ఆ రెండు జిల్లాలకు పిడుగుల ముప్పు | Visakhapatnam Meteorological Center Latest Warning | Sakshi
Sakshi News home page

ఆ రెండు జిల్లాలకు పిడుగుల ముప్పు

Published Mon, May 14 2018 2:23 PM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

Visakhapatnam Meteorological Center Latest Warning - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీలోని తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లా వాసులను విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రెండు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా తీరం వెంబడి నైరుతి దిశగా దక్షిణ కోస్తా తీరం వెంబడి దక్షిణ దిశగా గంటకు 45-50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement