సాక్షి, కాకినాడ: చంద్రబాబు ఎప్పటికీ రైతుబంధు కాదు రైతు రాబందు అంటూ మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'అమరావతిపై తీర్పు వచ్చిన తర్వాత చంద్రబాబులో ఆత్మవిశ్వాసం పెరిగిపోయినట్టుంది. మీరు చేసినవే చట్టాలా.. మేము చేసినవి చట్టాలు కావా?. మీరు చేసిన చట్టాలు పనికొచ్చినప్పుడు మేము చేసినవి ఎందుకు పనికిరావు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం.
చదవండి: (అసెంబ్లీకి ఉన్న హక్కులపై చర్చించాలని భావిస్తున్నాం: శ్రీకాంత్‌రెడ్డి)
అమరావతి ఒక్కటే అభివృద్ధి అంటే అది రియల్ ఎస్టేట్ అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం నుంచి తీసుకుంది ఎవరు?. ప్యాకేజీ కోసం వారం వారం పోలవరం అంటూ డ్రామా చేసింది మీరు. ఆర్‌అండ్‌ఆర్ అడిగిన రైతులపై కేసులు పెట్టిన చరిత్ర టీడీపీది. వ్యవసాయం దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యవసాయ శాఖను మూసేయడానికి ఆ శాఖ ఏమన్నా టీడీపీ ఆఫీసా' అంటూ చంద్రబాబుపై మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
'ప్రజల ఆకాంక్ష మేరకే మూడు రాజధానులు. వేల కోట్ల రూపాయలు పంటలకు రుణం ఇచ్చిన ప్రభుత్వం మాది. భారతదేశ చరిత్రలో రైతులకు ఎస్ఈజెడ్ భూములు తిరిగి ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. దమ్మున్న నాయకుడు సీఎం జగన్. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత మాది. రైతులకు ఉచిత పంటల బీమా చేయించిన ఘనత మాదే' అని మంత్రి కన్నబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment