సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల్లో ఏడుగురు మృతి చెందారు.
కాకినాడ: సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల్లో ఏడుగురు మృతి చెందారు. వీరంతా పగడాలపేటకు చెందిన సింహాద్రి, కామారి నూకరాజు, బుచ్చిబాబు, పాపారావు, కర్రి రాజు, సత్యనారాయణ, సత్యబాబు గా గుర్తించారు. మరో ఆరుగురు మత్య్సకారులు సహాయం కోసం ఎదరుచూస్తున్నారు. అయితే మంగళవారం ఉదయం ఎల్లయ్యపేటకు చెందిన ఓ బోటు ఒడిశా తీరానికి చేరుకుంది. ఇప్పటివరకు 25 బోట్లు తీరానికి చేరుకోగా, మరో 15 బోట్ల ఆచూకీ లభ్యం కాలేదు.
కాగా మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప హామి ఇచ్చారు. సముద్రంలో చిక్కుకున్న మత్య్సకారులు, బోట్ల ఆచూకీకై గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు. విశాఖ-కళింగపట్నం-గోపాలపురం మధ్య ఎయిర్ క్రాప్ట్ తో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.