Yacht Video
-
Viral Video: చూస్తుండగానే మునిగిపోయిన వందల కోట్ల 'మై సాగా'
రోమ్: వందల కోట్లు విలువచేసే ఓడ చూస్తుండగానే క్షణాల్లో మునిగిపోయింది. దక్షిణ ఇటలీ సముద్ర తీరంలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓడలో ఉన్న 9 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు.40 మీటర్ల ఈ ఓడ పేరు 'మై సాగా'. 2007లో ఇటలీలోనే తయారు చేశారు. గల్లిపోలి నుంచి మిలాజోకు వెళ్లే క్రమంలో కెటన్‌జారో మెరీనా తీరంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ముందుగా ఓడ కుడివైపు కొంత భాగం మునిగింది. ఆ తర్వాత క్షణాల్లోనే ఓడ మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఈ దృశ్యాలను ఇటలీ కోస్ట్ గార్డు సిబ్బంది రికార్డు చేశారు. Nei giorni scorsi, la #GuardiaCostiera di #Crotone ha coordinato operazioni di salvataggio di passeggeri ed equipaggio di uno yacht di 40m, affondato a 9 miglia al largo di #CatanzaroMarina. Avviata inchiesta amministrativa per individuarne le cause. #SAR #AlServizioDegliAltri pic.twitter.com/kezuiivqsM — Guardia Costiera (@guardiacostiera) August 22, 2022 అయితే టగ్బోట్తో ఓడను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నించినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక అది సాధ్యం కాలేదు. ఓడ మునిగిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణకు ఆదేశించారు. చదవండి: బైడెన్ టీంలో భారత సంతతి వ్యక్తులదే హవా.. 130మందికి కీలక పదవులు -
అంత ఆపదలోనూ ఊహించని గిఫ్ట్
హెబె హవెన్: ఈశాన్య ఆసియా దేశాలను తుఫాన్లు పట్టి కుదిపేస్తున్నాయి. చైనా ను పొరుగున ఉన్న హాంకాంగ్‌ను టైఫూన్ ‘హటో’ కకావికలం చేస్తోంది. సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో నిరాశ్రయులైన ప్రజలకు తినేందుకు తిండి కూడా కరువు అవుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే నీట మునిగిన ఇళ్లలోనే సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే సయ్ కుంగ్ పెనిన్సులా లోని హెబ్ హెవెన్ ప్రాంతంలో మాత్రం అంత ఆపదలోనూ ఓ వ్యక్తికి అనుకోని బహుమతి లభించింది. ఓవైపు భారీ వర్షం.. మరోవైపు భయంకర వరదలో ఎవరో పంపినట్లుగా ఓ పడవ(యాట్చ్) కొట్టుకుని వచ్చింది. అంతే ఆనందంతో ఉబ్బి తబ్బిబి అయిపోయిన అతగాడు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ‘నాకు పడవ దొరికింది. ఈ తుఫాన్లో నా ప్రాణాలు రక్షించుకునేందుకు మార్గం సుగమమైంది’ అని హాంకాంగ్ హైకర్స్ లిమిటెడ్ డైరక్టర్ స్టీవ్ ఫెబై ఎఫ్బీ లో సందేశం ఉంచాడు. పైగా పక్కనే మరో పడవ కూడా కొట్టుకొచ్చిందంటూ ఫోటోలను కూడా అప్లోడ్ చేశాడు. ఆ పడవలు తమవేనంటూ ఎవరూ ముందుకు రాలేదని స్టీవ్ చెబుతున్నాడు. ప్రస్తుతం ట్విట్టర్, ఫేస్ బుక్‌లో ఆ వీడియోకు మంచి స్పందన వస్తోంది. టైఫూన్ దాటికి చైనా, హాంకాంగ్‌లు నష్టం భారీగా జరగ్గా, జుహియా సిటీలో అది తీవ్రస్థాయిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.