పాక్ బోటు కలకలం.. అదుపులో తొమ్మిదిమంది | Pakistani Boat with 9 on Board Apprehended off Gujarat Coast | Sakshi
Sakshi News home page

పాక్ బోటు కలకలం.. అదుపులో తొమ్మిదిమంది

Published Sun, Oct 2 2016 4:25 PM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM

పాక్ బోటు కలకలం.. అదుపులో తొమ్మిదిమంది - Sakshi

పాక్ బోటు కలకలం.. అదుపులో తొమ్మిదిమంది

అహ్మదాబాద్: భారత సైన్యం జరిపిన దాడుల గురించి సర్వత్రా చర్చ జరుగుతుండగా భారత సముద్ర జలాల్లోకి దూసుకొచ్చి ఓ పాకిస్థాన్ బోటు హల్ చల్ చేసింది. ఆదివారం గుజరాత్ సముద్ర తీరంలో భారత కోస్టు గార్డులు ఓ పాకిస్థాన్ బోటును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో తొమ్మిది మంది వ్యక్తులు ఉన్నారు.

ఆదివారం ఉదయం 10.15గంటల ప్రాంతంలో ఐసీజీఎస్ సముద్ర పావక్ పాక్ బోటును గుర్తించిందని, ఆ వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారని, ప్రాథమిక సమాచారం మేరకు అందులో ఉన్నవారంతా పాక్ మత్యకారులని తెలుస్తోంది. ఇటీవలె భారత్ సర్జికల్ దాడులు నిర్వహించిన నేపథ్యంలో పాకిస్థాన్ ఏ సమయంలో నైనా ఏ రూపంలోనైనా తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుందని నిఘా వర్గాలు సమాచారం అందించడంతో గస్తీ దళం మరింత అప్రమత్తమైంది. ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్న తొమ్మిదిమంది పాకిస్థాన్ వాస్తవ్యులను పోరుబందర్ లో విచారించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement