ship sinks
-
మునిగిపోయిన వాణిజ్య నౌక..
పోర్బందర్: అరేబియా సముద్ర జలాల్లో పయనిస్తున్న ఓ వాణిజ్య నౌక మునిగిపోవడంతో అందులో ఉన్న మొత్తం 12 మంది భారతీయ సిబ్బందిని మన తీర రక్షక దళం(ఐసీజీ) కాపాడింది. మన ప్రాదేశిక జలాల ఆవల చోటుచేసుకున్న ఈ ఘటనలో పాకిస్తాన్ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ)సత్వరమే స్పందించి, సహకారం అందించినట్లు ఐసీజీ వెల్లడించింది. ఎంఎస్వీ ఏఐ పిరన్పిర్ అనే వాణిజ్య నౌక సరుకుతో ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి ఈనెల 2న గుజరాత్‌లోని పోర్బందర్కు బయలుదేరింది. అయితే, బుధవారం ఉదయం సముద్రంలోని అల్లకల్లోల పరిస్థితులతో లోపలికి భారీగా నీరు చేరి పాక్ ఆర్థిక జోన్ పరిధిలో ద్వారకకు పశ్చిమాన 270 కిలోమీటర్ల దూరంలో మునిగిపోయింది. ఓడలోని సిబ్బంది ముంబైలోని ఐసీజీ విభాగం మారిటైం రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ)కు రక్షించాలంటూ సందేశం పంపారు. దీనిని ఎంఆర్సీసీ గాందీనగర్‌లోని ఐసీజీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయానికి చేరవేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఐసీజీ విభాగం ఘటన జరిగిన పీఎంఎస్ఏ విభాగానికి అత్యవసర మెయిల్ పంపించింది. పిరన్పిర్ ఓడలోని సిబ్బంది చిన్న లైఫ్ బోట్లో తప్పించుకున్నారని, దాని జాడ కనిపెట్టాలని కోరింది. తక్షణమే స్పందించిన పీఎంఎస్ఏ ఆ సమీపంలోని మరో వాణిజ్య నౌకకు, నేవీకి సమాచారం అందించింది. ఐసీజీతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పీఎంఎస్ఏ సిబ్బంది విమానం ద్వారా గాలించి చివరికి లైఫ్ బోట్ జాడ కనిపెట్టారు. ఆ మేరకు ఐసీజీ సార్థక్ ఓడలో మొత్తం 12 మందినీ తీసుకుని, పోర్బందర్కు తరలించింది. పాక్ అధికారులు తక్షణమే స్పందించి, పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ మొత్తం ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ఐసీజీ పేర్కొంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతోపాటు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంలో పీఎంఎస్ఏ చూపిన నిబద్ధతను కొనియాడింది. -
గ్రీస్ సమీపంలో సరకు నౌక మునక
ఏథెన్స్: గ్రీస్ పరిధిలోని లెస్బోస్ ద్వీపం సమీప మధ్యదరా సముద్ర జలాల్లో ఒక సరకు రవాణా నౌక మునిగిన ఘటనలో నలుగురు భారతీయుల ఆచూకీ గల్లంతైంది. సిబ్బందిలో ఒక్కరిని మాత్రమే కాపాడగలిగామని గ్రీస్ తీర గస్తీ దళాలు వెల్లడించాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో గాలింపు కష్టంగా మారింది. దాదాపు 6,000 టన్నుల ఉప్పుతో ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా నుంచి బయల్దేరిన నౌక తుర్కియేలోని ఇస్తాంబుల్‌కు వెళ్తోంది. మార్గమధ్యంలో గ్రీస్‌కు చెందిన లెస్బోస్ వద్ద మునిగిపోయింది. నౌకలోని 14 మంది సిబ్బందిలో నలుగురు భారతీయలు, ఎనిమిది మంది ఈజిప్ట్‌పౌరులు, ఇద్దరు సిరియన్లు ఉన్నారు. ఆదివారం ఉదయం ఏడింటపుడు మెకానికల్ సమస్య తలెత్తిందంటూ ఎమర్జెన్సీ సిగ్నల్ పంపిన నౌక తర్వాత కనిపించకుండా పోయింది. ఒక ఈజిప్ట్ పౌరుడిని మాత్రం రక్షించగలిగారు. ఎనిమిది వాణిజ్య నౌకలు, రెండు హెలికాప్టర్లు, ఒక గ్రీస్ నావికా యుద్ద నౌక గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ఘటన జరిగన చోట్ల గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. -
పడవ మునక.. 21 మంది మృతి
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో 21 మంది చనిపోయారు. మరో 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. రిజాల్ ప్రావిన్స్ బినంగోనన్ పట్టణ సమీపంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో పడవలో ప్రయాణికులెందరున్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. గాలులు బలంగా వీస్తుండటంతో ప్రయాణికులంతా పడవలో ఒకే వైపునకు చేరడంతో ప్రమాదం జరిగిందన్నారు. -
Viral Video: చూస్తుండగానే మునిగిపోయిన వందల కోట్ల 'మై సాగా'
రోమ్: వందల కోట్లు విలువచేసే ఓడ చూస్తుండగానే క్షణాల్లో మునిగిపోయింది. దక్షిణ ఇటలీ సముద్ర తీరంలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓడలో ఉన్న 9 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు.40 మీటర్ల ఈ ఓడ పేరు 'మై సాగా'. 2007లో ఇటలీలోనే తయారు చేశారు. గల్లిపోలి నుంచి మిలాజోకు వెళ్లే క్రమంలో కెటన్‌జారో మెరీనా తీరంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ముందుగా ఓడ కుడివైపు కొంత భాగం మునిగింది. ఆ తర్వాత క్షణాల్లోనే ఓడ మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఈ దృశ్యాలను ఇటలీ కోస్ట్ గార్డు సిబ్బంది రికార్డు చేశారు. Nei giorni scorsi, la #GuardiaCostiera di #Crotone ha coordinato operazioni di salvataggio di passeggeri ed equipaggio di uno yacht di 40m, affondato a 9 miglia al largo di #CatanzaroMarina. Avviata inchiesta amministrativa per individuarne le cause. #SAR #AlServizioDegliAltri pic.twitter.com/kezuiivqsM — Guardia Costiera (@guardiacostiera) August 22, 2022 అయితే టగ్బోట్తో ఓడను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నించినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక అది సాధ్యం కాలేదు. ఓడ మునిగిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణకు ఆదేశించారు. చదవండి: బైడెన్ టీంలో భారత సంతతి వ్యక్తులదే హవా.. 130మందికి కీలక పదవులు -
రష్యా ప్రతీకార దాడులు
కీవ్/లండన్: నల్ల సముద్రంలో తమ కీలక యుద్ధనౌక మాస్క్వాను కోల్పోయిన రష్యా తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతోంది. శనివారం ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులను ఉధృతం చేసింది. తీర్పు ప్రాంతంతోపాటు రాజధాని కీవ్‌పై దృష్టి పెట్టింది. కీవ్ పరిసరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. కీవ్ చుట్టుపక్కల ఇప్పటివరకు 1,000కి పైగా మరణించారని ఉక్రెయిన్ చెప్పింది. యుద్ధంలో 3,000 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని, 10,000 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించింది. గత 24 గంటల్లో 8 ప్రాంతాలపై రష్యా విరుచుకుపడినట్లు చెప్పింది. తూర్పున డొనెట్స్క్, లుహాన్స్క్, ఖర్కీవ్, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని డినిప్రోపెట్రోవ్స్క్, పొల్టావా, కిరోవోహ్రాడ్, దక్షిణాన మైకోలైవ్, ఖేర్సన్‌పై దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. కీవ్ సమీపంలోని డార్నియిట్స్కీపై భారీగా దాడులు జరిగాయి. ఎస్‌యూ–35 ఎయిర్‌క్రాఫ్ట్ బాంబుల వర్షం కురిపించింది. ఖర్కీవ్‌పై రాకెట్ దాడుల్లో ఏడు నెలల చిన్నారి సహా ఏడుగురు మరణించారు. ఒలెగ్జాండ్రియాలోని ఎయిర్‌ఫీల్డ్‌పై శుక్రవారం రాత్రి రష్యా క్షిపణిని ప్రయోగించిందని నగర మేయర్ చెప్పారు. లుహాన్స్క్లో దాడుల్లో ఒకరు మరణించారు. సెవెరోండోన్టెస్క్, లీసీచాన్‌స్క్‌లో దాడుల్లో గ్యాస్ పైప్లైన్లు దెబ్బతిన్నాయి. ఒక చమురు శుద్ధి కర్మాగారం ధ్వంసమయ్యింది. రష్యాకు పరాభవం తప్పదు: జెలెన్స్కీ రష్యా దాడుల నుంచి దేశ ప్రజలను కాపాడుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పునరుద్ఘాటించారు. ఆక్రమణదారులకు పరాభవం తప్పదన్నారు. తమ దేశం ఎన్నటికీ రష్యా వశం కాబోదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు చాలవు రష్యాపై విధించిన ఆంక్షలు చాలవని జెలెన్స్కీ అన్నారు. రష్యా చమురును నిషేధించాలని ప్రపంచ దేశాలను కోరారు. యుద్ధం ఆగాలంటే అన్ని దేశాలు రష్యాతో ఆర్థిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని చెప్పారు. ► మారియూపోల్ పునర్నిర్మాణానికి సాయమందిస్తానని ఉక్రెయిన్ కుబేరుడు రినాట్ అఖ్మెటోవ్ ప్రకటించారు. దేశంలో అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ‘మెటిన్‌వెస్ట్’ యజమాని అయిన అఖ్మెటోవ్కు మారియూపోల్‌లో రెండు ఉక్కు పరిశ్రమలున్నాయి. ► సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో వందలాది మంది రష్యాకు అనుకూలంగా భారీ ప్రదర్శన చేపట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సూచించే ‘జెడ్’ అక్షరమున్న టీ షర్టులు ధరించారు. పుతిన్ చిత్రాలతో కూడిన ప్లకార్డులను చేబూనారు. ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరించే తీర్మానానికి మద్దతుగా సెర్బియా ఓటేయడాన్ని జనం వ్యతిరేకిస్తున్నారు. రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధించని ఒకే ఒక్క యూరప్ దేశం సెర్బియా. యూకే ప్రధాని, మంత్రులపై రష్యా నిషేధం ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన మంత్రివర్గ సహచరులతో పాటు పలువురు నేతలపై నిషేధం విధిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో యూకే ప్రభుత్వం రష్యాపై ఆంక్షలు విధించినందుకు ప్రతిచర్యగా ఈ నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. నిషేధానికి గురైన వారిలో భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునక్, హోంమంత్రి ప్రీతీ పటేల్ కూడా ఉన్నారు. రష్యా ప్రభుత్వం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ఇలాంటి నిషేధమే విధించింది. -
చిలక చిక్కింది!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇసుక తిన్నెలతో అలరించే సుందర బారువా తీరం ఒకవైపు.. మహేంద్ర తనయ నదీ సంగమం మరోవైపు. పచ్చని ప్రకృతి పరచుకునే తోటలతో శ్రీకాకుళం జిల్లాలోని ఈ తీర ప్రాంతం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు బీచ్ వదిలి వెళ్లినా ఓ సందేహాన్ని మాత్రం వెంట తీసుకెళ్తుంటారు. బీచ్‌లో కొంతదూరంలో కనిపించే ఆ కర్ర ఏమిటని..? సుడిగుండాల భయంతో.. అవి.. ‘చిలకా’ అనే పేరున్న నౌక ఆనవాళ్లు. ఎప్పుడో వందేళ్ల నాడు మునిగిపోయిందని స్థానికులు చెబుతుంటారే తప్ప సుడిగుండాల భయంతో అక్కడికి వెళ్లే సాహసం ఎవరూ చేయలేదు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన లివిన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ బృందం సుడిగుండాల వెనుక రహస్యాల్ని ఛేదించింది. నౌక అవశేషాలు స్కూబా డైవింగ్‌తో అన్వేషణ బారువ సముద్ర తీరంలో ఈనెల 27వతేదీన ముగ్గురితో కూడిన లివిన్ అడ్వెంచర్స్ బృందం పరిశోధన మొదలైంది. ఇన్స్ట్రక్టర్ బలరాం నాయుడు, డైవ్ మాస్టర్ రాహుల్, అడ్వాన్స్ డైవర్ లక్ష్మణ్ సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ అన్వేషణ ప్రారంభించారు. ఒడ్డుకు 400 మీటర్ల దూరంలో ఉన్న కర్ర వద్దకు చేరుకున్నారు. సాగర గర్భంలో 7 మీటర్ల లోతు వెళ్లాక వారికి నౌక అవశేషాలు కనిపించాయి. శిథిలావస్థలో ఉన్న నౌకలో గోలియత్ గ్రూపర్స్, లయన్ ఫిష్, ఎలక్ట్రిక్ రే, సిల్వర్ మూనీ తదితర జలచరాలు నివాసమున్నట్లు గుర్తించారు. దాదాపు 45 నిమిషాల పాటు సముద్ర గర్భంలో గడిపి నౌక వివరాలను సేకరించారు. నౌక వెనుక భాగం పైకి ఉండటం వల్ల అలలు వచ్చినప్పుడు ఆ తాకిడికి రిప్ కరెంట్‌లా మారి సుడిగుండాలు ఏర్పడినట్లు కనిపిస్తుంటుందని, ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. సాహస యాత్ర చేసిన లివిన్ అడ్వెంచర్స్ బృందం ‘నౌక పూర్తిగా శిథిలమైంది. అగ్ని ప్రమాదం సంభవించినట్లు చెబుతున్న భాగాలు ఇసుకలో కూరుకుపోయి ఉన్నాయి. దీనివల్ల అలలు ఉధృతంగా వెనుక భాగానికి తగిలి సుడిగుండాలుగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగా నౌక వెడల్పు కొలవలేకపోయాం. గతంలో మా బృందం విజయనగరం జిల్లా చింతపల్లి తీరంలో, విశాఖ జిల్లా భీమిలి తీరంలో మునిగిన నౌకల్ని అన్వేషించింది. – బలరాం నాయుడు (లివిన్ అడ్వెంచర్ సంస్థ ఇన్స్ట్రక్టర్) -
నడిసముద్రంలో చిక్కుకున్న నౌక
ఓస్లో: నార్వేతీరంలోని సముద్రంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ఆదివారం కూడా కొనసాగాయి. ఇప్పటివరకు 397 మంది ప్రయాణికులను హెలికాప్టర్ల ద్వారా తరలించారు. దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ట్రోంసో నుంచి స్టావంగర్‌కు వెళ్తున్న విలాసవంతమైన ఓడలో 1,373 మంది ఉన్నారు. శనివారం ఓడలోని ఇంజిన్లలో సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. కెప్టెన్ అప్రమత్తమై అధికారులకు సమాచారమిచ్చారు. ప్రయాణికులను సముద్రం ఒడ్డుకు తీసుకువచ్చేందుకు అధికారులు హెలికాప్టర్లు పంపారు. ఇప్పటిదాకా 397 మందిని తరలించారు. బలమైన గాలులు వీస్తున్నా, ప్రమాదకర వాతావరణపరిస్థితులు ఉన్నా హెలికాప్టర్ ద్వారా ప్రయాణికుల చేరవేత కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఓడలోని నాలుగు ఇంజిన్లలో మూడింటిని సిబ్బంది మరమ్మతు చేశారు. ఓస్లోకు వాయవ్య దిశలో సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోల్డె పోర్టుకు ప్రయాణికుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. లైఫ్ జాకెట్లతో నౌకలో బిక్కుబిక్కుమంటున్న ప్రయాణికులు -
నౌక మునక : 13 మంది మృతి
మనగ్వా : నికరాగ్వా లిటిల్ కర్న్ ద్వీపం సమీపంలోని కరేబియన్ సముద్రంలో పర్యాటకులను తీసుకు వెళ్తున్న చిన్ననౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది కోస్టరికన్స్ మరణించారు. ఈ మేరకు నికరాగ్వా అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. నౌకలో మొత్తం 32 మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. వారిలో పలువురిని రక్షించి... సమీపంలోని బిగ్ కార్న్ ద్వీపానికి తరలించినట్లు చెప్పారు. పర్యాటకులంతా యూఎస్‌కి చెందినవారని పేర్కొన్నారు. మృతుల్లో తొమ్మిది మంది కోస్టరికా పౌరులు ఉన్నారని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే ఇద్దరు యూఎస్ వాసులని చెప్పారు. బలమైన గాలులు వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొంది. అయితే నౌక కెప్టెన్‌ను అరెస్ట్ చేసి... విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
మునిగిన నౌక.. 14 మందిని రక్షించిన నేవీ
-
మునిగిన నౌక.. 14 మందిని రక్షించిన నేవీ
మునిగిపోతున్న నౌక నుంచి 14 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డ్ బృందాలు రక్షించాయి. ఎంవీ కోస్టల్ ప్రైడ్ అనే నౌక ముంబై తీరానికి 75 నాటికల్ మైళ్ల దూరంలోను, డామన్ తీరానికి 24 నాటికల్ మైళ్ల దూరంలోను బుధవారం ఉదయమే మునిగిపోయింది. ఈ నౌక నుంచి ఎస్ఓఎస్ కాల్ అందడంతో.. వెంటనే ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డ్ బృందాలు రంగంలోకి దిగాయి. సీ కింగ్, చేతక్ అనే రెండు హెలికాప్టర్లు ఈ రక్షణ ఆపరేషన్లోకి దిగాయి. ఉదయం 8 గంటల సమయంలో సీ కింగ్ హెలికాప్టర్ కొలాబా నుంచి బయల్దేరింది. మరో రెండు కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు మరో అరగంటలో బయల్దేరాయి. మునిగిపోతున్న నౌకలోని సిబ్బంది అందరినీ రక్షించి, వారిని సురక్షితంగా ఉమర్గావ్కు చేర్చారు. రెస్క్యూ ఆపరేషన్ ముగిసేసరికి నౌక సగం మునిగిపోయిందని ఇండియన్ నేవీ అధికార ప్రతినిధి తెలిపారు.