Fisher men
-
కాకినాడ తీరంలో తిరగబడ్డ తెప్ప.. ఇద్దరు మత్స్యకారుల మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ తీరంలో తెప్ప తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మృతిచెందారు. సోమవారం రాత్రి సూర్యారావుపేట నుంచి హోప్ ఐల్యాండ్ వరకు అయిదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వేటక ముగించుకొని తిరిగి వస్తుండగా కెరటాల ధాటికి తెప్ప తిరగడింది. ఈ ఘటనలో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు దుమ్మలపేటకు చెందిన మైలపల్లి కృపాదాస్, సూర్యరావుపేటకు చెందిన సత్తిరాజుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తెప్ప తిరగబడి సముద్రంలో పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన విషయాన్ని కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకారుల మృతి విషయాన్ని తెలుసుకున్న సీఎం చలించిపోయి వెంటనే ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షలు నష్టపరిహారం మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. -
విశాఖ తీరంలో మరోసారి ఉద్రిక్తత
విశాఖపట్నం: విశాఖ తీరంలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రింగు వలలో వేట సాగిస్తున్నారంటూ ఒక గ్రామానికి చెందిన మత్స్యకారుల బోట్లను మరో గ్రామస్తులు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ నగరానికి ఆనుకుని ఉన్న మత్స్యకారపల్లిలో కొందరు రింగ్ వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. దీనికి సమీపంలో ఉన్న జాలరిపేట గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై రెండు వర్గాల మధ్య ఆరు నెలల క్రితం ఘర్షణ చెలరేగడంతో మంత్రి అప్పలరాజు, కురసాల కన్నబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ దశలో నిన్న రాత్రి చేపల వేట ముగించి తీరంలో లంగర్ వేసిన ఆరు బోట్లకు నిప్పు పెట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య మరొకసారి వివాదం ఏర్పడింది. తమ వలలకు దారుణంగా నిప్పు పెట్టి నష్టపరిచారని మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి రెండు గ్రామస్తుల మధ్య వివాదం చెలరేగ కుండా అడ్డుకున్నారు. అధికారుల ఆదేశాల మేరకు చేపల వేట సాగుతుందని అంతవరకు ప్రజలు సమయంనంతో ఉండాలని సూచించారు. -
బోట్లకు నిప్పు అంటించిన ఘటనలో రోడ్డెక్కిన వివాదం
Fight Between Two Groups Of Fishermen In Jalaripeta ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): మత్స్యకారుల మధ్య రాజుకున్న వివాదం బుధవారం మరోసారి రొడ్కెక్కింది. రింగు వలలతో వేట నేపథ్యంలో తీరంలోని మత్స్యకార గ్రామాల మధ్య మంగళవారం చిచ్చురేగిన విషయం తెలిసిందే. వాసవానిపాలెం, జాలరి ఎండాడ, మంగమారిపేటకు చెందిన కొందరు జాలర్లు రింగు వలలతో మంగళవారం వేటకు వెళ్లగా పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు అడ్డుకోవడంతో ఈ వివాదం తలెత్తింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా పెదజాలరిపేటకు చెందిన 8 మందికి గాయాలుకాగా వాసవానిపాలెం, మంగమారిపేటకు చెందిన 6 బోట్లు దహనమయ్యాయి. అయితే బోట్లకు నిప్పు అంటించిన ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను మెరైన్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా మళ్లీ జాలరిపేటలో వాతావరణం వేడెక్కింది. జాలరిపేటలోని మత్స్యకారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కారు. సాయంత్రం 4 గంటల సమయంలో జాలరిపేటను ఆనుకొని ఉన్న ఆర్టీసీ కూడలికి భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు. మహిళలు, యువతతో సహా వేల సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్టయిన మత్స్యకారులను విడుదల చేయాలంటూ వారంతా కొద్దిసేపు నిరసన గళం వినిపించారు. ఈ సందర్భంగా తెడ్డిరాజు, పరసన్న వంటి పలువురు మత్స్యకార సంఘ నాయకులు మాట్లాడుతూ పోలీసులు అరెస్ట్ చేసిన మత్స్యకారులను తక్షణమే విడుదల చేయాలని హెచ్చరించారు. గంటలో విడుదల చేయకుంటే బీభత్సం సృష్టిస్తామని తెడ్డి రాజు బహిరంగంగా హెచ్చరించడం, కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ తీసేందుకు కొందరు మత్స్యకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని నిలువరించారు. పెదవాల్తేర్ ఆర్టీసీ డిపో కూడలి వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారులు చదవండి: కన్న తండ్రి పైశాచికత్వం! కూతురిపై లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని సైతం మంత్రుల సదస్సుకు గైర్హాజరు రింగు వలల వివాదంపై ఇప్పటికే పలు అవగాహన సదస్సులు, సమావేశాలు మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే తాజా వివాదంతో బుధవారం మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు సమక్షంలో మరోసారి సమావేశం నిర్వహించేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది. దీంతో ఇరువర్గాల మత్స్యకార గ్రామాల పెద్దలు కలెక్టర్ ఆధ్వర్యంలో సర్క్యూట్ హౌస్‌లో నిర్వహించే సమావేశానికి హాజరు కావాల్సివుంది. అయితే ఇంతలో జాలరిపేట మత్స్యకారులు ఆందోళనకు దిగడంతో సమావేశం నిలిచిపోయింది. పూచీకత్తుతో నిందితుల విడుదల ఈ ఘర్షణల్లో భాగంగా మంగళవారం 6 బోట్లు దహనం చేసిన విషయం తెసిందే. ఈ ఘటనకు సంబంధించి మెరైన్ పోలీసులు పిల్లా నూకన్న, వాడమదుల సత్యారావును అరెస్ట్ చేశారు. అయితే జాలరిపేట మత్స్యకారుల ఆందోళన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని విడిచిపెడుతున్నట్లు ద్వారకా ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. మెరైన్ పోలీసులు వారి వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు 41 నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతోపాటు పూచీకత్తులు రాయించుకొని విడిచిపెడుతున్నట్లు వెల్లడించారు. దీంతో రాత్రి 8గంటల సమయంలో నూకన్న, సత్యారావు విడుదలై నిరసన శిబిరానికి చేరుకోవడంతో ఆందోళన ముగిసింది. అయితే తీర ప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు అధికారులు వెల్లడించారు. హైకోర్టు ఉత్వర్వుల అమలుకు డిమాండ్ జిల్లాలో ఎంఎఫ్ఆర్ చట్టం – 1995 ప్రకారం రింగు వలలతో చేపల వేటపై వెంటనే నిషేధం అమలు చేయాలని పెదజాలారిపేట గ్రామ సేవా సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వారు బుధవారం పెదజాలరిపేట దరి కురుపాం సర్కిల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామ కుల పెద్ద తెడ్డు పరసన్న మాట్లాడుతూ కొత్తగా రింగు వలలకు అనుమతులు ఇవ్వరాదని కోరారు. తాము గతంలో హైకోర్టును ఆశ్రయిస్తే సముద్రంలో 8 కిలో మీటర్లలోపు రింగు వలలతో వేట నిషేధం అమలు చేయాలని తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. కోర్టు ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని తాము ఇప్పటికే రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, ఆ శాఖ కమిషనర్‌ను కోరామని గుర్తు చేశారు. అయినప్పటికీ రింగువలలతో వేట చేయవద్దని చెప్పినందున తమ గ్రామ మత్స్యకారులపై మంగళవారం దాడి చేసి గాయపరచడం అన్యాయమన్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేని మత్స్యశాఖ అధికారులు తమను గంగవరం నుంచి పెదనాగమయ్యపాలెం బీచ్ వరకు చేపలవేట చేయరాదని నిబంధనలు విధించడం విడ్డూరంగా వుందని విమర్శించారు. కార్యక్రమంలో తెడ్డు రాజు, తెడ్డు సత్తయ్య, ఒలిశెట్టి గురయ్య, తెడ్డు సతీష్ పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంవీపీ స్టేషన్ సీఐ రమణయ్య పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. చదవండి: దంత కళాశాలలో కీచక వైద్యుల లీలలు! -
శ్రీలంక సేన వీరంగం.. 40 మంది జాలర్లు బందీ
సాక్షి, చెన్నై: కొన్ని నెలల అనంతరం శ్రీలంక సేన మళ్లీ సాగరంలో వీరంగం సృష్టించింది. రామేశ్వరంకారైక్కాల్, పుదుకోట్టైలకు చెందిన 40 మంది జాలర్లను బందీగా పట్టుకెళ్లారు. ఈ సమాచారం జాలర్ల గ్రామాల్లో ఆక్రోశాన్ని రగిల్చింది. తమిళ జాలర్లపై శ్రీలంక సేనలు సాగించే వీరంగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కాలంలో ఈ దాడులు తగ్గాయి. శ్రీలంక చెరలో ఉన్న జాలర్లు మళ్లీ రాష్ట్రానికి చేరారు. అనేక పడవలు సైతం తిరిగి ఇక్కడకు చేరాయి. ఈ పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో శ్రీలంక సేనలు దాడులు చేసి నట్టు, ఓ పడవ మునగడంతో నలుగురు మరణించడం వెలుగు చూసింది. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన నలుగురు జాలర్లు మరణించారు. అయితే శ్రీలంక సేనలు తుపాకీలు గురిపెట్టినట్టు, దాడులతో హతమార్చినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణసాగుతోంది. బందీగా పట్టుకెళ్లారు.. అసెంబ్లీ ఎన్నికల వేళ సముద్ర తీరాల్లోని జాలర్ల గ్రామాలు అనేక సురుక్కు ముడి వల(అల్లికల)తో వేటకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్నికల బహిష్కరణ నినాదాన్ని అందుకున్నాయి. వీరిని బుజ్జగించేందుకు తీవ్రంగానే ఎన్నికల యంత్రాంగం ప్రయత్నాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంక సేన జాలర్లపై విరుచుకుపడ్డ సమాచారం. యావత్ తమిళ జాలర్లల్లో ఆగ్రహాన్ని రేపింది. బుధవారం అర్ధరాత్రి రామేశ్వరం నుంచి వెళ్లి కచ్చదీవుల్లో చేపల వేటలో ఉన్న జాలర్లపై రెండు బోట్లలో వచ్చిన శ్రీలంక నౌకాదళం వీరగం సృష్టించారు. జాలర్లు ఒడ్డుకు తిరుగు పయనం కాగా, రెండు పడవల్ని మాత్రం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ రెండు పడవల్లో ఉన్న 20 మందిని బందీలుగా శ్రీలంకకు పట్టుకు వెళ్లారు. అలాగే, కారైక్కాల్ నుంచి చేపల వేటకు వెళ్లిన మరో ఐదు పడవల్ని సరిహద్దులు దాటేశారన్న నెపంతో పట్టుకెళ్లారు. ఈ పడవల్లో మరో 20 మంది జాలర్లు ఉన్నారు. 40 మంది జాలర్లను ఒకే రోజు శ్రీలంక సేన పట్టుకెళ్లడంతో జాలర్ల సంఘాల్లో ఆగ్రహం రేగింది. ఎన్నికల వేళ జాలర్లపై శ్రీలంక సేన దాడి చేయడంతో అధికార అన్నాడీఎంకే, బీజేపీ అభ్యర్థులకు కలవరం తప్పడం లేదు. సముద్ర తీర నియోజకవర్గాల్లో పోటీలో ఈ పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా జాలర్ల గళం విప్పే పనిలో పడడం గమనార్హం. చదవండి: పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళ -
వేటకెళ్తూ దారితప్పి.. బంగ్లాదేశ్ జలాల్లోకి
సాక్షి, విజయనగరం/పూసపాటిరేగ: జిల్లాలోని మత్స్యకార గ్రామాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి. వేటకు వెళ్లిన తమవారు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి వెళ్లి అక్కడ బందీలయ్యారనే వార్త విని ఇక్కడి వారి కుటుంబాలు తల్లడిల్లాయి. గత అనుభవాల దృష్ట్యా తమ వారు ఎప్పుడొస్తారో తెలి యక వారంతా అల్లాడిపోయా రు. కనీసం తమ వారితో అధికారులు ఫోన్లో మాట్లాడించినా... బాగుండని బోరున విలపించారు. కానీ అదృష్టవశాత్తూ వా రు సురక్షితంగానే ఉన్నారని తెలియగానే వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఆ దేశ కోస్టుగార్డులు వెనక్కిపంపించారన్న సమాచారంతో తిప్పలవలస, పతివాడ బర్రిపేట, చింతపల్లి గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రపంచం మొత్తానికి కీడు చేస్తున్న కరోనా వీరికి మాత్రం ఒకరకంగా మేలు చేసిందనే చెప్పాలి. బందీలుగా చిక్కింది ఇలా... పూసపాటిరేగ మండలం తిప్పలవలస, పతివాడబర్రిపేట, చింతపల్లికి చెందిన ఎడుగురు మత్స్యకారులు మరో ఐదు గురు మత్స్యకారులతో కలిసి విశాఖ హార్బర్ నుంచి నవంబర్ 7వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. నిబంధనలపై అవగాహన లేక మన దేశ సరిహద్దు దాటి బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి పొరపాటున ప్రవేశించారు. నవంబర్ 29 తెల్లవారు జామున 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ రక్షక దళాలు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారిలో పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క దానయ్య, రాయితి లక్ష్మయ్య, నక్క బోడోడు, పతివాడబర్రిపేటకు చెందిన గరికిన ఎల్లయ్య, గరికిన శ్రీను, మైలపల్లి కొర్లయ్య, చింతపల్లికి చెందిన చొక్కా శ్రీను ఉన్నారు. బోటులో మత్స్యకారుల పక్కనే మన దేశ సముద్ర జలాల్లో వేట చేస్తున్న మత్స్యకారుల ద్వారా బోటు యజమాని వాసుపల్లి ప్రసాదుకు అక్కడి నుంచి సమాచారం పంపించారు. సోమవారం ఉదయానికి మత్స్యకారుల స్వగ్రామాలకు విషయం తెలియచేయడంతో వారి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. అదృష్ట వశాత్తూ గంటల వ్యవధిలోనే మత్స్యకారులను కరోనా భయంతో బంగ్లాదేశ్‌లో విడిచిపెట్టారు. జీపీఆర్ఎస్, వలలు తీసుకొని సరిహద్దు లు ఎందుకు దాటారని బంగ్లాదేశ్ కోస్టుగార్డులు ఆ గ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేశారు. మత్స్య కారులు సురక్షితంగా వస్తున్నారని మ త్స్యశాఖ జిల్లా ఉప సంచాలకులు నిర్మలా కుమారి ధ్రు వీకరించారు. చిక్కితే జైలుకే పొట్టకూటి కోసం వలస పోతున్న మత్స్యకారులు సముద్రంలో దారి తెలీక పొరపాటున పరాయి దేశ జలాల్లోకి వెళ్లి అక్కడి రక్షఖ దళాలకు బందీలుగా చి క్కుతున్నారు. జిల్లాలోని తీరప్రాంత మండలాలకు చెందిన వేలాది మంది కడలి బిడ్డలు విశాఖపట్నం, కర్ణాటక పోర్టులకు వెళ్లి, అక్కడి నుంచి సముద్రంలో వేటకు వెళుతుంటారు. దారి తప్పి విదేశీలకు బందీలు గా మారి ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గిపోతున్నారు. 2018 నవంబర్ 28వ తేదీన అరేబియా మహాసముద్రంలో వేటాడుతూ పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారంటూ అక్కడి అధికారులు ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను అరెస్టు చేశారు. దాదాపు 13 నెలల తర్వాత వీరు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విడుదలయ్యారు. ఆ తరువాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల సంక్షేమానికి అనేక వరాలనిచ్చా రు. వేట విరామ సయంలో ఇచ్చే సాయాన్ని రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. డీజిల్ రాయితీలను కూడా పెంచారు. అయితే ఈసారి చిక్కిన వారిని ఒకరకంగా కరోనా కాపాడిందంటున్నారు. ఇక రాడేమోనని భయపడ్డాం నా కొడుకు నక్కా దానయ్య బందీగా చిక్కాడని కబురు తెలియగానే గుండెలు గుభేల్ మన్నాయి. ఎందుకంటే గతంలో బందీలుగా చిక్కిన మా బంధువులు సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోయారు. మా బాబు పరిస్థితీ అంతేనా అని భయపడ్డాం. ఇంతలోనే అక్కడివాళ్లు విడిచిపెట్టారని సమాచారం వచ్చింది. దేవుడే మావోడ్ని కాపాడాడు. – నక్కా లక్ష్మీ, నక్కా దానయ్యతల్లి, తిప్పలవలస. ఆశలు వదులుకున్నాను... నా కొడుకు నక్క బోడోడు బంగ్లాదేశ్ మత్స్యకారులకు చిక్కా డని తెలియగానే నాకు దిక్కు ఎవరని బోరున ఏడ్చాను. దాదాపుగా ఆశలొదిలేసుకున్నాను. అంతలోనే అక్కడి అధికారులు మావోల్ని ఒదిలీసేరని తెలిసింది. నిజంగా దేవుడు మాపక్కనున్నాడు. అందుకు మావోడు వచ్చేత్తన్నాడు. వాడిని తనివితీరా సూసుకోవాలనుంది. – నక్క అప్పన్న, నక్క బోడోడు తండ్రి తిప్పలవలస మా అల్లుడికి మరో జన్మే మా అల్లుడు రాయితి లక్ష్మయ్య బంగ్లాదేశ్ కోస్టుగార్డులకు చిక్కి రోజు వ్యవధిలోనే తిరిగి ఇక్కడికి బయలుదేరినట్లు తెలిసింది. కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. బంగ్లాదేశ్ అధికారులకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించడంతో తిరిగి స్వగ్రామాలుకు పంపించారు. – మైలపల్లి అప్పయ్యమ్మ, రాయితి లక్ష్మయ్య అత్త, తిప్పలవలస. -
మత్స్యకారుల జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి : మత్స్యకారుల జీవనోపాధిని మెరుగు పరచడం ద్వారా వారి జీవితాలను మార్చాలనే లక్ష్యంతో పాటు మత్స్య పరిశ్రమ రూపు రేఖలను మార్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్ సదుపాయం కోసం రూ.3,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రూ.1,510 కోట్లతో నిర్మించనున్న 4 ఫిషింగ్ హార్బర్లకు, తొలి దశలో 25 ఆక్వా హబ్‌లకు శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చ్యువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని మత్స్యకారులు, ఆక్వా రైతులను ఉద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. నవరత్నాల్లోని ప్రతిదాన్ని మత్స్యకారులకు అందిస్తూనే.. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. రాబోయే సంవత్సర కాలంలో చేపలు, రొయ్యలు, పీతలు సాగు చేసే రైతుల జీవితాలను మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో రూ.225 కోట్లతో ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపడతున్నామని వెల్లడించారు. రూ.10 వేల కోట్ల వ్యయంతో మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్ట్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పండుగగా ప్రపంచ మత్స్య దినోత్సవం ఈ రోజు ప్రపంచ మత్స్య దినోత్సవం. దీనిని మనం ఒక పండుగగా జరుపుకుంటున్నాం. మన దేశానికి 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే, మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. దేశంలో సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రెండవ రాష్ట్రం మనది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల జీవితాలు మాత్రం పెద్దగా ఎందుకు మారలేదని, మనమంతా మనస్సాక్షితో గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించాలి. మత్స్యకారుల జీవితాలు ఎంత దయనీయమైన స్థితిలో వున్నాయి అనేది నా పాదయాత్రలో నా కళ్లారా చూశాను. మంచి చదువులు చదువుకోలేని పరిస్థితి. పక్కా ఇళ్లు లేని దుస్థితి. సరైన ఆరోగ్య వసతి, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేని పరిస్థితి. పట్టిన చేపలకు తగిన ధర రాని దైన్యం. మన కళ్లెదుటే ఇవన్నీ కనిపిస్తున్నాయి. మత్స్యకారుల జీవితాలను చూసి చలించిపోయాను మన మత్స్యకారులు అతి తక్కువ జీతానికి ఎక్కడో ఉన్న గుజరాత్ వంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడ బతుకు దెరవు కోసం ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ అంతర్జాతీయ జలాల్లో చేపల వేట సాగిస్తున్న వారిని పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోలీసులు పట్టుకుని జైళ్లకు పంపితే, అక్కడ మనవాళ్లు మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పాదయాత్రలో తీర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మత్స్యకార కుటుంబాలు చెప్పిన ఈ కన్నీటి గాథ నన్ను చలింపచేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వంపై మన ఎంపీలు తీవ్రమైన ఒత్తిడి తేవడంతో పాటు, నేను కూడా ప్రత్యేకంగా కేంద్రంతో మాట్లాడాను. ఆ జైళ్లలో మగ్గిపోతున్న మన వారిని తిరిగి ఇక్కడకు తీసుకు రావడానికి పెద్ద ప్రయత్నమే చేశాం. వారు తిరిగి వచ్చినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకు మన మత్య్సకారులకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆలోచిస్తే బాధ కలిగింది. మత్స్యకారుల జీవితాలను మార్చాలన్న లక్ష్యంతో అడుగులు పెద్ద సముద్రతీరం ఉన్నా.. మన రాష్ట్రానికి అవసరమైన పోర్ట్‌లను తెచ్చుకోలేక పోయాం. ఫిషింగ్ హార్బర్లను కట్టుకోలేక పోయాం. ఇన్ని సంవత్సరాల తరబడి మత్స్యకారులను పట్టించుకోవాలన్న ఆలోచన చేయలేదు. మత్స్యకారుల సమస్యలకు సమాధానాలు ఏమిటి? మొత్తంగా మత్స్య పరిశ్రమ పరంగా విస్తారంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఒక రాష్ట్రంగా మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల పరిపాలనలో ఇలా ఆలోచన చేశాం. వీరి జీవితాలు ఎలాగైనా మార్చాలని అడుగులు ముందుకు వేశాం. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని కూడా మత్స్యకారులకు అందించడంతో పాటు ప్రత్యేకించి వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మొట్ట మొదటి ఏడాదిలోనే మన ప్రభుత్వం ఆచరణలోకి తీసుకువచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి, చెప్పిన ప్రతి దానిని నెరవేరిస్తేనే, మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయని భావించి అడుగులు ముందుకు వేశాం. ఇప్పుడు నాలుగు.. త్వరలో మరో నాలుగు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి అటు మత్స్యకారుల జీవితాలు, ఇటు రాష్ట్రంలోని మత్స్యపరిశ్రమ రూపురేఖలను కూడా మార్చేందుకు దాదాపు రూ.1,510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు నేడు శంకుస్థాపన చేస్తున్నాం. డిసెంబర్ 15 నాటికి ఈ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని, పనులు కూడా ప్రారంభమవుతాయి. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం కొత్తపట్నంలో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేస్తున్నాం. 