ్లలో 2,635 మంది ఆత్మహత్యలకు పాల్పడితే చంద్రబాబు మాత్రం అవేమీ జరగనట్టు చెబుతూనే ఏడాదికి సగటున 79 మంది మాత్రమే బలవన్మరణాలకు పాల్పడుతున్నారని సన్నాయినొక్కులు నొక్కారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ జూన్ ఒకటి నుంచి డిసెంబర్ వరకు దాదాపు 163 మంది ఆత్మహత్యలకు పాల్పడిన మాట నిజం. ఈ ఐదేళ్లలో వ్యవసాయ సంక్షోభం పరిష్కారం దిశగా చంద్రబాబు ఏ చర్యా చేపట్టలేదు. అన్నదాతల ఆత్మహత్యలను వ్యక్తిగత వ్యవహారంగా కొట్టిపారేయడం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన 2014లో 164 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 2015లో ఆ సంఖ్య 516కి చేరింది. ఇలా ఏటేటా పెరుగుతూ పోయిందే తప్ప తరగలేదు. కాకుల్ని కొట్టి గద్దలకువేయడం బాబుకు అలవాటే.. కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందాన వ్యవసాయ సబ్సిడీలకు ఎగనామం పెట్టి ప్రకృతి సేద్యం, సేంద్రియ వ్యవసాయం మాటున వ్యాపారం చేస్తున్న ప్రభుత్వేతర సంస్థలకు కోట్లకు కోట్లు బాబు దోచిపెట్టిన తీరు రైతు వ్యతిరేకతకు నిదర్శనం. వ్యవసాయం లాభసాటి కాదంటూ దేశానికే వెన్నెముక అయిన రైతు వెన్ను విరుస్తున్నారు. తిరిగి అదే వ్యక్తి వ్యవసాయం మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు. సగటున 11 శాతం అభివృద్ధి అని చెబుతారు. ఈ వార్త రాస్తున్న సమయానికి అనంతపురం జిల్లా నార్పల మండలం జంగమరెడ్డిపల్లిలో రైతు వై.శివారెడ్డి రెండు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగేళ్లుగా పంటలు పండక పోవడం, అప్పులు పెరిగిపోవడం, ప్రైవేటు వ్యాపారుల ఒత్తిడి పెరగడం, దిక్కుతోచని పరిస్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నూటికి 99 శాతం మంది రైతులు ఇవే కారణాలతో చనిపోతున్నా.. చంద్రబాబు మాత్రం ఉలకడూ పలకడు. కనీసం ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు కూడా ఇష్టపడడు. బలవన్మరణాలకు పాల్పడిన కుటుంబాలను ఈ దేశ ప్రధానులు సందర్శించిన సంఘటనలను.. రాజకీయాలలో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గుర్తుకు తెచ్చుకోవాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ప్రధాని మన్మోహన్ కర్నూలు జిల్లా సోమయాజులపల్లిలో రెండు కుటుంబాలను సందర్శించి ఆర్థికసాయాన్ని ప్రకటించిన విషయాన్ని.. ఇప్పటి తన మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతల్ని అడిగైనా తెలుసుకోవాలి. చనిపోయిన కుటుంబాల పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ప్రముఖ వ్యవసాయ జర్నలిస్టు పాలగుమ్మి సాయినా«థ్ మొదలు సామాజిక విశ్లేషకుడు డాక్టర్ కె.నాగేశ్వర్ వరకు ఎందరెందరో తూర్పారబడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బాబు అబద్దాలు.. ‘నేను రైతు బిడ్డను. రైతుకు శాశ్వతంగా పెద్దన్నగా ఉండిపోవాలనుకుంటున్నా’ అని చంద్రబాబు ఇటీవలి ఎన్నికల్లో పదే పదే చెబుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో రైతుల పాలిట పెద్ద విరోధిగా మారారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రుణమాఫీ ఇంతవరకు పూర్తి కాలేదు. దురదృష్టవశాత్తు మరణించే రైతులకు రూ.5 లక్షల పరిహారం ఇస్తానంటూ ఘనంగా ప్రకటించుకున్న చంద్రన్న రైతు బీమా ఆచూకీ లేకుండా పోయింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జయతి ఘోష్ కమిటీ సిఫార్సుల మేరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.లక్షన్నరకు పెంచి ఎంతో పకడ్బందీగా అమలు చేశారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మొత్తాన్ని పెంచడానికి సైతం ఇష్టపడలేదు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీలో పదేపదే డిమాండ్ చేయడంతో రైతు ఆత్మహత్యలపై తప్పనిసరి పరిస్థితుల్లో పరిహారాన్ని పెంచుతున్నట్టు ప్రకటించి రకరకాల ఆంక్షలు విధించారు. చావును పరిగణనలోకి తీసుకోవడానికి బదులు వయస్సు తారతమ్యాలు పెట్టారు. ఇలా చెప్పి మూడేళ్లు గడిచినా పట్టుమని 200 మందికి కూడా సాయం అందలేదు. మానవ హక్కులఫోరం నివేదిక ప్రకారం.. ‘చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2017 జనవరి వరకు 960 మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లో చనిపోయారు. దురదృష్టం ఏమిటంటే కేవలం 96 మంది రైతు కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం అందింది. నిజానికిలా చేయడం రైతుల్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన జీవో–62ను తుంగలో తొక్కడమే. ఇంకా విచారకరమేమిటంటే.. ప్రకాశం జిల్లాలో 78 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే ఆరుగురికి మాత్రమే సాయం ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.చంద్రబాబు చెప్పినట్టు వ్యవసాయ రంగమే అంత బాగుంటే ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? రెయిన్ గన్లు పేలిందెక్కడ? రెయిన్ గన్ను తానే కనిపెట్టినట్టు చెబుతున్న చంద్రబాబు వర్షాభావంతో ఎండిన పంటను కాపాడే పేరుతో రూ. 164 కోట్లతో 13,334 జల ఫిరంగులు, నిర్వహణ, మరమ్మతుల పేరుతో మరో రూ. 103 కోట్లు, మొత్తం రూ.2 67 కోట్లు ఖర్చు చేసి తుస్సుమనిపించిన మాట నిజం కాగా సుమారు 3 లక్షల హెక్టార్లలో పంటల్ని కాపాడినట్టు సీఎం చెప్పుకున్నారు. చిత్రమేమిటంటే ముఖ్యమంత్రి స్వయంగా అనంతపురం జిల్లా వెళ్లి రెయిన్‌గన్‌ను ప్రారంభించిన రెండెకరాల పంట కూడా ఎండిపోయింది. చివరకు ఆ పొలం యజమాని ఇవాళ బెంగళూరులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మాట వాస్తవమైతే 2016–17లోనే 2.54 లక్షల హెక్టార్ల పంటను కాపాడినట్టు చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరం. రెయిన్ గన్ ఓ అట్టర్‌ఫ్లాప్ షో అని, దీనివల్ల ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరడం మినహా రైతులకు ఒరిగేందేమీ లేదని ప్రతిపక్షాలు ఆ వేళే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. చంద్రబాబు పెట్టిన రైతురథం జన్మభూమి కమిటీ సభ్యులు, పచ్చచొక్కాల పాలైంది. రైతు బీమా ఆవిరైంది. పగటి పూట ఇస్తామన్న 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సర్కారు వారి ఇష్టానుసారమైంది. ఇదీ జగన్ భరోసా ♦ ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం. పంట వేసే సమయానికి మే నెలలో రూ.12,500 చొప్పున నాలుగేళ్లపాటు రెండో సంవత్సరం నుంచి ఇస్తాం ♦ పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పనిలేకుండా బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే చెల్లిస్తాం. రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలు ఇస్తాం n రైతులకు ఉచితంగా బోర్లు ఇస్తాం. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్. ఆక్వా రైతులకు కరెంటు చార్జీలు యూనిట్‌కు రూ.1.50కే ఇస్తాం ♦ రూ.3 వేల కోట్లకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. రూ.4 వేల కోట్లతో ప్రకృత్తి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు. ప్రతి మండలంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు ఏర్పాటు ♦ మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డెయిరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 బోనస్. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేస్తాం ♦ ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.7 లక్షలు ఇస్తాం. గొర్రెల కాపరులకు చనిపోయిన ప్రతి గొర్రెకు రూ.6 వేలు బీమా అందిస్తాం -
సాయం కరువై మరణశాసమై..
ఐదేళ్లుగా కరువు గుప్పిట్లో ‘అనంత’ అక్షర క్రమంలో ముందున్న అనంతపురం జిల్లా.. రైతు ఆత్మహత్యల విషయంలో కూడా మొదటి స్థానంలోనే ఉంటోంది. జిల్లా వార్షిక వర్షపాతం కేవలం 552 మి.మీ. అందులో కీలకమైన ఖరీఫ్‌కు సంబంధించి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతీ రుతుపవనాల వల్ల కురిసే 338.4 మి.మీ వర్షంపైనే వ్యవసాయం ఆధారపడివుంది. ఏటా ఖరీఫ్‌లో వేరుశనగ, ఇతర పంటలు 20 లక్షల ఎకరాలకు పైగా సాగవుతాయి. ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 155.5 మి.మీ వర్షంపై రబీ పంటలు ఆధారపడి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్, రబీ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో రూ.2 వేల కోట్ల వరకు పెట్టుబడులు నేలపాలయ్యాయి. రూ.4 వేల కోట్ల వరకు పంట దిగుబడులు గాలిలో కలిసిపోయాయి. అలాగే రబీలో కూడా రూ.800 కోట్ల పెట్టుబడులు, రూ.1,500 కోట్ల పంట దిగుబడులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఏటా పంటలకు రైతులు రమారమి రూ.2,500 కోట్ల వరకు పెట్టుబడుల పెడుతున్నా వర్షాలు గతితప్పడంతో అందులో సగం కూడా వెనక్కిరావడం లేదు. కనీసం పశుగ్రాసం కూడా దక్కక ప్రధాన ప్రత్యామ్నాయమైన పాడి, పశుసంపద మనుగడ ప్రశ్నార్థకమైంది. ఉపాధి పనులే దిక్కు యాడికి మండలం చిక్కేపల్లికి చెందిన రైతు జయరామిరెడ్డికి భార్య చంద్రకళ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తమకున్న నాలుగు ఎకరాల పొలంలో వర్షాధారం కింద జొన్న పంటను సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగు భారమైంది. యాడికిలోని బ్యాంక్‌లో రూ. 1.50 లక్షల వరకు పంట రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు రుణమాఫీ వర్తించలేదు. మరోసారి పంట పెట్టుబడులకు బ్యాంక్ వాళ్లు రుణం మంజూరు చేయలేదు. దీంతో పంటల సాగుకు పెట్టుబడులతో పాటు 2017 అక్టోబర్ 24న పెద్దకూతురుకు పెళ్లికి ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 3 లక్షల వరకు అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పటికే అప్పుల వారి నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఉండేవి. అప్పులు తీర్చే మార్గం కానరాలేదు. దీంతో కుమార్తె పెళ్లి చేసిన మరుసటి రోజు అంటే అదే నెల 26న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయమూ అందలేదు. బ్యాంక్‌లో ఉన్న అప్పు మొత్తం వడ్డీతో సహా కడితే తప్ప పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వం అంటూ బ్యాంక్ అధికారులు తేల్చిచెప్పడంతో చంద్రకళకు దిక్కుతోచడం లేదు. పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. చివరకు కుటుంబ పోషణ కోసం ఉపాధి పనులకు వెళుతూ.. చిన్న కుమార్తెను నిట్టూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటోంది. ఉపాధి పనులతో పొట్టపోసుకుంటున్న చంద్రకళ ఆత్మహత్యల గుర్తింపులో అన్యాయం ఈ ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా ఏకంగా 262 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 421 జీఓ ప్రకారం అప్పులబాధ తాళలేక కుటుంబంలో జరిగిన ఎలాంటి ఆత్మహత్యనైనా రైతు ఆత్మహత్యగా గుర్తించాలి. అయితే ప్రభుత్వం మాత్రం ఆత్మహత్యల గుర్తింపు, పరిహారం మంజూరులో అడుగడుగునా దగా చేస్తూ వచ్చింది. 262 మంది ఆత్మహత్యలకు గానూ ప్రభుత్వం గుర్తించింది కేవలం 38 మాత్రమే. ‘అనంత’లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు గుర్తించాలని, పరిహారం అందించాలని అసెంబ్లీలో విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారు. అయితే ఇందులో రూ. 1.50 లక్షల వరకూ బాధిత రైతు కుటుంబానికి ఏ మేరకు అప్పలు ఉన్నాయో అంత చెల్లిస్తున్నారు. తక్కిన రూ. 3.50 లక్షలను ఏడాదికి రూ.50 వేల చొప్పున పంటసాగు కోసం ఇస్తామని ప్రకటించారు. ఇలా పరిహారం మంజూరులో కూడా అడ్డగోలు షరతులు పెట్టడంతో బాధిత రైతు కుటుంబాలు కోలుకోలేకపోతున్నాయి. ఆదుకోని రుణమాఫీ, బీమా, రాయితీలు ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేసిన రైతు రుణమాఫీ అస్తవ్యస్తంగా ఉండటంతో రైతులు కోలుకోలేకపోయారు. ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. హామీ ఇచ్చిన సమయానికి జిల్లా వ్యాప్తంగా రూ.6,817 కోట్ల రుణాలు ఉండగా అందులో చంద్రబాబు సర్కారు రూ.2,744 కోట్ల మాఫీకి పచ్చజెండా ఊపింది. అందులోనూ నాలుగు, ఐదు విడతల కింద రూ.1,132 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. రుణమాఫీ అర్జీలు ఇవ్వడానికే నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్న రైతులు వేలల్లో ఉన్నారు. ఇటీవల అమలు చేసిన సుఖీభవ కింద ఇచ్చిన రూ.వెయ్యి చిల్లర ఖర్చులకు కూడా సరిపోలేదు. ఆదుకుంటుందనుకున్న వాతావరణ బీమా, ఫసల్‌బీమా లాంటి పథకాలు ధీమా ఇవ్వలేకపోయాయి. వాటి కోసం కట్టిన ప్రీమియం మొత్తం కూడా వెనక్కిరాలేదు. 2014లో రైతులకు దక్కాల్సిన రూ.643 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ చంద్రబాబు సర్కారు ఇవ్వకుండా మోసం చేసింది. 2016లో కూడా రాష్ట్రంలో ఏడు జిల్లాలకు ఇన్పుట్ ఇచ్చినా... పంట దెబ్బతిన్న ‘అనంత’ రైతులకు మాత్రం మొండిచేయి చూపించింది. ఈ ఏడాది రూ.937 కోట్లతో పంపిన ఇన్పుట్ నివేదికకు ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు. కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టడం లేదు. ఏటా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కరువు బృందాలు జిల్లాకు వచ్చి వెళుతున్నా కరువు నిర్మూలన చర్యలకు ఉపక్రమించడం లేదు. ఇక వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుసంవర్ధకశాఖ అమలు చేస్తున్న పథకాలు రైతులకు ఏమూలకు చాలడం లేదు. రైతులకు ఉపయోగపడే పథకాలు లేవు. వాటికి పెద్దగా రాయితీ వర్తింపు కూడా లేకపోవడంతో రైతులకు వ్యవసాయం భారమైపోయింది. ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో చేసేదేమీ లేక అన్నదాత ఇంట మరణమృదంగం మోగుతోంది. ఈ ఐదేళ్లలో జిల్లాలో చోటు చేసుకున్న రైతు ఆత్మహత్యలు: ఏడాది ఆత్మహత్యలు 214 41మంది 2015 90మంది 2016 38మంది 2017 38మంది 2018 46మంది 2019 09మంది గత ఐదేళ్లలో ఖరీఫ్ పంటల సాగు, అందులో వేరుశనగ దిగుబడులు, జరిగిన పంటనష్టం... ఏడాది అన్ని పంటలు హెక్టార్లలో.. వేరుశనగహెక్టార్లలో.. వేరుశనగ దిగుబడి హెక్టార్లలో.. పంటనష్టం అంచనా... 2014 7,38,555 5,50,794 236 కిలోలు రూ. 2,800 కోట్లు 2015 6,46,172 4,44,122 670 కిలోలు రూ. 2,300 కోట్లు 2016 7,67,143 6,09,377 215 కిలోలు రూ. 3,400 కోట్లు 2017 6,10,473 4,01,350 850 కిలోలు రూ. 2,900 కోట్లు 2018 6.67,897 4,64,599 178 కిలోలు రూ. 3,800 కోట్లు గత ఐదేళలో వర్షపాతం, భూగర్భజల మట్టం వివరాలు... సంవత్సరం కురిసిన వర్షం భూగర్భ జల(మట్టం) 2014-15 404.3 17.11 2015-16 607.7 18.15 2016-17 333.0 22.10 2017-18 646.4 23.50 2018-19 274.2 24.90 జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం552.3మి.మీ. మేమేం పాపం చేశాం? ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారుల పేర్లు మహిత, హరిత. రామినేపల్లికి చెందిన రైతు యలమారెడ్డి గారి శ్రీనాథ్‌రెడ్డి (33) కుమార్తెలు. శ్రీనాథ్‌రెడ్డి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంతో వారిద్దరూ తండ్రి లేని వారయ్యారు. వివరాల్లోకెళితే..శ్రీనాథ్‌రెడ్డికి గ్రామ సమీపంలో 4 ఎకరాల పొలం ఉంది. పొలంలో రెండు బోవులు తవ్వించినా చుక్క నీరు పడలేదు. పంటల సాగు, బోర్ల తవ్వకం కోసం అప్పు చేశాడు. అలాగే రాప్తాడు కెనరాబ్యాంకులో రూ.1.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. అసలు వడ్డీ కలిపి రూ.2.85 లక్షలు అయింది. బయట వ్యక్తుల వద్ద రూ.7.20 లక్షల దాకా అప్పు ఉంది. అయితే వరుస కరువుల నేప థ్యంలో పంట చేతికి రాలేదు. దీంతో అప్పుల భారం పెరిగిపోయి వాటిని తీర్చే మార్గం కానరాక 2017 ఏప్రిల్ 19న పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రుణదాతలతో పాటు బ్యాంకర్లు, పూచీకత్తు ఉన్న రైతుల ఒత్తిడితో దిక్కుతోచని రైతు శ్రీనాథ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వం నుంచి కూడా ఈ రైతు కుటుంబానికి ఎటువంటి పరిహారం రాకపోవడంతో చేసిన అప్పులు అలాగే మిగిలిపోయాయి. రుణం చెల్లించాలంటూ 2017, సెప్టెంబర్ 18న, 2018 సెప్టెంబర్ 26న బ్యాంకు అధికారులు రైతు భార్య లక్ష్మీకి నోటీసులు కూడా ఇచ్చారు. ఇక రుణదాతలు కూడా ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. అప్పులే మా కొడుకును బలిగొన్నాయి మాకున్న ఎనిమిది ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నాం. ఏడెమిదేళ్లుగా వర్షాలు సక్రమంగా కురవ లేదు. ప్రతి ఏటా పంటలు పండక తీవ్రంగా నష్టపోయాం. రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ప్రభుత్వమూ మోసం చేసింది. పంట పెట్టుబడులకు చేసిన రూ. 6 లక్షల అప్పులు తీర్చే మార్గం కానరాక ఈ ఏడాది జనవరి 31న పొలంలోని చెట్టుకు మా కుమారుడు అశోక్‌రెడ్డి ఉరివేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. – శెట్టిపల్లి సుబ్బరత్నమ్మ, శివారెడ్డి, దంపతులు, పూలఓబయ్యపల్లి, తాడిమర్రి కుమారుడు ఆశోక్‌రెడ్డి ఫొటో చూపుతున్న తల్లిదండ్రులు ఒక పూట పస్తులతో.. ఈమె పేరు బయమ్మ. యల్లనూరు మండలం దంతలపల్లి గ్రామం. ఈమె భర్త దాసరి గోపాల్. తమకున్న మూడు ఎకరాల్లో పంట సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరికి విశ్వనాథ్ అనే బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న 21 సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నాడు. ఇతరుల సాయం లేనిదే ఏ పనీ చేసుకోలేడు. పంట సాగు కోసం వేసిన బోరుబావి ఎండిపోవడంతో.. 2014లో మూడు లక్షలు వెచ్చించి మూడు బోరుబావులు తవ్వించారు. అయినా ఫలితం లేకపోయింది. పంట సాగుకు రూ. 1.50 లక్షల అప్పులు చేశారు. అరకొర సాగునీటితో పంట చేతికి రాలేదు. దీంతో 2015లో రూ.3.50 లక్షలు అప్పు చేసి 80 గొర్రెలను కొనుగోలు చేసి జీవనాధారాన్ని మార్చుకున్నారు. మూడు నెలల వ్యవధిలోనే ఇందులో 40 గొర్రెలు చనిపోయాయి. ఇదే సమయంలో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు తీవ్రం కావడంతో ఉన్న 40 గొర్రెలు అమ్మి రూ. 3 లక్షలు అప్పులు తీర్చాడు. మిగిలిన రూ. 5 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక గత ఏడాది జూన్ 2న గోపాల్ విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో ప్రస్తుతం ఈ కుటుంబం చాలా దయనీయ పరిస్థితుల్లో బతుకుతోంది. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న కుమారుడిని వదిలి తల్లి ఎక్కడకు వెళ్లలేకపోతోంది. కుమారుడికి అందే రూ. వెయ్యి వికలాంగ పింఛన్‌తో సర్దుకుపోతూ ప్రతి నెలా అందే రేషన్‌తో ఒక పూట భోజనం చేస్తూ.. మరోపూట పస్తులతో ఆ తల్లి గడుపుతోంది. కుమారుడి పరిస్థితిని చూపెడుతున్న బయమ్మ చితికిన బతుకులు పాడి ఆవుతో జీవనం సాగిస్తున్న లావణ్య, పిల్లలు, ఈ చిత్రంలో పాడిఆవుకు మేత పెడుతున్న ఈమె పేరు లావణ్య. ఆ పక్కన ఉన్నది ఆమె పిల్లలు. తన భర్త బాలకేశవయ్య జీవించి ఉన్నప్పుడు తమకున్న 4.90 ఎకరాల్లో పంటల సాగు చేస్తూ జీవనం సాగించేవారు. ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావంతో పంటలు సరిగా పండలేదు. పంటల సాగుకు గూనిపల్లి సహకార సంఘంలో దీర్ఘకాలిక రుణం కింద రూ. 3 లక్షలు, స్వల్ప కాలిక రుణం కింద మరో రూ. 50 వేలు తీసుకున్నాడు. బ్యాంకుల్లో రుణాలు పుట్టకపోవడంతో పంట పెట్టుబడులకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 2 లక్షల వరకూ అప్పులు చేశాడు. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ వర్తించలేదు. అదే సమయంలో అప్పులు తీర్చే మార్గం కానరాక 2016లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న లావణ్య పరిస్థితి తెలుసుకున్న నటుడు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి.. కొంత మేర ఆర్థిక సాయంతో పాటు ఓ గ్రైండర్ అందజేశారు. ‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా లక్ష్మి అందజేసిన ఆర్థిక సాయంతో పాడి ఆవును కొనుగోలు చేసి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఏ పూటకాపూట కూలి పనులతో.. బియ్యంలో రాళ్లు ఏరుతున్న ఈమె పేరు బోయ మారెక్క. గుమ్మఘట్ట మండలం తాళ్లకెర గ్రామం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తన భర్త బోయ రామప్ప జీవించి ఉన్నప్పుడు తమకున్న ఐదు ఎకరాల్లో పంటల సాగుకు బోర్లు వేయించడం.. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ ఇతర ఖర్చుల కోసం ప్రైవేటు వ్యక్తులతో రూ. 4.50 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆశించిన మేర పంట దిగుబడులు రాకపోవడంతో అప్పులు తీర్చడం భారమైంది. చివరకు మనోవేదనతో కుమిలిపోతూ 2018 సెప్టెంబర్ 21న రామప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. ఆయన మృతితో కుటుంబం జీవనం దుర్భరమైంది. ఉన్న ఐదు ఎకరాల పొలం కూడా బీడుపడింది. ఏ పూటకాపూట కూలి పనులతో పొట్ట పోసుకుంటున్నారు. ఇంటిలో సామగ్రి ఏదీ లేదు. మంత్రి కాలవ శ్రీనివాసులను కలిసి తమ దీన పరిస్థితి వివరించి, సాయం చేయాలని అర్థించినా.. ఫలితం లేకుండా పోయిందంటూ మారెక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – గుమ్మఘట్ట -
రైతే రాజు! ఎన్నికల రోజు మాత్రమే
దేశ జనాభాలో 54 శాతం మంది, మన తెలుగు రాష్ట్రాలలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడినా, రైతుల ఎజెండాకు ఎప్పుడూ రాజకీయ పార్టీలు ప్రాధాన్యతనివ్వలేదు. ప్రతి రాజకీయ నాయకుడు రైతు మిత్రులమని, రైతుబిడ్డలమని చెప్పుకున్నా, రైతుల కోసం చేసింది శూన్యమే. రైతులు కులాలు, ప్రాంతాల వారీగా చీలిపోయి తమ డిమాండ్ల సాధనకు ప్రయత్నించకపోవడం ఒక కారణమైతే.. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయం ఎప్పటికీ గిట్టుబాటు కాదన్న అంచనాతో ఆ వర్గం వారిని కనీసం 10–15 శాతం తగ్గించాలన్న ఆలోచనలు రెండో కారణం. ఈ విషయాలను కొన్ని పార్టీలు సూటిగా.. ఇంకొన్ని డొంకతిరుగుడుగా చెబుతున్నాయి. మరికొన్ని ఏమీ మాట్లాడకుండా ఈ ఎజెండా అమలుకు చర్యలు తీసుకుంటున్నాయి. చిత్రం ఏమిటంటే.. వ్యవసాయం నుంచి బయటికొచ్చిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలేమిటన్న ప్రశ్నకు ఏ రాజకీయ పార్టీ వద్దా సమాధానం లేదు. నిరుద్యోగ సమస్య ఈ పదేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. 2014లో 3.41 శాతమున్న నిరుద్యోగిత 2018 నాటికి 6.1 శాతానికి పెరిగింది. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రమ చేయగలిగిన వయసులో (15–59 సం.) ఉండే వారి సంఖ్య 6.12 కోట్లని అంచనా. అయితే వ్యవసాయేతర పనుల ద్వారా 2.8 కోట్ల మందికే ఉపాధి లభిస్తోందని అంచనా. కాబట్టి ఏ రకంగానైనా సరే.. వ్యవసాయ రంగమే మిగిలిన వారందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితి. రాజకీయ నేతలు ఈ రంగం సమస్యలను గుర్తించడంలో తప్పులు చేస్తుండటం, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వాల తప్పుడు విధానాలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. రుణమాఫీ మాయ.. వ్యవసాయ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని గత ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు రుణమాఫీ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా సుమారు లక్ష కోట్ల రూపాయల రుణమాఫీ జరిగితే, అందులో సగం రెండు రాష్ట్రాల్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మొత్తం రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీనిచ్చాయి. అధికారంలోకి రాగానే అనేక నిబంధనలు పెట్టి చివరికి కొంతలో కొంత అదీ నాలుగు విడతలలో ఇచ్చిన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యధికంగా వ్యవసాయ రుణగ్రస్తులు (తెలంగాణ: 89.1%, ఆంధ్రప్రదేశ్: 92.9%) ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనైనా, సంస్థాగత రుణాలు పొందుతున్నది 21 శాతం మంది రైతులే. రెండు రాష్ట్రాల్లో సుమారు నలభై లక్షల మంది (ఆంధ్రప్రదేశ్–25 లక్షలు, తెలంగాణ– 15 లక్షలు) కౌలు రైతులుంటే వారిలో రుణాలు పొందేది చాలా తక్కువ. మిగతా వారంతా అధిక వడ్డీకి ప్రైవేటు రుణాలు, సూక్ష్మ రుణాలు తీసుకునే వారే. రుణమాఫీ వీరికేమాత్రం ఉపయోగపడదు. పైగా 4 విడతలుగా చేయటం వల్ల ఏటా రైతులకు అందాల్సిన రుణాలు అందక అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలు తీసుకోవాలి. రుణాలు సరైన సమయంలో అందకపోవటంతో చాలామంది రైతులు బీమా కూడా పొందలేకపోయారు. రుణాలు సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రుణమాఫీ వర్తించకపోవడం అటువంటి వారిని నిరుత్సాహపరిచేలా ఉంటుంది. ఒకసారి మాఫీ చేస్తే మరో మాఫీ కోసం ఎదురు చూస్తారనీ, సక్రమంగా చెల్లించిన వారిని రాయితీ ఇవ్వకుండా శిక్షించడంవల్ల వారూ తిరిగి చెల్లించరని, ఈ రకంగా బ్యాంకుల తిరిగి చెల్లింపుల సంస్కృతి దెబ్బతిని గ్రామీణ బ్యాంకింగ్ రంగం కుప్ప కూలుతుందనీ విమర్శకుల భావన. ఇలా చేయొచ్చు.. పంట నష్టం, ప్రతికూల మార్కెట్ పరిస్థితులు, గిట్టుబాటు కాని ఆదాయం, పెరిగిన ఉత్పత్తి ఖర్చు వంటి కారణాలతో తీసుకున్న అప్పుని రైతులు తిరిగి చెల్లించలేక పోతున్నారు. సంక్షోభ కారకాల్లో ఎలాంటి మార్పు చేయకుండా కేవలం రుణాలు మాఫీ చేయడం వల్ల ఫలితం ఉండదు. తదుపరి పంటకాలాల్లో కూడా ఇదివరకటి పరిస్థితే పునరావృతమై తిరిగి కొత్త అప్పు చెల్లించలేని పరిస్థితే మళ్లీ ఏర్పడి రుణమాఫీ మరలా అడిగే పరిస్థితి వస్తుంది. దీనికంటే, కౌలు రైతులతో సహా వ్యవసాయం చేసే రైతులందరికీ పంట, మార్కెటింగ్ రుణాలు, మౌలిక సదుపాయాల కోసం రుణాలందే వ్యవస్థ ఏర్పాటు చేయటం కోసం, వారికి బ్యాంకు గ్యారెంటీగా వుంచటం కోసం ప్రభుత్వం ఒక నిధిని ఏర్పాటు చేయవచ్చు. దానిపై వచ్చే వడ్డీతో సరిగ్గా చెల్లించే రైతులకి రాయితీలు అందించవచ్చు. పూర్తిగా సంక్షోభంలో ఉన్న రైతు కుటుంబాలను గుర్తించి వారి రుణాలు మాత్రం రీషెడ్యూల్ లేదా మాఫీ చేయవచ్చు. అంతేగాని అందరికీ మాఫీ అనేది పూర్తిగా అనవసర విషయం. ‘నాన్ రి కోర్స్’ రుణాలు మేలు.. అమెరికా లాంటి దేశాలలో ఉన్న నాన్ రి కోర్స్ వ్యవసాయ రుణాల వంటివి ఇవ్వవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే తాత్కాలిక ‘మార్కెట్’ రుణాలుగా (ధర తక్కువగా ఉన్నప్పుడు పంటని నిల్వ ఉంచుకుని ధర పెరిగినప్పుడు అమ్ముకునే వెసులుబాటు కోసం) ప్రారంభించిన సౌకర్యం నాన్ రీకోర్స్ వ్యవసాయ పరపతిగా పరిణతి చెందింది. ఈ పద్ధతిలో రైతుకు పంట హామీగా రుణాన్ని స్తారు. మార్కెట్ ధర నిర్దేశిత ధరకు తక్కువగా ఉంటే నష్టాన్ని మినహాయించుకొని తిరిగి చెల్లిస్తే రుణఖాతాలో మిగులు రద్దవుతుంది. పంట నష్టం జరిగితే అప్పు చెల్లించాల్సిన పని లేదు. తక్కువగా పండితే ఆ పంటని ప్రభుత్వానికి దఖలు చేస్తే సరిపోతుంది. రుణం రద్దవుతుంది. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తన ఉచిత ఆహార ప«థకం (ఫుడ్ స్టాంప్‌లు) కోసం వినియోగించుకుంటుంది. రైతు వ్యవసాయం చేస్తే చాలు పంట సక్రమంగా ఉండి ధర పలికితేనే తిరిగి చెల్లించడం జరుగుతుంది. లేకుంటే అప్పు రద్దవుతుంది. ప్రతిసారీ రుణమాఫీ కోసం అడగాల్సిన పని లేదు. అప్పు తిరిగి చెల్లించడం లేక చెల్లించకపోవడం రైతు ఇష్టానికే వదిలేస్తారు. అమెరికా వ్యవసాయ విభాగం (యూఎస్డీఏ) ఈ రుణాలనందిస్తుంది. వాస్తవ సాగుదారులకే నగదు బదిలీ రుణమాఫీ పని చేయడం లేదని గుర్తించిన రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టిన కొత్త విధానం రైతులకు నేరుగా నగదు బదిలీ చేయటం. తెలంగాణలో వ్యవసాయ ఖర్చులు తగ్గించే లక్ష్యంతో ‘రైతుబంధు’ పేరుతో ప్రతి పంటకాలానికి ఎకరానికి రూ.4 వేలు, సంవత్సరానికి రూ.8 వేలు ఇస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రూ.10 వేలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికలలో తెరాస హామీనిచ్చింది. అయితే ఈ పథకం పెట్టుబడి సహాయ పథకంగా పిలవబడుతున్నా, ఇది కేవలం పట్టాదారు పాస్‌బుక్ ఉన్న భూ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది. వ్యవసాయం చేస్తూ రోజు వారి కష్టనష్టాలు భరిస్తున్న లక్షల మంది కౌలు రైతులు, భూమి పట్టా లేని అనేక మంది ఈ లబ్ధి పొందలేక పోయారు. ఆ తర్వాత ఒరిస్సా ప్రభుత్వం ‘కాలియా’ (కుటుంబానికి సంవత్సరానికి పదివేలు) పేరుతోను, కేంద్ర ప్రభుత్వం కుటుంబానికి రూ.ఆరు వేలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో (కుటుంబానికి రూ.15 వేలు) నగదు బదిలీ పథకాలు ప్రవేశపెట్టాయి.. వీటన్నిటిలోను వాస్తవ సాగుదారులను గుర్తించి సహాయం అందించటానికి ప్రయత్నం చేయక, భూమి హక్కుదారులకు మాత్రమే అందచేయటానికి ఏర్పాట్లు చేశారు. వస్తు రూపేణా ఇచ్చే సబ్సిడీలకంటే నేరుగా నగదు బదిలీ చేయటం రైతులకు ఉపయోగపడేదే. అయితే అది వాస్తవ సాగుదారులకు అందేలా చేయటం ముఖ్యం. నగదుబదిలీఇలాఉండాలి ♦ సాయం నేరుగా వాస్తవ సాగుదారులకు మాత్రమే అందాలి. వారిని గుర్తించి నేరుగా అందించేందుకు ఏర్పాట్లు చేయాలి ♦ పెట్టుబడి సహాయం అయినప్పుడు (తెలంగాణ) వర్షాధార పరిస్థితులలో ఉన్న రైతులకు, చిన్న సన్నకారు రైతులకు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఎకరం, అంతకంటే తక్కువ ఉన్నా రైతులకు అందే సహాయం మరీ తక్కువ. ♦ కుటుంబ ఆదాయ సహాయ పథకం అయినప్పుడు (ఆంధ్ర, ఒడిశా, కేంద్రం) ఇవి కుటుంబం గౌరవంగా బతకటానికి అవసరమైనంతగా ఉండాలి. ఈ మొత్తానికి ఉద్యోగులకు జీతం పెరిగినట్లు కరువు భత్యాలు కలపాలి. ♦ ఎంతివ్వాలనే దానిపై నిర్ణయాలు తీసుకోవటానికి, అందకపోతే ఫిర్యాదు చేయటానికి రాష్ట్రస్థాయిలో రైతుల ఆదాయ కమిషన్ ఉండాలి. ♦ ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు నెరవేర్చక పోతే రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు చేయాలి. హామీలు ఎలా నేరవేరుస్తారో, దానికి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారో పార్టీలు స్పష్టంగా ముందే చెప్పాలి. లేదంటే రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. ఇదీ రైతు ఎజెండా సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో దేశంలోని రైతు సంఘాలన్నీ ఒక్కతాటిపై నిలిచి.. తమ డిమాండ్లు ఇవీ అని పార్టీల ముందు పెట్టాయి. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ), కర్ణాటక రాజ్య రైతు సంఘ (కేఆర్ఆర్ఎస్), తమిలగ వివసాయిగై సంఘం (టీవీఎస్), ఆదివాసీ గోత్ర మహాసభ (ఏజీఎం)లతోపాటు కొన్ని ఇతర సంఘాలన్ని గత వారం ‘ఆలిండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఫార్మర్స్ మూవ్మెంట్’ పేరుతో ఏకమయ్యాయి. రైతు సమాజం డిమాండ్లు పద్దెనిమిదింటిని తమ మేనిఫెస్టోల్లో చేర్చాలని, వాటి పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేసింది ఈ సంస్థ! ♦ వ్యవసాయ సంక్షోభంపై చర్చించేందుకు పార్లమెంటు ఉభయ సభలు కనీసం నెల రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. ♦ 2013నాటి భూసేకరణ చట్టంలో పరిహారం చెల్లింపులు న్యాయంగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ♦ భూ సేకరణను రాష్ట్ర జాబితాలోంచి తొలగించి.. కేంద్ర జాబితాలోకి చేర్చాలి. ♦ గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు అన్ని పంట ఉత్పత్తులను వందశాతం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. ♦ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బేషరతుగా పంట రుణాల మాఫీ.. ⇔ పంట బీమా పథకంలో సమూల మార్పులు చేయాలి.. అడవి జంతువుల వల్ల పంటలకు కలిగే నష్టాన్నీ బీమా పథకంలోకి చేర్చాలి. ⇔ ఎకరాకూ ఏటా రూ.పదివేల పెట్టుబడి సాయం. ⇔ రైతులకు రూ.ఐదు వేల నెలవారీ పింఛన్. ⇔ అన్ని రకాల వ్యవసాయ పనిముట్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు.. ⇔ పాముకాట్లు వంటి వ్యాసంగిక ఇబ్బందుల నుంచి రక్షణకు ఉచితసామాజిక భద్రత పథకం. ⇔ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో ఒక్కరికైనా ప్రభుత్వోద్యోగం.. -
షరతుల్లేని పరిహారం
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2017 జనవరి వరకు 960 మంది రైతులు వివిధ సంఘటనలలో మృత్యువాత పడ్డారు. అందరికీ నష్టపరిహారం అందిస్తానని వాగ్దానం చేసి, అందుకు అనుగుణంగా జీవో నంబర్ 62ను తెచ్చింది ప్రభుత్వం. అయితే, దురదృష్టం ఏమిటంటే కేవలం 96 మంది రైతు కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం అందింది. నిజానికిలా చేయడం రైతుల్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన ఆ జీవోను తుంగలో తొక్కడమే. ఇంకా విచారకరమైన విషయమేమిటంటే, ప్రకాశం జిల్లాలో 78 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే ఆరుగురికి మాత్రమే సాయం ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. (మానవ హక్కుల ఫోరం నివేదిక)నేలను నాశనం చేసే వాడు నింగికి ఎదుగుతుంటే మట్టిని ప్రేమించే వాడు కృంగి కృశించి చివరికి అర్ధంతరంగా ఆ మట్టిలోనే కలిసిపోవడం అంటే ఇదేనేమో.. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల చావుడప్పు మోగుతోంది. పత్తి రైతులతో మొదలయిన ఈ పరంపర ఇప్పుడు అన్ని వర్గాల రైతులను చుట్టేస్తోంది. విధాన నిర్ణేతల తప్పిదాలు, వ్యవసాయ పరపతి లభించక, గిట్టుబాటు ధర రాక, పెట్టుబడులు పెరిగి అప్పుల పాలైన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏదోమూల ప్రతిపూట ఓ అన్నదాత కన్నుమూస్తున్నాడు. వ్యవసాయ సంక్షోభంపై చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా రాధాకృష్ణ కమిషన్‌ను నియమించి సంక్షోభ కారణాలను గుదిగుచ్చినా పరిష్కారం దిశగా ఏ చర్యా చేపట్టకపోగా కాలయాపన చేశారు. వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగంలో చేర్చానని ఘనంగా ప్రకటించుకున్నా తాను తొలిసంతకం చేసిన రుణమాఫీకే ఇంతవరకు గతి లేకుండా పోయింది. వ్యవసాయ సంక్షోభాన్ని, అన్నదాతల ఆత్మహత్యలను గుర్తించి నిరాకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబు ఒక్కరే. ఆత్మహత్యలు వ్యక్తిగత వ్యవహారంగా కొట్టిపారేయడం చంద్రబాబుకే చెల్లింది. గత నాలుగేళ్లలో రెండు వేల మంది రైతులు చనిపోయారు. దీనిపై దృష్టి సారించాల్సిన ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. చనిపోయిన కుటుంబాల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారు. వ్యవసాయం దండగ, టూరిజమే పండగని చెప్పే చంద్రబాబుకు చివరకు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు కూడా చేతులు రాకపోవడం గమనార్హం. చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన 2014లో 164 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 2015లో ఆ సంఖ్య 516కి చేరింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్షన్నర పరిహారం అందించారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మొత్తాన్ని పెంచడానికి సైతం ఇష్టపడలేదు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో పదేపదే డిమాండ్ చేయడంతో రైతు ఆత్మహత్యలపై తప్పనిసరి పరిస్థితుల్లో పరిహారాన్ని పెంచుతున్నట్టు ప్రకటించి రకరకాల ఆంక్షలు పెట్టారు. చావును పరిగణనలోకి తీసుకోవడానికి బదులు వయసు తారతమ్యాలు పెట్టారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు ఒక రేటు, ఆపై వయసున్న వారికి మరో రేటు, ఇలా వివిధ రకాలుగా నిబంధనలు పెట్టి గరిష్టంగా రూ.5 లక్షలని చెబుతూ వచ్చారు. ఇలా చెప్పి మూడేళ్లు గడిచినా çకనీసం 200 మందికి కూడా సాయం అందలేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుభరోసా పథకాన్ని ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అప్పుల భారంతో అన్నదాతలు మరణించడానికి వీలు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు బలవన్మరణానికి పాల్పడినా, ప్రమాదవశాత్తు మరణించినా ఆ రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన రైతు కుటుంబ పునరావాసానికి ఆర్థికంగా చేయూత ఇవ్వడంతో పాటు ఆ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని జగన్ ఇచ్చిన హామీ పట్ల రైతుల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.– ఎ.అమరయ్య,చీఫ్ రిపోర్టర్, సాక్షి -
నాలుగేళ్లు దాటినా ఎక్స్‌గ్రేషియా అందలేదు
కర్నూలు జిల్లా : సేద్యం కోసం చేసిన అప్పులు రైతులకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా బాధిత రైతు కుటుంబం ఎక్స్‌గ్రేషియాకు నోచుకోక నాలుగేళ్లుగా తీరని శోకంతో కొట్టుమిట్టాడుతూ ఉంది. కర్నూలుజిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోస్గి మండలం సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన మేకల తమ్మారెడ్డి(40) అప్పుల బాధతో 2014 సెప్టెంబర్ 8న పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్మారెడ్డికి 3 ఎకరాల సొంత భూమి ఉంది. పొలంలో ఉల్లి, పత్తి పంటలను సాగు చేశాడు. మూడేళ్ల పాటు పంటలు చేతికి రాక, గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. బ్యాంక్‌లో రూ. 60 వేలు, బయట రూ. 6 లక్షల వరకు అప్పు చేశాడు. 2014లో వానలు లేక ఉల్లి పంట అరకొరగా పండింది. పండిన పంటకు సైతం ధర లేదు. దీంతో కుమిలిపోయాడు. పొలంలోనే పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య రాధమ్మ, కుమారులు జగన్నాథం, మర్రిస్వామి, కుమార్తె ధరణి ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో వారి కుటుంబ జీవనం దుర్భరంగా మారింది. సేద్యం చేసుకునే స్థోమత లేక పొలాన్ని కౌలుకు ఇచ్చిన రాధమ్మ తన పెద్ద కొడుకు జగన్నాథాన్ని బడి మాన్పించి కూలీ పనులకు తీసుకెళ్తున్నది. ప్రభుత్వం నుంచి నయా పైసా సాయం అందలేదు. వితంతు పింఛన్ మాత్రం అందుతున్నది. పూరి గుడిసెలో నివాసం ఉంటూ పుట్టెడుదుఃఖంలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం కనికరించకపోతుందా, ఎక్స్‌గ్రేషియా ఇవ్వకపోతుందా అన్న ఆశ తో రోజులు వెళ్లదీస్తోంది.– కె. పరశురాంసాక్షి, మంత్రాలయం, కర్నూలు జిల్లా -
రైతన్నకు నీటి కష్టాలు
సాక్షి, మోటకొండూర్(నల్గొండ) : దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఏ సీజన్లోనైనా కష్టాలు మాత్రం తప్పటం లేదు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకపోవడం ఒక కారణమైతే.. కురిసిన వర్షపు నీటిని నిల్వచేసే చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్యాక్రాంతం అయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం మరో కారణం. వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతుందటంతో భూగర్భ జలాలు నానాటికి అడుగంటి బోర్లు వట్టిపోతుండటంతో రైతులకు కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయి. రబీ సాగు వివరాలు ఇలా.. మండల వ్యాప్తంగా 15,275 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉండగా అందులో రబీలో 1,322 హెక్టార్ల విస్తీరణంలో సాగుచేశారు. అందులో వరి 890 హెక్టార్లు, జొన్నలు 6 హెక్టార్లు, మినుములు 6 హెక్టార్లు, శెనిగలు 25 హెక్టార్లు, వేరుశెనిగలు 30 హెక్టార్లు, కొర్రలు ఒక హెక్టార్, కూరగాయలు 90హెక్టార్లు, మొక్కజొన్న 270హెక్టార్లు సాగు చేపట్టారు. కాగా గత రబీ సీజన్లో 3,412 హెక్టార్లలో సాగుచేయగా వర్షాల లేమి కారణంగా ఈ రబీ సీజన్లో సగానికి పైగా సాగు తగ్గింది. ప్రసుత్తం సాగు చేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో రైతున్నలు ఆకాశంవైపు ఆశగా చూస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటాయి వర్టూర్ గంగబావి వద్ద నాకు 9ఎకరాల భూమి ఉంది. అందులో 3ఎకరాలు పత్తి, 2ఎకరాలు కంది, ఎకరం వరి పంట వేశాను. వరికి మరో 20 రోజులు నీళ్లు అందితే పంట చేతికొచ్చేది. కానీ నీళ్లు అందక ప్రస్తుతం ఎండిపోయింది. కాగా నాకు రెండు బోర్లు ఉన్నాయి. గత రబీ సీజన్లో 2.5ఎకరాలలో వరి పంట పండించాను. ఇప్పుడు ఎకరం కూడా పారే పరిస్థితిలేదు. – సింగిరెడ్డి సాయిరెడ్డి, రైతు -
పుచ్చకాయతో నష్టాలు
పుచ్చకాయ తింటే లాభాలనేకం అందుకే వేసవిలో పుచ్చకాయను తినని వారుండరు. కాని పుచ్చ పంటకు తెగులు సొకడంతో దిగుబడి తగ్గి కష్టాల్లో ఉన్న రైతన్నను మార్కెట్లొ ధర వెక్కిరించింది. చివరికి పెట్టుబడి సొమ్ము కూడా చేతికి రాక రైతుకు కన్నీరే మిగిల్చింది. సాక్షి, చిట్టమూరు: వర్షాభావ పరిస్థితులు మెట్టపంటల సాగు రైతును కుదేలు చేసింది. ఈ ఏడాది పుచ్చ పంట వేసిన రైతులకు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. గతేడాది వివిధ ప్రాంతాల్లో వేసిన పంటకు అంతు పట్టని తెగులు సోకడంతో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం అయినా పంట ఆశాజనకంగా ఉంటుందని ఆశించిన రైతులు గతేడాది కంటే ఎక్కువగా నష్టాలను చవిచూశారు. పుచ్చ పంట సాగు చేసిన రైతులకు ఉద్యానవన శాఖ అధికారుల నుంచి ఎటువంటి సలహాలు, సూచనలు అందలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన సేద్యం పద్ధతులు అవలంబించలేకపోవడంతో పంటలను తెగుళ్లు ఆశించాయి. రైతులు పురుగు మందు దుకాణదారులు చెప్పిన మందులు వాడినా దిగుబడులు అంతంత మాత్రమే వస్తున్నాయన్నారు. గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరు చిల్లకూరు మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో మెట్ట ప్రాంతాల్లో రైతులు పుచ్చ పంట సాగుచేశారు. ప్రస్తుతం కోత దశలో ఉండటంతో రైతులు కాయలు కోసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కాయ సైజును బట్టి వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. చిన్న సైజు కాయలను వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో రోడ్ల పక్కన రైతులే అమ్మకాలు చేస్తున్నారు. వేలు పెట్టుబడి పెట్టి చివరకు కాయ సైజు రాకపోవడంతో అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టమూరు మండలంలో ప్రధానంగా చిల్లమూరు, మొలకలపూడి, రామాపురం గ్రామాల్లో మెట్టు ప్రాంతాల్లో రైతులు పుచ్చసాగు చేశారు. చిట్టమూరు మండలం నుంచి గతంలో దేశ రాజధాని ఢిల్లీకు కూడా ఎగుమతి అయ్యేవి. అయితే ఈ సంవత్సరం కాయ సైజు పెద్దగా రాకపోవడం, నాణ్యత లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయాయని రైతులు చెబుతున్నారు. ధరలు భారీగా పతనం ఈ ఏడాది పుచ్చకాయల ధరలు భారీగా పనమయ్యాయి. గతేడాది టన్ను రూ.10 వేలు ఉంటే.. ఈ ఏడాది రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు ఉన్నాయి. కాయలు చిన్నవి అయితే రూ.4,500 లోపే కొనుగోలు చేస్తున్నారు. కానీ మార్కెట్లో వ్యాపారులు మాత్రం కాయల సైజ్‌ను బట్టి విక్రయిస్తుండడంతో టన్ను రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకంటే.. వ్యాపారులు రెండింతల లాభాలను పొందుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పుచ్చసాగు నియోజకవర్గంలో ఈ ఏడాది వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో రైతులు వరి పంటకు సాగు నీరు లేక ఆరుతడి పంట పుచ్చను సాగు చేశారు. బావులు, గుంతల్లోని నీటి ఆధారంగా పుచ్చసాగు చేశారు. డీజిల్ ఇంజన్ల ద్వారా పుచ్చ పంటకు సాగునీరు అందించి వ్యయప్రయాసలు పడి పండించినా చివరకు కష్టమే మిగిలిందని రైతులు వాపోతున్నారు. ఎకరా పుచ్చసాగుకు దుక్కి మొదలు, కోత దశ వరకు సుమారు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. అయితే తొలి కోతలో రెండు టన్నులు, రెండో కోతలో రెండు టన్నులు మొత్తం ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు తెలిపారు. అయితే అన్ని బాగుండి గతంలో ఎకరాకు సుమారు 15 టన్నుల వరకు దిగుబడి వచ్చేదని రైతులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎకరాకు రూ.10 వేలు నష్టం వస్తుందని రైతులు తెలిపారు. ఎకరాకు రూ.10 వేలు నష్టం నాలుగు ఎకరాల్లో పుచ్చ పంట సాగు చేశాను. దిగుబడి తక్కువగా రావడంతో ఎకరాకు రూ. 10 వేలు నష్టం వచ్చింది. అధికారుల నుంచి పంట సస్యరక్షణపై ఎటువంటి సలహాలు, సూచనలు లేకపోవడంతో తెగుళ్లను తగ్గించేందుకు పెట్టుబడులు పెరిగాయి. – సంక్రాంతి కస్తూరయ్య, రైతు, మొలకలపూడి, చిట్టమూరు మండలం డిసెంబర్ నెలలో నాటుకోవాలి రైతులు డిసెంబర్ నెలలో విత్తనాలు నాటుకుంటే పంటకు తెగుళ్లు తగ్గి దిగుబడి పెరుగుతోంది. తామర పురుగు, డైబ్యాక్ తెగులు ఎక్కువగా వస్తున్నాయి. వైరస్ ఎక్కువగా సోకడంతో తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. రైతులు మేలు రకమైన విత్తనాలను విత్తుకోవాలి. పాతరకం విత్తనాలు వేసుకోవడం వల్ల తెగుళ్లు వస్తున్నాయి. – ఆనంద్, ఉద్యానశాఖ అధికారి, గూడూరు -
రైతు ఆత్మహత్య!
శ్రీకాకుళం, సంతకవిటి/రణస్థలం: మందరాడ గ్రామానికి చెందిన వడ్డిపల్లి గోవిందరావు(45) అనే రైతు రణస్థలం వద్ద గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. రణస్థలంలోని జె.ఆర్.పురం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఒరుగంటి నరేష్ కుమార్ స్థలంలో ఉరివేసుకొని ఇతడు ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రణస్థలం, లావేరు, సంతకవిటి మండలాల్లో సంచలనం రేపింది. జె.ఆర్.పురం సీఐ ఎ.విశ్వేశ్వరరావు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం స్థానికులు ద్వారా తెలుసుకున్న జె.ఆర్.పురం సీఐ ఎ.విశ్వేశ్వరరావు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన తీరు పరిశీలిస్తుండగా అదే సమయంలో మృతుడు జేబులో ఫోన్ మోగుతుండడంతో ఆ ఫోన్ ఆన్ చేసి సంబంధిత వ్యక్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని సీఐ తెలిపారు. కుటుంబ సభ్యులు వచ్చి పరిశీలించారు. బుధవారం రాత్రి వరకు ఈయన ఇంటి వద్దే ఉన్నాడు. గత రెండు రోజులుగా మానసిక పరిస్థితి బాగుండకపోవడంతో ఈయనను కుటుంబీకులు గురువారం ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఈయన ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈయన వ్యవసాయం చేసుకోవడంతో పాటు వరిగడ్డి వ్యాపారం చేసేవాడు. గతంలో మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ రెండు రోజుల క్రితం నుంచి ఇబ్బంది పడుతూవచ్చాడు. ఈయనకు భార్య చిన్నమ్మడుతో పాటు కుమారుడు మణికంఠ ఉన్నారు. కుమార్తె పావనికి రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఆమె ప్రస్తుతం అత్తవారి ఇంటి వద్ద ఉంటుంది. గోవిందరావు మృతిచెందిన విషయం తెలుసుకొని గ్రామస్తులు శ్రీకాకుళం రిమ్స్‌కు చేరుకున్నారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా మృతదేహంతో పాటు బంధువులు, గ్రామస్తులు స్వగ్రామానికి చేరుకొని గోవిందరావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య చిన్నమ్మడు కన్నీరుమున్నీరుగా విలపించింది. నాన్నా లే నాన్న అంటూ గోవిందరావు కుమార్తె పావని తండ్రి మృతదేహంపడి విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. తన తండ్రి మృతదేహం వద్ద కుమారుడు మణికంఠ గట్టిగా రోదించగా అదుపుచేయడం ఎవరి తరమూకాలేదు. గోవిందరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గోవిందపై కేసు నమోదు కాగా, కొన్నాళ్లు క్రితం సంతకవిటీ పోలీస్ స్టేషన్లో మృతుడిపై కేసు నమోదైందని సీఐ తెలిపారు. భార్యతో గొడవలు, గతంలో ఇదే స్థలంలో పురుగు మందు తాగి అత్మహత్యాయత్నానికి పాల్పడడం, ఎనిమిది నెలల క్రితం పొందూరు రైల్వే పట్టాలపై పడుకొని అత్మహత్యాయత్నానికి పాల్పడం వంటి సంఘటనలు ఉన్నాయని చెప్పారు. మానసిక స్థితి బాగోలేక జె.ఆర్.పురం పరిధిలోకి వచ్చి చెట్టుకు తువ్వాలతో ఉరివేసుకొని అత్మహత్యకు పాల్పడి ఉంటాడని సీఐ తెలిపారు. మృతదేహానికి శవపంచనామా నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జె.ఆర్.పురం ఎస్సై బి.ఆశోక్‌బాబు తెలిపారు. -
అయ్యో అన్నదాతా..!
విజయనగరం, సీతానగరం/పార్వతీపురం: మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని.. అన్నదాత అభివృద్ధే తమ ధ్యేయమని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నాయకులకు రైతుల ఆత్మహత్యాయత్నాలు కనబడడం లేదు. తనకు రుణం ఇమ్మని అడగలేదు.. భూమి మంజూరు చేయమనీ ఆ రైతు అడగలేదు. కేవలం తన భూ సమస్య పరిష్కరించమని మాత్రమే కోరాడు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇది జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా ఆ సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ బాధిత రైతు మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సీతానగరం మండలం చినబోగిలి గ్రామానికి చెందిన గుణుపూరు రాము అనే రైతు తన 84 సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరాడు. కాని అధికారులు స్పందించలేదు. దీంతో 2015లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో ‘నీరు – చెట్టు’ కార్యక్రమంలో పాల్గొనగా.. బాధిత రైతు రాము తన సమస్యను ఏకంగా ముఖ్యమంత్రికే చెప్పుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విసిగిపోయిన రైతు రాము తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో చంద్రబాబునాయుడు రైతు సమస్య తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ అధికారులు అదే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించలేదు. దీంతో ఎప్పటికీ తన సమస్య పరిష్కారం కాదనే బెంగతో గురువారం స్థానిక రాష్ట్రీయ రహదారికి ఆనుకుని ఉన్న కాశీపేట వాటర్‌హెడ్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కలెక్టర్, సబ్ కలెక్టర్ వచ్చి తన సమస్యను పరిష్కరిస్తేనే కిందకు దిగుతానని.. లేని ఎడల దూకి చనిపోతానని స్పష్టం చేస్తూ ట్యాంక్‌పై కూర్చున్నాడు. అధికారుల్లో అలజడి... రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నాడన్న విషయం తెలుసుకున్న తహసీల్దార్ డి. బాపిరాజు, ఎస్సై ఎస్. కృష్ణమూర్తి తక్షణమే చేరుకుని అగ్నిమాపక, 108 సిబ్బందిని రప్పించారు. సమస్యను పరిష్కరిస్తామని కిందకు దిగాలని కోరినా రైతు ఒప్పుకోలేదు. దీంతో కొంతమంది రామును కిందకు దించేందుకు ట్యాంక్ పైకి ఎక్కేందుకు వెళ్లగా.. తనతో తెచ్చుకున్న పురుగు మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే బాధిత రైతును కిందకు దించి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే బాధిత రైతు ఆస్పత్రిలో మాట్లాడుతూ, అధికారుల చుట్టూ నాలుగేళ్లుగా తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. పైగా స్థానిక నాయకులు, అధికారులు తనను బెదిరిస్తున్నారని.. అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పారు. ఈ సంఘటనపై ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెవ్వెన్యూ అధికారులు అవకతవకలు చేశారని ఆవేదనతో..
-
బోరుబావి రైతులను ఆదుకోరా?
వర్షపునీటితో వ్యవసాయం చేయటమనేది అత్యంత ప్రాచీనమైన కళ. పంటభూమికి నీరందించటానికి మనకున్న ముఖ్యమైన నీటివనరులు మూడు. అవి 1. వర్షపాతం, 2.భూతలజలం, 3. భూగర్భజలం. తెలంగాణలో సగటు వార్షికవర్షపాతం 929 మి.మీ. ఇందులో నైరుతి ఋతుపవనాల ద్వారా రమారమి 67శాతం జూన్ నుంచి సెప్టెంబర్ నెలల్లోనే లభిస్తుంది. 23శాతం వర్షపాతం ఈశాన్య ఋతుపవనాల ద్వారా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు లభిస్తుంది. ఇవి పోగా మిగతా పదిశాతం వర్షపాతం జనవరి నుండి మే నెలల మధ్య ఐదు నెలల్లో లభిస్తుంది. రాష్ట్రంలోని పంటభూమిలో ఒక కోటీæ 43 లక్షల ఎకరాలలో మూడింట ఒక వంతు భూమికి మాత్రమే నీటి వసతి ఉంది. ఈ నీటి వసతి కల్పిం చిన పంట భూమిలో మూడింట రెండువంతుల భూమికి రైతులే స్వయానా అప్పులు చేసి ఎన్నో బాధలుపడి బోరుబావుల ద్వారా నీటివసతిని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో ఉన్న మొత్తం చెరువులు, కుంటలు 41,131. వీటి కింద ఉన్న పారుదల 1956–57లో 5,30,565 హెక్టార్లుగా ఉన్నది. 2000–01 నాటికి 1,65,303 హెక్టార్లకు పడిపోయింది. అంటే ఐదు దశాబ్దాలలో చెరువులు, కుంటల కింద నీటిపారుదలలో తగ్గిన విస్తీర్ణం 8,50,000 ఎకరాలకు పైగానే ఉంది. అదే విధంగా కాలువల కింద పారకం 1990–91లో 3,38,276 హెక్టార్లుగా ఉన్నది 2000–01 నాటికి 1,62,315 హెక్టార్లకు పడిపోయింది. రాష్ట్రంలో వాణిజ్యపంటలవైపు మొగ్గుచూపు తున్న రైతులు ప్రాజెక్టులు, చెరువులు, కాలువల ద్వారా సాగునీరు లభించకపోవటంతో గత్యంతరం లేక బోరు బావులపై ఆధారపడుతున్నారని గత 50 ఏళ్ల గణాంకాలు చెబుతున్నాయి. 1970–71లో రాష్ట్రంలో 2,14,500 బోరుబావులుంటే 2017 నాటికి వాటి సంఖ్య 20,21,084కు చేరుకుంది. ప్రస్తుతం 22,50,000వరకు ఉంటాయని నిపుణుల అంచనా. ఒక్కో బోరుబావిపై రైతులు ఖర్చుపెడుతున్నది సగటున లక్షరూపాయలనుకుంటే ఇన్ని బోరుబావులపై రైతులు పెట్టిన ఖర్చు 22,500 కోట్లకు పైగానే ఉంటుంది. నేడు మనరాష్ట్రంలో 1,43,00, 000 ఎకరాలు సాగుకు అనుకూలమైన భూమి ఉంటే అందులో సాగవుతుంది మాత్రం గరిష్టంగా ఒక కోటీ పది లక్షల ఎకరాలు మాత్రమే. ఈ పంటభూమిలో మూడింట ఒకవంతు భూమికి సాగునీటి వసతి 6 భారీ, 30 మధ్యతరహా, 41.131 చెరువుల, కుంటల వ్యవస్థల ద్వారా ప్రభుత్వం గత కొంతకాలంగా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కల్పించింది. నీటివసతి గల భూమిలో మూడింట రెండువంతుల భూమికి రైతులే స్వయానా బోర్లద్వారా నీటివసతిని ఏర్పాటు చేసుకున్నారు. కానీ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది ప్రశ్న? పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ఈ బోరుబావుల రైతులంతా చిన్నసన్నకారురైతులే. వీళ్లంతా అరెకరం నుండి ఐదు ఎకరాల లోపు వ్యవసాయభూకమతాలు కల్గిఉన్నవారే. వీళ్లలో మెజార్టీ రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందినవారు. 80శాతం పైగా బోరుబావులున్నవి వీళ్ల వ్యవసాయక్షేత్రాల్లోనే. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో 80శాతం వరకు ఈ కుటుంబాల నేపథ్యంలోని వారేనని నిపుణుల అంచనా. ఈ చిన్నసన్నకారు రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులపై, బంధుమిత్రులపై వ్యవసాయంలో తమ పెట్టుబడి అవసరాల కోసం ఆధారపడుతున్నారు. వడ్డీరేట్లు అధికంగా ఉండటంతో రుణాలు తీర్చలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలోని బోరుబావులలో 25శాతం బోరుబావులు మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నాయి. మిగతావన్నీ డేంజర్ జోన్లోనివే. భూగర్భజలాశయం ఒకబ్యాంకు లాంటిది. బ్యాంకులో మనం ఎంత డబ్బును జమచేస్తే అంతే తీసుకోగలం. అలాగే ఎంత వాననీరు భూగర్భజలాశయానికి చేరుతుందో అంతనీటిని మాత్రమే మనం బయటకు తీసి వాడుకోవాలి. రాష్ట్రంలోని బోరుబావులను, వాటి సంబంధిత రైతుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసే నిమిత్తం నిపుణులతో కూడిన ఒక కమిటీని వేసి వారి సూచనలు, సలహాల ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి. దాంతోపాటు దక్కన్‌పీఠభూమిలో భాగంగా ఉన్న మన రాష్ట్ర నైసర్గిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లక్షల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన భారీ నీటిపారుదల ఎత్తిపోతల పథకాలకు స్వస్తి పలికి వీటికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ జలవనరుల నిపుణులు హన్మంతరావు ప్రతిపాదించిన చతుర్విద జలప్రక్రియను చేపట్టాలి. చైనా, రాజస్తాన్ లాంటి ప్రాంతాల్లో హన్మంతరావు ప్రతిపాదించిన చతుర్విద జలప్రక్రియ సత్ఫలితాలనిస్తున్నట్లుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ విధానం మన రాష్ట్ర నైసర్గిక స్వరూపానికి అనుగుణంగా ఉండి సత్ఫలితాలనిస్తుంది. వ్యాసకర్త ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ‘ మొబైల్: 98491 36104 ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ -
‘రైతుల ఆత్మహత్యలకు కారణమెవరు?’
సాక్షి, హైదరాబాద్: రైతులను బంధువులా ఆదుకుంటామని చెప్పే సీఎం కేసీఆర్ పాలనలో రోజుకు 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అధికారుల నివేదికలో స్పష్టమైందని, ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి నిలదీశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాన్ని గుర్తించి రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, కానీ వేలమంది ప్రాణాలు పోయేవరకు విభజన విషయంలో నిర్ణయాన్ని జాప్యం చేసినట్లుగా చూపిస్తూ కాంగ్రెస్‌ను కేసీఆర్ దోషిగా చిత్రీకరించారని ఆరోపించారు. వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే వరకు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టకుండా చోద్యం చూసిన టీఆర్ఎస్ అధిష్టానాన్ని దోషి అనాలా? క్రిమినల్ అనాలా? అని ఆమె ప్రశ్నించా రు. ఒకేసారి రుణమాఫీ, నిజమైన శ్రామిక కౌలుదారులకు రైతుబంధు, గిట్టుబాటు ధర చెల్లించని టీఆర్ఎసే ఇందుకు కారణమని ధ్వజమెత్తారు. నెల రోజులు గడిచినా జవాబు చెప్పడానికి ఇక్కడ ఇంకా సర్కార్ -
బండి సుధాకర్ కుటుంబానికి సాయం అందేనా?
వ్యవసాయాన్నే జీవనాధరం చేసుకొని కుటుంబ పోషణ కోసం రేయింబవళ్లు కష్టపడినా.. కాలం కలసి రాక పేరుకుపోయిన అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. బంగి సుధాకర్ ఆత్మహత్య పాలై 16 నెలలు గడిచినా పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని తెలుసుకుంటే ఎవరికైనా గుండె గొంతుకలోకి వస్తుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండల కేంద్రానికి చెందిన సుధాకర్(35) అనే రైతు అప్పుల పాలై 2017 ఆగస్టు 24న పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తండ్రి సోమన్న పేరు మీద∙రెండు ఎకరాల పొలం ఉంది. దీనికి తోడు మరో 13 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. అయితే, సొంత పొలం కేవలం రెండు ఎకరాలే ఉందన్న సాకుతో బ్యాంకులో అప్పు ఇవ్వలేదు. దీంతో వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి సాగు కోసం రూ.5 లక్షలు అప్పులు చేశాడు. కొండంత ఆశతో సాగు చేసిన పంటలు వర్షాల్లేక సరిగ్గా పండకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. చేసిన రూ.5 లక్షల అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో కలవరం మొదలై పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య అనుమంతమ్మ, 4గురు పిల్లలు ఉన్నారు. కుమార్తె స్ఫూర్తి(11) ఆరో తరగతి, గణేష్(9) నాలుగో తరగతి, కవల పిల్లలు రాజు, రాజేష్ (5) యూకేజీ చదువుతున్నారు. ఆర్డీఓ విచారణ చేసి వెళ్లారు.. సాయం అందలేదు.. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో నలుగురు పిల్లల పోషణ తనకు కష్టంగా మారిందని అనుమంతమ్మ అన్నారు. కూలీ నాలీ చేసి పిల్లల ను పోషిస్తున్నారు. ఆదోని ఆర్డీఓ వచ్చి విచారణ చేసి వెళ్లారని, అయినా తమకు ఎలాంటి సహయం చేయలేదన్నారు. – పి. గోపాల్, సాక్షి, పత్తికొండ, కర్నూలు జిల్లా -
కనికరం ఏది?
-
రుణమే యమపాశమై..
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మీదేవీ నాయుడు చిన్న రైతు. తొలకరిలో కురిసిన వర్షంతో పత్తి, మిర్చి సాగు చేశారు. ఆ తర్వాత వరుణదేవుడు ముఖం చాటేయడంతో పంటలు నిలువునా ఎండిపోయాయి. అప్పులు పెరిగిపోయాయి. దిక్కుతోచని స్థితిలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. కనికరం లేని పాలకులు మొఖం చాటేశారే కానీ ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం భేతాళపురం గ్రామానికి చెందిన దున్న లక్ష్మీనారాయణ ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట తిత్లీ తుపానుకు ధ్వంసమైంది. ప్రభుత్వం నుంచి ఆయనకు నయా పైసా సాయం అందలేదు. అప్పుల భారం పెరిగి బతుకు భారమై పంట చేలో శవమై తేలాడు. సాక్షి, అమరావతి:రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల రైతన్నలు పెద్ద ఎత్తున బలవన్మరణాలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక వేల సంఖ్యలో అన్నదాతలు తనువు చాలిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పెదకడబూరుకు చెందిన రైతు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి ఓ రైతు తనువు చాలించగా ఆయన భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రైతు దంపతుల ఆత్మహత్యాయత్నంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ప్రకాశం జిల్లాలోనూ ఓ యువరైతు వరుసగా మూడేళ్ల పాటు అప్పుల పాలు కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరువు ప్రాంతాలకు వెళ్లని సీఎం.. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఇటీవల అన్నదాతల చావుకేకలతో మార్మోగుతోంది. పంట పొలాలు మరుభూములుగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారుతోంది. సీఎం చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ వర్తించకపోవడం, అరకొర మాఫీ వడ్డీలకే సరిపోక బ్యాంకులకు డిఫాల్టర్లుగా మారి దిక్కుతోచని స్థితిలో పలువురు రైతులు చనిపోతుండగా అననుకూల పరిస్థితుల్లో పంట పండించినా గిట్టుబాటు ధర రాక మరికొందరు, ప్రైవేట్ వ్యాపారుల నుంచి 4 – 5 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి సంక్షోభంలో చిక్కుకుని ఇంకొందరు రైతులు మరణిస్తుంటే ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, పంటల బీమాను పట్టించుకోకుండా రైతులను గాలికి వదిలేసింది. ధరలలో వ్యత్యాసం కింద ఇస్తామని ప్రకటించిన స్థిరీకరణ నిధుల్ని గానీ, మొక్కజొన్న, కంది, మిర్చికి ఇస్తామన్న బోనస్ మొత్తాల్ని గానీ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. పంటల సాగుబడి వ్యయం భారీగా పెరిగినా, వరుస కరువులు, తుపాన్లు వెంటాడుతున్నా సర్కారు కనికరం చూపడం లేదు. రైతు ఆత్మహత్యల్ని గుర్తిస్తే ఎక్కడ సాయం ఇవ్వాల్సి వస్తుందోనన్న భయంతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉన్నట్టు వృద్ధి రేటుపై గొప్పలు చెబుతోంది. నాలుగున్నరేళ్లుగా వరుస కరువులు, ప్రకృతి విపత్తులు, తుపాన్లతో రైతులు కకావికలమై ఊళ్లకు ఊళ్లు వలస వెళుతున్నా ప్రభుత్వం మొండిచెయ్యే చూపుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్లలో ఇంతవరకు నయాపైసా కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఆత్మహత్యల నివారణకు చొరవ చూపించి రైతన్నల్లో మనోధైర్యం నింపాల్సిన ముఖ్యమంత్రి కనీసం కరువు పీడిత జిల్లాల్లో పర్యటించకపోవడం దురదృష్టకరమని వ్యవసాయ రంగ ప్రముఖులు విమర్శిస్తున్నారు. కనికరం ఏది? రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి కేవలం 347 మండలాలను రాష్ట్ర ప్రభుత్వమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. వాస్తవానికి అన్ని మండలాల్లోనూ కరువు తాండవిస్తోందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అయితే కరువు ప్రాంతాలను ప్రకటించారే గానీ కరువు మాన్యువల్ ప్రకారం ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలను ప్రకటించలేదు. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోయిన రైతులకు రూ.2 వేల కోట్లను పెట్టుబడి రాయితీగా ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు ఇవ్వలేదు. పంటల బీమా లెక్కల్ని ఇంతవరకు తేల్చలేదు. ఫలితంగా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవాల్సి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా తగ్గిపోతోంది. రబీలో మొత్తం సాగు విస్తీర్ణం 23.43 లక్షల హెక్టార్లకుగానూ ఇప్పటి వరకు సగం ప్రాంతంలో కూడా విత్తనాలు పడలేదు. మరో వారంలో సీజన్ కూడా ముగియబోతోంది. రెండు సీజన్లలో కలిపి రైతులు రూ.19 వేల కోట్ల పెట్టుబడులు నష్టపోయినట్టు అనధికార అంచనా. వడ్డీకీ చాలని మాఫీ 2014లో చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం రాష్ట్రంలో సుమారు రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.15,038 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అయితే ఇది రైతులు చెల్లించాల్సిన వడ్డీలకు కూడా సరిపోకపోవడంతో వారికి సకాలంలో రావాల్సిన ఏ రుణమూ అందకుండా పోయింది. వారికి కొత్తగా అప్పులిచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఫలితంగా ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తెచ్చి సాగు చేసి చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. బీమా పరిహారానికీ మొండిచెయ్యి కరువుల్ని జయించానని, సముద్రాలను గెలిచానని తరచూ చెప్పే సీఎం చంద్రబాబు రైతుల ఇక్కట్లను పట్టించుకోకుండా అభివృద్ధి రేట్లంటూ అంకెల గారడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది వ్యవసాయాభివృద్ధి రేటు 16.55 శాతంగా నిర్ణయించి ఆ దిశగా ముందుకు సాగుతున్నట్టు చెప్పుకోవడం గమనార్హం. ఒకవైపు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రాక రైతులు అల్లాడిపోతున్నారు. కనీస మద్దతు ధరలకు మార్కెట్ ధరలకు ఎటువంటి పొంతన లేకుండా పోయిందనే దానికి రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే వరే ప్రత్యక్ష నిదర్శనం. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1750 ఉంటే రూ.1,100 – రూ1,200 మించి ఎవరూ కొనడం లేదు. ఈ పరిస్థితుల్లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో చిక్కుకుపోయి మరోమార్గం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ దుస్థితిపై హైకోర్టు సైతం ఇటీవల స్పందిస్తూ.. రైతులు కష్టాలు చెప్పుకునేందుకు ఓ చట్టబద్ధ సంస్థ ఉండాలని సూచించినా టీడీపీ సర్కారు ఆలకించలేదు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులకు చంద్రన్న రైతు బీమా పథకం కింద ఇస్తామన్న రూ.5 లక్షలను సైతం ఇవ్వకుండా ఎగ్గొడుతూ అన్నదాతల ఆత్మహత్యలను గుర్తించడానికే ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో రైతుల్లో మనోధైర్యం నింపేలా చేయడమే తక్షణ కర్తవ్యమని రైతు సంఘాలు సూచిస్తున్నాయి. బాబు గద్దెనెక్కాక వేలల్లో రైతుల బలవన్మరణం.. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,635 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు వ్యవసాయ రంగంపై కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 2014లో ఏపీలో 164 మంది (వ్యవసాయ కూలీలు, కౌలు రైతులను కలపలేదు. వారిని కూడా కలిపితే 570 మందికి పైగా ఉంటారని అంచనా) అన్నదాతలు చనిపోయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంచనా వేసింది. 2015లో ఆ సంఖ్య 916 (వీరిలో రైతులు 516 మంది)కి పెరిగింది. 2016లో ఏపీలో 804 మంది (వీరిలో కౌలు రైతులు, రైతు కూలీలు ఉన్నారు) ఆత్మహత్యలు చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. 2017 నుంచి ఆ సంస్థ రైతుల చావుల్ని నమోదు చేయడం లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు. అంటే సగటున ఏటా రాష్ట్రంలో 7 వందల మంది రైతులు చనిపోతున్నారు. దీని అర్థం రాష్ట్రంలో పూటకో రైతు ఆత్మహత్య చేసుకున్నట్టని, ఈ నాలుగేళ్లలో 2,650 మంది చనిపోయారని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 163 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 46 మంది, అనంతపురం జిల్లాలో 44 మంది ఉన్నారు. అప్పుల భయంతో కుమిలిపోయాడు.. మాకు సేద్యం తప్ప వేరే ఆధారం లేదు. రెక్కలు విరిగేలా కష్టపడ్డా గట్టెక్కలేకపోయాం. అప్పుల భయానికి నా బిడ్డ ఎంతో కుమిలిపోయేవాడు. దీనికి అనారోగ్యం కూడా తోడవడంతో ప్రాణం తీసుకున్నాడు. చిన్నారులు అనాథలయ్యారు. అన్యాయం జరిగిపోయింది నాయనా.. – నాగన్న (మృతుడు పెద్ద రంగన్న తండ్రి) పెద్ద దిక్కును కోల్పోయాం.. మా ఇంట్లో అమ్మనాన్న తర్వాత కుటుంబ భారాన్ని మా అన్నే భుజాన వేసుకున్నాడు. సేద్యం చేస్తూ మమ్మల్ని బతికిస్తూ వచ్చాడు. పంటలు పండక తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యాం. ప్రాణాలు తీసుకోవడానికి అప్పులే ప్రధాన కారణం. ఇంటి పెద్దదిక్కును కోల్పోయాం. – చిన్న రంగన్న (మృతుడి తమ్ముడు) కరువు మండల మైనా ఏం లాభం? గత సెప్టెంబర్‌లో పెద్దకడబూరు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ లేదు. వరుస కరువులతో చితికిపోయిన తమను ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా కానరాక యువరైతు పెద్ద రంగన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. – వెంకటేశ్వర్లు, రైతు యువరైతు బలి యర్రగొండపాలెం: వరుసగా మూడేళ్లు పాటు పంటలు పండక అప్పుల పాలు కావడం, రుణం తీర్చే దారి కానరాక ప్రకాశం జిల్లాలో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యర్రగొండపాలెం మండలం పందివానిపల్లెకు చెందిన గోపు వెంకటరెడ్డి (35) తనకున్న 1.22 ఎకరాల పొలంతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అదునులో వర్షాలు కురవకపోవడం, పొలంలో బోర్లు ఎండి పోవడంతో మిరప పంట చేతికి అందలేదు. తక్కువ నీటితో సాగు చేద్దామని మొక్కజొన్న వేసినా తెగులు సోకడంతో హతాశుడయ్యాడు. గత మూడేళ్లుగా పెట్టుబడికి తెచ్చిన అప్పులు కూడా తీరకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరగడంతో మానసిక వ్యధకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం తన ముగ్గురు పిల్లలను పుల్లలచెరువు మండలం సి.కొత్తపల్లిలోని అత్త వారి ఇంట్లో అప్పగించి భార్యతో కలసి వరి కోతల కోసం గుంటూరు జిల్లా కారంపూడికి వెళ్లాడు. అక్కడ పని చేయలేక ఒంటరిగా తిరిగొచ్చాడు. అనంతరం పనులు ముగించుకొని పుట్టింటికి చేరుకున్న భార్య అంజమ్మ మంగళవారం ఉదయం భర్తకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పొరుగు వారికి ఫోన్ చేసింది. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా వెంకటరెడ్డి చీరతో ఉరి వేసుకొని చనిపోయినట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం తరువాత వెంకటరెడ్డి గ్రామంలో కనిపించ లేదని, బహుశా అదే రోజు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు తెలిపారు. మృతుడికి 11 ఏళ్ల వయసున్న కుమారుడు శివారెడ్డితోపాటు 9, 7 సంవత్సరాల వయసున్న కుమార్తెలు సుచిత్ర, లక్ష్మి ఉన్నారు. ఉసురు తీసిన అప్పులు.. వెంకటరెడ్డికి దాదాపు రూ.6 లక్షల మేర అప్పులు ఉన్నట్లు మృతుడి భార్య తెలిపింది. 2016లో యర్రగొండపాలెంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మృతుడు రూ.1.10 లక్షలు రుణం తీసుకున్నాడు. వడ్డీతో కలిసి ఇది దాదాపు రూ 1.50 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ అప్పులు కూడా ఉండటం, వాటిని తీర్చాలని ఒత్తిడి పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రాణం తీసిన అప్పులు ఆదోని/టౌన్/మంత్రాలయం/పెద్దకడబూరు: సాగు కోసం చేసిన అప్పు యమపాశమైంది. కరువు కుంగదీయగా ఏటా రుణఊబిలో కూరుకుపోవడం అన్నదాత వెన్ను విరిచింది. ఆదుకునే దిక్కు కానరాక ఆ రైతు దంపతులు పురుగుల మందు తాగారు. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా పెద్దకడబూరులో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది. భార్య కళ్లెదుటే పురుగుల మందు తాగడంతో... పెద్దకడబూరు గ్రామానికి చెందిన కురువ పెద్ద రంగన్న తన తల్లి నారాయణమ్మ పేరుతో ఉన్న 4.50 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నాడు. వర్షాభావం కారణంగా ఏటా నష్టపోవడం మానసికంగా కుంగదీసింది. ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలి? వైద్య చికిత్స కోసం డబ్బు ఎక్కడి నుంచి తేవాలనే విషయంపై భార్య సరస్వతి అలియాస్ పద్మతో సోమవారం రాత్రి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. బంధువులు వచ్చి ఇద్దరికీ సర్ది చెప్పినా పెద్దరంగన్న బలవన్మరణమే శరణ్యమని భావించాడు. మంగళవారం ఉదయం మిరప పంటను మార్కెట్‌కు తరలించేందుకు బస్తాల్లో సిద్ధం చేసిన అనంతరం ఇంటికి చేరుకుని భార్య ఎదుటే పురుగుల మందు తాగాడు. దీంతో పెద్ద రంగన్న భార్య కూడా పురుగుల మందు డబ్బాను లాక్కుని బలవంతంగా తాగింది. దీన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెద్దరంగన్న చనిపోగా పద్మ పరిస్థితి విషమంగా ఉంది. పెద్దరంగన్న మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దంపతులకు పదేళ్ల లోపు వయసున్న ముగ్గురు చిన్నారులు ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెట్టుబడులు మట్టిపాలు.. నిరుడు ఖరీఫ్‌లో ఉల్లి 90 బస్తాల దాకా దిగుబడి వచ్చినా ధరలు లేకపోవడంతో పెద్దరంగన్న దాదాపు రూ.40 వేల వరకు నష్టపోయాడు. ఎకరం పొలంలో వేసిన మిరపకు జెమిని వైరస్ సోకడంతో రూ.2 లక్షలు దాకా పెట్టుబడి మట్టి పాలైంది. వర్షాభావం, గులాబీరంగు పురుగు ఆశించడంతో పత్తి కూడా దెబ్బ తింది. దీంతో మూడు ఎకరాల్లో పత్తి పంటను గొర్రెల మేత కోసం వదిలేశాడు. పెద్ద రంగన్న స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో 2016లో పంట రుణం రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. ప్రస్తుతం వడ్డీతో కలిపి అప్పు దాదాపు రూ.1.80 లక్షలకు చేరుకుంది. ఇది కాకుండా బయట మరో రూ.4 లక్షల మేరకు అప్పు చేశాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు అఖిల (7), అజయ్ (5), ఓంకార్(3) ఉన్నారు. చెట్టంత కొడుకు తన కళ్లెదుటే శాశ్వతంగా కళ్లు మూయగా కోడలు మృత్యువుతో పోరాడుతుండటాన్ని చూసి పెద్ద రంగన్న తల్లిదండ్రులు నాగన్న, నారాయణమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
కర్నూలులో రైతు దంపతులు ఆత్మహత్యయత్నం
-
రైతుల వినతులను 3 నెలల్లో పరిష్కరించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు తమ కష్టాలు, సమస్యలపై సమర్పించే వినతి పత్రాలను 3 నెలల్లో పరిష్కరించాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్‌కు తెలిపింది. రైతు సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రైతు రుణ విమోచన కమిషన్ ఇచ్చే ఆదేశాలను అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి రైతుల సమస్యలు తెలుసుకోవచ్చునని, పరిష్కారానికి తగిన ఆదేశాలూ జారీ చేయవచ్చునంది. జిల్లా కేంద్రాల్లో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏర్పాటు చేయవచ్చునని, దీనికి అవసరమైన సహాయ సహకారాల్ని అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చారు.. అందులో ఎన్ని పరిష్కరించారు.. తదితర విషయాలపై 3 నెలలకోసారి కమిషన్ తన నివేదికను రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శికి సమర్పించాలని తెలిపింది. వాటిని పరిశీలించి అవసరాన్ని బట్టి తాము తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసు కెళ్లేందుకు క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయసేవాధికార సంస్థ, పారా లీగల్ వలంటీర్లు తగిన సహాయ సహకారాలు అందించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు ఆత్మహత్యల నివారణకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పి.శ్రీహరిరావు, సామాజిక కార్యకర్త డి.నర్సింహారెడ్డి, మరికొందరు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కమిషన్‌కు సదుపాయాలు కల్పించాం ఈ వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపించారు. రైతుల కోసం రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేశామని, కమిషన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం ఓ కొత్త పథకం ప్రకటించనుందని వెల్లడించారు. రైతుబంధు కింద సాయాన్ని మరింత పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. -
అయ్యో.. రైతన్నా
ఆరుగాలం కష్టం చేసి జీవించే రైతన్నకు అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. ఏ పనిచేయాలన్నా ప్రాణాల మీదకే వస్తున్నాయి. కొందరు ప్రమాదవశాత్తు చనిపోతుండగా కొందరు చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. శుక్రవారం అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా దుక్కి దమ్ము చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతిచెందాడు. అప్పుల బాధతో.. గణపురం: చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జయశంకర్ జిల్లా గణపురం మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపురం మండల కేంద్రానికి చెందిన పాశికంటి రాజయ్య(45) తనకున్న కొద్దిపాటి భూమితో పాటు నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడికి తెచ్చిన అప్పులు పెరిగాయి. పంట దిగుబడి రాక అప్పులు తీర్చలేక శుక్రవారం తన చేను వద్దకు వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో క్రిమీ సంహారక మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమీప వ్యవసాయ భూముల్లో ఉన్న రైతులు గమనించి 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ములుగు సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో రాజయ్య మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య సుగుణ, కుమార్తె , కుమారుడు ఉన్నారు. పురుగు మందు తాగి .. గార్ల(ఇల్లందు): ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగు మందు సేవించి ఓ రైతు మృతిచెందిన సంఘటన శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పూమ్యా తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గార్ల మండలం పూమ్య తండాకు చెందిన ఇస్లావత్ పంతు(46) కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పత్తి చేను కోసం తెచ్చిన పురుగు మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇరుగు పొరుగు వారు చూసి హుటాహుటిన పంతును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందా డు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం. కుమారుడు కల్యాణ్ ఫిర్యాదు మేరకు ఏఎస్సై యాకుబ్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి కొత్తగూడ(ములుగు): ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన సంఘటన కొత్తగూడ మండలం కోనాపురంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతిరెడ్డి కిషన్‌రెడ్డి తనకున్న జాన్‌డీయర్ ట్రాక్టర్‌కు రోటోవేటర్‌తో నారుమడి దమ్ముచేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కన ఉన్న గుంతలోకి ఒక టైర్ దిగడంతో ఒకవైపు బోల్తాపడింది. ఘటనలో కిషన్‌రెడ్డి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సరిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పద్దర్మ మంత్రి చందూలాల్ తనయుడు ధరంసింగ్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని పరామర్శించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తాహెర్‌బాబా తెలిపారు.