
ఐటీఎఫ్ గ్రేడ్-2 టోర్నీలో రన్నరప్ గా ప్రాంజల
కైరొ(ఈజిప్టు): వర్థమాన టెన్నిస్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి యడ్లవల్లి ప్రాంజల ఐటీఎఫ్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నీలో తృటిలో అంతర్జాతీయ టైటిల్ కోల్పోయింది. ఈ టోర్నీలో బాలికల డబుల్స్ విభాగంలో ప్రాంజల- కర్మన్ కౌర్ జోడీ రన్నరప్ గా నిలిచింది. డచ్ దేశానికి చెందిన ఐసోల్ డిజాంగ్, నీనా క్రూజర్ చేతిలో 1-6, 6-3, 4-10 చేతిలో ఓడిపోయింది.
సెమీఫైనల్లో జాస్మిన(పోలెండ్)-వలేరియా(ఈస్తోరియా)పై ప్రాంజల- కర్మన్ కౌర్ జోడీ విజయం సాధించింది.