సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న విషయాన్ని మరోసారి నిజం చేసి చూపించారు. ఇప్పటికే కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించడానికి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పంటకు కనీస మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబానికి తక్షణమే సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
దీంతో రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి వ్యవసాయశాఖ కొత్త ఆలోచనా విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం 13 జిల్లాలకు రూ. కోటి చొప్పున రూ.13 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు రూ. కోటి రూపాయలు చొప్పున వారి గ్రీన్ చానెల్ అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఇక మీదట దురదృష్టవశాత్తు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే తక్షణమే వారి కుటుంబాలకు జిల్లా కలెక్టరే స్వయంగా వెళ్లి ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment