ఆక్వా పరిశ్రమ వద్దంటూ అర్ధనగ్న ప్రదర్శన | aakwa parisrama vaddamtu arthanagna pradarsana | Sakshi
Sakshi News home page

ఆక్వా పరిశ్రమ వద్దంటూ అర్ధనగ్న ప్రదర్శన

Published Sat, Aug 20 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

aakwa parisrama vaddamtu arthanagna pradarsana

మొగల్తూరు : తుందుర్రులో ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ మత్య్సకారులు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ తమ తాతల నుంచి వేటే ఆధారంగా జీవిస్తున్నామని, తల్లి లాంటి గొంతేరు డ్రెయిన్‌ను కాలుష్యం చేసి తమ పొట్టలు కొట్టవద్దన్నారు. రెండు సంవత్సరాలుగా పరిశ్రమ స్థాపించవద్దంటూ ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి లక్ష్మణస్వామి, మునియ్య, నాగిడి రాంబాబు, ముత్యాలరాజు, బర్రి లక్ష్మణస్వామి, తిరుమాని శ్రీరాములు, కె.విశ్వనాథవర్మ, రాజశేఖర్, మార్రాజు, ప్రసాద్‌ పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement