సాక్షి, విజయవాడ: ప్రస్తుతం ప్రపంచం కనపడని శత్రువుతో యుద్ధం చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కరోనా మహమ్మారి పోరులో ప్రజలకు వైద్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ కూడా చాలా ముఖ్యమన్నారు. కాగా కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవడానికి ఏపీ మంత్రులంతా ముందుకు వస్తున్నారని, సామాజిక దూరం ద్వారా ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈక్రమంలో ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 40 వేల మందికి సరుకులు పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. (లాక్‌డౌన్: 50 శాతం కూలి అదనం)
అయితే టీడీపీ నేత చంద్రబాబు హోం క్వారంటైన్‌లో ఉండి ఉత్తరాలు రాస్తున్నారని మంత్రి విమర్శించారు. చంద్రబాబు ఇంకా భ్రమలో ఉన్నారా లేక ఆయన నైజమే అలా ఉందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. వ్యవస్థలను విధ్వంసం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి గాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేదన్నారు. ఈ విపత్కర పరిస్థితిలో మీ పాలన ఎలా ఉందో ఉత్తరాంధ్ర ప్రజలు చెబుతున్నారన్నారు. ఇక టీడీపీ అధికారంలో ఉండగా టమాటకు గిట్టుబాటు ధరలు కల్పించారా అని ప్రశ్నించారు. నష్టం వచ్చిన మొక్కజొన్న, జొన్న, రబి, టమాటా, అరటి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి న్యాయం చేయ్యమని బాబు ఎందుకు లేఖ రాయడం లేదన్నారు. పోస్టు కార్డుల ఉద్యమంలా చంద్రబాబు లేఖలు బీజేపీ, సీపీఐ, జనసేన, పార్టీలు చంద్రబాబు తోక పార్టీల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని మంత్రి విమర్శించారు. (ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment