పేలుడు వల్లే ఈజిప్ట్ విమానం కూలిందా?
కైరో: మధ్యధరా సముద్రంలో కుప్పకూలిన ఈజిప్టుఎయిర్ విమానం పేలుడు వల్లే కూలిందా..? దీనికి అవుననే అంటున్నారు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల ఆనవాళ్లను పరీక్షించిన ఫోరెన్సిక్ నిఫుణులు. సముంద్రం నుంచి స్వాధీనం చేసుకున్న మృతదేహాల ఆనవాళ్లను పరీక్షిస్తే ప్రమాదానికి పేలుడే కారణమని తెలుస్తోందని ఈజిప్టు ఫోరెన్సిక్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
గత వారం ఈజిప్టు ఎయిర్‌కు చెందిన విమానం పారిస్ నుంచి కైరోకు వస్తుండగా సముద్రంలో కుప్పకూలడంతో 66 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈజిప్టు దర్యాప్తు బృందంలో సభ్యుడైన ఫోరెన్సిక్ నిఫుణుడు మృతదేహాల ఆనవాళ్లను పరీక్షించారు. ఘటనా స్థలం నుంచి 80 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారని, ఇవన్నీ చాలా చిన్నచిన్నగా ఉన్నాయని, పెద్ద భాగం ఒక్కటి కూడా లేదని, దీని వల్లే విమానంలో పేలుడు సంభవించినట్టుగా భావిస్తున్నామని చెప్పారు. అయితే పేలుడుకు కారణం ఏమిటనే దాని గురించి ఇప్పుడు చెప్పలేనన్నారు.
మరోవైపు ఈజిప్టు అధికారులు దీనిపై స్పందిస్తూ.. పేలుడుకు ఉగ్రవాద చర్య కారణం కావచ్చని, సాంకేతిక సమస్య కారణం కాకపోవచ్చని పేర్కొన్నారు. అయితే కొందరు ఏవియేషన్ నిఫుణులు మాత్రం బాంబు పేలుడు లేదా కాక్‌పిట్‌లో ప్రమాదం పేలుడుకు కారణం కావచ్చిన విశ్లేషిస్తున్నారు.