25 ఆక్వా హబ్‌లకు శంకుస్థాపన రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో.. ఒక్కొక్కటి చొప్పున ఆక్వా హబ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీని కోసం రూ.225 కోట్లు ఖర్చు చేయనున్నాం. తొలి దశలో భాగంగా 25 ఆక్వా హబ్‌ల నిర్మాణానికి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు అందుబాటులోకి తీసుకువచ్చి, పౌష్టికాహార భద్రతను కల్పించడంతో పాటు, జనతాబజార్లకు అనుసంధానం చేసి, మత్స్య, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా 8 ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు.. వీటన్నింటికీ కలిపి దాదాపు రూ.3,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. రాబోయే ఏడాదిలో రాష్ట్రంలో చేపలు, పీతలు, రొయ్యలను సాగు చేస్తున్న రైతుల జీవితాలను పూర్తిగా మార్చే దిశగా.. కనీసం 30 శాతం మన రాష్ట్రంలోనే వాటి కొనుగోళ్లు జరిగేలా జనతాబజార్లకు అనుసంధానం చేస్తున్నాం. మున్సిపాలిటీ వార్డుల్లో, గ్రామ సచివాలయాల పక్కనే జనతా బజార్లు ఏర్పాటు చేసి, వాటిల్లో ఆక్వా ఉత్పత్తుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక ఏడాది కాలంలోనే వీటి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్ట్‌ల నిర్మాణం మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో దాదాపు మరో రూ.10 వేల కోట్లతో మరో మూడు పోర్ట్‌లను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీటికి సంబంధించి మరో రెండు, మూడు నెలల్లోనే టెండర్లను ఫైనలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. 2019 ఎన్నికల సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం మేనిఫేస్టోలో చెప్పిన మూడు వాగ్దానాలు నెరవేర్చాం. మత్స్యకార అక్కచెల్లెమ్మల కోసం పలు కార్యక్రమాలు చేపట్టాం. మత్స్యకారుల సంక్షేమం కోసం ఇలా.. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిషేధ సమయం. ఈ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఎప్పుడూ సకాలంలో వారికి సాయం అందించలేదు. కొన్నిసార్లు ఇచ్చినా, అది కూడా అరకొరే. దానిని కూడా అందిరికీ ఇచ్చేవారు కాదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేట నిషేధ సమయంలో ఆదాయాన్ని కోల్పోయే ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10 వేలు సాయంగా ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 2019-20లో మొత్తం1,02,332 కుటుంబాలకు రూ.102.33 కోట్లు అందించామని గర్వంగా చెబుతున్నాం. వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయం గత ఏడాది నవంబర్‌లో ఇచ్చాం. ఈ ఏడాది కూడా నవంబర్లోనే ఇవ్వాలనుకోకుండా మే నెలలోనే చెల్లించాం. గత ఏడాది ఇచ్చిన దానికన్నా ఎక్కువగా అంటే 1,09,2307 కుటుంబాలకు దాదాపు రూ.110 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశాం. దేశీయ, నాటు, తెడ్డు తెరచాప మత్స్యకారులకు సాయం గతంలో మర పడవల్లో చేపల వేటకు వెళ్లే వారికే ఈ సాయం అందించేవారు. అదికూడా రిజిస్ట్రేషన్ చేయకుండా అష్టకష్టాలు పెట్టే వారు. ఆ పరిస్థితులను పూర్తిగా మారుస్తూ.. దేశీయ, నాటు, తెడ్డు, తెరచాప సహాయంతో వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా వేట నిషేధ సమయంలో రూ.పది వేల సాయం అందిస్తున్న ప్రభుత్వం మనది. మనం అధికారంలోకి రాకముందు మత్స్యకారుల బోట్లకు డీజిల్ లీటర్‌కు ఆరు రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. ఈ రోజు మన ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని ఆరు నుంచి తొమ్మిది రూపాయలకు పెంచింది. ఆ రాయితీని బంకులో డీజిల్ కొట్టే సమయంలోనే తగ్గించి తీసుకునేలా చర్యలు తీసుకున్నాం. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకార సోదరులు మరణిస్తే, గతంలో వారి కుటుంబానికి అందించే రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాం. మీ బిడ్డగా, మీమీద మమకారంతో ఈ కార్యక్రమాన్ని చేశాను. గుజరాత్ బకాయి పెట్టినా, రూ.78 కోట్లు చెల్లించాం గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ 2012లో మన రాష్ట్రంలోని సముద్ర తీరంలో డ్రిల్లింగ్ చేసిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మండలాల్లో 68 మత్స్యకార గ్రామాల్లోని 16,559 మత్స్యకార కుటుంబాలు జీవన భృతి కోల్పోయాయి. 13 నెలల పాటు డ్రిల్లింగ్ జరిగింది. అయితే గుజరాత్ పెట్రోలియం సంస్థ ఆరు నెలల కాలానికి రూ.68 కోట్లు మాత్రమే చెల్లించింది. మిగిలిన ఏడు నెలలకు చెల్లించాల్సిన రూ.78 కోట్లు బకాయి పెట్టింది. దీనిని అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. నా పాదయాత్రలో బాధిత మత్స్యకార కుటుంబాలు చెప్పిన ఈ సమస్యను గుర్తు పెట్టుకుని, గత ఏడాది ఇదే మత్స్యకార దినోత్సవం రోజున రూ.78 కోట్ల బకాయిలను మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. కేంద్రం నుంచి ఈ మొత్తం ఎప్పుడు వస్తుందో తెలియదు.. అప్పటి వరకు మత్స్యకార కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సొమ్ము చెల్లించింది. ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ రూ.1.50కే ఇస్తున్నాం మొత్తంగా మత్స్యకార రంగానికి మద్దతుగా నిలుస్తున్నాం. ఆక్వా రైతులకు కరెంట్ యూనిట్ రూ.1.50కే అందిస్తున్నాం. ఇందుకోసం ఏకంగా రూ.720 కోట్ల సబ్సిడీని ఆక్వా రైతుల కోసం చిరునవ్వుతోనే ప్రభుత్వం భరిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు, మూడు నెలలు కూడా ఆగకుండా ఈ కార్యక్రమానిక శ్రీకారం చుట్టాం. దీనివల్ల సుమారు 55 వేల మంది ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు సంబంధిత గ్రామ సచివాలయాల్లో 794 మంది మత్స్య సహాయకులను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నియమించాం. ఆర్బీకేల్లో రైతులకే కాదు, మత్స్యకారులు, ఆక్వా రైతులకు కూడా తోడుగా వుండి, వారిని చేయిపట్టుకని మత్స్య సహాయకులు నడిపిస్తున్నారు. ఏపీ ఫిష్ ఫీడ్ యాక్ట్, ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ నాణ్యమైన చేపలు, రొయ్యల మేత అందుబాటులో లేక రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో పాదయాత్రలో కళ్లారా చూశాను. క్వాలిటీ అనేది తెలియక, ఆ ఫీడ్‌లో ఫెస్టిసైడ్స్, కెమికల్స్ వుండటం వల్ల ఆక్వా ఉత్పత్తులు అమ్ముడు పోక రకరకాలుగా ఆక్వా రైతులు ఇబ్బంది పడ్డారు. ఆక్వా రైతులకు నాణ్యమైన మేత అందించాలనే ఉద్దేశంతో, నకిలీలను అడ్డుకునేందుకు దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీ ఫిష్ ఫీడ్ చట్టాన్ని చేశాం. ఇందుకోసం ఆక్వా రైతులకు నాణ్యమైన చేప, రొయ్య పిల్లల సరఫరాకు ఏపీ ఫీష్ సీడ్ కంట్రోల్ ఆర్డినెన్స్ కూడా జారీ చేశాం. ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.50 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశాం. నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. నా పాదయాత్రలో ఆక్వా రైతుల కష్టాలను చూశాను. ఎక్కడా ల్యాబ్‌లు లేవు. కృష్ణా జిల్లాలో సమస్య వస్తే.. ఎక్కడికో కాకినాడ వరకు తీసుకుపోవాల్సి వచ్చేది. అంతదూరం పోలేక, ఎవరి దగ్గర దొరికితే.. వారి దగ్గర సీడ్ తీసుకునేవారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, క్వాలిటీ అనేది ప్రతి ఆక్వా రైతుకు కూడా అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు మత్స్య, ఆక్వా రంగాల్లో నిపుణులను తయారు చేయడానికి, నైపుణ్యం పెంచడానికి, పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ఆర్డినెన్స్ జారీ చేశాం. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ పనులు ప్రారంభమవుతాయి. ఇవ్వన్నీ కూడా మంచి మనసుతో చేశాం. దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మరింతగా మీ అందరికీ మేలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీ మేలు మరవలేం ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అని మీరు పాదయాత్రలో అన్నారు. సీఎం కాగానే మీరు ఆ మాట నిలబెట్టుకున్నారు. తక్కువ టైంలో మా చేతికి రూ.10 వేల సాయం అందింది. మీరు చిన్న కర్ర తెప్పలను కూడా గుర్తించి వాళ్లకు కూడా రూ.10 వేలు ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాం. గతంలో ఇలాంటి సాయం ఎప్పుడూ అందలేదు. ఎవరైనా వేటకు వెళ్లి మరణిస్తే అందించే సాయాన్ని ఏకంగా రూ.10 లక్షలు చేశారు. పాకిస్తాన్, గుజరాత్‌తో చిక్కుకుపోయిన మత్స్యకారులను రప్పించిన మీ మేలు మరవలేం. మంచినీళ్లు పేట దగ్గర జెట్టీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. మత్స్యకారుడికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చారు. మత్స్యకారులం అందరం మీకు రుణపడి ఉంటాం. ఎల్లకాలం మీరే సీఎంగా ఉండాలి. - లక్ష్మయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట, శ్రీకాకుళం. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు సముద్రంలో చేపల వేట నా వృత్తి. మీరు ఈ రోజు నిజాంపట్నం పోర్టు అభివృద్ధికి రూ.451 కోట్లు కేటాయించి మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఈ పోర్టు అభివృద్ధి చెందితే అక్కడ శీతల గిడ్డంగిలు, ఐస్ ప్లాంట్స్, ఆక్షన్ హాల్స్, విశ్రాంతి భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మాకు ఎన్నెన్నో అవకాశాలు అందివస్తాయి. ఏటా రూ.10 వేలు సాయం చేస్తున్నారు. ఆయిల్ సబ్సిడీ రూ.6 నుంచి రూ.9కి పెంచారు. ఆర్బీకేల పక్కన మత్స్య మార్కెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యకారులందరి తరఫున మీకు ధన్యవాదములు. - ఎన్.శివయ్య, మత్స్యకారుడు, నిజాంపట్నం గ్రామం, గుంటూరు జిల్లా ఏ ప్రభుత్వం ఇలా మేలు చేయలేదు మీరు ఆక్వా కల్చర్‌లో అన్ని అంశాలను ఒక గొడుగు కిందకు తెస్తూ.. ఆక్వాకల్చర్ అథారిటీ ఏర్పాటు చేయడం వల్ల మా సమస్యలన్నింటికి పరిష్కారం కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమూ చూడనంత తీవ్రంగా, తీక్షణంగా మీరు మా సమస్యను చూసి పరిష్కరిస్తున్నారు. గతంలో ఇంత మేలు ఎప్పుడూ జరగలేదు. యూనిట్ విద్యుత్ రూ.1.50 చొప్పున ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఒకరకంగా ఈ రోజు రైతులు ప్రాణాలతో ఉన్నారంటే అందుకు మీరే కారణం. కోవిడ్ సమయంలోనూ మద్దతు ధర కల్పించి ఆదుకుంటున్నారు. ఆక్వా హబ్‌లు, ప్రాసెసింగ్ యూనిట్లు, జనతా బజార్లు మా తల రాతలను మారుస్తాయనడంతో సందేహం లేదు. - కనుమూరి ప్రసాద్, గుడివాడ, కృష్ణా జిల్లా -
ఉద్దానానికి మణిహారం..
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మారిపోయిన ఉద్దానం దశ తిరగబోతోంది. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు ఉద్దానానికి మణిహారం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారు. చేయని వాగ్దానాలను సైతం అమలు చేస్తూ ఉద్దానం వెనుకబాటు, అక్కడున్న సమస్యలను పారదోలేందుకు నడుం బిగించారు. ఒకవైపు కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తుండగా, మరోవైపు రూ.700 కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టును నిర్మి స్తున్నారు. ఇంకోవైపు మత్స్యకారుల అవసరాలు, సంపదను రవాణా చేసేందుకు రూ. 3665.90 కోట్లతో భావనపాడు పోర్టు ను నిర్మించేందుకు లైన్ క్లియర్ చేశారు. కొన్ని రోజుల కిందట పోర్టు ప్రాజెక్టుకు ఆమోదం తెలపగా, తాజాగా రైట్ సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను ఆమోదించారు. 36 నెలల్లో తొలి దశ ప్రాజెక్టు పూర్తి చేసేలా లక్ష్యంగా చేసుకుని పనులు ప్రా రంభిస్తున్నారు. ఇప్పటికే మంచినీళ్ల పేట వద్ద జెట్టీ నిర్మాణా న్ని చేపడుతున్నారు. అటు కిడ్నీ రోగుల బాధలు, ఇటు మంచినీటి సమస్య, మరోవైపు మత్స్యకారుల వలసలు నియంత్రించే త్రిముఖ లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణ అమలు చేస్తున్నారు. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం.. ఉద్దానం ఏరియాలో కిడ్నీ సమస్య దశాబ్దాలుగా ఉంది. ప్రభుత్వాలెన్ని వచ్చినా కిడ్నీ రోగుల సమస్య పరిష్కారం కాలేదు. అధికారంలోకి రాకముందే కిడ్నీ సమస్యకు మూలాలను అన్వేషించారు. అధికారంలోకి వచ్చాక అమలు చేశారు. ఇప్పటికీ కిడ్నీ వ్యా«ధుల నియంత్రణ కోసం రీసెర్చ్ సెంటర్‌తో పాటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్ల వరకు నిధులు కూడా మంజూరు చేశారు. ఇప్పుడా పనులు జరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా ఈ వ్యాధి ప్రధాన కారణం తాగునీరే కావొచ్చనే ఉద్దేశంతో రూ. 700కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టును నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించనున్నారు. మరోవైపు కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్లు ఎక్కడిక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఖరీధైన మందులను అందుబాటులోకి తెచ్చారు. నిపుణులైన వైద్యులను నియమిస్తున్నారు. తాజాగా భావనపాడు పోర్టు నిర్మాణానికి అంతా సిద్ధం చేశారు. ఆ పోర్టుకు సంబంధించి రైట్ సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను ప్రభుత్వం ఆమోదించింది. కార్గో రవాణాకు ఎంతో అనుకూలంగా ఉన్న భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణంతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రానుంది. దీంతో మత్స్యకారుల వలసల సమస్యకు చెక్ పడనుంది. కార్గోకు అనుకూలంగా భావనపాడు జిల్లాలో జల మార్గం ద్వారా కార్గో రవాణాకు ఎంతో అనుకూలంగా ఉన్న సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో ఓడరేవు నిర్మాణం దశాబ్దాల నాటి కల. ప్రభుత్వా లు మారుతున్నప్పుడల్లా భావనపాడు ఓడరేవు నిర్మాణానికి ఈ ప్రాంతంలో మత్స్యకారులకు ఆశలు కల్పించి ఆ తర్వాత గాలికొదిలేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం దశాబ్దాల కలగా ఉన్న భావనపాడు పోర్టు నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేశారు. తూర్పు తీరంలో ఉత్తరాంధ్రకు ఆనుకుని ప్రస్తుతం విశాఖపట్టణం పోర్టు ఒక్కటి మాత్రమే జల మార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లకు జల మార్గంలో అతి తక్కువ దూరం కలిగిన పోర్టు మరొకటి లేదు. దీంతో ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు భావనపాడు ఓ డరేవు అనుకూలంగా చెప్పవచ్చు. టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రానైట్ పరిశ్రమలు మెండుగా ఉన్నాయి. దీంతో భావనపాడు ప్రాంతంలో కార్గో( లగేజీ రవాణా)కు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇక జాతీయ స్థాయిలో 40శాతం విదేశీ మారక ద్రవ్యం మెరైన్ సెక్టార్ నుంచే వస్తోంది. అందులో సిక్కోలు మత్స్యకారుల వాటానే ఎక్కువ. జిల్లాలో విస్తారమైన 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా మౌలిక సదుపాయాలు లేక వలస పోతున్న పరిస్థితి నెలకుంటోంది. జిల్లాలో 11 మండలాల పరిధిలో 145 మత్స్యకార గ్రామా లు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి చేపల వేట ఆధారపడి ఉన్నారు. అయితే ప్రధానంగా ఆక్వా ఎగుమతులతో రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ ఆలోచన మేరకు సము ద్ర ఆధారిత ఆదాయం పెంచుకునే క్రమంలో భావనపాడు తీరంలో ఓడరేవు ఏర్పాటు చేస్తే ఒక వైపు మత్స్య సంపద, మరో వైపు ఇతర ఖనిజ సంపదను ఎగుమతి, దిగుమతి చేసుకుంటూ రాష్ట్రానికి ఆదాయం పెంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే, మత్స్యకారుల వలసలు ని యంత్రించేందుకు అవకాశం ఉంటుంది. 36 నెలల్లో అందుబాటులోకి భావనపాడు పోర్టు మొదటి దశ పనులు 36 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. మొదటి విడత పనుల్లో మూడు సా«ధారణ కార్గో బెర్తులు, ఒక బల్క్ కార్గో బెర్త్, 500 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించను న్నారు. దీని కోసం ఏపి మారిటైమ్ బోర్డు రూ. 2,123 కోట్లు వరకు రుణం పొందేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇచ్చింది. 2024–25 నాటికి 12.18 ఎంటీపీఏ సామర్థ్యం కలిగిన కార్గో రవాణా కు వీలుగా లక్ష్యాన్ని నిర్దేశించారు. 2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో రవాణాకు వీలుగా పోర్టు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈ పోర్టు నిర్మాణ పనులను భావనపాడు పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టేలా ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. భూసేకరణకు రూ. 261కోట్లు మంజూరు భావనపాడు పోర్టు నిర్మాణానికి బడ్జెట్ కేటాయిస్తూ ఈ ఏడాది జూన్ నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో తక్షణమే ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై నెలలో 10 సర్వే బృందాలతో భావనపాడు, దేవునల్తాడ ప్రాంతాల్లో ఎంజాయ్మెంట్ సర్వే ప్రారంభించారు. పోర్టు నిర్మాణానికి మొత్తం 2320.29 ఎకరాలను సిద్ధం చేశారు. ఇందులో 642.76 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 1677.53 ఎకరాలు జిరాయితీగా గుర్తించారు. అయితే గతంలో భూసేకరణ చేపట్టినప్పటికీ మరో సారి ఆయా భూముల్లో పరిస్థితులపై మరో సారి ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించడంతో పోర్టు నిర్మాణానికి వడి వడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణకు సంబంధించి రూ. 261 కోట్ల మేర ప్రభుత్వం సమకూర్చింది. భావనపాడు ఓడరేవు నిర్మాణం కోసం అవసరమైన మౌలిక వసతుల కోసం మారీటైమ్ బోర్డు ద్వారా ప్రత్యేక వాహనాలు కొనుగోలు, ప్రత్యేక అధికారుల నియామకాలకు సంబంధించి రాష్ట్ర మౌలిక వసతుల, పెట్టుబడుల మారీ టైమ్ బోర్డు శాఖా నుంచి తాజాగా ఉత్తర్వులు సైతం జారీ చేశారు. మత్స్యకారులకు మహర్దశ స్థానికంగా వేటకు అనుకూలత లేక పొట్ట చేత పట్టుకుని మత్స్యకారులు వేరే రాష్ట్రాలకు వలసపోయి కుటుంబానికి దూరంగా దీనంగా బతుకుతున్నారు. పది, పదిహే ను వేల సంపాదన కోసం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలకు వెళ్తున్నారు. వెళ్లిన చోట ప్రతి సారి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుస్థితి నెలకుంటుంది. ఈ పరిస్థితి లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జెట్టీ లు, ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మాణంతో మత్స్యకారుల బతుకుల్లో సరికొత్త వెలుగులు తీసుకురావాలని భావి స్తోంది. మత్స్యకారుల వలసలు తగ్గించేందుకు ఏడాది లోగా పనులు ప్రారంభించే లక్ష్యంగా వెళ్తోంది. ఎచ్చెర్ల మండలం బుగడుట్ల పాలెంలో రూ. 332 కోట్లతో ఫిషింగ్ హార్బర్, డి.మత్స్యలేశం పంచాయతీ రాళ్లపేటలో రూ. 21.92కోట్లతో జెట్టీలు (ఫిష్‌ల్యాండింగ్ కేంద్రా లు), కవిటి మండలం ఇద్దువానిపాలెంలో రూ. 12కోట్ల తో జెట్టీలు, వజ్రపుకొత్తూరు మండలంలోని నీళ్లపేటలో రూ. 11.95కోట్లతో జెట్టీలు వంటి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే భావనపాడు తీరానికి కూత వేటు దూరంలో వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రం (జెట్టీ) నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత కొన్ని నెలల క్రితం శంకు స్థాపన చేశారు. తాజాగా జెట్టీ పనులు సైతం ప్రారంభమయ్యాయి. -
ఏపీలో ‘వేట’ సాయం వెంటనే
సాక్షి, అమరావతి: లాక్డౌన్, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభమైంది. క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పని చేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వీరికి అందచేసే సాయాన్ని రూ.10 వేలకు పెంచింది. గత నవంబరు 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 1,02,338 మందికి వేట విరామ సాయాన్ని అందించింది. బోట్ల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది లబ్ధి్దదారుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. (చదవండి: మే 5 తర్వాత కరోనా తగ్గుముఖం : శారదా పీఠాధిపతి) మార్చి 31 లోపు మరపడవలను నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరపడవలపై 8 మంది, మోటారు పడవలపై ఆరుగురు, సంప్రదాయ పడవలపై ముగ్గురు కార్మికులకు వేట విరామ సాయం అందించనుంది. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లోని మత్స్యశాఖ సహాయకులు, ఇతర సిబ్బంది పడవలపై పనిచేస్తున్న కార్మికుల జాబితా సేకరించి అర్హుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. లబ్ధి్దదారుల జాబితా ఖరారు అయిన తరువాత వారి బ్యాంకు ఖాతాల్లో వేట విరామ సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. ఈ ఏడాది వేట విరామ సమయం ప్రాంభమైన 20 రోజుల్లోనే ప్రభుత్వం సాయం అందజేస్తుందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి చెప్పారు. (చదవండి: డ్రోన్లతో థర్మల్ స్క్రీనింగ్) -
నేడు స్వదేశానికి తెలుగు మత్స్యకారులు
-
సంధి ముగిసె.. ఇక వేటకు వెడలవలె!
సాక్షి, ఒంగోలు : గంగమ్మ తల్లిని నమ్ముకున్న గంగపుత్రుల పరిస్థితి ముందు వేట.. వెనుక అప్పులు అన్నచందంగా మారింది. మరో 24 గంటల్లో మత్స్యకారులు వేటకు బయలుదేరే సమయం ఆసన్నమైంది. వేట నిషేధ సంధికాలం ముగియనుండటంతో మత్స్యకారులు వేటకు కావాల్సిన వలలు, పడవలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 60 రోజుల పాటు సముద్రంలో వేట లేక పూట గడవక నానా తంటాలు పడిన మత్స్యకారులు తిరిగి వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా సంధికాలం ఇచ్చే సాయాన్ని ప్రభుత్వం త్వరగా అందించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. సముద్రంలో వేటనిషేధ సమయంలో ప్రభుత్వం అందించే కరువుభత్యం సాయం గత టీడీపీ ప్రభుత్వం సరిగా అందించకపోవడంతో జాలర్లు నానా కష్టాలు పడ్డారు. అయితే గతనెల 30న ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి తమకు అండగా నిలుస్తాడని మత్స్యకారులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. బాబు హయాంలో అరకొరగా సాయం.. సముద్రంలో మత్స్య సంపంద పునరుత్పత్తి సమయమైన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 60 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేట నిషేధాన్ని విధించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి ఏటా వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి జీవనభృతి కింద 31 కేజీల బియ్యాన్ని అందించేందుకు చట్టాన్ని రూపొందించింది. అయితే 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత మాజీ సీఎం చంద్రబాబు జీవన భృతి కింద ఒక్కో మత్స్యకారుడికి రూ.4వేలు అందిస్తానని హామీ ఇచ్చారు. సంధికాలం సాయం అరకొరగా అందించి చేతులు దులుపుకున్నారు. వేట నిషేధ కాలం శుక్రవారంతో పూర్తవుతున్నప్పటికి ధా సమయంలో అందించాల్సిన ప్రభుత్వ సాయం (జీవన భృతి) నేటికి ఒక్కరికి కూడా మత్య్సకారులకు అందలేదు. అయితే ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్య్సకారులకు జీవనభృతి కింద ఒకొక్కరికి రూ.10 వేలు సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో గంగపుత్రులు గండెడాశతో ఎదురు చూస్తున్నారు. ప జిల్లాలో 102 కిలో మీటర్ల మేర తీరం ఉండగా 74 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 80వేలకు పైగా మత్స్యకారులు ఉన్నారు. చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, విజయలక్ష్మీపురం, పొట్టిసుబ్బయ్యపాలెం, రామాపురం, కఠారివారిపాలెం గ్రామాల్లో మత్య్సకారులే అధికం. వీరందరికి సముద్రంలో వేటే జీవన ఆధారం. ఈ గ్రామాల్లోని ప్రజలందరు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేపల వేట, మత్య్స సంపద అమ్మకాలపైనే ఆదారపడి జీవిస్తున్నారు. గతేడాది నిషేధ సాయానికి మెలికలు పెట్టి కొందరికే తూతూ మంత్రంగా చంద్రబాబు సాయం అందించారని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఏడాది నుంచి ఆ ఇబ్బందులు ఉండవని వేట నిషేధ సమయంలో ప్రభుత్వ అందించే సాయం సరైన సమయంలో వైఎస్ జగన్ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
మత్స్యకారుల సత్తా చాటుదాం
‘తెడ్డు’ తిరగబడింది.. నయవంచనపై యుద్ధాన్ని ప్రకటించింది! ‘ఏరు దాటేదాకా మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న..’ అనే తీరుగా ప్రవర్తిస్తున్న సీఎం చంద్రబాబుపై మత్స్యకారులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించాలంటూ నమ్మక ద్రోహంపై తెడ్డు ఎక్కుపెట్టారు. మత్స్యకారులను ఎస్టీల జాబితాలో చేరుస్తామని గత ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ శాంతియుతంగా 75 రోజులు నిరాహార దీక్షలు చేస్తే టెంట్లు కూల్చేసి బూటుకాళ్లతో తొక్కేసిన ఘటనను తమ జాతి విస్మరించదని, ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. సునామీలు, తుపాన్లకు ఎదురొడ్డిన తాము చంద్రబాబు సర్కారును ఉప్పెనలా కూల్చేస్తామని సిక్కోలు గంగపుత్రులు ఊరూవాడా గర్జిస్తున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఊరూరా కరపత్రాలు... రాష్ట్రంలో మత్స్యకారులు తమను ఎస్టీల జాబితాలో చేర్చాలని చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మత్స్యకార నాయకులు ఆయన్ను పలుమార్లు కలసి హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ వచ్చారు. చివరకు తాము మోసపోయామని గుర్తించి 2017 డిసెంబర్ 11న శ్రీకాకుళంలో 110 గ్రామాలకు చెందిన మత్స్యకారులు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఏకంగా 75 రోజుల పాటు దీక్షలు కొనసాగాయి. ఎస్టీ సాధన సమితి ఉద్యమం విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కూడా విస్తరించింది. హామీని నిలబెట్టుకోకపోగా ఉద్యమాన్ని సర్కారు ఉక్కుపాదంతో అణచి వేయడంపై నిరసనలు భగ్గుమన్నాయి. జిల్లా మంత్రులు కూడా చేతులెత్తేయడంతో టీడీపీకి రాజీనామా చేయాలని శ్రీకాకుళం జిల్లా మత్స్యకార నేతలు నిర్ణయించారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే మూడు వేల మందికిపైగా మత్స్యకారులు టీడీపీకి రాజీనామా చేశారు. వీరంతా వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలవాలని నిర్ణయించారు. టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి ఉద్యమ నేతలకు ఎమ్మెల్సీ పదవి ఎర వేసినా లొంగలేదు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని 110 మత్స్యకార గ్రామాల్లో చంద్రబాబు మోసాన్ని కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని ప్రస్తావించే చంద్రబాబు తమకు చేసిన వాగ్దానంపై మాట తప్పడాన్ని మత్స్యకారులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందంటూ ఊరూరా వివరిస్తున్నారు. – బొల్లం కోటేశ్వరరావు సాక్షి ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాకుళం టీడీపీకి ఓటేయరాదని నిర్ణయించాం... మమ్మల్ని ఎస్టీల జాబితాలో చేరుస్తామని గత ఏడాది ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజు కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ రోజు కులవృత్తి ప్రకారం ఆయనకు తలగోడ (బుంగ) నెత్తికి పెట్టాం. కానీ మోసం చేశారు. విశాఖలో తాట తీస్తానని హెచ్చరించి మా జాతిని అవమానించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటేయొద్దని ఊరూరా చాటి చెబుతున్నాం. –కొమర శంకర్రావు, జిల్లా అధ్యక్షుడు, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషరీస్ మా ఉసురు తగులుతుంది.. గంగమ్మ తల్లిని నమ్ముకున్న బిడ్డలం. ఎస్టీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీ అమలు కోసం దీక్షలు చేస్తుంటే మా టెంట్లను తగలబెట్టించిన చంద్రబాబుకు మా ఉసురు తగులుతుంది. బాబు మోసానికి నిరసనగా టీడీపీకి రాజీనామా చేసి బయటకొచ్చా. –కోరాడ నర్సింగరావు, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బలరాంపురం, ఇంత మోసగాడనుకోలేదు.. చంద్రబాబు ఇంత మోసగాడనుకోలేదు. మూడుసార్లు అమరావతిలో ముఖ్యమంత్రిని కలిశాం. ఇక మంత్రి అచ్చెన్నాయుడిని 30 సార్లు కలిసి ఉంటాం. ఎస్టీల జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఏడాదిగా మభ్యపెడుతూ వచ్చారు. ఈ మోసాన్ని గుర్తించే టీడీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నాం. నేను పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్నా. శ్రీకాకుళం పట్టణ ఉపాధ్యక్షుడిగా, కౌన్సిలర్‌గా పనిచేశా. –దూడ సుధాకర్ (ఎస్టీ సాధన సమితి శ్రీకాకుళం జిల్లా కన్వీనర్) -
ఆశల తీరం.. అభివృద్ధికి దూరం
సాక్షి, నరసాపురం: జిల్లాలో 19 కిలోమీటర్లు మేర తీర ప్రాంతం.. అపార మత్స్యసంపద, ఏటా రూ.300 కోట్లపైగా మత్స్యసంపద ఎగుమతులు.. వేటపై ఆధారపడి జీవించే 3 వేల మత్స్యకార కుటుంబాలు.. ఇది నరసాపురం ప్రాంతం పరిస్థితి. అయితే సముద్రంలోకి బోట్లను పంపుకోవడానికి, మత్స్యసంపద ఎగుమతులు, దిగుమతులు చేసుకోవడానికి సరైన ఫ్లాట్పాం లేని దుస్థితి. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని దశాబ్దాలుగా నేతలు చెబుతూనే ఉన్నా కార్యాచరణ ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ అంశంపై కదలిక వచ్చింది. ఆయన మృతితో పట్టించుకునేవారే కరువయ్యారు. మత్స్యకారులు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి ఓట్లకు గాలం వేసేందుకు తెలుగుదేశం పార్టీ హార్బర్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. హార్బర్ స్థానంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం అంటూ హడావుడి కూడా చేశారు. అపార మత్స్యసంపద.. బంగాళాఖాతానికి చేరువలో ఉండటంతో నరసాపురం తీరంలో అపారంగా మత్స్యసంపద ఉంది. నరసాపురం, కాకినాడ, నెల్లూరు, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన సుమారు 150 వరకూ బోట్లు తీరంలో నిత్యం వేటసాగిస్తాయి. ఏటా ఈ ప్రాంతం నుంచి రూ.300 కోట్లపైనే మత్స్య ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. అయితే స్థానికంగా ఎగుమతి, దిగుమతులకు సంబంధించి, వేట బోట్లను నిలిపి ఉంచుకోవడానికి ఎలాంటి సదుపాయాలు లేవు. దీంతో వేట ముగించిన బోట్లు అటు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది. నరసాపురంలోని లాకుల వద్ద ఉన్న గోదావరి పాయ వద్ద నిలిపి ఉంచుతారు. మళ్లీ బోట్లను వేట కోసం సముద్రంలోకి తీసుకెళ్లడం మత్స్యకారులకు కష్టంతో కూడుకున్న పని. మత్స్యకారుల వేటకు అనువుగా, మత్స్యసంపద ఎగుమతి, దిగుమతులకు వీలుగా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో హార్బర్ నిర్మించాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. ఐదేళ్లు.. ఎన్నో డ్రామాలు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో హార్బర్‌పై ఎలాంటి దృష్టిపెట్టలేదు. హార్బర్ తరహాలోనే బియ్యపుతిప్పలో రూ.13.58 కోట్లతో ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ నిర్మిస్తామని కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. 2017 జనవరి 26న మత్స్యశాఖ కార్యదర్శి ఎస్.అంజలి బియ్యపుతిప్ప ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామని, మరో రెండు, మూడు నెలల్లోనే పనులు మొదలు పెడతామంటూ హడావుడి చేశారు. కేంద్ర మత్స్యశాఖ నిధులు అందిస్తుందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఎమ్మెల్యే సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. గతంలో వైఎస్ హయాంలో స్థల సేకరణ జరిగిన ప్రాంతంలోనే ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి మొదటి విడతగా రూ.13.58 కోట్లు మంజూరు చేశారని, దీనికి సంబంధించి జీఓ కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారు. లోకేష్‌తో శంకుస్థాపన కూడా చేయించారు. అయితే ఒక్కపైసా కూడా నిధుల విడుదల కాలేదు. ఇవీ ఉపయోగాలు.. హార్బర్ నిర్మిస్తే తీరప్రాంతంతో పాటు జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మత్స్యసంపదకు డిమాండ్ ఉంది. అయితే గిడ్డంగులు వంటి సదుపాయలు లేకపోవడంతో మత్స్య ఉత్పత్తులను అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. హార్బర్ నిర్మిస్తే మత్స్యకారులకు మేలు జరుగుతుంది. రవాణా మార్గాలు అభివృద్ధితో పాటు అనుబంధ పరిశ్రమలు వస్తాయి. వైఎస్ హయాంలో కదలిక 2004లో వైఎస్ అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్‌పై దృష్టిపెట్టారు. 2006లో వైఎస్ రాజశేఖరెడ్డి రూ.8.53 కోట్లతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయించారు. 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత కేంద్ర మత్స్యశాఖ ద్వారా నరసాపురం మండలం బియ్యపుత్పిలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి దాదాపుగా రంగం సిద్ధం చేశారు. అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో అక్కడున్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో హార్బర్ నిర్మించాలని, రేవు నిర్మాణం, శీతల గిడ్డంగులు, బోట్లు, వలల మరమ్మతుల యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించారు. మోసం చేస్తున్నారు ఐదేళ్లుగా పట్టించుకోలేదు. హార్బర్ నిర్మాణానికి జీఓ వచ్చిందన్నారు. శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. తీరంలో మత్స్యకారులను ప్రభుత్వం మోసం చేస్తుంది. ముందు హార్బర్ అన్నారు, మళ్లీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అంటున్నారు. చివరకు ఏదీలేదు. వశిష్ట వంతెన తరహాలోనే హార్బర్ విషయంలో కూడా మోసం చేశారు. –బర్రి శంకరం, మత్స్యకారనేత జిల్లా అభివృద్ధిపై ప్రభావం జిల్లాలో తీరప్రాంతం ఇక్కడే ఉంది. ఇక్కడ హార్బర్ నిర్మిస్తే కేవలం మత్స్యకారులకే కాదు అందరికీ ఉపయోగం. జిల్లా అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 2014 ఎన్నికల్లో 15కి 15 స్థానాలు కట్టబెట్టిన జిల్లాకు చంద్రబాబునాయుడు మొండిచేయి చూపించారు. –విన్నా ప్రకాష్, న్యాయవాది -
లక్ష్యం చేరలే..
హన్మకొండ చౌరస్తా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సమీకృత మత్స్య అభివృద్ధి పథకం లక్ష్యం నెరవేరడం లేదు. చేపల పెంపకం.. చేప విత్తనాల ఉత్పత్తి.. ప్రాసెసింగ్.. మార్కెటింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి చేయూతనందించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం నిధుల లేమితో పేదల దరిచేరని పరిస్థితి నెలకొంది. సుమారు రూ.వెయ్యి కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఎఫ్‌డీఎస్ అమలుకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష మంది మత్స్యకారులు ఉండగా.. ఇందులో 40 శాతం మంది మాత్రమే లబ్ధి పొందినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన 60 శాతం మంది డీడీలు చెల్లించి.. ఆరు నెలలకు పైగా వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. నిధుల కొరతే కారణమా.. పథకం అమలులో జాప్యంపై అధికారులను సంప్రదించగా.. ఎన్నికలే కారణమని చెప్పారు. కోడ్ అమలులో ఉన్నందున వాహనాలను పంపిణీ చేయలేదని అంటున్నారు. అయితే.. ఎన్నికల ముందే ప్రారంభమైన పథకానికి కోడ్ సంబంధమేంటని మత్స్య సహకార సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా నిధుల కొరత కారణంగానే పథకం అమలు నిలిచిపోయినట్లు సమాచారం. వస్తాయా.. లేదా.. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా లబ్ధిపొందే వస్తువుపై లబ్ధిదారుడు 25 శాతం మొత్తాన్ని డీడీ ద్వారా మత్స్యశాఖ కార్యాలయం పేరుతో చెల్లించాలి. మిగిలిన 75శాతం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ప్రాతిపదికన టీవీఎస్ మోపెడ్, లగేజీ ఆటోల కోసం చెల్లించిన వారే ఎక్కువ శాతం మంది ఉన్నారు. ఇందులో 40 శాతం మంది లబ్ధిదారులకు మాత్రమే వాహనాలు అందినట్లు మత్స్య సహకార సంఘాలు చెబుతున్నాయి. టీవీఎస్ మోపెడ్ నుంచి లగేజీ ఆటోల వరకు లబ్ధిదారులుగా ఎంపికైన మత్స్యకారులు డీడీలు చెల్లించి ఆరు నెలలు గడుస్తోంది. అప్పు తెచ్చి డీడీలు చెల్లించిన మత్స్యకారులకు నిధుల లేమి నేపథ్యంలో వాహనాలు వస్తాయా.. లేదా.. అనే అనుమానం వారిని పీడిస్తోంది. -
న్యాయం జరిగేలా కృషి చేస్తాం: విజయసాయి రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: అరేబియన్ మహా సముద్రంలో పాకిస్తాన్ భద్రతా దళాల(కోస్టు గార్డుల)కు చిక్కి కరాచీ జైలులో మగ్గుతున్న రాష్ట్రానికి చెందిన మత్య్సకారుల విడుదలకు కృషిచేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. సోమవారం సీతమ్మధార క్యాంప్ కార్యాలయంలో మత్స్యకార కార్మిక సంఘం నేత మూగి గురుమూర్తి, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాలు విజయసాయిరెడ్డిని కలిసి సమస్యను వివరించి, వినతిపత్రం అందించారు. అరెస్టయిన 22 మంద్రి ఆంధ్ర మత్య్సకారులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. వారంరోజులు గడుస్తున్నా కేంద్ర విదేశాంగ శాఖలో ఎలాంటి చలనం లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే కేంద్రం స్పందించి బందీలైన మత్య్సకారుల విడుదలకు కృషిచేయాలని కోరారు. త్వరలోనే బందీలైన మత్స్యకారుల కుటుంబ సభ్యులతో కలిసి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలవడానికి ఢిల్లీ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. -
పాకిస్తాన్ రక్షణ దళాలకు బందీగా మారిన అభాగ్యులు
రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న జీవితాలు వారివి. దినదిన గండంగా సాగే వృత్తిపైనే జీవించే కుటుంబాలవి.సముద్రమే సర్వస్వంగా... మృత్యువుకు ఎదురీది... నిత్యం పోరాటమే వారి జీవనం. ఉన్న ఊళ్లో కూడు కరువై... కుటుంబ పరిస్థితులు భారమై... బతుకు తెరువుకోసం పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. అక్కడ బోటులో కూలీలుగా మారి కొందరు ప్రకృతి వైపరీత్యాల వల్ల మృత్యువాత పడుతుండగా... మరి కొందరు అనుకోని కష్టంలో చిక్కుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాంకు చెందిన మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రంలోని హీరావల్లో బోటులో కూలీలుగా చేరి వేట చేస్తూ పాకిస్తాన్ జలాల్లోకి పొరపాటున వెళ్లి అక్కడి కోస్టుగార్డు దళాలకు బందీ అయ్యారు. తమవారిని విడిపిస్తారో లేదో... ఎన్నాళ్లు వారిని చెరలోఉంచుతారో తెలియక ఇక్కడి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఊళ్లోనే ఉపాధి ఉంటే ఈ సమస్యలు తలెత్తేవా.. అని వారు గగ్గోలు పెడుతున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురానికి చెందినవారే గడచిన నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాల్లో చిక్కుకున్నారు. ఈ రెండు మండలాల్లో సుమారు 22 వేల మంది మత్స్యకారులున్నారు. వారిలో వివిధ కారణాల రీత్యా, కుటుంబ పరిస్థితుల కారణంగా సుమారు 2 వేల మందికి పైగా మత్స్యకారులు ఇప్పటికే వలసపోగా సుమారు 3500 మంది వరకు సముద్రంలో వేటకు వెళుతున్నారు. 16,500 మంది పరోక్షంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏ పనీ చేయలేని వారు, వృద్ధాప్యం మీద పడిన వారు మాత్రమే తీరప్రాంత గ్రామాల్లో ఉన్నారు తప్ప పనిచేయగలిగే శక్తి ఉన్నవారందరూ చాలా వరకు వలస బాటపట్టారు. పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలస, చింతపల్లి, పతివాడ బర్రిపేట, కోనాడ, భోగాపురం మండలంలో ముక్కాం, చేపల కంచేరు, కొండ్రాజుపాలెం తదితర గ్రామాల నుండి మత్స్యకారులు ఎక్కువగా వలసపోతున్నారు. వీరిలో అత్యధికంగా విశాఖపట్నం మంగమారిపేట, గుజరాత్లో సూరత్, వీరావలి వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు. కాటేస్తున్న కాలుష్యభూతం తీరప్రాంత గ్రామాలను ఆనుకుని రసాయన పరిశ్రమల వ్యర్థాలు పైపులైన్లు వేసి సముద్రంలోకి విడిచిపెడుతుండటంతో ఇక్కడి మత్స్యసంపద కాస్తా కనుమరుగైపోతోంది. ఇక్కడ చేపలు దొరకక బతువు తెరువు కోసం వలసపోతున్నారు. మత్స్యకారుల జీవన పరిస్థితిలు మెరుగుపరచడానికి ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా వలసలకు కారణంగా చెప్పవచ్చు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు గంగపుత్రులు తమ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయింది. చేసేది లేక వలస వెళ్లాల్సి వచ్చింది. పూసపాటిరేగ మండలంలోని ఒక్క తిప్పలవలస నుండే సుమారు వెయ్యిమంది వలస పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నిత్యం ప్రమాదంలోనే... ఉన్న ఊరిలో వేటసాగకపోవడంతో వివిధ రాష్ట్రాల్లో చేపల వేటకు కూలీలుగా మారుతున్నారు. ప్రకృతి ప్రకోపానికి బలై మరణశయ్యపైకి చేరుతున్నారు. కొన్ని ప్రమాదాల్లో మృతదేహాల ఆచూకీ కూడా దొరకట్లేదు. మూడు నెలల క్రితం చింతపల్లికి చెందిన మైలపల్లి శ్రీను పారదీప్‌లో వేట చేసుకొని వస్తుండగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి తీరంలో జరిగిన పడవ ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. పూసపాటిరేగ మండలం పతివాడ బర్రిపేటకు చెందిన సూరాడ రాము, వాసుపల్లి లక్ష్మణరావు, తమ్మయ్యపాలేనికి చెందిన బడే సత్తియ్య ఒడిశాలోని గంజాం జిల్లా రామయ్యపట్నం రేవులో గల్లంతయ్యారు. తాజాగా పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క అప్పన్న, బర్రి బవిరీడు, నక్కా నరిసింగు, నక్క ధనరాజు, బోగాపురం మండలం ముక్కాంకు చెందిన మైలపల్లి గురువులు వీరావలినుంచి వేటకు బయలుదేరి పాక్జలాల్లో పొరపాటున ప్రవేశించి అక్కడి రక్షణ దళాలకు బందీలుగా చిక్కారు. పాక్ అదుపులో వున్న ఐదుగురి కుటుంబాలను జిల్లా అధికారులు కనీసం పట్టించుకోలేదు. కనీసం ఆరా తీయలేదు. బందీల పరిస్థితిపై ఇంతవరకూ కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇదీ మత్స్యకారుల ప్రాణాలకు వారిచ్చే విలువ. పాకిస్థాన్ దళాలవద్ద బందీలుగా ఉన్న జిల్లా మత్స్యకారులను విడిపించేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. జీవన పరిస్థితులపై అధ్యయనం చేసి, వారు వలస వెళ్లకుండా చేయాల్సిన ప్రత్యమ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇప్పటికే స్వయం ఉపాధిపై మత్స్యకారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్థానికంగా ఉండి చేపల వేట సాగించేందుకు కొత్తగా 120 బోట్లు మంజూరుచేశాం.– మాచర్ల దివాకర్, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ -
జాలర్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి
సాక్షి, అమరావతి: పాకిస్తాన్ చెరలో బందీలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జాలర్లను విడిపించే విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ కోస్టు గార్డులను అరెస్ట్ చేసి జాలర్లను విడిపించి క్షేమంగా రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చే విధంగా భారత ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ మేరకు వైఎస్ జగన్ శుక్రవారం ఒక ట్వీట్ చేశారు. ( ఇది చదవండి: గొల్లుమన్న మత్స్యకార పల్లెలు) Seeking the urgent intervention and help of MEA,GoI in ensuring the safe return of fishermen from Andhra Pradesh arrested by the Pakistan Coast Guard. — YS Jagan Mohan Reddy (@ysjagan) 30 November 2018 -
గొల్లుమన్న మత్స్యకార పల్లెలు
పూసపాటిరేగ/భోగాపురం: సముద్రమే వారికి సర్వస్వం. వేటే జీవనాధారం. దానికోసం ఎన్నికష్టాలైనా ఎదురీదుతారు. ఎంత దూరానికైనా పొట్టపోషణకోసం వెళ్లిపోతారు. అలా వెళ్లిన జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులు పాకిస్తాన్ సరిహద్దులోకి వెళ్లిపోవడంతో అక్కడి కోస్టుగార్డులకు చిక్కి బందీలుగా మారారు. విషయం తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు ఇప్పుడు గొల్లుమంటున్నారు. ఇక్కడ వేటసాగక.. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని తీరప్రాంతంలో వేట సరిగ్గా సాగడం లేదు. ఏడాదిలో దాదాపు రెండు నెలలు నిషేధం... మిగిలిన కాలంలో కొన్నాళ్లు రకరకాల తుఫాన్లు, అల్పపీడనాలు తదితర సమయాల్లో నెలల తరబడి వేట సాగడం లేదు. దీంతో జీవనాధారం లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఎంతోమంది మత్స్యకారులు బతుకు తెరువు కోసం గుజరాత్‌లోని హీరావల్ వెళ్లి అక్కడ కొందరివద్ద వేటపనికి కుదిరి ఇక్కడి కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. ఇలా వెళ్లినవారు అక్కడ వేటకోసం సముద్రంలోకి వెళ్లి రకరకాల చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. ఇక్కడ సక్రమంగా వేట సాగితే ఇక్కడినుంచి వెళ్తే పరిస్థితి ఉండదని స్థానికులు చెబుతున్నారు. అదే విధంగా పూసపాటిరేగ తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాం గ్రామాలకు చెందిన ఐదుగురు ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దులోకి అనుకోకుండా వెళ్లి అక్కడి రక్షక దళాలకు చిక్కారు. రెండు గ్రామాల్లో కలవరం పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాంనకు చెందిన పలువురు మత్స్యకారులు ఆగస్టు 15వ తేదీన గుజరాత్ రాష్ట్రం హీరావల్‌వెళ్లి చేపలవేట నిమిత్తం బోట్లులో కూలీలుగా పనిచేయడానికి కుదిరారు. అక్కడి నుంచి 10 రోజుల క్రితం ఇంజిన్ వున్న స్టేయింగ్ బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో పాకిస్తాన్ జలాల్లోకి వేటచేస్తూ ప్రవేశించారు. బోర్డర్లో వున్న పాకిస్తాన్ రక్షణ దళాలు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో తిప్పలవలసకు చెందిన నక్కా అప్పన్న, నక్కా ధనరాజు, నక్కా నరిసింగు, బర్రి బవిరీడు, భోగాపురం మండలం ముక్కాంనకు చెందిన మైలపల్లి గురువులు ఉన్నారు. ఇందులో నక్కా అప్పన్న, నక్కా ధనరాజు తండ్రీకొడుకులు, నక్కా నరిసింగు(18) అప్పన్నకు బంధువు. విడుదలకు కృషి చేయాలి పాకిస్తాన్లో బందీలుగా ఉన్న మత్స్యకారులను తక్షణమే విడుదల చేయడానికి కేంద్రప్రభుత్వం చొరవ చూపాలని బాధిత కటుంబాలు వేడుకొంటున్నాయి. గతంలో పాకిస్తాన్లో చిక్కిన వారిని సంవత్సరాలపాటు జైలులో ఉంచేవారని, బందీలుగా వున్న వారికి భోజన సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడిన రోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ హరివహర్‌లాల్ స్పందించి ప్రభుత్వానికి నివేదించాలని మత్స్యకారులు కోరుతున్నారు. అయితే మత్స్యకారులు చిక్కుకుని 24 గంటలు గడిచినా స్థానిక అధికారులు కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు. చింతపల్లి మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు తిప్పలవలసలో బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి సమాచారం మాత్రం సేకరించారు. మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు మాత్రం ఎక్కడా ఆచూకిలేదు. నా పెనిమిటి ఇంటికి వస్తాడా... మైలపల్లి గురువులకు భార్య దానయ్యమ్మ, కొడుకు దాసు, కుమార్తె సత్య ఉన్నారు. ఇద్దరు పిల్లలకీ వివాహాలు అయిపోయాయి. కొడుకు కర్ణాటక రాష్ట్రం మంగుళూరు వద్ద ఉంటూ వేట చేసుకుని జీవిస్తున్నాడు. భార్య గ్రామంలో చేపలు అమ్ముతూ జీవిస్తుంది. గురువులు ఇతర బోట్లలో వేట పనిచేస్తూంటాడు. సమాచారం తెలుసుకున్న గురువులు భార్య కన్నీటి పర్యంతమవుతోంది. తన భర్తకు 64 సంవత్సరాలుంటాయని, వేరే ఆధారం లేక అంత దూరం వెళ్లాల్సి వచ్చిందనీ, ‘నా పెనిమిటిని వేరే దేశపోళ్ళు తీసుకెళ్ళిపోయారంట... నా పరిస్థితి ఏంటి.. నా భర్త సేమంగా తిరిగొస్తాడా బాబూ.. సెప్పండి బాబూ’ అని కనబడినోళ్ళని అడగడం చూస్తే కడుపు తరుక్కుపోయింది. -
సముద్రంలో బోటు గల్లంతు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఫిషింగ్ బోటు సముద్రంలో గల్లంతైంది. బోటులో దుమ్మలపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 7న కాకినాడ నుంచి చేపల వేటకు ఫైబర్ బోటు వెళ్లింది. మత్స్యకారులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బాధితుల కుటుంబసభ్యులు ప్రభుత్వాధికారుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోస్టుగార్డులను కోరారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ రెండు జిల్లాలకు పిడుగుల ముప్పు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలోని తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లా వాసులను విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రెండు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా తీరం వెంబడి నైరుతి దిశగా దక్షిణ కోస్తా తీరం వెంబడి దక్షిణ దిశగా గంటకు 45-50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
13 నిమిషాలు ఊపిరి బిగపట్టి...
జకార్త : నిమిషం పాటు ఊపిరి బిగపట్టడమే కష్టం. అలాంటిది ఏకంగా నీటి అడుగులో పది నిమిషాలు ఊపిరి బిగపట్టడం మాములు విషయం కాదు. ఇండోనేషియాలోని బజౌ గిరిజన తెగకు చెందిన మత్స్యకారులు నీటి అడుగున 13 నిమిషాల పాటు ఊపిరి బిగపడతారంట. ఈ విషయాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు వెలుగులోకి తీసుకొచ్చారు. సూపర్ హ్యూమన్లుగా అభివర్ణిస్తూ ప్రఖ్యాత మాగ్జైన్ ‘జర్నల్ సెల్’ ఈ మేర ఓ కథనాన్ని ప్రచురించింది. ‘ఇండోనేషియాలోని దీవుల్లో వీళ్లు జీవిస్తుంటారు. చెక్కతో ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లద్దాలతో సముద్రంలోకి దూకుతారు. సుమారు 230 అడుగుల వరకు వెళ్లి చేపలు పడట్టం వీరి ప్రత్యేకత. అలా సుమారు 13 నిమిషాల వరకు నీటి అడుగున ఉండగలుగుతారు పీహెచ్డీ విద్యార్థిని మెలిస్సా ఇలార్డో తెలిపారు. దీనికి కారణం వారి శరీరంలోని ప్లీహం అని ఆమె చెబుతున్నారు. ‘సాధారణంగా నీటి అడుగున ఉన్నప్పుడు శ్వాసక్రియలో ప్లీహం కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్రరక్తకణాలను రక్త ప్రసరణలోకి చేర్చుతుంది. తద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. బజౌ తెగ వారిలో ప్లీహం సాధారణ మానవుల్లో కంటే పెద్ద పరిమాణం(50 శాతం పెద్దదిగా) ఉంది. అందుకే వాళ్లు వాళ్లు అంత ఎక్కువ సేపు నీటి అడుగున ఉండగలుగుతున్నారు’ అని మెలిస్సా వివరించారు. వెయ్యేళ్ల క్రితం బజౌ తెగ ప్రజలను సీ నమాడ్స్ అని పిలిచే వారు. దక్షిణాసియా సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టి జీవించేవారు. ప్రస్తుతం కొన్ని దీవుల్లో మాత్రమే కనిపిస్తున్నారు. తన పరిశోధనలో భాగంగా మెలిస్సా కొన్ని నెలలుగా ఇక్కడే నివసించి వాళ్ల జన్యు నమునాలను సేకరించి ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు ఈ వాదనను కొట్టేస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనల తర్వాతే ఓ అభిప్రాయానికి వస్తామని చెబుతున్నారు. -
వెలుగులోకి సూపర్ హ్యూమన్
-
చేపల వేటపై నిషేధం.. షరతులు!
బీజింగ్: నదీజలాల్లో లభ్యమయ్యే జీవ సంపదను సంరక్షించేందుకుగానూ చైనా ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా ప్రతి ఏడాది మూడు నెలలపాటు చైనాలోని పొడవైన నదుల్లో రెండోదైన ఎల్లో రివర్ (పసుపు నది), లేక హోయాంగ్లో చేపల వేటను నిషేధిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు మత్స్యకారులు, ఇతరులు పసుపు నది తీరంలో వేటకు వెళ్లొద్దని వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు ఓ ప్రకనటలో వెల్లడించారు. చైనాలో అతిపొడవైన నది యాంగ్ట్జే లో 2002నుంచి పూర్తి స్థాయిలో చేపలు, ఇతర జలచరాల వేటను అధికారులు నిషేధించారు. పెరల్ నది తీరంలోనూ ఫిషింగ్ నిషేధిస్తూ చైనా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో చేపలవేట నిషేధించిన మూడోనదిగా ఎల్లో రివర్ (పసుపు నది) నిలిచింది. ఈ ఏప్రిల్ నుంచి చేపలవేటపై నిషేధం అమల్లోకి వస్తుంది. మూడు పెద్ద సరస్సులు, 13 పెద్ద కాలువలు ఎల్లో రివర్‌తో అనుసంధానమై ఉన్నాయి. కాగా, మత్స్యసంపదకు ఆటంకాలు తలెత్తుతున్నాయన్న కారణంతో ప్రతి ఏడాది కొంతకాలం చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్లు వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు వివరించారు. అనుమతి లేకుండా ఎక్కడైనా చేపలవేట కొనసాగించినట్లు గుర్తిస్తే ఆ మత్స్యకారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
మత్స్య రహస్యం!
‘‘ అధికారి గారు.. జిల్లాలో ఏ పథకం అమలవుతుంది..వాటి వివరాలు ఏమైనా చెబుతారా’’ అని అడిగితే..అన్ని పథకాలు అమలవుతున్నాయి’’ అన్న సమాధానం వస్తోంది. ‘‘ఏయే పథకాలో వివరంగా చెబుతారా’’..అని మళ్లీ అడిగితే..‘‘అన్ని పథకాలు అని చెప్పాముగా..ఇంకేం కావాలి.’’ అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి అధికారులు, కిందిస్థాయి సిబ్బంది. ఇదండీ జిల్లా మత్స్యశాఖ పరిస్థితి. ఇక్కడ అంతా రహస్యమే. ఏ పథకం కింద ఎవరు లబ్ధిపొందుతున్నారో సమాచారం ఇవ్వరు. అసలు పథకంకింద లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారో..చేయడం లేదో తెలియని పరిస్థితి. నల్లగొండ టూటౌన్ : మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉచితంగా చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టి వారికి అన్ని విధాలా మేమున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. అందుకు భిన్నంగా జిల్లా మత్స్యశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యకారుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నా క్షేత్రస్థాయిలో ఉన్న మత్స్యకార్మికులకు తెలియజేయకుండా ఏ ఒక్క పథకంపైనా సంబంధిత అధికారులు నోరు విప్పకుండా వింత పోకడపోతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వాల నుంచి ఏయే పథకాలు వస్తున్నాయన్న వివరాలను కూడా మత్స్యకారులకు తెలియనీయకుండా కార్యాలయంలోని కొంతమంది అధికారులు తమకు నచ్చినవారికి మాత్రమే సమాచారం ఇచ్చి ‘చేతులు చాచుతున్నారు’ అనే విమర్శలు ఉన్నాయి. ఫలానా పథకం మంజూరైంది..ఇన్ని యూనిట్లు ఉన్నాయి..అర్హులు దరఖాస్తు చేసుకోవాలి అన్న సమాచారాన్ని కనీసం పత్రికల ద్వారా కూడా ప్రకటన జారీ చేయకుండా అంతా రహస్యంగా ఉంచుతున్నారు. దీంతో ఈ శాఖలో ప్రభుత్వ పథకాలు గడప దాటడంలేదు. ఎందుకింత రహస్యం? ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో కా ర్మికులందరికి తెలియజేసే బాధ్యతను మత్స్యశాఖ అధికారులు విస్మరించడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి పథకం గురించి మీడి యా ద్వారా ప్రచారం కల్పించాల్సి ఉన్నా ఆ విధంగా చేసిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. జిల్లాలో 147 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా సభ్యులు 25 వేల మంది వరకు ఉన్నారు. మొత్తం మత్స్యకారుల సంఖ్య సుమారు 90 వేల పైబడే ఉన్న ట్లు తెలుస్తుంది. వీరి సంక్షేమానికి ప్ర భుత్వం టాటా ఏసీ ట్రాలీ వాహనాలు, టీవీఎస్ మోపెడ్ బైక్‌లు, చేపలు పట్టే వలలు, మహిళా సభ్యులకు స బ్సిడీ రుణాలు, ఐస్ బాక్సులు, త దితర వా టిని సబ్సిడీపై అందజేస్తుంది. ఆయా పథకాలపై సంబందిత అధికారులు మ త్స్యకారులకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై పలు అ నుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త మకు నచ్చిన వారికి మాత్రమే తె లి సేలా సంఘం అధ్యక్షుడికి, లేదంటే వా రికి అనుకూలంగా ఉండే సభ్యులకు మాత్రమే సమాచారం చేరవేస్తున్నారనే పలువురు మత్స్యకార్మికులు ఆరోపిస్తున్నారు. మూలన పడిన బడ్జెట్ ... 2016–17 సంవత్సరానికి సంబంధించి మత్స్యకార్మికుల కోసం ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. దాదాపు రూ.కోటికి పైగా బడ్జెట్ ఉన్నా అర్హులైన వారికి నేటికీ పథకాలు అందించలేదు. చేపల విక్రయానికి టాటా ఏసీ ట్రాలీ వాహనాలు, టీవీఎస్ మోపెడ్లు కార్మికులకు ఎంతో అవసరం ఉన్నా వాటి గురించి అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదనే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లు దాటినా పథకాలు అబ్ధిదారులకు ఇవ్వడానికి అధికారులకు తీరిక లేదా, వారికి కావాల్సినవి ముట్టలేదా అనే ఆరోపణలు వస్తున్నాయి. అలాంటిది ఏమీ లేదు ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరితను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు అందించడానికి లబ్ధిదారుల జాబితా తయారు చేశామన్నారు. 2016–17 సంవత్సరంలో మాత్రమే వాహనాల బడ్జెట్ వచ్చిందని, సిబ్బంది ద్వారా మత్స్యకారులకు తెలియజేస్తున్నామని చెప్పారు. త్వరలోనే అందిస్తామని తెలిపారు. -
నిషే«ధం ఉన్నా నిర్భయంగావేట
కొవ్వూరు రూరల్: నిబందనలు ఉన్నా అమలు చేసేవారే ఉండరు. ఒకవేళ నిబందనలు ప్రదర్శించినా బయపడేవారు ఉండరు. ముఖ్యంగా జూన్ నుంచి ఆగష్టు నెలాఖరు వరకూ గోదావరి నదిలో గుడ్డు దశ నుంచి మత్స్య సంపద పెరుగుతుంది. ఈ సమయంలో నదిలో చేపలవేటను కూడా అధికారులు నిషేదిస్తుంటారు. అయితే అదే సమయంలో గోదావరిలో చేరే కొత్త నీటితో రొయ్య, చేపపిల్లలు విరివిగా దొరుకుతుంటాయి. దీనినే అక్రమార్కులు తమ వ్యాపారానికి మరల్చుకుంటున్నారు. ఆయా సమయంలో వేటపై నిషేదం ఉన్నా అది అమలు కావడం లేదు. కొవ్వూరు మండలం మద్దూరులంకలో బ్యారేజ్ వద్ద రొయ్య సీడ్‌ను పట్టుకుని అమ్ముకునే వ్యాపారం జొరుగా సాగుతుంది. అదే విదంగా గోదావరి పరివాహకప్రాంతంలో రొయ్య పిల్లలు చేప పిల్లలను పట్టి ఎండబెట్టి కోళ్ల మేతకు అమ్ముకుంటున్నారు. పిల్ల దశలో గోదావరిలో మత్స్య సంపదను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జాలర్లు వలల ద్వారా పట్టుకుంటే నదిలో అవి పెరగవని, తమ జీవనాధారం పోతుందంటూ రెండు నెలల క్రితం తాళ్లపూడి మండలంలోని జాలర్లు వేటను అడ్డుకున్నారు. ఈ విదంగా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అయితే ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన మత్స్యశాఖ అధికారులు మాత్రం పట్టనట్టే ఉంటారు. తూతూ మంత్రంగా సీడ్ పట్టే ప్రాంతంలో నిబందనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటారు. ఇప్పటికైనా గోదావరిలో అక్రమ వేటను నిరోదించి మత్స్యసంపదను కాపాడాలని కోరుతున్నారు. -
వామ్మో వార్దా
కరెన్సీ కొరత వేళ తుపాను ముప్పు ఆందోళన చెందుతున్న తీర ప్రాంత జనం చేతిలో చిల్లిగవ్వ లేక హడలిపోతున్న ప్రజలు నరసాపురం : వార్దా తుపాను భయపెడుతోంది. కరెన్సీ కష్టాలు రెట్టింపైన వేళ తుపాను ముప్పు పొంచి ఉండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురిస్తే చేతిలో చిల్లిగవ్వలేని వేళ తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే నోట్ల కష్టాలు తీవ్రంగా వెంటాడుతున్నాయని, ఈ నేపథ్యంలో తుపాను అంటే జనజీవనం పూర్తిగా స్తంభిస్తుందని ఆందోళన చెందుతున్నారు. వణుకుతున్న తీరం 19 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న జిల్లాకు తుపానులు కొత్తకాదు. తుపానుల సమయంలో జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, జనాన్ని ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం చేపడుతుంది. అయితే వార్దా తుపానును ప్రత్యేకంగా చూడాలి. నోట్ల రద్దుతో జనం దగ్గర రూపాయి లేని పరిస్థితి. సరిగ్గా సమయం చూసి తుపాను విరుచుకు పడబోతోంది. అందుకే అందరిలో ఒకటే గుబులు. రెండు రోజుల నుంచి గంటల తరబడి బ్యాంకుల ముందు నుంచున్నా కూడా పైసా చేతికి రాలేదు. ఏటీఎంలు ఎక్కడా తెరుచుకోలేదు. శనివారం అయినా ఏటీఎంల్లో సొమ్ములు పెడతారనుకుంటే అదీ జరగలేదు. మరో రెండు రోజుల పాటు బ్యాంకులకు సెలవు. ఈ రెండురోజులు కూడా ఏటీఎంల్లో సొమ్ములు పెట్టకపోతే అడగడానికి బ్యాంకు సిబ్బంది కూడా కనిపించని పరిస్థితి. రాబోయే రెండు రోజులు కూడా ఏటీఎంల్లో సొమ్ములు ఉండవని, జనం మానసికంగా సిద్ధమయ్యారు. తుపాను గండాన్ని ఎలా గట్టెక్కాలోనని ఆలోచిస్తున్నారు. భారీవర్షాలు కురిసే అవకాశం ఆది, సోమవారాల నుంచి తుపాను ప్రభావం కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులు వరుసగా భారీవర్షాలు పడి ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడితే తీవ్ర ఇబ్బందులు తప్పవు. భారీవర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. అదే జరిగితే ఇంట్లో నుంచి రెండు, మూడు రోజులపాటు బయటకు రాని పరిస్థితి. దీంతో పప్పులు, కూరగాయలు లాంటి నిత్యావసర వస్తువులు కొనుక్కుని, ఇంట్లో పెట్టుకుందామని జనం భావించారు. అయితే శనివారం ఎక్కడా ఏటీఎంలు తెరుచుకోలేదు. కోతలు ఇంకా పూర్తిస్థాయిలో అవ్వకపోవడం, ధాన్యం ఒబ్బిడి జరగక పోవడం లాంటి ఇబ్బందులున్నాయి. కూలీలకు సొమ్ములు ఇచ్చుకోని పరిస్థితిలో రైతులు ఉన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా సొమ్ములు ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కానీ ఎక్కడా అమలు కాలేదు. ఒక్క రైతులు అనే కాదు. వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు ఇలా అన్నివర్గాల ప్రజలకు ఇప్పుడు ఒక్కటే అలోచన. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా తుపాను తాకిడిని ఎలా ఎదుర్కోవాలి. తుపాను రక్షణ చర్యలంటూ రెండు రోజులుగా సమీక్ష సమావేశాలతో హడావిడి చేస్తున్న రెవెన్యూ అధికారులు మరి ఈసారి రక్షణ చర్యల్లో కొత్తగా చేరిన కరెన్సీ కొరతను ఎలా ఎదుర్కొంటారనేదే అసలు ప్రశ్న. తిరిగొచ్చిన బోట్లు తుపాను ప్రభావం శనివారం నుంచి కనిసిస్తోంది. నరసాపురం తీరప్రాంతంలో ఆకాశం మబ్బులతో, చల్లటి గాలులు వీస్తున్నాయి. వేటకు వెళ్లిన బోట్లు తుపాను హెచ్చరికలతో తీరానికి చేరాయి. నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడ ప్రాంతాలకు చెందిన 70 వరకూ వేట బోట్లు నరసాపురం తీరానికి చేరాయి. సముద్రంలో అలజడి వాతావరణం నెలకొందని మత్స్యకారులు తెలిపారు. చేతిలో చిల్లిగవ్వ లేదు నేను చేపలు అమ్ముకుని జీవిస్తున్నాను. తుపాను తీవ్రరూపం దాలిస్తే కొన్ని రోజుల వరకు వ్యాపారం ఉండదు. నోట్ల రద్దు కారణంగా కొంతకాలంగా అమ్మకాలు లేవు. పింఛన్ సొమ్ము కూడా బ్యాంకులోనే ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఈ పరిస్థితుల్లో తుపాను వస్తే తీవ్ర ఇబ్బందులే. కె.సత్యవతి, మెట్టిరేవు, మొగల్తూరు మండలం నగదు కొరత లేకుండా చూడాలి తుపాను ప్రభావం గట్టిగా ఉంటే మాత్రం జనం నానాపాట్లు పడతారు. ఎందుకంటే మూడు రోజులుగా బ్యాంకుల్లో డబ్బులు సరిగా రావడంలేదు. మళ్లీ సెలవులు వచ్చాయి. ఎవరి చేతిలోనూ డబ్బులు లేవు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నగదు కొరత లేకుండా చూడాలి. డాక్టర్ ఏబీఎస్ మూర్తి, పర్యావరణవేత్త, వైఎన్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్