సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల్లో ఏడుగురు మృతి చెందారు. వీరంతా పగడాలపేటకు చెందిన సింహాద్రి, కామారి నూకరాజు, బుచ్చిబాబు, పాపారావు, కర్రి రాజు, సత్యనారాయణ, సత్యబాబు గా గుర్తించారు. మరో ఆరుగురు మత్య్సకారులు సహాయం కోసం ఎదరుచూస్తున్నారు. అయితే మంగళవారం ఉదయం ఎల్లయ్యపేటకు చెందిన ఓ బోటు ఒడిశా తీరానికి చేరుకుంది. ఇప్పటివరకు 25 బోట్లు తీరానికి చేరుకోగా, మరో 15 బోట్ల ఆచూకీ లభ్యం కాలేదు.