సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతి అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటున్నామని పేర్కొన్నారు. ‘‘దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. 33 శాతం పంట నష్టపోతేనే పరిహారమంటూ బాబు హయాంలోనే జీవో వచ్చింది. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా నాటకాలాడింది చంద్రబాబు కాదా?. మేం ఎప్పటికప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం.పొగాకును సైతం కొనుగోలు చేశాం.ఆర్‌బీకేలను పంటల కొనుగోలు కేంద్రాలుగా చేశామని’’ మంత్రి కన్నబాబు తెలిపారు. (చదవండి: ఏలూరులో తాగునీరు సురక్షితమే..)
Comments
Please login to add a commentAdd a comment