ఏపీ తీరానికి ఉగ్ర ముప్పు లేదు.. | There is no threat to the AP coast | Sakshi
Sakshi News home page

ఏపీ తీరానికి ఉగ్ర ముప్పు లేదు..

Published Mon, Aug 7 2017 2:51 AM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM

ఏపీ తీరానికి ఉగ్ర ముప్పు లేదు..

ఏపీ తీరానికి ఉగ్ర ముప్పు లేదు..

కోస్ట్‌గార్డు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ వీఎస్‌ఆర్‌ మూర్తి
 
సాక్షి, న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతానికి ఎలాంటి ఉగ్రముప్పు లేదని కోస్ట్‌గార్డు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ వీఎస్‌ఆర్‌ మూర్తి తెలిపారు.   పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మూర్తి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమ నౌకలు, విమానాలు ఏపీ తీరప్రాంతాన్ని అనుక్షణం గస్తీ కాస్తుంటాయని తెలిపారు. భారతదేశానికి 7,516 కిలోమీటర్ల విస్తారమైన తీర ప్రాంతముందని, ఇదే మాదక ద్రవ్యాల రవాణాకు ప్రధాన కారణమని చెప్పారు.

తీర ప్రాంత రక్షణలో కోస్ట్‌గార్డ్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఏపీ తీరప్రాంతానికి ఎలాంటి ఉగ్రముప్పు లేదని, విశాఖ, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నంలో కోస్ట్‌గార్డ్‌ స్టేషన్లున్నాయని పేర్కొన్నారు. తమ నౌకలు, విమానాలు ఏపీ తీరప్రాంతాన్ని అనుక్షణం గస్తీ కాస్తుంటాయని, విశాఖ సమీపంలోని నౌకాదళ స్థావరాలు, కాకినాడ సమీపంలోని చమురు ఉత్పత్తి, శుద్ధి కేంద్రాలకు రక్షణ చాలా అవసరమని వివరించారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement