27 నుంచి వైఎస్సార్ సీపీ జిల్లాల వారీ సమీక్షలు | YSR CP district wise reviews to be started from Nov 27 | Sakshi
Sakshi News home page

27 నుంచి వైఎస్సార్ సీపీ జిల్లాల వారీ సమీక్షలు

Published Tue, Nov 25 2014 2:07 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

YSR CP district wise reviews to be started from Nov 27

ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ముగ్గురు సభ్యుల కమిటీ పర్యటనలు
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల పర్యవేక్షణకు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ నెల 27వ తేదీ నుంచి తిరిగి జిల్లా పర్యటనలు చేపట్టనుంది. కమిటీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజులు వరుసగా ఐదు రోజుల పాటు ఐదు జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంబంధిత జిల్లా ఇన్‌చార్జిలు, ఆయా జిల్లాలకు చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లాలో పార్టీ నేతలందరూ ఈ సమావేశాలకు హాజరవుతారు.
 
 గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో పార్టీలో కీలకంగా పనిచేసే నేతలందరిని సమావేశాలకు ఆహ్వానిస్తారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా, సేవాదళ్ విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధా, బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, కార్మిక విభాగం అధ్యక్షుడు గౌతంరెడ్డి, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున, న్యాయవిభాగం అధ్యక్షుడు పి.సుధాకర్‌రెడ్డి, ఎస్టీ విభాగం అధ్యక్షుడు బాలరాజు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు, పార్టీ కార్యదర్శి చల్లా మధుసూదన్‌రెడ్డిలు ఈ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు.
 
 పార్టీ విద్యార్థి విభాగాలకు నియామకాలు
 నెల్లూరు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులను పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగంలో నియమిస్తూ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎల్.డేవిడ్ (పశ్చిమగోదావరి), రాష్ట్ర కార్యదర్శులుగా ఎల్.రాజశేఖరరెడ్డి (చిత్తూరు), ఆవుల తులసీరాంయాదవ్ (నెల్లూరు), కె.కృష్ణస్వరూప్, డి.నవహర్ష (పశ్చిమగోదావరి)లను నియమించారు. రాష్ట్ర ఉప కార్యదర్శులు ఎస్.చక్రధర్ (చిత్తూరు), ఎస్.హాజీ, బి.శివశంకర్ గుప్తా (నెల్లూరు)లను.. కార్యవర్గ సభ్యులుగా ఇ.హేమంత్‌యాదవ్ (చిత్తూరు), జి.మహేష్‌రెడ్డి (నెల్లూరు) లను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement