సాక్షి, విజయవాడ: అమరావతిని తన మనుషులకు దోచి పెట్టడానికి, రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకున్నాడని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమాన్ని వెనకుండి నడిపించింది చంద్రబాబే. బాబు స్వయంగా జోలె పడితే.. బంగారు గాజులు వితరణ ఇచ్చిన పరిస్థితిని చూశాం. సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి అంటున్నారు. దేనికి క్షమాపణ చెప్పాలి?. చంద్రబాబు అమరావతిని రాజధాని చేస్తానని.. నీరు మట్టితో సరిపెట్టినందుకా..?. రైతుల నుంచి తీసుకున్న భూమిలో గజం కూడా వెనక్కి ఇవ్వకుండా కాలక్షేపం చేసినందుకా..?. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని.. చంద్రబాబును ఎందుకు అడగలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌నే నిందిస్తారు. చంద్రబాబు ఏం మాట్లాడతాడో పవన్ కళ్యాణ్ కూడా అదే మాట్లాడతాడు.
చదవండి: (మా విధానానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం: మంత్రి బొత్స)
బాబు అవసరంలేదని తేల్చేశారు
ఈ రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలు చేసే ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. రాజకీయం, పదవులు తప్ప కుటుంబంతో, మనుషులతో సంబంధం లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాలకు చంద్రబాబు అవసరం లేదని మొన్నటి ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించారు. అమరావతి ప్రాంతంలో పోటీ చేసిన ఆయన కొడుకుని కూడా ఓడించి చూపారు. రాజకీయాలకు ఎవరు అవసరమో, ఎవరు అవసరం లేదో చంద్రబాబు సర్టిఫై చేయనవసరం లేదు. తన అధికారాన్ని జగన్ కూకటివేళ్లతో కూల్చేశారనే ఉక్రోషం బాబుది.
చదవండి: (అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకో: మంత్రి కన్నబాబు)
ఇక మళ్లీ అధికారంలోకి వస్తామో లేదో అనే భయంలో చంద్రబాబు ఉన్నారు. రోజురోజుకీ జనం గుండెల్లో నిలిచిపోతున్న వ్యక్తి జగన్. తప్పులు చేయకుండా, అవినీతి చేయకుండా పాలన చేయాలనేదే సీఎం జగన్ ఆలోచన. కోర్టు తీర్పును చూస్తే చంద్రబాబుకు హ్యాపీగానే ఉంటుంది. ఒక ప్రాంతమే బాగుపడాలని ఆయన కోరుకున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మేము కోరుకున్నాం. మేం కోర్టులను గౌరవిస్తున్నాం. కోర్టు తీర్పును ప్రభుత్వం పరిశీలిస్తుంది' అని మంత్రి కన్నబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment