ప్రాంజలకు టైటిల్ | pranjala won the title | Sakshi
Sakshi News home page

ప్రాంజలకు టైటిల్

Published Sun, Jan 11 2015 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

ప్రాంజలకు టైటిల్

ప్రాంజలకు టైటిల్

సాక్షి, హైదరాబాద్: తెలుగమ్మాయి, డిఫెండింగ్ చాంపియన్ యడ్లపల్లి ప్రాంజల ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-3 టెన్నిస్ టోర్నమెంట్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. చండీగఢ్‌లోని సెక్టార్-10 సీఎల్‌టీఏ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో ఆమె వరుస సెట్లలో థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంగ్‌లక్ జిట్టాకొట్‌పై అలవోక విజయం సాధించింది. టైటిల్ పోరులో ప్రాంజల 6-1, 6-2తో జిట్టాకొట్‌ను కంగుతినిపించింది. డబుల్స్‌లో కర్మాన్ కౌర్‌తో కలిసి బరిలోకి దిగిన హైదరాబాదీ క్రీడాకారిణి తొలి రౌండ్లోనే పరాజయం చవిచూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement