
సాక్షి, విజయవాడ: పంటల ప్రణాళికలకు ఈ ఏడాది నుంచి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బుధవారం ఆయన వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఖరీఫ్ సన్నద్ధత, వైఎస్సార్ పొలంబడి, విత్తనాలు, ఎరువుల సరఫరాపై మంత్రి సమీక్షించారు.
ఆర్బీకేల మౌలిక సదుపాయాల కల్పనపై సూచనలిచ్చారు. క్రాప్ ప్లానింగ్, ప్రత్యామ్నాయ పంటలపై జేసీలు దృష్టి సారించాలన్నారు. జులై 8న వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నామని.. జులై 8న కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హబ్‌లు ప్రారంభిస్తామని తెలిపారు. వరికి సంబంధించి సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు చాలా ముఖ్యమని, బోర్ల కింద పండించే వరి పంటలకి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని కన్నబాబు అన్నారు.
చదవండి: వైఎస్ఆర్ బీమాపై సమీక్ష: సీఎం జగన్ కీలక నిర్ణయాలు
సీఎం జగన్‌ను కలిసిన ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు
Comments
Please login to add a commentAdd a comment