కొచ్చి: ఇరాన్‌లో చేపలుపట్టే పని చేసేందుకు వెళ్లిన భారతీయులను యజమాని వేధించాడు. సరైన జీవన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో యజమాని సయ్యద్ అన్సారీ నుంచి తప్పించుకోవాలని ఆరుగురు కన్యాకుమారికి చెందిన మత్స్యకారులు డిసైడయ్యారు.
ఇంకేముంది చేపలు పట్టేందుకు యజమాని ఇచ్చిన బోట్‌లోనే ఇరాన్ నుంచి పారిపోయి సముద్రంలో ప్రయాణించి భారత్‌లోని కొచ్చి తీరాని వచ్చారు. కొచ్చి తీరానికి వీరి బోట్ చేరుకున్న వెంటనే తీరంలోకి కోస్ట్‌గార్డ్ గుర్తించి అడ్డుకున్నారు. ఆరా తీస్తే ఇరాన్ యజమాని తమను మోసం చేశాడని,అందుకే పారిపోయి వచ్చామని మత్స్యకారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment