yadlapalli pranjala
-
ప్రాంజలకు నిరాశ
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019 ఆసియా పసిఫిక్ వైల్డ్ కార్డ్ ప్లే ఆఫ్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు నిరాశ ఎదురైంది. చైనాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ప్రాంజల క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఏడో సీడ్ ప్రాంజల 2–6, 5–7తో మురమత్సు చిహిరో (జపాన్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
మెయిన్ ‘డ్రా’కు చేరువలో ప్రాంజల
ముంబై: మరో విజయం సాధిస్తే హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ప్రాంజల 6–3, 6–0తో భారత్‌కే చెందిన మిహికా యాదవ్‌ను ఓడించింది. ఒక్సానా (జార్జియా)తో నేడు జరిగే రెండో రౌండ్లో గెలిస్తే ప్రాంజల మెయిన్ ‘డ్రా’కు అర్హత పొం దుతుంది. క్వాలిఫయింగ్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సౌజన్య భవిశెట్టి 3–6, 1–6తో హిరోకో కువాటా (జపాన్) చేతిలో ఓడింది. -
కెరీర్ అత్యుత్తమ ర్యాంక్‌లో ప్రాంజల
న్యూఢిల్లీ: వరుసగా రెండు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య టోర్నమెంట్ టైటిల్స్ గెలిచిన హైదరాబాద్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల ర్యాంకింగ్స్‌లో అద్భుత పురోగతి సాధించింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రాంజల 60 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 280వ ర్యాంక్‌కు చేరుకుంది. అంకిత రైనా 195వ స్థానంలో నిలిచి భారత మహిళల సింగిల్స్ నంబర్‌వన్ ప్లేయర్‌గా ఉంది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో యూకీ బాంబ్రీ టాప్–100లో స్థానం కోల్పోయాడు. యూరోపియన్ ఓపెన్ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన యూకీ బాంబ్రీ ఏడు స్థానాలు కోల్పోయి 107వ ర్యాంకులో నిలిచాడు. నింగ్బో చాలెంజర్ టోర్నీలో రాణించిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కెరీర్ బెస్ట్ 146వ ర్యాంక్‌ను అందుకున్నాడు. -
ప్రాంజల జంట ఓటమి
ముంబై: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల–కర్మన్‌కౌర్ థండి (భారత్) జోడీ 4–6, 2–6తో దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా)–ఇరీనా ఖరోమచెవా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల జంట తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత ఆశాకిరణం అంకిత రైనా 6–2, 6–2తో పియెంగ్టర్న్ ప్లిపుయెచ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. తద్వారా తన కెరీర్లో తొలిసారి ఓ డబ్ల్యూటీఏ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అమన్డైన్ హెసీ (ఫ్రాన్స్)తో అంకిత ఆడుతుంది. -
ప్రాంజల జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది. థాయ్‌లాండ్‌లో శనివారం జరిగిన మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన జీల్ దేశాయ్‌తో కలిసి ప్రాంజల టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ప్రాంజల–జీల్ దేశాయ్ ద్వయం 6–2, 7–5తో రుతుజా భోస్లే (భారత్)–అలెగ్జాండ్రా వాల్టర్స్ (ఆస్ట్రేలియా) జంటపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది ప్రాంజలకిది రెండో డబుల్స్ టైటిల్. గత జూన్‌లో ఔరంగాబాద్‌లో జరిగిన టోర్నీలో జియావోజి జావో (చైనా)తో కలిసి ప్రాంజల తొలి టైటిల్‌ను నెగ్గింది. మరోవైపు డబుల్స్‌లో ఓడినప్పటికీ... సింగిల్స్‌లో రుతుజా భోస్లే విజేతగా నిలిచింది. ఫైనల్లో రుతుజా 6–4, 2–6, 7–5తో హువా చెన్ లీ (చైనీస్ తైపీ)పై గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు జ్యోతి సురేఖ సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ‘అర్జున’ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ... మెక్సికోలో అక్టోబర్ 15 నుంచి 22 వరకు జరిగే ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. సోనెపట్‌లో జరిగిన సెలక్షన్స్‌లో ఆమె రికార్డు విజయాన్ని సాధించింది. శనివారం నిర్వహించిన ఒలింపిక్ రౌండ్లో జ్యోతి సురేఖ నిర్ణీత 150 పాయింట్లకు గానూ 150 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. -
విజేత ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: జూనియర్ బాలికల విభాగంలో పలు టైటిల్స్ సాధించిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ యడ్లపల్లి ప్రాంజల సీనియర్ స్థాయిలోనూ తన సత్తా చాటుకుంది. ఈజిప్ట్‌లో ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో 18 ఏళ్ల ప్రాంజల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. 2 గంటల 48 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల 6–7 (0/7), 7–5, 6–4తో క్లెరికి (ఇటలీ)పై నెగ్గింది. సీనియర్ స్థాయిలో ప్రాంజలకిదే తొలి ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో నాలుగు ఏస్‌లు సంధించిన ప్రాంజల, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. టోర్నీ మొత్తం ప్రాంజల కేవలం ఒక సెట్ మాత్రమే తన ప్రత్యర్థులకు కోల్పోవడం విశేషం. -
యు.ఎస్.ఓపెన్‌లో ఓడిన యడ్లపల్లి ప్రాంజల
-
క్వార్టర్స్‌లో ప్రాంజల జోడి
సాక్షి, హైదరాబద్: తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఐటీఎఫ్ గ్రేడ్-1 జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్లో దూసుకెళ్తోంది. మలేసియాలోని కూచింగ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి, డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. హైదరాబాద్ క్రీడాకారిణికి తొలి రౌండ్ రెండు విభాగాల్లోనూ బై లభించింది. దీంతో నేరుగా రెండో రౌండ్ బరిలోకి దిగింది. సింగిల్స్‌లో మూడో సీడ్ ప్రాంజల 6-1, 6-2తో గాబ్రియెల్లా డా సిల్వాఫిక్ (ఆస్ట్రేలియా)పై అలవోక విజయం సాధించింది. డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో నూర్ హలిజా (ఇండోనేసియా)తో కలిసి రెండో సీడ్‌గా బరిలోకి దిగిన ప్రాంజల జోడి 6-2, 6-3తో ఇగ్లుపాస్ ఖిమ్ (ఫిలిప్పీన్స్)-కహ్ఫియాని రిఫాంటి (ఇండోనేసియా) జంటపై గెలిచింది. -
ప్రాంజల శుభారంభం
జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ప్రాంజల 6-4, 6-3తో కేటీ పొలూటా (దక్షిణాఫ్రికా)పై గెలిచింది. 66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. రెండో రౌండ్లో టాప్ సీడ్ షిలిన్ జు (చైనా)తో ప్రాంజల తలపడుతుంది. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన ఓజస్విని సింగ్ 6-0, 4-6, 1-6తో ఒలివియా హాగర్ (అమెరికా) చేతిలో ఓడిపోగా... బాలుర సింగిల్స్ తొలి రౌండ్లో సుమీత్ నాగల్ (భారత్) 6-2, 4-6, 6-4తో ఐదో సీడ్ మైకేల్ మో (అమెరికా)పై సంచలన విజయం సాధించాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో మహేశ్ భూపతి (భారత్)-జర్మీలా గజ్దోసోవా (ఆస్ట్రేలియా) జంట 6-4, 6-7 (7/9), 8-10తో హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ)-జేమీ ముర్రే (బ్రిటన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ప్రాంజలకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలుగమ్మాయి, డిఫెండింగ్ చాంపియన్ యడ్లపల్లి ప్రాంజల ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-3 టెన్నిస్ టోర్నమెంట్లో టైటిల్ నిలబెట్టుకుంది. చండీగఢ్‌లోని సెక్టార్-10 సీఎల్‌టీఏ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో ఆమె వరుస సెట్లలో థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంగ్లక్ జిట్టాకొట్పై అలవోక విజయం సాధించింది. టైటిల్ పోరులో ప్రాంజల 6-1, 6-2తో జిట్టాకొట్ను కంగుతినిపించింది. డబుల్స్‌లో కర్మాన్ కౌర్‌తో కలిసి బరిలోకి దిగిన హైదరాబాదీ క్రీడాకారిణి తొలి రౌండ్లోనే పరాజయం చవిచూసింది. -
ఐటీఎఫ్ గ్రేడ్-2 టోర్నీలో రన్నరప్ గా ప్రాంజల
కైరొ(ఈజిప్టు): వర్థమాన టెన్నిస్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి యడ్లవల్లి ప్రాంజల ఐటీఎఫ్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నీలో తృటిలో అంతర్జాతీయ టైటిల్ కోల్పోయింది. ఈ టోర్నీలో బాలికల డబుల్స్ విభాగంలో ప్రాంజల- కర్మన్ కౌర్ జోడీ రన్నరప్ గా నిలిచింది. డచ్ దేశానికి చెందిన ఐసోల్ డిజాంగ్, నీనా క్రూజర్ చేతిలో 1-6, 6-3, 4-10 చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో జాస్మిన(పోలెండ్)-వలేరియా(ఈస్తోరియా)పై ప్రాంజల- కర్మన్ కౌర్ జోడీ విజయం సాధించింది.