పాదయాత్రలో స్వాగతం పలికిన దివ్యాంగురాలిని పలకరిస్తున్న షర్మిల
బూర్గంపాడు: అప్పుల బాధ, కల్తీవిత్తనాల బెడద, రుణమాఫీలో జాప్యం వంటి కారణాలతో జరుగుతున్న రైతుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ముసలిమడుగు గ్రామం నుంచి ప్రారంభమై రామాపురం, కృష్ణసాగర్ క్రాస్‌రోడ్స్, మల్లెలమడుగు, మొండికుంట, కొత్తూరు మీదుగా తుమ్మలచెరువు వరకు కొనసాగింది.
ముసలిమడుగులో నిర్వహించిన రైతుగోస దీక్షలో ఆమె మాట్లాడుతూ ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో 8 వేల మంది, గత 6 నెలల్లో వెయ్యి మందికిపైగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వ్యవసాయాన్ని పండుగలా, రైతులను రాజులుగా చేస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు ఆ రైతుల భూములనే లాక్కుంటూ వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment