సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు అండ్ కో తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 33 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2019 వరకు అధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయని తెలిపారు. రైతుల ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. దేశంలో రైతులకు ఏ రాష్ట్రంలో ఇవ్వని పథకాలను ఏపీలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పెట్టుబడి సహాయం చేస్తున్నట్లు కన్నబాబు వెల్లడించారు. (చదవండి : రైతులకు బేడీలు వేసిన ఘనత చంద్రబాబుదే)
Comments
Please login to add a commentAdd a comment