![Fishing Boat Disappear In sea At Kakinada bank - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/15/dert.jpg.webp?itok=RzLO642J)
ప్రతీకాత్మక చిత్రం
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఫిషింగ్ బోటు సముద్రంలో గల్లంతైంది. బోటులో దుమ్మలపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 7న కాకినాడ నుంచి చేపల వేటకు ఫైబర్ బోటు వెళ్లింది. మత్స్యకారులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బాధితుల కుటుంబసభ్యులు ప్రభుత్వాధికారుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోస్టుగార్డులను కోరారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment