సాక్షి, హైదరాబాద్: రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చే యూత, సాగునీటి ప్రాజెక్టులు, వనరుల కారణంగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గతంతో పోలిస్తే 300 శాతం తగ్గాయని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగం ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, వి.గంగాధర్ గౌడ్, తాత మధులతో కలిసి ఆయన బీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.
2014లో 1,300 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అది ఇప్పుడు 352గా ఉందని, నీతి ఆయోగ్ వంటి సంస్థ తెలంగాణలో వ్యవసాయ స్థితిగతులు బాగున్నాయని కితాబిచి్చందని గుర్తు చేశారు. కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పది శాతంలోపు తగ్గితే తెలంగాణలో 300 శాతం తగ్గాయని, వివిధ కారణాలతో భూ మి లేనివారు ఆత్మహత్యలు చేసుకుంటే కూ డా రైతుల ఖాతాలో వేస్తున్నారని అన్నారు. ఎవరు ఆత్మహత్య చేసుకున్నా అది బాధాకరమే అని, తప్పుడు లెక్కలతో ఓ పత్రిక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అసత్యా లు ప్రచారం చేస్తుందని విమర్శించారు.
చదవండి: సర్పంచ్‌లూ అర్థం చేసుకోండి!.. కేంద్రం రూ.1,100 కోట్ల నిధులు ఆపేసింది
Comments
Please login to add a commentAdd a comment