
సాక్షి, హైదరాబాద్: రైతులను బంధువులా ఆదుకుంటామని చెప్పే సీఎం కేసీఆర్ పాలనలో రోజుకు 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అధికారుల నివేదికలో స్పష్టమైందని, ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి నిలదీశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాన్ని గుర్తించి రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, కానీ వేలమంది ప్రాణాలు పోయేవరకు విభజన విషయంలో నిర్ణయాన్ని జాప్యం చేసినట్లుగా చూపిస్తూ కాంగ్రెస్‌ను కేసీఆర్ దోషిగా చిత్రీకరించారని ఆరోపించారు.
వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే వరకు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టకుండా చోద్యం చూసిన టీఆర్‌ఎస్ అధిష్టానాన్ని దోషి అనాలా? క్రిమినల్ అనాలా? అని ఆమె ప్రశ్నించా రు. ఒకేసారి రుణమాఫీ, నిజమైన శ్రామిక కౌలుదారులకు రైతుబంధు, గిట్టుబాటు ధర చెల్లించని టీఆర్‌ఎసే ఇందుకు కారణమని ధ్వజమెత్తారు. నెల రోజులు గడిచినా జవాబు చెప్పడానికి ఇక్కడ ఇంకా సర్కార్