సాక్షి, విజయవాడ: కరోనాపై భయాందోళనలు కలిగించడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎజెండా అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం ఎలా నడపాలో చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు, మొసలి కన్నీళ్లు ప్రజలకు తెలుసన్నారు. ‘‘అలిపిరి సంఘటన జరిగినప్పుడు, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీనే రద్దు చేసిన గొప్ప అడ్మినిస్ట్రేటర్ బాబు’’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. గోదావరి పుష్కరాలలో 29 మందిని బలి తీసుకున్న బాబు.. ప్రభుత్వ యంత్రాంగం ఎలా నడపాలో సీఎం వైఎస్ జగన్‌కి పాఠాలు చెప్పడం హాస్యాస్పదమన్నారు.
‘‘ప్రధాని మోదీ సీటులో బాబు కూర్చొని.. దేశంలో కరోనా కట్టడి చేయొచ్చు కదా?. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడిగా వెళ్లి ఈ భూగోళంలో కరోనా లేకుండా తరిమి కొట్టొచ్చు. ఇన్ని కబుర్లు చెబుతున్న చంద్రబాబు, లోకేశ్‌లు తిరుపతి ఉపఎన్నికలో పక్షం రోజులపాటు గల్లీ గల్లీ తిరిగి ఎందుకు ప్రచారం చేశారు’’ అంటూ రామచంద్రయ్య చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లకుండా అత్యంత బాధ్యతగా వ్యవహరించిన ఏకైక నాయకుడు దేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని సి.రామచంద్రయ్య అన్నారు.
చదవండి: 600 మంది ప్రాణాలను కాపాడిన ఏపీ పోలీసులు
కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment