tumdurru
-
జైలు నుంచి ఆక్వా ఉద్యమకారులు విడుదల
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ జైలు నుంచి మెగా ఆక్వా పార్కు ఉద్యమకారులు ఆరుగురు మంగళవారం విడుదలయ్యారు. గోదావరి మెగా ఆక్వా పుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాడంతో పోలీసులు పలువురిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. 50 రోజులుగా జైలులో ఉన్న ఆరేటి వాసు, ముచ్చెర్ల త్రిమూర్తులు, బెల్లపు సుబ్రహ్మణ్యం, కొయ్యే మహేష్, కలిగిత సుందరావులకు బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల అయ్యారు. ఉద్యమకారులకు ఆక్వాపుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్‌జైలు నుంచి తుందుర్రు బాధితురాలు ఆరేటి సత్యవతి కూడా నిన్న బెయిల్ పై విడుదలయిన విషయం తెలిసిందే. -
ఆక్వా పరిశ్రమ వద్దంటూ అర్ధనగ్న ప్రదర్శన
మొగల్తూరు : తుందుర్రులో ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ మత్య్సకారులు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ తమ తాతల నుంచి వేటే ఆధారంగా జీవిస్తున్నామని, తల్లి లాంటి గొంతేరు డ్రెయిన్‌ను కాలుష్యం చేసి తమ పొట్టలు కొట్టవద్దన్నారు. రెండు సంవత్సరాలుగా పరిశ్రమ స్థాపించవద్దంటూ ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి లక్ష్మణస్వామి, మునియ్య, నాగిడి రాంబాబు, ముత్యాలరాజు, బర్రి లక్ష్మణస్వామి, తిరుమాని శ్రీరాములు, కె.విశ్వనాథవర్మ, రాజశేఖర్, మార్రాజు, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆక్వా పరిశ్రమ వద్దంటూ అర్ధనగ్న ప్రదర్శన
మొగల్తూరు : తుందుర్రులో ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ మత్య్సకారులు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ తమ తాతల నుంచి వేటే ఆధారంగా జీవిస్తున్నామని, తల్లి లాంటి గొంతేరు డ్రెయిన్‌ను కాలుష్యం చేసి తమ పొట్టలు కొట్టవద్దన్నారు. రెండు సంవత్సరాలుగా పరిశ్రమ స్థాపించవద్దంటూ ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి లక్ష్మణస్వామి, మునియ్య, నాగిడి రాంబాబు, ముత్యాలరాజు, బర్రి లక్ష్మణస్వామి, తిరుమాని శ్రీరాములు, కె.విశ్వనాథవర్మ, రాజశేఖర్, మార్రాజు, ప్రసాద్ పాల్గొన్నారు.