Superyacht Worth Millions Sunk Off Southern Italy: My Saga - Sakshi
Sakshi News home page

Viral Video: క్షణాల్లోనే సముద్రంలో మునిగిపోయిన 'మై సాగా'.. అంతా చూస్తుండగానే..

Published Wed, Aug 24 2022 5:44 PM | Last Updated on Wed, Aug 24 2022 7:11 PM

superyacht worth millions sunk off southern Italy - Sakshi

రోమ్‌: వందల కోట్లు విలువచేసే ఓడ చూస్తుండగానే క్షణాల్లో మునిగిపోయింది. దక్షిణ ఇటలీ సముద్ర తీరంలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓడలో ఉన్న 9 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు.40 మీటర్ల ఈ ఓడ పేరు 'మై సాగా'. 2007లో ఇటలీలోనే తయారు చేశారు.

గల్లిపోలి నుంచి మిలాజోకు వెళ్లే క్రమంలో కెటన్‌జారో మెరీనా తీరంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ముందుగా ఓడ కుడివైపు కొంత భాగం మునిగింది. ఆ తర్వాత క్షణాల్లోనే ఓడ మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఈ దృశ్యాలను ఇటలీ కోస్ట్ గార్డు సిబ్బంది రికార్డు చేశారు.

అయితే టగ్‌బోట్‌తో ఓడను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నించినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక అది సాధ్యం కాలేదు. ఓడ మునిగిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణకు ఆదేశించారు.
చదవండి: బైడెన్ టీంలో భారత సంతతి వ్యక్తులదే హవా.. 130మందికి కీలక పదవులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement