'ఫిబ్రవరి 2 న వైఎస్ జగన్ యువభేరీ' | Ys jagan yuvabheri to be held on Feb 2, in Srikakulam district | Sakshi
Sakshi News home page

'ఫిబ్రవరి 2 న వైఎస్ జగన్ యువభేరీ'

Published Sun, Jan 31 2016 6:45 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Ys jagan yuvabheri to be held on Feb 2,  in Srikakulam district

శ్రీకాకుళం: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వైఎస్ జగన్ యువభేరీ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 2వ తేదీన జరుగనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం జరుగనున్నట్టు చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆదర్శ ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకోవడాన్ని ఎద్దేవా చేశారు. ఏ రంగంలో విజయం సాధించారని చంద్రబాబుకు ఆదర్శ ముఖ్యమంత్రి బిరుదు ఇచ్చారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement