చాడ గ్రామంలో ఎండిపోయిన పొలాన్ని పరిశీలిస్తున్న ఏఈఓ
సాక్షి, మోటకొండూర్(నల్గొండ) : దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఏ సీజన్‌లోనైనా కష్టాలు మాత్రం తప్పటం లేదు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకపోవడం ఒక కారణమైతే.. కురిసిన వర్షపు నీటిని నిల్వచేసే చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్యాక్రాంతం అయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం మరో కారణం. వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతుందటంతో భూగర్భ జలాలు నానాటికి అడుగంటి బోర్లు వట్టిపోతుండటంతో రైతులకు కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయి.
రబీ సాగు వివరాలు ఇలా..
మండల వ్యాప్తంగా 15,275 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉండగా అందులో రబీలో 1,322 హెక్టార్ల విస్తీరణంలో సాగుచేశారు. అందులో వరి 890 హెక్టార్లు, జొన్నలు 6 హెక్టార్లు, మినుములు 6 హెక్టార్లు, శెనిగలు 25 హెక్టార్లు, వేరుశెనిగలు 30 హెక్టార్లు, కొర్రలు ఒక హెక్టార్, కూరగాయలు 90హెక్టార్లు, మొక్కజొన్న 270హెక్టార్లు సాగు చేపట్టారు. కాగా గత రబీ సీజన్‌లో 3,412 హెక్టార్లలో సాగుచేయగా వర్షాల లేమి కారణంగా ఈ రబీ సీజన్‌లో సగానికి పైగా సాగు తగ్గింది. ప్రసుత్తం సాగు చేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో రైతున్నలు ఆకాశంవైపు ఆశగా చూస్తున్నారు.
భూగర్భజలాలు అడుగంటాయి
వర్టూర్ గంగబావి వద్ద నాకు 9ఎకరాల భూమి ఉంది. అందులో 3ఎకరాలు పత్తి, 2ఎకరాలు కంది, ఎకరం వరి పంట వేశాను. వరికి మరో 20 రోజులు నీళ్లు అందితే పంట చేతికొచ్చేది. కానీ నీళ్లు అందక ప్రస్తుతం ఎండిపోయింది. కాగా నాకు రెండు బోర్లు ఉన్నాయి. గత రబీ సీజన్‌లో 2.5ఎకరాలలో వరి పంట పండించాను. ఇప్పుడు ఎకరం కూడా పారే పరిస్థితిలేదు.
– సింగిరెడ్డి సాయిరెడ్డి, రైతు
Comments
Please login to add a commentAdd a comment